ట్రంప్‌కు టాటా చెప్పేశారు...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైబర్‌సెక్యూరిటీ సలహాదారుల బృందం షాక్ ఇచ్చింది. జాతీయ భద్రతా అంశాలపై తమ సూచనలను ట్రంప్ విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ వారంతా మూకుమ్మడిగా తప్పుకున్నారు.సైబర్ భద్రత పట్ల యూఎస్ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, తమ సూచనలను పెడచెవినపెడుతున్నారని వారు తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
అమెరికన్లు ఆధారపడుతున్నకీలక వ్యవస్థల సైబర్ భద్రతకు ఎదురవుతున్న ముప్పు, సవాళ్లపై అధ్యక్షుడు శ్రద్ధ చూపడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు విద్వేష గ్రూపుల హింస, అసహనాలను నిరోధించడంలో ట్రంప్ ఫలమయ్యారనీ పేర్కొన్నారు. రాజీనామా చేసిన సైబర్ సెక్యూరిటీ భద్రతాదారుల్లో భారత సంతతికి చెందిన డేటా సైంటిస్ట్ కూడా ఉన్నారు.