link
-
బ్యాంక్ లింక్ పంపి.. రూ.11లక్షలు దోచేశారు
జనగామ: ఇంటి నిర్మాణానికి మూడేళ్లుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటున్న సొమ్మును సైబర్ మాయగాళ్లు ఏపీకే లింక్ పంపి దాన్ని డౌన్లోడ్ చేయగానే క్షణాల్లో నగదును మాయం చేశారు. ఫోన్ ఔట్ గోయింగ్ పని చేయడం లేదని.. అనుమానం వచ్చి బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో సొమ్ము లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు సదరు ఖాతాదారుడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణం హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పోలోజు రామేశ్వర్ ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పునాది వేశాడు. అప్పటి నుంచి ఇంటి నిర్మాణానికి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేస్తూ స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.11లక్షల వరకు జమ చేశాడు. ఇంటి నిర్మాణ పనులకు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి కొంత నగదును డ్రా చేసుకుంటున్నాడు. కాగా ఈ నెల 8వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన రామేశ్వర్.. తిరుగు ప్రయాణంలో తన ఫోన్‌కు యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్‌తో ఫేక్ మెసేజ్ వచ్చింది. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ మోసగాడు పంపించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ నేరస్తుడు సదరు వ్యక్తికి ఎటువంటి అనుమానం కలుగకుండా తన ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేశాడు. అదే రోజు రాత్రి రామేశ్వర్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు, శుక్రవారం రూ.4.21 లక్షలు, మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షల నగదును డ్రా చేసుకుని, రూ.142 మాత్రమే మి గిల్చారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్‌కు వెళ్లి సరి చేయగా, డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రా వడంతో అక్కడ నుంచి హుటాహుటిన బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అ ధికారులు ఖాతా నంబర్‌ను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో డ బ్బులు డ్రా అయినట్లు తెలిపారు. ఇందులో రూ.9.21 లక్షల నగదు అ నుమానం కలుగకుండా డ్రా చేయగా, రూ.2లక్షలు మాత్రం చెన్నైలో ని సిద్దపుడూర్ సెంట్రల్ బ్యాంకు నుంచి రాహుల్ అనే వ్యక్తికి నెఫ్ట్ చేసిన ట్లు గుర్తించినట్లు బాధితుడు రామేశ్వర్ తెలిపారు. బాధితుడు పో లీ సులను ఆశ్రయించగా 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చే యించారు. వెంటనే కేసును విచారించిన పోలీసులు, రూ.1.37 లక్షల ను హోల్డ్ చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు రామేశ్వర్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఓటరు నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదు: ECI
సాక్షి, ఢిల్లీ: ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం Election Commission of India స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారం -6, 6బీ లో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓ రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అండర్ టేకింగ్ సమర్పించింది ఈసీఐ. ఇప్పటికే దాదాపు 66,23,00,000 కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల కార్డులతో జత చేశామని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎన్నికల గుర్తింపు కార్డులతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జూన్ 2022లో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రదేశ్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది సుకుమార్ పట్టజోషి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తరపున అండర్‌టేకింగ్‌ను బెంచ్‌కు సమర్పించారు. అండర్ టేకింగ్‌లో.. ఫారం6(కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం)తో పాటు 6బీ(రిజిస్ట్రేషన్ ఇన్ ఈ-రోల్) అవసరమైన మార్పులు చేస్తమని తెలిపారు. అలాగే. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26-బి ప్రకారం ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఈసీఐ అండర్ టేకింగ్ నేపథ్యంలో.. కోర్టు సదరు రిట్ పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్లైన్లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
గడువు ముగుస్తోంది.. పాన్-ఆధార్ లింక్ చేశారా?
