
హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మంగళ వారం ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. గత కొంత కాలంగా.. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్.. వీసీ అప్పారావు పునరాగమనంతో వేడెక్కింది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. తర్వాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే.. మంగళవారం ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా 'కిల్లర్ వీసీ గోబ్యాక్ అంటూ' నినాదాలుచేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.