మల్కాపూర్: విశాఖపట్నం జిల్లా మల్కాపూర్ హనుమాన్ ఆలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి జితేందర్(35) మృతిచెందారు.
ద్విచక్రవాహనంలో విధులకు బయలుదేరిన ఆయన.. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.