టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్టు అరంగేట్ర సిరీస్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్‌లో అడుగు పెట్టిన నితీశ్.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
తొలిసారి ఆసీస్ గడ్డపై అడినప్పటికి నితీశ్‌లో కొంచెం కూడా భయం కన్పించలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర కుర్రాడు సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన అంతర్జాతీయ సెంచరీని కూడా నితీశ్ అందుకున్నాడు.
మెల్‌బోర్న్‌లో అతడి చేసిన సెంచరీ తన కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బీజీటీ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెడ్డి రెండో స్ధానంలో నిలిచాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో మెరిశాడు.
వైజాగ్‌లో గ్రాండ్ వెలకమ్..
ఇక ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీష్ కుమార్ రెడ్డి తన స్వస్థలమైన విశాఖకు గురువారం చేరుకున్నాడు. విమానాశ్రయంలో ఈ తెలుగు తేజానికి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు.
ఓపెన్ టాప్ జీపులో ముందు సీట్లో నితీశ్ రెడ్డి కూర్చోగా.. వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. అభిమానులతో గాజువాక వీధులు కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు
నితీష్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. గతేడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నితీశ్ రెడ్డి డెబ్యూ చేశాడు.
బంగ్లాతో సిరీస్‌లో కూడా అతడు అద్బుతంగా రాణించాడు. అయితే టీ20, టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఇప్పుడు వన్డేల్లో కూడా డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 ఏళ్ల నితీశ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అతడు అక్కడ తన సత్తాచాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌తో జరగనున్న తొలి టీ20తో ఇంగ్లండ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. ఐదు టీ20 అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.
చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
India allrounder Nitish Kumar Reddy received a grand welcome at the Vizag airport upon his homecoming after a successful tour of Australia, where he scored a maiden Test 💯 at the MCG ##BGT2025 pic.twitter.com/jt0AqTDTXK
— Gaurav Gupta (@toi_gauravG) January 9, 2025
Comments
Please login to add a commentAdd a comment