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ముగుస్తోంది. మినహాయింపు కేటగిరీకి చెందినవారు తప్ప మిగిలిన వారందరూ వెంటనే తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్లో రిమైండర్‌ను షేర్ చేసింది. చివరి తేదీ సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు, పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. పాన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన సూచనలతోపాటు గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జరిగే పరిణామాల గురించి కూడా హెచ్చరించింది. చివరి తేదీ ఎప్పుడు? పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. ఈలోపు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించకపోతే, 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ పాన్ కార్డ్ పని చేయకుండా పోతుంది. పాన్-ఆధార్ లింక్ చేయడమెలా? ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ కోసం సెర్చ్ చేసి అందుబాటులో ఉన్న పాన్-ఆధార్ లింక్‌పై క్లిక్ చేయాలి అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి లేకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి (యూజర్ ఐడీగా పాన్ నంబర్ నమోదు చేయాలి) వెంటనే ఆధార్-పాన్ లింక్‌ను తెలియజేసే పాపప్ కనిపిస్తుంది. (ఒకవేళ కనిపించకపోతే వెబ్సైట్ ఎడమ వైపు విభాగాన్ని సందర్శించండి) అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి వివరాలను నిర్ధారించి, క్యాప్చాను ఎంటర్ చేయాలి ఇది పూర్తయిన తర్వాత పాన్ ఆధార్ కార్డ్‌కి విజయవంతంగా లింక్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. లింక్ చేయకపోతే ఏమౌతుంది? ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది. అలాగే ఈ కింది పరిణామాలను పాన్ హోల్డర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెల్లింపులు నిలిచిపోతాయి. పాన్ పని చేయని కాలానికి నిలిచిపోయిన నగదుపై ఎటువంటి వడ్డీ రాదు అధిక టీడీఎస్, టీసీఎస్‌లు భరించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు, కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల వాసులు, భారతీయ పౌరులు కానివారు, 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి, జరిమానాల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2023 మార్చి 28న ఆర్థిక శాఖ ఇచ్చిన ప్రకటనలో పాన్-ఆధార్ లింకింగ్‌కు చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2023 మార్చి 28 నాటికి 51 కోట్లకుపైగా పాన్లు ఆధార్‌తో లింక్ అయినట్లు పేర్కొంది. पैन धारक कृपया ध्यान दें! आयकर अधिनियम, 1961 के अनुसार, पैन धारक, जो छूट की श्रेणी में नहीं आते हैं, उन्हें 30.06.2023 तक अपने पैन को आधार से जोड़ना अनिवार्य है। कृपया अपना पैन और आधार आज ही लिंक करें! Kind attention PAN holders! As per Income-tax Act, 1961, it is mandatory… pic.twitter.com/VyliEJ75Gy — Income Tax India (@IncomeTaxIndia) June 21, 2023 ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట! టీసీఎస్, టీడీఎస్ అనుసంధానం..
న్యూఢిల్లీ: మూలం వద్దే పన్ను వసూలు చేయడం (టీసీఎస్), మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్)ను ప్రభుత్వం అనుసంధానించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనివల్ల టీసీఎస్ చెల్లించిన వారిపై టీడీఎస్ భారం తగ్గుతుందని.. తద్వారా పన్ను చెల్లింపుదారు నగదు ప్రవాహాలపై ప్రభావం పడకుండా ఉంటుందన్నారు. జూలై 1 నుంచి కొన్ని రకాల అంతర్జాతీయ క్రెడిట్ కార్డు వ్యయాలపై 20 శాతం టీసీఎస్‌ను అమలు చేస్తున్న దశలో అనంతనాగేశ్వరన్ ఈ అంశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్తకులు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలపై టీసీఎస్‌ను వసూలు చేస్తుంటారు. అదే టీడీఎస్ అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ పట్ల నిరసన వ్యక్తం కావడంతో రూ.7 లక్షల వరకు లవాదేవీలకు మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. దీనివల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించిందని... కనుక ఎక్కువ శాతం లావాదేవీలు 20 శాతం టీసీఎస్ పరిధిలోకి రావంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని అనంత నాగేశ్వరన్ సమర్థించారు. -
ఇన్స్టాల్ చేసే యాప్‌తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
పాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. వీరికి మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది. అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్లు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. భారతదేశ పౌరులు కాని వారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్ సాయిబాబాకు భారీ షాక్ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషి(సాయిబాబా) మీద నమోదు అయిన అభియోగాలు.. సమాజం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. శనివారం ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్.. ఆయన జీవితఖైదును కొట్టేస్తూ తక్షణమే విడుదల చేయాలంటూ మహారాష్ట్ర హోం శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై స్టే విధించాలంటూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. దీంతో.. ఈ వ్యవహారంపై మరో అత్యవసర అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో.. శనివారం మహారాష్ట్ర పిటిషన్‌పై ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. బాంబే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దోషి విడుదల ఆదేశాలు ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కొన్ని కీలక విషయాలను విస్మరించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వైద్యపరమైన కారణాల దృష్ట్యా గృహనిర్భంధం కోసం సాయిబాబా చేసుకున్న అభ్యర్థనను సైతం.. నేర తీవ్రత దృష్ట్యా తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. సాయిబాబాతో పాటు సహ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. విడుదలపై స్టే ఇస్తూ.. రికార్డుల్లోని సాక్ష్యాలను సవివరంగా విశ్లేషించిన తర్వాత నిందితులు దోషులుగా నిర్ధారించబడినందున.. బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 390 కింద అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. వీల్ చైర్‌కి పరిమితమైన ఈ మాజీ ప్రొఫెసర్.. మావోయిస్టులతో సంబంధాల కేసులో 2014 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జీవిత ఖైదు పడడంతో.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా సుప్రీం కోర్టు స్టే నేపథ్యంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఉదయ్‌పూర్ కంటే ముందే మరో ఘటన! దర్యాప్తు ముమ్మరం
ముంబై: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో ఉగ్రకోణం వెలుగు చూడడంతో నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో పాటు మరికొన్ని కీలకాంశాలను సైతం రాజస్థాన్ పోలీసులు విచారణ ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ ఘటన కంటే ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో దర్యాప్తు ఊపందుకుంది. మహారాష్ట్ర అమరావతిలో మెడికల్ సామాగ్రి వ్యాపారి ఉమేష్ కోల్హే హత్య పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఆయన్ని కూడా కన్హయ్య లాల్ తరహాలోనే దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతర వివరాలేవీ బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం.. ఇది నూపుర్ శర్మ కామెంట్లకు ముడిపడిన ఘటనే అని చెప్తున్నారు. జూన్ 21వ తేదీ రాత్రి దుకాణం నుంచి తిరిగి వస్తున్న టైంలో ఉమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన్ని గొంతుకోసి చంపి పారిపోయినట్లు.. వెనుక మరో బైక్ మీద వస్తున్న ఉమేష్ కొడుకు, ఉమేష్ భార్యలు ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి.. అబ్దుల్ తౌఫిక్, షోయెబ్ ఖాన్, అతీఖ్ రషీద్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ అది దొంగతనంలో భాగమే అయితే.. ఉమేష్ వెంట ఉన్న డబ్బును తీసుకెళ్లేవాళ్లు. కానీ, ఆయన్ని ఎందుకు హత్య చేసి ఉంటారన్నది ఇప్పుడు పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాదు.. కోల్హే తన సోషల్ మీడియాలో నూపుర్ శర్మకు అనుకూలంగా కొన్ని పోస్టులు షేర్ చేశారని, వాటిని వాట్సాప్ గ్రూపుల్లోనూ పంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి.. అమరావతి కమిషనర్ ఆర్తి సింగ్‌ను కలిసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్‌పూర్ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన పోలీసులు.. దర్యాప్తు చేయిస్తున్నారు. చదవండి: ఉదయ్‌పూర్ ఘటన.. భయపడినట్టుగానే జరిగింది!! -
Cyber Crime: లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ
మీ వాట్సాప్ ఆకర్షణీయమైన పింక్ కలర్లో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో అన్ని రకాల సినిమాలను హై క్వాలిటీలో చూడాలనుకుంటున్నారా? ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో చూసి ఆనందించాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బులు చెల్లించకుండానే వాటిని అమెజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్‌లో ఆస్వాదించండి. మీరు చేయాల్సిందల్లా ఈ లింక్‌ను క్లిక్ చేయడమే. మీ స్మార్ట్ ఫోన్లోని ఆండ్రాయిడ్ వెర్షన్లో మీరు ఊహించని గేమ్స్, సినిమాలు, మరెన్నో యాప్‌లు తక్కువ రేటుకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ లింక్‌ను ఓపెన్ చేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇటువంటి ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మకంగా పంపించే లింకులను క్షణం ఆలోచించకుండా క్లిక్ (ఓపెన్) చేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. సైబర్ నేరగాళ్లు నయా దందాలకు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఫేస్బుక్ అక్కౌంట్లను హ్యాక్ చేసి ఖాతాదారు ఫ్రెండ్స్‌తో మెసెంజర్ ద్వారా నమ్మకంగా చాటింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న సైబర్ క్రైమ్ ముఠాలు చెలరేగిపోయాయి. తాజాగా వాట్సాప్ గ్రూపులకు యాప్‌లు, ఆఫర్లు, సినిమాలు, గేమ్స్ అంటూ లింక్‌లు పెట్టి డేటా దోచేసే ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త ప్రకటనలతో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే.. ఫోన్లోని సమాచారం చోరీ అవుతోంది. ఇన్స్టాల్ పేరుతో ఆయా లింక్‌లను క్లిక్ చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్కు అనుమతిస్తే వెంటనే మన ఫోన్ సైబర్ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. లా ఫోన్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల సర్వర్లోకి చేరుతోంది. ఆ డేటాను ఉపయోగించుకుని మన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే మనకు తెలియకుండానే డబ్బులు లాగేయడం, వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలు చిక్కితే న్యూడ్ ఫొటోలు, వీడియోలు అంటూ డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, మన కాంటాక్ట్స్‌కు కాల్చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చేసేందుకు అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్ వాట్పాప్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి లింక్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు. మనకు తెలియని, అవగాహన లేని లింక్‌లను తెరిస్తే ఫోన్లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది. వీటిపై ఇప్పటివరకు మా పరిధిలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయినా ఇటువంటి లింక్‌ల పట్ల సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. - బి.రాజారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ, విజయవాడ -
‘తపాలా’లో ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పొందేందుకు ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం (ఓటీపీ కోసం) తప్పనిసరి కావటంతో తపాలాకార్యాలయాలను వినియోగించుకోవాలని ఆ శాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ (28 మఫిసియల్ జిల్లాలు) పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో ఈ అనుసంధాన ప్రక్రియ చేయించుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తున్నాయని తెలిపింది. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పటం ద్వారా గాని లేదా ఐరిష్ ద్వారా కానీ సరుకులు ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓటీపీ కోసం ఆధార్‌తో మొబైల్ అనుసంధానం తప్పనిసరైంది. ఆధార్‌లో నిక్షిప్తమై ఉన్న ఐరిస్‌లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, ఐరిస్‌ను కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ రెండు సేవలను తపాలాశాఖ ఆధ్వర్యంలోని ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. -
ఈ నెల 31 తర్వాత పాన్ పనిచేయదు!
న్యూఢిల్లీ: పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి అని, ఇందుకు ఇచ్చిన గడువు ఈ నెల 31న ముగుస్తుందంటూ ఆదాయపన్ను శాఖ మరోసారి గుర్తు చేసింది. గడువు నాటికి అనుసంధానం చేసుకోకపోతే.. అప్పుడు పాన్ పనిచేయకుండా పోతుందని హెచ్చరించింది. బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ లేదా పాన్ సేవా కేంద్రాలను సందర్శించడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను సైతం పోస్ట్ చేసింది. ్ఖఐఈ్కఅN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, పాన్ నంబర్ టైప్ చేసిన తర్వాత 567678 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే, ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ఠీఠీఠీ. జీnఛిౌఝ్ఛ్ట్చ్ఠజీnఛీజ్చ్ఛీజజీ జీnజ. జౌఠి. జీn కు వెళ్లి కూడా అనుసంధానం చేసుకోవచ్చు. -
అసలు పాపం వారిదే..నీరవ్‌ను వదిలిపెట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. దావోస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార వేత్తలతో దిగిన ఫోటోలో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ఉండటంపై విమర్శలకు దిగిన కాంగ్రెస్‌కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందన్నారు. గీతాంజలి ఆభరణాల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నవిషయాన్నిగుర్తు చేసిన ఆమె రాహుల్‌పై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ స్కాంలో అసలు పాపం అంతా కాంగ్రెస్‌దేనని, దాన్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీపై ఎదురు దాడిచేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి భార్యకు భార్య అనితా సింగ్‌కు నీరవ్ మోదీకి చెందిన కంపెనీలో షేర్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. నీరవ్ మోదీ కంపెనీలలో ఒకటైన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనితా సింఘ్వి ,(కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి భార్య) , కుమారుడు అవిష్కార్ సింఘ్వి డైరెక్టర్లుగా ఉన్న అద్వైతా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్ హోల్డింగ్స్ స్థలాన్ని 2002 నుంచి అద్దెకు ఇచ్చారని, రెండు కంపెనీల మధ్య రుణ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఇందులో ప్రమోటర్లుగా కాంగ్రెస్‌వారే లబ్ధి దారులుగా ఉన్నారని ఆరోపించారు. వారసత్వ, వారసత్వ ఆస్తులు అన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవని ఆమె ఆరోపించారు. అలాగే మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ దేశం విడిచిపారిపోయినా, పట్టుకుని తీరతామన్నారు.ఆయన్ను అరెస్టు చేసేందుకవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీరవ్ మోదీ సహా అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. కుంభకోణాలకు పాల్పడిన క్షమించే ప్రసక్తే లేదనీ, శిక్షించి తీరుతామన్నారు. -
