సాక్షి, హైదరాబాద్: సెలెబ్రిటీలకే కాదు. క్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఎదుటి వారి ప్రతిష్టను సోషల్ మీడియాలో దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు శాడిస్టులు. మరికొందరేమో పిచ్చి, ‘పచ్చి..’వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తాము ఫేమస్ అయ్యేందుకు దిగజారుతున్నారు.
వ్యూస్, లైక్, కామెంట్లు , షేర్లతో సొమ్ము చేసుకునేందుకు ఇంకొందరు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎదుటి వారికి ఎలాంటి సంబంధం లేని విషయాలను వారికి అంటగట్టి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా కొందరు డబ్బు ఖర్చు చేసి మరీ ఇతరులతో ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎదుటివారు ప్రయోగించే ‘ట్రోలింగ్’అ్రస్తాన్ని ఎలా తిప్పికొట్టాలి..ఎలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన ఉండాలంటున్నారు సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డా.పాటిబండ్ల ప్రసాద్.
ట్రోలింగ్ అంటే..
ఆన్‌లైన్‌లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా కలవరపెట్టడాన్ని మనం స్థూలంగా ట్రోలింగ్ అనవచ్చు. ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాలను సైతం అంటగడుతూ వారి సామాజిక హోదాను దెబ్బతీయడం, తద్వారా వారిని తీవ్ర ఆందోళనలో నెట్టడమే ట్రోలింగ్‌చేసే వారి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు.
ట్రోలింగ్ రకాలు...
ఫ్లేమ్ ట్రోలింగ్
నిందారోపితమైన ఆరోపణలు, ద్వేషాన్ని, ఇతరులను కించపర్చే అంశాలపై ట్రోలింగ్. ఉదాహరణకు మతపరమైన విద్వేష పూరిత భావజాలం పెంచేలా ట్రోలింగ్.
ఆఫ్–టాపిక్ ట్రోలింగ్
అసందర్భమైన వ్యక్తులను, ప్రదేశాలను, స్థలాలను వివాదాల్లోకి లాగేలా చేసే ట్రోలింగ్. ఉదాహరణకు..పాత తరం రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయాల్లోకి లాగడం..ప్రాంతాలు, మతపరమైన పాత వివాదాలు లేవనెత్తేలా ట్రోలింగ్.
కన్సర్న్ ట్రోలింగ్
ఏదైన ఒక అంశాన్ని బా గా సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఆ విషయంపట్ల ఆందోళన చెందుతున్నట్టుగా నటిస్తూ వ్యాఖ్య లు.. ట్రోలింగ్ చేయడం.. ఉదాహరణకు.. మతపరమైన అంశాలపై మద్దతు పెంచడం, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేలా ట్రోలింగ్..
సోక్ పప్పెట్ ట్రోలింగ్...
పెద్ద సంఖ్యలో ఫేక్ అకౌంట్లను సృష్టించి వాటి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చేలా లేదా కించపర్చేలా ట్రోలింగ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం.. ఉదాహరణకు..రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి, మతపరమైన అంశాల గురించి డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేయడం.
ట్రోలింగ్ దుష్ప్రభావాలు..
భావోద్వేగాలు రెచ్చగొట్టి బాధించడం: మానసిక క్షోభకు ట్రోలింగ్ దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తెచి్చపెడుతుంది.
నమ్మకాన్ని పోగొట్టడం: ట్రోలింగ్ అనేది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన, అర్థవంతమైన సంభాషణల్లోనూ పాల్గొనకుండా స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.
చిల్లింగ్ ఎఫెక్ట్: ట్రోలింగ్ లేదా వేధింపులు భయాన్ని పెంచుతాయి. ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తి ఆన్‌లైన్‌లో తన అభిప్రాయాలు స్వేచ్ఛ చెప్పడానికి భయపడే పరిస్థితికి వస్తాడు.
తప్పుడు సమాచారం: ట్రోల్‌లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.
ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే బాధితులు..
ట్రోలింగ్‌కు పాల్పడాలనుకునే వారు టార్గెట్ చేసుకునేది ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారిపైనే అందరిలో ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
స్పందించకపోవడమే అసలు మందు..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోలింగ్ పాల్పడే వారి లక్ష్యం ఒక్కటే మనల్ని అన్ని రకాలుగా వేధించడం. అందుకే ట్రోలింగ్‌లో చేసే వారి కామెంట్లు పట్టించుకోకపోవడం అనేది ఉత్తమం. వీలైనంత వరకు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. అది ట్రోలింగ్‌కు వాడే ప్రమాదం ఉంది. అలానే ట్రోలింగ్ శ్రుతి మించితే మాత్రం ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి, ఆ కంటెంట్ డిలీట్ చేయించవచ్చు. అదేవిధంగా ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేయడం, మ్యూట్ వంటి ఆప్షన్లు వాడాలి.
ఇలా ఎదుర్కోవచ్చు...
ట్రోల్‌ను తప్పక రిపోర్ట్ చేయాలి..
మనపై ట్రోలింగ్ చేస్తూ మనల్ని కించ పర్చే వ్యాఖ్యలు ఉంటే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి ఆ కామెంట్లు డిలీట్ చేయించవచ్చు.
ఈ టూల్స్ వాడొచ్చు.. సోషల్ మీడియా ఖాతాల్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లు కొన్ని టూల్స్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేలా ఇస్తున్నాయి. ట్రోలింగ్ చేసే వారిని బ్లాక్ చేయ డం, మ్యూటింగ్ యూజర్స్ ఆప్షన్ పెట్టడం, ఫిల్టరింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వంటివి వాడుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment