బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా, భారత్ జట్లు సిద్దమయ్యాయి. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ రెండూ భావిస్తున్నాయి. అయితే ఈ నాలుగో టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఓపెనర్‌గా రోహిత్..
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాణిస్తుండడంతో గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్‌మ్యాన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ క్రమంలోనే అతడిని తన రెగ్యూలర్ బ్యాటింగ్ పొజిషేన్‌లోనే పంపాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఫస్ట్ డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై వేటు పడే అవకాశం ఉంది.. ఎందుకంటే రోహిత్ ఓపెనర్‌గా, రాహుల్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వస్తే.. గిల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు రాక తప్పదు. అతడు ఎప్పుడూ టాపర్డర్‌లో తప్ప లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు.
దీంతో గిల్ స్దానంలో ధ్రువ్ జురెల్‌కు చోటు ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టైమ్స్ ఇండియా కథనం ప్రకారం.. బ్యాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సందర్‌లు బ్యాక్సింగ్ డే టెస్టులో స్పిన్నర్లగా ఆడున్నట్లు సమాచారం. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలని రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నరంట. నితీశ్ బ్యాటింగ్ పరంగా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, బౌలింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్‌కు అవకాశమివ్వనున్నారంట.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన! 19 ఏళ్ల కుర్రాడికి చోటు
Comments
Please login to add a commentAdd a comment