cyber security experts
-
ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్‌లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్‌లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్ సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్‌కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ–ఐఎన్(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) యాపిల్ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్‌లోని యాపిల్ సంస్థ ప్రతినిధులు సీఈఆర్టీ–ఐఎన్ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్ సైబర్ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. -
ఫేక్ లోన్ యాప్‌లతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ రుణ యాప్‌లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్లైన్ రుణ యాప్ బజాజ్ ఫైనాన్స్ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది. ఫేక్ యాప్‌ల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్లైన్ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో రుణం తీసుకొనే ముందు యాప్‌ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఫేక్ రుణ యాప్‌ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి... ♦ వెరిఫై చేయని ఆన్లైన్ రుణ యాప్లనుప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. ♦ ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అఫిలియేషన్ లేకపోయినా అది మోసపూరిత ఆన్లైన్ లోన్ యాప్‌గా గుర్తించాలి. ♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్ ఉన్న యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ♦ రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్‌లు నకిలీవేనని తెలుసుకోవాలి. ♦ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలి. కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్‌లు - ఐవొరి లెండ్స్, క్యాష్ పార్క్, ఆన్లైన్ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్కాష్, లోన్బడ్డీ. -
ట్రోలింగ్ సామాజిక జబ్బు!
సాక్షి, హైదరాబాద్: సెలెబ్రిటీలకే కాదు. క్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఎదుటి వారి ప్రతిష్టను సోషల్ మీడియాలో దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు శాడిస్టులు. మరికొందరేమో పిచ్చి, ‘పచ్చి..’వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తాము ఫేమస్ అయ్యేందుకు దిగజారుతున్నారు. వ్యూస్, లైక్, కామెంట్లు , షేర్లతో సొమ్ము చేసుకునేందుకు ఇంకొందరు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎదుటి వారికి ఎలాంటి సంబంధం లేని విషయాలను వారికి అంటగట్టి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా కొందరు డబ్బు ఖర్చు చేసి మరీ ఇతరులతో ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎదుటివారు ప్రయోగించే ‘ట్రోలింగ్’అ్రస్తాన్ని ఎలా తిప్పికొట్టాలి..ఎలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన ఉండాలంటున్నారు సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డా.పాటిబండ్ల ప్రసాద్. ట్రోలింగ్ అంటే.. ఆన్లైన్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా కలవరపెట్టడాన్ని మనం స్థూలంగా ట్రోలింగ్ అనవచ్చు. ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాలను సైతం అంటగడుతూ వారి సామాజిక హోదాను దెబ్బతీయడం, తద్వారా వారిని తీవ్ర ఆందోళనలో నెట్టడమే ట్రోలింగ్చేసే వారి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ట్రోలింగ్ రకాలు... ఫ్లేమ్ ట్రోలింగ్ నిందారోపితమైన ఆరోపణలు, ద్వేషాన్ని, ఇతరులను కించపర్చే అంశాలపై ట్రోలింగ్. ఉదాహరణకు మతపరమైన విద్వేష పూరిత భావజాలం పెంచేలా ట్రోలింగ్. ఆఫ్–టాపిక్ ట్రోలింగ్ అసందర్భమైన వ్యక్తులను, ప్రదేశాలను, స్థలాలను వివాదాల్లోకి లాగేలా చేసే ట్రోలింగ్. ఉదాహరణకు..పాత తరం రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయాల్లోకి లాగడం..ప్రాంతాలు, మతపరమైన పాత వివాదాలు లేవనెత్తేలా ట్రోలింగ్. కన్సర్న్ ట్రోలింగ్ ఏదైన ఒక అంశాన్ని బా గా సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఆ విషయంపట్ల ఆందోళన చెందుతున్నట్టుగా నటిస్తూ వ్యాఖ్య లు.. ట్రోలింగ్ చేయడం.. ఉదాహరణకు.. మతపరమైన అంశాలపై మద్దతు పెంచడం, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేలా ట్రోలింగ్.. సోక్ పప్పెట్ ట్రోలింగ్... పెద్ద సంఖ్యలో ఫేక్ అకౌంట్లను సృష్టించి వాటి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చేలా లేదా కించపర్చేలా ట్రోలింగ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం.. ఉదాహరణకు..రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి, మతపరమైన అంశాల గురించి డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేయడం. ట్రోలింగ్ దుష్ప్రభావాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టి బాధించడం: మానసిక క్షోభకు ట్రోలింగ్ దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తెచి్చపెడుతుంది. నమ్మకాన్ని పోగొట్టడం: ట్రోలింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన, అర్థవంతమైన సంభాషణల్లోనూ పాల్గొనకుండా స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. చిల్లింగ్ ఎఫెక్ట్: ట్రోలింగ్ లేదా వేధింపులు భయాన్ని పెంచుతాయి. ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తి ఆన్లైన్లో తన అభిప్రాయాలు స్వేచ్ఛ చెప్పడానికి భయపడే పరిస్థితికి వస్తాడు. తప్పుడు సమాచారం: ట్రోల్లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే బాధితులు.. ట్రోలింగ్‌కు పాల్పడాలనుకునే వారు టార్గెట్ చేసుకునేది ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారిపైనే అందరిలో ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్పందించకపోవడమే అసలు మందు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోలింగ్ పాల్పడే వారి లక్ష్యం ఒక్కటే మనల్ని అన్ని రకాలుగా వేధించడం. అందుకే ట్రోలింగ్‌లో చేసే వారి కామెంట్లు పట్టించుకోకపోవడం అనేది ఉత్తమం. వీలైనంత వరకు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. అది ట్రోలింగ్‌కు వాడే ప్రమాదం ఉంది. అలానే ట్రోలింగ్ శ్రుతి మించితే మాత్రం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి, ఆ కంటెంట్ డిలీట్ చేయించవచ్చు. అదేవిధంగా ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేయడం, మ్యూట్ వంటి ఆప్షన్లు వాడాలి. ఇలా ఎదుర్కోవచ్చు... ట్రోల్‌ను తప్పక రిపోర్ట్ చేయాలి.. మనపై ట్రోలింగ్ చేస్తూ మనల్ని కించ పర్చే వ్యాఖ్యలు ఉంటే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి ఆ కామెంట్లు డిలీట్ చేయించవచ్చు. ఈ టూల్స్ వాడొచ్చు.. సోషల్ మీడియా ఖాతాల్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లు కొన్ని టూల్స్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేలా ఇస్తున్నాయి. ట్రోలింగ్ చేసే వారిని బ్లాక్ చేయ డం, మ్యూటింగ్ యూజర్స్ ఆప్షన్ పెట్టడం, ఫిల్టరింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వంటివి వాడుకోవాలి. -
సీడీఎస్ఎల్ సిస్టమ్‌లో మాల్వేర్
న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్వేర్ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్ఎల్ శుక్రవారం వెల్లడించింది. ఇది లావాదేవీల సెటిల్మెంట్లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్కనెక్ట్ చేసినట్లు సీడీఎస్ఎల్ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. -
వారికి భారీగా డిమాండ్, జీతం రూ.4 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ డిజిటల్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వారు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో వీరి కొరత ఎక్కువగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత ఏడాదిగా ఇండియా ఇంక్‌లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు బాగా కొరత ఏర్పడిందని, దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించే వారికి 25-35 శాతం ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపాయి. వీటిలో టాప్ రోల్స్‌కు వార్షిక వేతనం రూ.2 కోట్లకు పైన ఉంటుందని, వేరియబుల్స్ వంటి వాటిని మొత్తం కలుపుకుని, కొన్ని సందర్భాల్లో వీరి వేతనాలు రూ.4 కోట్ల వరకు ఉంటున్నాయని తెలిసింది. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో, డిజిటల్ లావాదేవీలు పెరిగి సైబర్ సెక్యురిటీ టాలెంట్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీలు కూడా సైబర్ అటాక్స్‌తో బెంబేలెత్తుతున్నాయి. దీంతో సైబర్ ప్రొఫిషెనల్స్ నియామకాలపై ఎక్కువగా దృష్టిసారించాయి. తమ క్లయింట్ల బోర్డుల్లో చాలామంది సైబర్ సెక్యురిటీ కోసం కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు సెర్చ్ సంస్థలు హంట్ పార్టనర్స్, ట్రాన్సెర్చ్ పేర్కొన్నాయి. 18 నెలల క్రితం వరకు కూడా సైబర్ సెక్యురిటీ నిపుణులు సమస్యల్లో ఉన్న ఐటీ సర్వీసులను మాత్రమే చూసుకునే వారని, కానీ ప్రస్తుతం వీరు కంపెనీల్లో బోర్డుల్లో స్థానం సంపాదించడమే కాకుండా.. మొత్తం వ్యాపారాలు వారిపై ఆధారపడేలా చేసుకున్నారని కేపీఎంజీ సైబర్ సెక్యురిటీ లీడ్, పార్టనర్ అతుల్ గుప్తా చెప్పారు. నాయకత్వ స్థానాల్లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు డిమాండ్ బాగా ఉందని, అదేవిధంగా తక్కువ స్థాయిలో కూడా వీరికి ప్రాధాన్యం ఉందని కార్న్ ఫెర్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవ్‌నీత్ సింగ్ తెలిపారు. సైబర్ సెక్యురిటీ అధినేతలకు వార్షిక వేతనం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉందని గుప్తా చెప్పారు. ముఖ్యంగా కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రిటైల్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో వీరికి డిమాండ్ బాగా ఉందని పేర్కొన్నారు. -
ట్రంప్‌కు టాటా చెప్పేశారు...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైబర్‌సెక్యూరిటీ సలహాదారుల బృందం షాక్ ఇచ్చింది. జాతీయ భద్రతా అంశాలపై తమ సూచనలను ట్రంప్ విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ వారంతా మూకుమ్మడిగా తప్పుకున్నారు.సైబర్ భద్రత పట్ల యూఎస్ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, తమ సూచనలను పెడచెవినపెడుతున్నారని వారు తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అమెరికన్లు ఆధారపడుతున్నకీలక వ్యవస్థల సైబర్ భద్రతకు ఎదురవుతున్న ముప్పు, సవాళ్లపై అధ్యక్షుడు శ్రద్ధ చూపడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు విద్వేష గ్రూపుల హింస, అసహనాలను నిరోధించడంలో ట్రంప్ ఫలమయ్యారనీ పేర్కొన్నారు. రాజీనామా చేసిన సైబర్ సెక్యూరిటీ భద్రతాదారుల్లో భారత సంతతికి చెందిన డేటా సైంటిస్ట్ కూడా ఉన్నారు. -
సైబర్ దాడులకు సిద్ధం
చెన్నై: భారత ప్రభుత్వం ఆజ్ఞాపిస్తే పాకిస్థాన్‌లోని వెబ్సైట్లపై సైబర్ దాడులకు సిద్ధమని నేషనల్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ఎస్.అమర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆ దేశంలోని వివాస్పద అంశాలను తెలుసుకోవచ్చని అన్నారు. పటాన్‌కోట్ దాడి అనంతరం తాము పాకిస్థాన్‌కు చెందిన అధికారిక వెబ్ సైట్లను హాక్ చేయగలమని చెప్పామని ఇందుకు ప్రభుత్వ అనుమతి అవసరమని ఆయన అన్నారు. చెన్నైలో జరిగిన నేషనల్ సైబర్ డిఫెన్స్ సమ్మిట్ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు చెందిన ప్రతీ సమాచారాన్ని హ్యాక్ చేయగల సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద ఉందని అన్నారు. ఇండియన్ వెబ్‌సైట్స్ ఎంత వరకు భద్రం అన్నప్రశ్నకు సమాధానంగా.. మనం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, మన సైట్లను హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు. గతంలో హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించామని చెప్పారు.దేశ వ్యాప్తంగా మన సైట్లను పరిరక్షించడానికి 10 లక్షల మంది నిపుణులు అవసరమని తెలిపారు.