ఆధార్-పాన్ అనుసంధానంపై గుడ్‌న్యూస్
సాక్షి న్యూఢిల్లీ: ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2018)మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ లింకింగ్ ప్రస్తుత గడువు ఈ డిసెంబర్ 31తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. CBDT extends date till 31.3.18 for linking of Aadhaar with PAN https://t.co/5mLiy2sf6b — Ministry of Finance (@FinMinIndia) December 8, 2017 -
13.28 కోట్ల పాన్‌కార్డులు ..
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ 13.28 కోట్ల శాశ్వత ఖాతా నంబర్లు (పాన్ ) కార్డ్ తో ఆధార్ నంబర్ల అనుసంధానం జరిగిందని కేంద్ర ప్రకటించింది. దీంతో ప్యాన్‌తో ఆధార్ లింకింగ్ ప్రక్రియలో 39.5 శాతం కార్డుల అనుసంధానం పూర్తయిందని అధికారిక వర్గాలు సోమవారం ప్రకటించాయి. సుమారు 33 కోట్ల పాన్ కార్డులు ఉండగా, ఆధార్ 115 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేసినట్టు వెల్లడించాయి. జూలై 1 నుంచి ఐటీఆర్ ( ఆదాయన పన్ను టర్న్) దాఖలు కు పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదాయపు పన్ను చట్టం నిబంధనపై జూన్ నెలలో సుప్రీంకోర్టు సమర్థించింది అయితే గోపత్య అంశంపై రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వరకు ఈ ఆదేశాల అమలుపై పాక్షింగా స్టే విధించింది. అలాగే ఆధార్కార్డుకోసం నమోదు చేసుకున్న వారి పాన్ కార్డులు రద్దు కావని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కూడా...
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ అనుసంధానం పరంపరలో మరో అంశంకూడా వచ్చి చేరింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా ఆధార్‌నెంబర్ తో అనుసంధానం ప్రక్రియను అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. త్వరలోనే డ్రైవింగ్ లైసెన్సులతో ఆధార్‌ను అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017లో శుక్రవారం మాట్లాడుతూ రవిశంకర్ ప్రసాద్ ఈ సంకేతాలిచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ తో కూడా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ లింకింగ్‌కు ఎలాంటి గుడువును కేంద్ర మంత్రి వెల్లడించలేదు. డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ లింకింగ్ పై ఆలోచిస్తున్నామని దీనిపై కేంద్ర మంత్రి నితిన్గడ్కర్తో చర్చించినట్టు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో డిజిటిల్ ఐడెంటిటీ ద్వారా వ్యక్తిగత గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. అలాగే నగదు అక్రమ లావాదేవీల నిరోధానికి పాన్‌తో ఆధార్ అనుసంధానం అవసరమని చెప్పారు. ఆధార్ అనుసంధానం, గోప్యత ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకముందే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ఎస్ఎంఎస్తో పాన్-ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఆదాయ పన్ను శాఖ మరింత సరళ తరం చేసింది. కేవలం ఒక ఎస్ఎంఎస్ ద్వారా పాన్ నంబర్‌కు ఆధార్చ నంబర్‌ను లింక్ చేసే విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు పన్నుచెల్లింపుదారులు తమ ఆధార్ కార్డు నెంబరును అనుసంధానం చేయాల్సిందిగా కోరింది. ఇటీవల ఐటీ వెబ్సైట్లో ఆధార్ లింక్ కోసం కొత్త లింక్‌ను ప్రకటించిన ఐటీ శాఖ తాజాగా ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రముఖ జాతీయ దినపత్రికలలో జారీ చేసిన ప్రకటనల్లో ఎస్ఎంఎస్ ద్వారా వీటిని ఎలా లింక్ చేయాలో వివరించింది. పాన్, ఆధార్ నెంబర్లను 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ సెండ్ చేయాలని చెప్పింది. మరిన్ని వివరాలకు ఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కోరింది. కాగా జూలై 1, 2017 నుండి పాన్ కార్డు దరఖాస్తు కు ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
పాన్‌తో ఆధార్ అనుసంధానికి కొత్త లింక్
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ) గురువారం ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/ పేరుతో కొత్త లింక్‌ను లాంచ్ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. పాన్ తో ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఈ కొత్త లింక్‌ను పొందు పర్చింది. ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను (పాన్, ఆధార్ ) అనుసంధానించటానికి హోం పేజ్‌లో దీన్ని సృష్టించింది. అయితే పాన్, ఆధార్ లలో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని తెలిపింది. అలాగే పాన్, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్‌బర్త్, జెండర్ తదితర వివరాలు సరిపోలాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) లేదా ఈ మెయిల్ పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం ఐటీఆర్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి అమలుకానుంది. -
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?
న్యూఢిల్లీ: భారతీయ పౌరులకు బయోమెట్రిక్ డేటా ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు ఆధార్ కార్డ్. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకం చేయడానికి, నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఆర్థిక శాఖ పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. పాన్, పన్ను రిటర్న్‌లు దాఖలు కోసం ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిసెంబరు 31 తుది గడువుగా ప్రకటించింది. ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ ఇన్వాలిడ్ అవుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా? మొదట పన్ను చెల్లింపుదారులఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నేరుగా లాగిన్ అయితే సరిపోతుంది.లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ వివరాలను ఆటోమేటిగ్గా సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత మీ నంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే.. నిమిషాల్లో ఈ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలన్నీ సరిపోలితేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయిన వెంటనే సమాచారం అందుతుంది. పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో కొన్ని రోజుల తర్వాత పాన్ పనికిరాకుండా పోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆధార్ లేని వారు దాని కోసం దరఖాస్తు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఈ మధ్యే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని వుంటే అనుసంధానం చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ నంబరు వేస్తే చాలు. -
వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్
-
వాట్సాప్ వీడియో కాల్ లింక్ స్కామ్
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సాప్ ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన వీడియో కాలింగ్ అప్లికేషన్ ను అపుడే హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ తాజాగా వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ ఇన్విటేషన్ ముసుగులో స్కామ్ భయం ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. వీడియో కాల్ ఇన్విటేషన్ పేరుతో మోసపూరిత లింక్స్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయని, వీటిని క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో కాలింగ్ ఫీచర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం...కేవలం ఇన్విటేషన్ ద్వారా మాత్రమే ఈ ఫీచర్ కి అనుమంతి వుందంటూ యూజర్లను ట్రాప్ చేసి, సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు తెలిపారు.ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మోసగాళ్ల ట్రాప్ లో కుండా కేవలం గూగుల్ ప్లే ద్వారా మాత్రమే వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసకోవాలని తెలిపారు. కాగా తాజాగా అధికారిక వాట్సాప్ అకౌంట్లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఉపయోగించుకుంటున్న యూజర్లు వాట్సాప్ వీడియో కాల్స్ నాణ్యత పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ కాల్స్ సమయంలో పి నాసిరకమైన వీడియో క్వాలిటీ పూర్ గా ఉందని, ఎక్కువ డేటాను ఖర్చవుతోందని వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
లింక్ తెగి.. ముందుకెళ్లిన రైలింజన్
డోన్ టౌన్: లింక్ తెగిపోవడంతో డోన్ నుంచి గుత్తికి వెళ్లే ప్యాసింజర్ రైలింజన్..బోగీలు లేకుండా వంద మీటర్లు ముందుకు వెళ్లింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కాసేపు ఆందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం గ్రహించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజిన్‌ను వెనక్కు తెచ్చి బోగీలతో లింక్‌ను సరిచేయడంతో 30 నిమిషాలు ఆలస్యంగా ప్యాసింజర్ రైలు గుత్తికి బయలుదేరింది.