Jabardasth Comedian Apparao About Why He Left Comedy Show, Details Inside - Sakshi
Sakshi News home page

Jabardasth Comedian Apparao: 'చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్‌లో పెట్టారు'.. అప్పారావు ఆవేదన

Published Tue, Apr 12 2022 11:23 AM | Last Updated on Tue, Apr 12 2022 1:08 PM

Jabardasth Comedian Apparao About Why He Left Comedy Show - Sakshi

'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్‌ అయిన కమెడియన్లలో అప్పారావు ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన ఈ షోలో కనిపించడం లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆ షోలో 7-8 సంవత్సరాలుగా ఉన్నాను. షూటింగులకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్లేవాడిని. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత నా వయసును దృష్టిలో పెట్టుకొని ‍ మేనేజ్‌మెంట్‌ కొంతకాలం వెయిట్‌ చేయమన్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు.

చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్‌లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశాను. ఒకప్పుడు టీమ్‌ లీడర్‌గా చేసిన నేను ఆ తర్వాత కాలంలో ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా పరోక్షంగా అవమానించారు.

అందుకే తప్పుకోవాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైతేనేం, ఇప్పుడు మరో కామెడీ షో చేస్తున్నాను. డబుల్‌ పేమెంట్‌ ఇస్తున్నారు.  ఇప్పుడు నా పరిస్థితి బాగుంది  అని చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement