Navy employee
-
యారాడ బీచ్‌లో నేవీ ఉద్యోగుల గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ నేవీ షిప్ సుమిత్రలో పనిచేస్తున్న 30 మంది నావికా సిబ్బంది ఆదివారం యారాడ బీచ్ సందర్శనకు వెళ్లారు. వీరిలో జగత్ సింగ్, శుభమ్ అనే ఇద్దరు నౌకా సిబ్బంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే నావీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా జగత్ సింగ్ మృతదేహం లభించింది. శుభం ఆచూకీ ఇంకా లభించలేదు. అతనికోసం హెలికాప్టర్ ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!) -
ప్రేమ పెళ్లి.. మోసం
సాక్షి, సంతబొమ్మాళి: ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వాంఛ తీరాక వదిలేసి వెళ్లిపోయాడు. ఓ నేవీ ఉద్యోగి చేసిన ఘనకార్యమిది. దీనిపై బాధితురాలు సాయిలీల పోలీసులను ఆశ్రయించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వడ్డివాడ గ్రామానికి చెందిన బైరి మల్లేశ్వరరావు విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తర్ర సాయిలీల వెంటపడి ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పార్కులు, సినిమాహాళ్ల తిప్పేవాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. విశాఖపట్నం తీసుకువెళ్లి 2020 జూలై15న రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అక్కడే ఓ లాడ్జిలో పది రోజుల పాటు ఇద్దరూ గడిపారు. అనంతరం యువతిని స్వగ్రామం వడ్డివాడలో వదిలేసి మల్లేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత యువతిని పట్టించుకోవడం మానేశాడు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో యువతి ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. విసిగిపోయిన ఆమె మంగళవారం మల్లేశ్వరరావు ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అత్తామామలు అడ్డుకోగా.. వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో ఆమె సంత బొమ్మాళి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మేరకు మల్లేశ్వరరావు, అత్తామామలు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కామేశ్వరరావు తెలిపారు. -
ఫలించిన అమ్మ పోరాటం!
అనుమానాస్పదరీతిలో కన్నబిడ్డను కోల్పోయి రెండు దశాబ్దాలకుపైగా మానసిక క్షోభకు గురైన ఓ అమ్మ న్యాయస్థానంలో నెగ్గింది! ఆమె వేదనకు ముగింపు పలుకుతూ నౌకాదళ ఉద్యోగి అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఉత్వర్వులు జారీ చేసింది. అరుదైన చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ.. – సాక్షి, హైదరాబాద్ ఇది ఓ అమ్మ ఆవేదన... ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనురాధా అశోక్ పల్దే వయసు 70కి పైనే ఉంటుంది. దేశసేవ కోసం నౌకాదళంలో చేరిన ఆమె కుమారుడు అమర్ అశోక్ పల్దే దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాకినాడ వద్ద నిర్వహించిన విన్యాసాల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నేవీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయాడని తేల్చారు. దీంతో కుమారుడి మృతిపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ ఆ తల్లి వేడుకున్నారు. దీనికి స్పందించకపోవడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా చేసిన ఆమె పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్దే మృతిపై స్వతంత్ర ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా స్థానిక అధికారులు సేకరించిన ఆధారాలను అవసరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. నేవీ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకోవచ్చని తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాలని స్థానిక పోలీసులు, నేవీ అధికారులను ఆదేశించింది. ఓ తల్లి ఆవేదనకు సంబంధించిన కేసు కాబట్టి సీబీఐ తక్షణమే దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వరగా ముగిస్తుందనే ముగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆ రోజు ఏం జరిగిందంటే.. నౌకాదళంలో సీమెన్–1గా ఎంపికైన అమర్ అశోక్ పల్దే కమాండ్ క్లియరెన్స్ డైవింగ్ టీంలో విధులు నిర్వర్తించేవారు. 1993 సెప్టెంబర్ 21న కాకినాడ వద్ద సముద్ర తీరంలో హలో జంప్ పేరుతో ఓ సన్నాహక కార్యక్రమం జరిగింది. దీని ప్రకారం డైవర్లు హెలికాఫ్టర్ నుంచి సముద్రంలోకి దూకి అక్కడి నుంచి తీరానికి ఈదుకుంటూ రావాలి. మొత్తం నలుగురు డైవర్లు సముద్రంలోకి దూకగా అమర్ మాత్రం తీరానికి చేరుకోలేదు. రెండు రోజుల తరువాత అతడి మృతదేహం సముద్ర జలాల్లో తేలుతూ కనిపించింది. అతడి మృతదేహంపై చనిపోకముందే కొన్ని గాయాలున్నట్లు కనుగొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రమాదవశాత్తే అమర్ మృతి చెందారని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. మొదట బాంబే హైకోర్టులో.. నేవీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనురాధా అశోక్ పల్దే తొలుత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధి తమకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి తల్లి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి 2016 జూన్ 7న తీర్పునిస్తూ అమర్ మృతిపై బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవన్నారు. బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీని మరోసారి నియమించాలన్న తీర్పును సవాలు చేస్తూ నేవీ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల్లో విశ్వాసం నెలకొల్పేందుకే... ‘అమర్ మృతిపై కాకినాడ పోలీసులు 1993లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ పోర్టు పరిధిలో ఘటన జరిగింది కాబట్టి స్థానిక పోలీసులే దర్యాప్తు జరపాలని నేవీ అధికారులు చెబుతున్నారు. నౌకాదళ నిబంధన ప్రకారం పునర్ దర్యాప్తు జరిపే అవకాశం లేదని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవాలని నావికాదళ అధికారులు అప్పీల్లో అభ్యర్థిస్తున్నారు. మరోవైపు తన బిడ్డది అసహజ మరణమంటూ దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని మృతుడి తల్లి కోరుతున్నారు. నౌకాదళం బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ విచారణ నివేదిక నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ముందున్న అన్ని ఆధారాలు, నేవీ చట్టాలను పరిశీలించాం. బాధితులు, మృతుల తల్లిదండ్రుల మనసులో విశ్వాసం నెలకొల్పేందుకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం. దీనివల్ల న్యాయ లక్ష్యం నెరవేరినట్లవుతుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో పరిహారం కోసం మృతుడి తల్లి కాకినాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించారు. నేవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే అమర్ అశోక్ మరణం సంబంధించిందని తేల్చిన కోర్టు.. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. -
నేవీ ఉద్యోగి నిర్వాకం, చెప్పుదెబ్బలు..
విశాఖ : ఉన్నతమైన హోదాలో ఉండి... విధులు నిర్వహిస్తున్న అతడి ప్రవర్తన పక్కదారి పట్టింది. విచక్షణ మరిచి, ఆకతాయి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయి చివరకు చావు దెబ్బలు తిన్నాడు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో ఓ యువతి స్నానం చేస్తుండగా నేవీ ఉద్యోగి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు యువతి, కుటుంబ సభ్యులు అతన్ని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. బాధితురాలు ఆగ్రహంతో నిందితుడిని చెప్పుతో ఎడా పెడా వాయించేసింది. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేవీ ఉద్యోగి అని...నేవల్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నట్లు తేలింది. -
నేవీ ఉద్యోగి నిర్వాకం, చెప్పుదెబ్బలు..
-
గౌరవం.. రోడ్డుపాలు..
రక్షక భటులకు.. రక్షణ దళాలకు యూనిఫాం, టోపీ ఓ గౌరవం. క్యాప్ హుందాతనాన్ని సూచిస్తుంది. మనిషికి తల ఎంత అవసరమో.. నేవీ ఉద్యోగికి టోపీ అంతే అవసరం. దానిని గౌరవిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. ఆ హుందాతనాన్ని ఓ నేవీ ఉద్యోగి పొరపాటున దారిలో పారేసుకున్నారు. డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లే రహదారిలో.. ఈ దృశ్యం సాక్షి కెమెరా కంటపడింది. పదుల సంఖ్యలో వాహనాలపై వెళ్తున్నా.. ఎవ్వరూ దాని గురించి పట్టించుకోలేదు. ఆ టోపీ విలువ తెలిసిన శర్మ అనే విశ్రాంత నేవీ ఉద్యోగి.. బండిని ఆపి.. దాన్ని అందుకున్నారు. బైక్‌పై గౌరవంగా తీసుకెళ్లిపోయారు. -
స్వైన్‌ఫ్లూ జోరు
రోజుకు 3–4 అనుమానిత కేసులు తాజాగా నేవీ ఉద్యోగికి వ్యాధి లక్షణాలు విశాఖపట్నం : నగరంలో స్వైన్‌ఫ్లూ జోరు తగ్గడం లేదు. ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా స్వైన్‌ఫ్లూ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దాదాపు నెల రోజుల క్రితం వెలుగు చూసిన ఈ మహమ్మారి ఆరంభంలో నగరంలోని సాలిపేటకు చెందిన ఒక మహిళను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఉధృత రూపం దాలుస్తూనే ఉంది. ఎక్కడో చోట తన ఉనికిని చాటుకుంటేనే ఉంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జనం రద్దీ ఎక్కువగా ఉండే 11 ప్రాంతాల్లో స్క్రీనింగ్ కేంద్రాలను, ప్రభుత్వ ఐడీ ఆస్పత్రి, కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అక్కడ స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులను చేర్చుకుని చికిత్స అందజేస్తున్నారు. రోజుకు ముగ్గురు నలుగురు చొప్పున స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతూనే ఉన్నారు. వీరిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తున్నారు. లేనివారిని ఆస్పత్రుల నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తు తం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 35 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులున్నాయి. వీరిలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరికొంతమందికి సంబంధించి వైద్య నివేదికలు రావలసి ఉంది. ప్రైవేటు ఆస్పత్రిలో నేవీ ఉద్యోగికి వైద్యం శనివారం ఐఎన్ఎస్ కల్యాణి క్వార్టరులో ఉంటున్న నేవీ ఉద్యోగికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు మైదాన ప్రాంతాలకంటే నగరం నుంచే ఎక్కువగా వస్తున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో విశాఖ ఉత్సవ్ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తున్నందున వీరు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇందులో భాగంగా అవగాహన కోసం విశాఖ ఉత్సవ్‌లో ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో సత్వర చికిత్స కొద్దిరోజుల క్రితం కేజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూను నిర్ధారించే వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుల శాంపిళ్లను తిరుపతి, హైదరాబాద్‌ల్లోని వైరాలజీ ల్యాబ్‌లకు పంపేవారు. ఈ శాంపిళ్ల రిపోర్టు రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పట్టేది. అప్పటిదాకా ఆయా రోగులకు నామమాత్రపు చికిత్సను అందించేవారు. తాజాగా కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుతో గంటల వ్యవధిలోనే వ్యాధి లక్షణాలను స్పష్టం చేస్తూ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారికి తక్షణమే అత్యవసర వైద్యం అందించే అవకాశం కలుగుతోంది. -
'ఆ మృతదేహం మా వాడిదే'
విశాఖ: ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తన కుమారుడేనంటూ ఓ వ్యక్తి నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 29న నేవీ ఉద్యోగుల కారు ఢీకొని జనార్థన్ అనే వ్యక్తి మృతిచెందాడు. అయితే జనార్థన్ తమ కుమారుడేనంటూ మృతదేహాన్ని తీసుకెళ్లి అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు చేశాడు. అనంతరం ప్రమాద పరిహారం కింద నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో మృతుడు జనార్ధన్ తమ కుమారుడేనంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లిదండ్రులు బుధవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జనార్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, రేపు (గురువారం) జనార్ధన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టమ్ చేయనున్నారు. -
డ్యూటీకి వెళుతుండగా ప్రమాదం: నేవీ ఉద్యోగి మృతి
మల్కాపూర్: విశాఖపట్నం జిల్లా మల్కాపూర్ హనుమాన్ ఆలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి జితేందర్(35) మృతిచెందారు. ద్విచక్రవాహనంలో విధులకు బయలుదేరిన ఆయన.. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తుపాకీతో కాల్చుకున్న నౌకాదళ ఉద్యోగి
మల్కాపురం: విశాఖలో నౌకాదళ ఉద్యోగి ఒకరు విధుల్లో ఉండగా తుపాకీతో తనకు తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రవి సాక్ (28) ఓ యుద్ధనౌకలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నేవల్ డాక్‌యార్డ్‌లో విధుల్లో ఉన్న సమయంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తుపాకీ మిస్‌ఫైర్ అయ్యిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. -
కృష్ణానదిలో జారిపడి నేవీ ఉద్యోగి మృతి
గుంటూరు : సరదాగా నదిలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాడేపల్లి మున్సిపాలిటి పరిధిలోని బ్రహ్మానందపురానికి చెందిన పగడాల నాగరాజు(31) నావికాదళంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే సెలవుపై సొంత ఊరికి వచ్చాడు. ఈ క్రమంలో మిత్రులతో కలిసి శనివారం రాత్రి అమరావతి కరకట్టకు వెళ్లిన నాగరాజు ప్రమాదవశాత్తు జారిపడి నదిలో గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు అతని మృతదేహం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆదివారం ఉదయం మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారాంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.