
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు.
భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు.
ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు.