తమిళనాడులోని కోయంబత్తూరలో ఐటీ ఉద్యోగి రమ్య ఆత్మహత్య ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వేధించిన నెటిజన్లు వచ్చి ఇపుడా బిడ్డను పెంచుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఆ మేరకు ఇన్‌స్టాలో చిన్మయి పోస్ట్ పెట్టారు.
ఏప్రిల్ 28న, తిరుముల్లైవాయల్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీలో రమ్య తన కుమార్తెతో ఆడుకుంటుండగా, ఎనిమిది నెలల పాప ఆమె చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మారిపోవడం విషాదం.
మరోవైపు కేసు నమోదు చేసిన కరమడై పోలీసులు ఆమె మరణాకి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Comments
Please login to add a commentAdd a comment