పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌ | I-T Dept launches new facility to link Aadhaar with PAN | Sakshi
Sakshi News home page

పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌

Published Thu, May 11 2017 5:41 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌

పాన్‌తో ఆధార్‌ అనుసంధానికి కొత్త లింక్‌

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌  నెంబర్‌ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ)  గురువారం ప్రారంభించింది.  సంస్థ వెబ్‌ సైట్‌ లో https://incometaxindiaefiling.gov.in/  పేరుతో కొత్త లింక్‌ను లాంచ్‌ చేసింది.   ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి  పాన్‌ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో  ఈ సదుపాయాన్ని ప్రారంభించింది.  పాన్‌ తో ఆధార్‌  అనుసంధాన  ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ  పన్నుశాఖ  ఇ-ఫైలింగ్ వెబ్ సైట్  లో  ఈ కొత్త లింక్‌ను  పొందు పర్చింది.  ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను  (పాన్‌, ఆధార్‌ ​) అనుసంధానించటానికి  హోం పేజ్‌లో దీన్ని  సృష్టించింది. అయితే  పాన్, ఆధార్ లలో  నమోదు చేసిన వివరాలు  ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.   

యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత,  ఈ లింక్‌  ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో  లాగిన్‌ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్‌ ద్వారా ఆధార్‌, పాన్‌ నంబర్లను అనుసంధానించుకోవచ్చని  తెలిపింది. అలాగే పాన్, ఆధార్‌ కార్డులలో డేట్‌ ఆఫ్‌బర్త్‌, జెండర్‌ తదితర వివరాలు  సరిపోలాల్సి ఉంటుందని  తెలిపింది.   ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం  రిజిస్టర్డ్‌ మొబైల్‌కు  ఓటీపీ(వన్‌టైం పాస్‌వర్డ్‌)   లేదా ఈ మెయిల్‌   పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం  ఐటీఆర్‌ దాఖలుకు ఆధార్‌ తప్పనిసరి. అలాగే పాన్‌ దరఖాస్తుకు ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి   అమలుకానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement