జీవితాన్ని ‘విధి’ నియంత్రించడం మాట దేవుడెరుగు... రకరకాల యాప్‌లు మాత్రం నియంత్రిస్తున్నాయి. టెక్నాలజీపై అతిగా ఆధారపడి అనర్థాలను కొని తెచ్చుకోవడం నుంచి డీప్‌ఫేక్ వరకు డిజిటల్ స్పేస్‌లోని చీకటి ప్రపంచంపై దృష్టి సారిస్తుంది కంట్రోల్. నెట్‌ఫ్లిక్స్ సైబర్–థ్రిల్లర్ ‘కంట్రోల్’ ట్రైలర్ నేపథ్యంలో సాంకేతిక వైపరీత్యాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది...
అనగనగా ‘కంట్రోల్’ అనే యాప్. ఈ యాప్‌లోకి అడుగు పెడితే ఏ.ఐ అసిస్టెంట్ ప్రత్యక్షమౌతాడు. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడగలను’ అని అడుగుతాడు.యూజర్ తన మనసులో మాట చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి యూజర్ జీవితం, సంతోషం ఏఐ ఆసిస్టెంట్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది.
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన సైబర్ థ్రిల్లర్ ‘కంట్రోల్’లో అనన్య పాండే, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అనన్య పాత్ర పేరు... నెల్లా అవస్తీ.
కంట్రోల్‌యాప్. ఇన్‌లోకి నెల్లా లాగిన్ కావడంతో రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ మొదలవుతుంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయిన నెల్లా తన జీవితాన్ని నియంత్రించే హక్కును ఏఐ–జనరేటెడ్ పర్సన్ ఎలెన్‌కు ఇస్తుంది. నెల్లా, జో ల మధ్య ఆనందకరమైన ప్రేమ అర్ధంతరంగా విచ్చిన్నం అవుతుంది. దీనికి కారణం జో చేసిన మోసం. బ్రేకప్ తరువాత కక్షసాధింపు చర్యల్లో భాగంగా నెల్లాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటాడు జో.
జో టార్చర్ తట్టుకోలేక ‘కంట్రోల్’ యాప్‌ను ఆశ్రయిస్తుంది నెల్లా. తన ‘ఎక్స్’ను రిమూవ్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ సహాయం కోరుతుంది. దీంతో జో సోషల్ మీడియా బ్లూప్రింట్ పిక్సెల్ బై పిక్సెల్ తుడిచిపెట్టుకు΄ోతుంది. సోషల్ మీడియాలోనే కాదు రియల్ వరల్డ్‌లోనూ అతడి ఉనికి కనిపించదు. జో ‘మిస్సింగ్’ వార్త నెల్లా చెవిలో పడుతుంది.
‘నీకు కావాల్సింది ఇదే కదా’ అని నెల్లాతో ఏఐ–అసిస్టెంట్ చెప్పడంతో క్లిప్ ముగుస్తుంది.‘అన్‌లైన్‌లో మన ఉనికికి, నిజ జీవితంలో మనం ఎవరం అనే దానికి మధ్య గీసుకోవాల్సిన విభజన రేఖ గురించి కంట్రోల్ సిరీస్ దృష్టి పెడుతుంది’ అంటుంది అనన్య.
ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్, రష్మిక మందనలాంటి టాప్ మూవీస్టార్స్ ‘డీప్‌ఫేక్’ బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘చాలా భయంగా ఉంది. సెలబ్రిటీలుగా మా ముఖాలు, గొంతులు ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తాయో తెలియకుండా ఉంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామో తెలియడం లేదు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చట్టాలు తేవాలి. గట్టిగా అమలు పర్చాలి. ఇదొక్కటే పరిష్కారం’ అంటుంది అనన్య పాండే.
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉత్సాహవంతమైనదో, సృజనాత్మకమైనదో మరో కోణంలో చూస్తే వినాశకరమైనది. డీప్‌ఫేక్ టెక్నాలజీని మహిళల విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ వేధింపులలో మహిళలలే బాధితులు. కృత్రిమ మేధను ఒక ప్రత్యేకమైన జీవిగా, ఒక కొత్త జాతిగా... ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవడంలో ఆ వర్ణణలేవీ ఉపయోగపడడం లేదు.
– వెరిటీ హార్డింగ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్
ప్రియాంక చోప్రాకు ట్రోలింగ్ కొత్త కాదు. ఎన్నో సందర్భాలలో ట్రోలింగ్‌కు గురైంది అయితే చో్ర΄ా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. డీలా పడి΄ోలేదు. ఆమె జపించే మంత్రం... సెల్ప్–లవ్. తాజాగా ప్రియాంక చోప్రా ఒక హార్ట్‌వామింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విశాలమైన కళ్ల అబ్బాయిలా కనిపించే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఫొటో అది. ఆ ఫొటో చోప్రాదే. ఫొటోను షేర్ చేస్తూ ప్రియాంక ఇలా రాసింది...
వార్నింగ్: నా తొమ్మిదేళ్ల చిన్నారిని ట్రోల్ చేయకండి. తన ప్రీ- టీనేజ్ హెయిర్ స్టైల్‌ను ‘కటోరి కట్’గా అభివర్ణించింది. ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అంటూ సెల్ఫ్–లవ్ ప్రాముఖ్యత గురించి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment