చెత్తట్రాక్టర్‌లో ఉన్న ఆధార్ కార్డులు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్‌లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్‌లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి.
వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు.
పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.
చెక్కు దొరకలేదు.
డిసెంబర్‌లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్
Comments
Please login to add a commentAdd a comment