లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సికార్ గంజ్ జంక్షన్ సమీపంలో బొబ్బిలి వైపు నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమదాంలో క్లీనర్ ఇనప కుర్తి అప్పారావు(31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గరివిడి మండలం శంకుపాత్రనిరేగ గ్రామానికి చెందినవాడు. కాగా.. గాయపడ్డ డ్రైవర్ కు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.