Adithya S nair: యువతి ప్రాణం తీసిన ట్రోలర్స్‌ | Social Media Trolls Leads To Kerala Influencer Tragic Death | Sakshi
Sakshi News home page

ఓ గీతాంజలి, ఓ రమ్య.. ఇప్పుడు ఆదిత్య.. యువతి ప్రాణం తీసిన ట్రోలర్స్‌

Published Wed, Jun 19 2024 10:45 AM | Last Updated on Wed, Jun 19 2024 11:02 AM

Social Media Trolls Leads To Kerala Influencer Tragic Death

ట్రోలింగ్‌ సర్వసాధారణమైన ఈరోజుల్లో.. సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. ఓ గీతాంజలి, ఓ రమ్య.. ఇప్పుడు ఆదిత్య ట్రోలర్స్‌ ధాటికి బలయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండడం భరించలేక నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆదిత్య బలవన్మరణానికి పాల్పడింది.

కేరళ తిరువనంతపురం కున్నుపుజా ఏరియాకు చెందిన ఆదిత్య ఎస్‌ నాయర్‌(18) Adithya S nair  ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలోనే పరిచయమైన బినోయ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ యూట్యూబ్‌, ఇన్‌స్టా వీడియోలతో ఫాలోయింగ్‌ పెంచుకుంటూ వచ్చారు. అయితే రెండు నెలల కిందట ఈ జోడీ విడిపోయినట్లు ప్రకటించింది. అ‍ప్పటి నుంచి బినోయ్‌ను సపోర్ట్‌ చేస్తూ.. ఆదిత్యను ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు.  

అవి ఒక స్టేజ్‌ ధాటి మీమ్స్‌ వేసే దాకా వెళ్లింది. దీంతో భరించలేకపోయిన ఆమె జూన్‌ 10న ఉరేసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. వారం పాటు చికిత్స పొంది కన్నుమూసింది. దీంతో అప్పటిదాకా ట్రోల్‌ చేసిన మీమర్లే.. సింపథీ పోస్టులు వేస్తూ వస్తున్నారు. 

‘‘వాళ్లిద్దరి రిలేషన్‌షిప్‌ గురించి తెలిసి మందలించాం. చదువు మీద ఫోకస్‌ పెట్టాలని ఆదిత్యకు సూచించాం. అందుకే ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. కానీ,  ఆ కుర్రాడు మాత్రం ఇలా మానసికంగా వేధించి నా కూతురిని చంపాడు అని  ఆదిత్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య నాయర్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. బినోయ్‌ను పూజాప్పుర పోలీసులు అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement