ఎంపిక కోసం సెర్చ్ కమిటీల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్(వీసీ)లను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విశ్వవిద్యాలయాల వారీగా వైస్ చాన్స్‌లర్ల ఎంపిక కోసం త్వరలోనే సెర్చ్ కమిటీలు వేసేందుకు కసరత్తు చే స్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం సెర్చ్ కమిటీలు లేదా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వీసీలను ఎంపిక చేయాలి.
ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకనుంది. యూనివర్సిటీల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సెర్చ్ కమిటీలే నిష్ణాతులైన ప్రొఫెసర్లను గుర్తించి, గవర్నర్ ఆమోదానికి పంపించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని తెలుగు విశ్వ విద్యాలయం, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయం మినహా మిగతా అన్ని విశ్వ విద్యాలయాలు ఇన్‌చార్జిల పాలనలోనే ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలే ఉన్నారు.
త్వరలో వర్సిటీలకు వీసీల నియామకం
Published Wed, Nov 26 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement