ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంనగరంలోని వర్తక సంఘం భవనంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. చాంబర్ ఆఫ్ కామర్స్‌లో మొత్తం 993 మంది సభ్యులు ఉన్నారు.
ఈ సభ్యులకు ఓటు హక్కు కల్పిం చారు. ఓటు వేసేందుకు వారు వెంట గుర్తింపు కార్డు ను తెచ్చుకోవాలని ఎన్నికల అధికారులు నిర్ణయించా రు. వర్తక సంఘం భవనంలో మొత్తం 8 బూత్‌లను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల అధికారులు వీవీ అప్పారావు, సోమశేఖర శర్మలు ఏర్పాట్లు చేస్తున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఐదుగురు ప్రతినిధులతో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను మొత్తం 19 శాఖలకు చెందిన 993 సభ్యులు తమ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓటరు అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారితో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. ఒక్క అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర అన్ని పదవులకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున పోటీ చేస్తున్నారు. ఒక్కో ఓటరు 10 మందికి ఓటు వేయాల్సి ఉంది. బ్యాలెట్ పత్రాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఒక్కో బ్యాలట్‌పై మొత్తం 21 పేర్లు ఉంటాయి. వీటిలో తాము ఎంచుకున్న 10 మందికి ఓటు వేయాలి ఉంది.
మధ్యాహ్నం దిగుమతి శాఖ ఎన్నికలు
దిగుమతి శాఖ ఎన్నికలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. దిగుమతి శాఖలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు 417 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంది. దిగుమతి శాఖలో అధ్యక్ష, కార్యదర్శి పదవులతో పాటు 8 మంది కార్యవర్గ సభ్యులకు సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. దిగుమతి శాఖకు మొత్తం 10 పదవులుండగా 20 మంది పోటీ చేస్తున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి లెక్కింపు
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అనంతరం దిగుమతి శాఖ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఎన్నికల పోలింగ్‌కు, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి వీవీ.అప్పారావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పోలింగ్, లెక్కింపులకు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించుకున్నట్లు ఆయన తెలిపారు.
రేపే ‘చాంబర్’ ఎన్నికలు
Published Sat, Sep 7 2013 6:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement