Ajit: అజిత్‌ కళలు అన్నీ ఇన్నీ కాదండోయ్‌ | Cine actor Ajit cooks very special Biryani | Sakshi
Sakshi News home page

Ajit: అజిత్‌ కళలు అన్నీ ఇన్నీ కాదండోయ్‌

Published Fri, Mar 22 2024 9:45 AM | Last Updated on Fri, Mar 22 2024 8:06 PM

- - Sakshi

సినీ నటుడు అజిత్‌కు ఎన్నో కళలు

ఫార్ములా వన్‌ కార్లు నడుపుతాడు

అద్భుతంగా బిర్యానీ వండుతాడు

చెన్నై: కోలీవుడ్‌లో బిరియాని ప్రియుడు, స్పెషలిస్ట్‌ ఎవరైనా ఉన్నారంటే అది నటుడు అజిత్‌నే అయ్యి ఉంటారు. ఈయన తాను నటించే చిత్రాల షూటింగ్‌ స్పాట్‌లో యూనిట్‌ సభ్యులందరికీ స్వయంగా బిరియాని వండి వారుస్తారు. ఇక ఈయనలో ఒక మంచి షూటర్‌, బైక్‌ రైడర్‌ ఉన్నారన్న విషయం తెలిసిందే. షూటింగ్‌కు బ్రేక్‌ వస్తే చాలు మోటార్‌సైకిల్‌పై దేశ, విదేశాలు చుట్టి వస్తుంటారు.

ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో నటిస్తున్న అజిత్‌ ఆ చిత్ర షూటింగ్‌కు బ్రేక్‌ రావడంతో తన మిత్రులతో కలిసి బైక్‌లో మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. విడాముయర్చి చిత్రం ద్వారా పరిచయం అయిన నటుడు ఆరవ్‌ కూడా అజిత్‌ బృందంలో ఉన్నారు. కాగా వీరందరి కోసం అజిత్‌ మధ్యప్రదేశ్‌లోని అడవి ప్రాంతంలో మకాం పెట్టారు. అక్కడ గ్యాస్‌ పొయ్యిపై పెద్ద బానం పెట్టి చికెన్‌ బిరియాని చేసి, మిత్రులకు వడ్డించారు.

దాన్ని వారంతా యమ రంజుగా ఉందంటూ రొట్టలేసుకుని ఆరగించారట. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకు ముందు షూటింగ్‌లో యూనిట్‌కు సభ్యులకు తన బిరియాని స్పెషలిస్ట్‌ రుచిని చూపించిన అజిత్‌ ఇప్పుడు తన ఫ్రెండ్స్‌ కోసం చికెన్‌ బిరియాని చేయడం విశేషం. కాగా ఇటీవలే తన సతీమణి శాలిని పుట్టిన రోజు వేడుకలను అజిత్‌ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను చూసిన ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement