Vice-chancellor
-
ఎస్వీ యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరపాలి
-
ఏయూలో వీసి Vs రిజిస్ట్రార్
-
వీసీల నియామకాలు చెల్లవు
* 28, 29, 38, 1 నంబర్ జీవోలను కొట్టివేసిన హైకోర్టు * పభుత్వ చర్య చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా.. * యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలు జరగాలి * చాన్స్లర్లుగా డాక్టరేట్ ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలకు చాన్సలర్లు, వైస్ చాన్స్లర్ల (వీసీల) నియామకం అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 28, 29, 38, 1 నంబర్ జీవోలను కొట్టివేసింది. ఇవన్నీ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధమని.. వాటి ప్రకారం జరిగిన నియామకాలేవైనా రద్దయినట్లేనని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అయితే అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో.. యూనివర్సిటీలకు ప్రభుత్వమే చాన్స్లర్లను నియమించేందుకు, గవర్నర్‌తో నిమిత్తం లేకుండా వీసీలను నియమించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం 28, 29 నంబర్ జీవోలను జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు వీసీల అర్హతలను మార్పు చేస్తూ జీవో 38, యూజీసీ పేస్కేళ్లను 2014, జూన్ 2 నుంచి వర్తింపజేసుకుంటూ జీవో నం 1లను కూడా జారీ చేసింది. ఈ జీవోలను, తర్వాత వాటి స్థానంలో తీసుకొచ్చిన చట్టాలను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై గత వారం తుది విచారణ జరిపి, తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం.. గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రాజ్యాంగానికి, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తన న్యాయ పరిధిని దాటి మరీ ఈ జీవోలు జారీ చేసిందని ఆక్షేపించింది. ఎటువంటి అర్హతలను నిర్దేశించకుండానే చాన్స్‌లర్ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించడాన్ని తప్పుబట్టింది. వీసీల నియామక అర్హతలు కూడా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. 2010 యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలను చేపట్టాలని ఆదేశించింది. అటు ప్రజా జీవితం లో, ఇటు విద్యా రంగంలో పేరు పొందిన వారిని నియమించాలని.. అందులోనూ డాక్టరేట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు, తమ ఆదేశాలకు అనుగుణంగా వీసీలను నియమించాలని సూచించింది. ఈ వ్యాజ్యాలపై విచారణ పెండింగ్‌లో ఉండగా.. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఏవైనా నియామకాలు జరిగి ఉంటే అవి రద్దవుతాయని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును అధ్యయనం చేసి తగిన విధంగా స్పందించేందుకు వీలుగా తీర్పు అమలును వాయిదా వేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన ధర్మాసనం తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది. నేడు సీఎం సమీక్ష రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కొత్తగా నియమితులైన వీసీలు, సంబంధిత మంత్రులు, కార్యదర్శులు ఇందులో పాల్గొననున్నారు. -
ప్రొఫెసర్లకే వీసీ చాన్స్
ఐఏఎస్, ఐపీఎస్‌లను నియమించే ఆలోచన వెనక్కి సాక్షి, హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ జడ్జిలను యూనివర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్లుగా నియమించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లకే వాటిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా సెర్చ్ కమిటీలు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లతో కూడిన జాబితాను సీఎంకు పంపనున్నట్టు తెలిసింది. ఉస్మానియా, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలకు వీసీల ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీల సమావేశాల్లో ఈ అంశంపైనా చర్చించాయి. ఒక్కో వర్సిటీ వీసీ పోస్టుకు ముగ్గురు ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో జాబితాలను పంపించినట్లు తెలిసింది. ఓయూ వీసీ పోస్టుకు అదే వర్సిటీ ఫిజిక్స్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ సాయన్న, మరొకరు నర్సింహారెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంచంద్రం పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో సాయన్న పేరునే సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. నల్లగొండ మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ఇప్పటికే అల్తాఫ్ హుస్సేన్‌ను నియమించింది. మిగతా వర్సిటీలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కమిటీలు ఈ నెల 16 వరకు సమావేశం కాబోతున్నాయి. 12న తెలుగు వర్సిటీ, 13న పాలమూరు వర్సిటీ, 14న శాతవాహన వర్సిటీ, 15న తెలంగాణ వర్సిటీ, 16న కాకతీయ వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ఆర్జీయూకేటీల సెర్చ్ కమిటీల సమావే శాలూ త్వరగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 20 లోగా వీసీల నియామకం పూర్తవుతుందని అంచనా. ప్రొఫెసర్ల అనుభవం నిబంధనను ఐదేళ్లకు సడలించినా, పదేళ్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ మూడింటికీ నేరుగా నియామకాలు... కాళోజీ హెల్త్ వర్సిటీకి కరుణాకర్‌రెడ్డిని నేరుగా నియమించిన ప్రభుత్వం.. అగ్రి కల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలకు అదే తరహాలో వీసీలను నియమిం చేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అగ్రికల్చర్ వర్సిటీ స్పెషలాఫీసర్‌గా ఉన్న ప్రవీణ్‌రావును ఆ వర్సిటీ వీసీగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మంగళ వారం ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. గత కొంత కాలంగా.. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్.. వీసీ అప్పారావు పునరాగమనంతో వేడెక్కింది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. తర్వాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా 'కిల్లర్ వీసీ గోబ్యాక్ అంటూ' నినాదాలుచేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. -
'వర్సిటీపై దాడి'కి వీసీ కూడా బాధ్యుడే
'సరిహద్దు గాంధీ' బిరుదాంకితుడు, బచా ఖాన్ గా ఖ్యాతిగడించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరుమీద నెలకొల్పిన విశ్వవిద్యాలయంలో రక్తపుటేరులు పారించిన తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్ ప్రపంచం ఖండించింది. జనవరి 20న జరిగిన ఉగ్రదాడిపై ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రాథమిక నివేదికను సమర్పించిన ఆ కమిటీ దాడి ఘటనలో వర్సిటీ పెద్దల బాధ్యతారాహిత్యం స్పష్టంగా బయటపడిందని పేర్కొంది. వర్సిటీ భద్రతపై వీసీ ఫజల్ ఉర్ రహీమ్ మర్వత్, సెక్యూరిటీ ఇన్ చార్జి అష్ఫ్రాక్ అహ్మద్ ల నిర్లక్ష్యం వల్లే ఉగ్రవాదులు లోపలికి సులువుగా చొరబడగలిగారని, 21 మంది మరణాలకు వారు కూడా బాధ్యులేనని, తక్షణ వారిని విధుల నుంచి తొలిగించాలని దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 'వర్సిటీ ప్రాంగణంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారుగానీ వాటిని పర్యవేక్షించే కేంద్రీయ వ్యవస్థ ఏర్పాటును విస్మరించారు. ఒకవేళ ఆ వ్యవస్థ పనిచేసి ఉంటే ఉగ్రవాదుల చొరబాటును సులువుగా నివారించే వీలుండేది. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో వర్సిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు' అని నివేదికలో పొందుపర్చారు. -
అగ్రీవర్సిటీలో హడావుడీ ప్రమోషన్లకు బ్రేక్
-‘సాక్షి’ వార్తతో కదిలిన యంత్రాంగం -నేటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిపివేత -తక్షణమే జరపాలంటూ టీచర్ల డిమాండ్ -వర్శిటీ టీచర్ల అసోసియేషన్ అత్యవసర భేటీ హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగాల్సిన ప్రమోషన్ల ఇంటర్వ్యూలను వాయిదా వేయగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 'అగ్రీవర్శిటీలో హడావిడి ప్రమోషన్ల' శీర్షికన ఈనెల 23న ‘సాక్షి దినపత్రిక’లో వచ్చిన కథనానికి స్పందనగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న వైస్ ఛాన్సలర్ ఇంత హడావిడిగా 18 మంది ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 70 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు ఇంటర్వ్యూ తేదీలు ఖరారు చేయడాన్ని పలువురు తప్పుబట్టిన నేపథ్యంలో డాక్టర్ పద్మరాజు వాటిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. 2014 జనవరి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి ఉపాధ్యాయులకు జరపాల్సిన మెరిట్ ప్రమోషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చేపట్టాలని అసోసియేషన్ యూనివర్శిటీ పాలకవర్గానికి విజ్ఞప్తి చేసింది. -
త్వరలో వర్సిటీలకు వీసీల నియామకం
ఎంపిక కోసం సెర్చ్ కమిటీల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఇన్చార్జిల పాలనలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్(వీసీ)లను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విశ్వవిద్యాలయాల వారీగా వైస్ చాన్స్లర్ల ఎంపిక కోసం త్వరలోనే సెర్చ్ కమిటీలు వేసేందుకు కసరత్తు చే స్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం సెర్చ్ కమిటీలు లేదా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వీసీలను ఎంపిక చేయాలి. ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకనుంది. యూనివర్సిటీల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సెర్చ్ కమిటీలే నిష్ణాతులైన ప్రొఫెసర్లను గుర్తించి, గవర్నర్ ఆమోదానికి పంపించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని తెలుగు విశ్వ విద్యాలయం, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయం మినహా మిగతా అన్ని విశ్వ విద్యాలయాలు ఇన్చార్జిల పాలనలోనే ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలే ఉన్నారు. -
తెలంగాణవారినే నియమించాలి: విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అన్ని గేట్లకు తాళం వేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, డీన్ పదవుల్లో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్‌చేస్తూ.. మంగళవారం రాజేంవూదనగర్‌లోని వర్సిటీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పరిపాలన భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీసీ నియామకంలో తమ డిమాండ్ సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నా సీమాంధ్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్ సాధన కోసం భారీ నిరసనలు చేపట్టారు. అయినా సర్కారు తీరు ఏమాత్రం మారకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.