Postman
-
మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఉత్తరం
చిల్లకూరు: తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం పోయింది.. అది ఏంటీ అనే సామెత అడిగిన వెంటనే ‘ఉత్తరం’ అని సమాధానం వచ్చేది. అయితే ఇప్పుడు ఆ మాట చెప్పుకునేందుకే తప్ప.. ఉత్తరం రాసేవారే కరువయ్యారు. పోస్టు అని ఇంటి ముంగిట పోస్టు మ్యాన్ కేక వేయగానే.. ఉత్తరం అందుకునేందుకు ఉరుకున వచ్చేవారు. తమ బంధుమిత్రులు అందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఉత్తరాల కోసం ఎదురుచూసేవారు. మంచి వార్తను మోసుకొచ్చిన జాబులను భద్రంగా దాచుకునేవారు. ఆ రోజులు మధుర జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి. నేటి సమాజంలో పిల్లలకు పోస్టులో ఉత్తరం వచ్చి దానిని చదువుకుని ఎంతో తృప్తి పడే వారమని పెద్దలు చెబితే.. ఇంకా లేఖలు ఏంటి.. నేరుగా సెల్ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా అని అంటున్నారు. అయితే ముఖాముఖీగా వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతున్నా, సంబోధనలో ఎన్నో మార్పులు ఉంటాయి. అయితే ఉత్తరంలో పలకరింపులు సంప్రదాయబద్ధంగా ఉంటూ మనసును ఆకట్టుకుంటాయి. పెద్దలైతే మహారాజశ్రీ, చిన్న వారైతే చిరంజీవి, మహిళలను లక్ష్మీ సమానురాలైన, వితంతువులైతే గంగా భాగీరథీ సమానులైన అని సంబోధించేవారు. అలాగే ఉత్తరం ముగింపులో కూడా పెద్దలకు నమస్కారంతో అని, చిన్నవారికి ఆశీస్సులతో అని రాసేవారు. ఎవరైనా కాలం చేసిన వార్తను ఉత్తరంలో రాసేప్పుడు ఒక వైపున నలుపు రంగు ఉండేలా చూసేవారు. ఆ ఉత్తరాన్ని ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయటనే చించివేసేవారు. అలాగే ముఖ్యమైన సమాచారం ఉండే లేఖరను జాగ్రత్తగా ఒక కమ్మీకి కుట్టి పెట్టే వారు.స్మార్ట్‌ఫోన్ ప్రభావంతోనే..ఉత్తరాలు రాసుకునే రోజుల్లో ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ, ఇలా ఎన్నో లేఖలపై సినిమాలు తీశారు. అవి ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించాయి. అయితే నేటి యువత చేతిలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి వాడుతున్నప్పటికీ అవతల వారి పూర్తి యోగ క్షేమాలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత టిక్ టాక్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా వేరే వ్యాపకాలకు మొగ్గుచూపుతున్నారు. క్షేమ సమచారాలను కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పంచుకునేందుకు కూడా ఇష్ట పడడం లేదు. ఉత్తరాలు రాసుకునే సమయంలో మరో ఉత్తరం వచ్చే వరకు ఎదురు చూపులు ఉండేవి. సమయం లేక రాయలేని వారికి ఉత్తరం రాసి చాలా రోజులైందనే దిగులు ఉండేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్ల రాకతో ఉత్తరాల ఊసే లేకుండా పోయింది. దీంతో యువత అరకొర సందేశాలను పంపుకుని సంతోష పడుతున్నారే కానీ, పాత కాలంలో లాగా పూర్తి సమాచారం చదువుకుని తృప్తి పడలేక పోతున్నారు. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
ప్రమాదంలో ఏపీ సచివాలయ పోస్ట్‌మెన్ మృతి
మంగళగిరి: ప్రమాదవ శాత్తూ ద్విచక్ర వాహనం చెరువులోకి దూసుకువెళ్లి ఏపీ సచివాలయ పోస్ట్‌మెన్ మృత్యువాత పడిన ఘటన మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో చోటు చేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాత మంగళగిరికి చెందిన జె.కేశవరావు (62) బుధవారం ఉదయం 10 గంటలకు రోజుమాదిరి తన ద్విచక్ర వాహనంపై వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో గల పోస్టాఫీస్ కార్యాలయానికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని యర్రబాలెం చెరువు కట్ట వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు వెంబడినే ఉన్న చెరువులోకి దూసుకువెళ్లింది. అయితే ఆ మార్గంలో ప్రయాణించే వారెవరూ ఈ ప్రమాదాన్ని గమనించలేదు. అదే రోజు మధ్యాహ్నం చెరువులో ఓ గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానిక యువకుల చేత బయటకు తీయించారు. ద్విచక్ర వాహనం ఆచూకీ లభించలేదు. అప్పటికే మృతుడు కేశవరావు కడుపు ఉబ్బి ఉండటంతో పాటు మెడలో గుర్తింపు కార్డు వేలాడుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడు కేశవరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి ఓ గంట ముందు నగరంలోని హెడ్ పోస్టుమాస్టర్ నరసింహా రెడ్డిని కలసి తాను ఈ నెల చివరి నాటికి రిటైర్ కాబోతున్నానని, తనకు పోస్టల్‌శాఖ నుంచి రావల్సిన బెనిఫిట్స్‌కు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. -
ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్‌గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు. పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..? అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు కొరియర్ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం. ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. ♦ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. ♦ ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్‌మాన్ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్‌మాన్ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. –పీవీఎస్ రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ -
తెలంగాణ బెస్ట్ పోస్ట్‌మ్యాన్ గా శేషు
మధిర: ఖమ్మం జిల్లా మధిర పోస్టాఫీసులో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న బిజ్జాల శేషు తెలంగాణ రాష్ట్ర బెస్ట్ పోస్ట్‌మ్యాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు భారతీయ తంతి తపాలాశాఖ ఉత్తమ అవార్డులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా 2019–20 ఏడాదికి సంబంధించి ఎక్కువ ఉత్తరాలు అందజేయడం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ. 2.65 కోట్లు చేయించడం, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో సేవలందించారు. కాగా, 2018 నుంచి 1,400 ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాలను ఖాతాదారులతో తెరిపించినందుకు శేషుకు అవార్డు లభించింది. అలాగే సుకన్య సమృద్ధి ఖాతాలు తదితర ఉత్తమ సేవలకుగాను ఆయన రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 16న తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ చేతులమీదుగా శేషు అవార్డును అందుకోనున్నారు. -
పోస్ట్‌మ్యాన్ నిర్వాకం.. రెండేళ్లుగా
సాక్షి, బాన్సువాడ: సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. అయితే, బట్వాడా చేయకుండా రెండేళ్లుగా 7 వేల ఉత్తరాలను మూలన పడేశాడో పోస్ట్‌మ్యాన్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ సమీపంలోని తన బంధువులకు చెందిన ఓ హోటల్ గదిలో 12 సంచుల్లో పోస్ట్‌మ్యాన్ బాలకృష్ణ ఉత్తరాలను పడేశాడు. తమకందిన సమాచారంతో ఈ బాగోతం బయటపడిందని, శనివారం ఆ ఉత్తరాలను స్వాధీ నం చేసుకున్నామని, ఇందుకు బాధ్యుడైన బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు ఏఎస్పీ రాజనర్సాగౌడ్ తెలిపారు. చదవండి: పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు.. -
పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు..
సాక్షి, మహబూబ్‌నగర్ / వనపర్తి: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. నేడు రాష్ట్రంలో అత్యధికంగా 3,018 కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వనపర్తిలో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమే కాక.. జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఓ పెన్షన్ పంపిణీదారుడి వల్ల చిన్నంబావి జోన్లో పది రోజుల వ్యవధిలో ఏకంగా 100 మందికి కరోనా సోకినట్లు సమాచారం. వివరాలు.. సుమారు పది రోజుల క్రితం గ్రామస్తులకు పెన్షన్ పంపిణీ చేయడం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఒక పోస్ట్‌మ్యాన్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని కలిసిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత వారు కలిసిన వారు వైరస్ బారిన పడ్డారు.(చదవండి: తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు) ప్రస్తుతం ఈ కేసులు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారాయి. పోస్ట్‌మ్యాన్‌ని కలిసిన వారిని గుర్తించి.. ఆ తర్వాత వారు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో మెగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ డ్రైవ్ ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోమ్ క్వారంటైన్‌తో పాటు లాక్డౌన్ పాటిస్తున్నారు. బుధవారం నాటికి వనపర్తిలో 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలో గత వారం రోజుల్లో 337 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. -
30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..
తమిళనాడు: దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. అతడి పేరు డి శివన్. తమిళనాడులో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు చేరవేయడానికి అతడు దట్టమైన అడవి, జలపాతాల గుండా 15 మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయన క్రూర మృగాల దాడులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయినా బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు. Postman D. Sivan walked 15 kms everyday through thick forests to deliver mail in inaccessible areas in Coonoor.Chased by wild elephants,bears, gaurs,crossing slippery streams&waterfalls he did his duty with utmost dedication for 30 years till he retired last week-Dinamalar,Hindu pic.twitter.com/YY1fIoB2jj — Supriya Sahu IAS (@supriyasahuias) July 8, 2020 ప్రస్తుతం శివన్ పదవి విరమణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్ అధికారి సుప్రియా సాహు బుధవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కు వేల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. ‘దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది... అతని నిబద్ధతకు అభినందనలు’, ‘అతను పద్మ పురస్కారానికి అర్హుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆధార్ కార్డులను మట్టిలో పాతిపెట్టాడు..!
ఒడిశా, భువనేశ్వర్: ప్రజలకు అందజేయాల్సిన ఆధార్ కార్డులను ఓ పోస్ట్‌మన్ మట్టిలో పాతిపెట్టిన సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్ సమితి, బొడాస్ పంచాయతీ జొగాయి పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మన్ వాంఛనిధి పరిడా ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. చెరువు తవ్వకాల పనుల్లో మట్టిలో పాతిపెట్టిన ఆధార్‌కార్డులు గుట్టలుగుట్టలుగా బయటపడడంతో విషయం బయటపడింది. ఈ దృశ్యం గ్రామస్తుల దృష్టికి రావడంతో ఆ ఆధార్ కార్డులను పరిశీలించి, పోస్ట్‌మన్ తప్పిదంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి కూడా తప్పు ఒప్పుకున్నట్లు సమాచారం. -
పోస్ట్మ్యాన్లతో కూరగాయల సరఫరా
చెన్నై : సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. ఇప్పటి వరకు మనం అదేం చూశాం .అయితే ఇకపై వారు పండ్లు, కూరగాయలు సరఫరా చేయనున్నారు. ఇండియా పోస్ట్‌తో ఉద్యానవన శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పండ్లు, కూరగాయలు ఇళ్లకు సరఫరా చేయనున్నారు. ఇటీవల చెన్నైలోని చిట్లపాక్కంలో పోస్ట్మ్యాన్లతో విజయవంతంగా పంపిణీ చేశారు. దీంతో ఈ వ్యవస్థను మరో వారంలో అమల్లోకి తీసుకురావాలని ఉద్యానవన శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతి పోస్టాఫీసు పరిధిలోని ఆపరేటివ్ ఏరియా సామర్థ్యాన్ని బట్టి కూరగాయల పొట్లాలు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రతి పార్సిల్లో గరిష్టంగా ఏడు కిలోల కూరగాయలు, పండ్లను సరఫరా చేసేలా యోచిస్తోందని తెలిపారు. పార్సిళ్లు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నందున కొత్తగా కూరగాయలు, పండ్లు సరఫరా వల్ల ఇండియా పోస్ట్‌కు ఆదాయం కూడా లభిస్తుందని తపాలాశాఖ అధికారులు భావిస్తున్నారు. ‘లాక్’ తీస్తే కరోనాతో కష్టమే.. -
ఇక పోస్ట్‘పాలసీ’ మ్యాన్లు!
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్‌లు త్వరలో బీమా పాలసీ విక్రయదారుల అవతారం ఎత్తనున్నారు. వీరిని పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్‌గా (విక్రయదారులు) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రతిపాదించవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటి ప్రకారం.. తపాలా శాఖ పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్‌ల జాబితాను ఐఆర్డీఏఐకు పంపి అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు విస్తరించని ప్రాంతాల్లో (మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు) వీరు బీమా విస్తరణకు తోడ్పడతారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుని, పోస్ట్మ్యాన్లు, డాక్ సేవక్‌ల ద్వారా పాలసీల విక్రయాలను చేపట్టవచ్చు. -
మెసెంజర్ పోస్ట్‌కు పీహెచ్డీ అభ్యర్థులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పోలీసుశాఖలో పోస్ట్‌మ్యాన్ తరహా విధులు నిర్వహించడానికి జారీ చేసిన 62 పోస్టులకు ఏకంగా 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు టెలికం విభాగం పంపే సందేశాలను ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు అందించే మెసెంజెర్ (పోస్టుమ్యాన్) ఉద్యోగాలకు రాష్ట్రసర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. కనీస విద్యార్హత ఐదో తరగతి. పీహెచ్డీ చేసిన 3,700 మంది ఈ పోస్టుకు దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 28,000 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 50 వేల మంది గ్రాడ్యుయేట్లున్నారు. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు విద్యార్హత ఉన్నవారు 7,400 మంది ఉన్నారు. నెలజీతం రూ.20 వేలు. ఎక్కువ దరఖాస్తులు రావడంతో రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
మీకు చేరాల్సిన లేఖ దశాబ్ద కాలం లేటు!
మీకు రావాల్సిన పాస్‌పోర్టు కోసం ఎదురుచూస్తున్నారా? మీకు రావాల్సిన బ్యాంకు పాస్‌పుస్తకం ఏదైనా మిస్సయ్యిందా? లేదా మీరెదురుచూస్తోన్న ఏటీఎం కార్డు మీకింకా చేరలేదా? మీ స్నేహితుడి సమాధానం కోసం వేచిఉన్నారా? ఏం ఫరవాలేదు. కాస్త ఆలస్యంగా అయినా మీకు చేరుతుంది. కాకపోతే ఓ దశాబ్ద కాలం లేటవుతుందంతే. కాకపోతే మీకు రావాల్సిన కాల్‌లెటర్ కూడా ఓ దశాబ్దకాలం లేటవుతుందంతే! ఒరిస్సాలోని ఒధాంగా గ్రామంలో జగన్నాథ్ పూహాన్ అనే ఓ పోస్ట్‌మాన్ ఇలాగే సర్దిచెప్పుకొని తను ఇవ్వాల్సిన ఉత్తరాలన్నింటినీ పోస్టాఫీసులోనే పోగేసాడు. ఉత్తరాలూ, ఏటీఎం కార్డులూ, పాస్‌పోర్టులూ, రకరకాల పోస్టల్ ప్యాకెట్లూ ఇలా ఒకటేమిటి మొత్తం 6000 ఉత్తరాలను పంచకుండా తన ఆఫీసులోనే ఉంచేసుకున్నాడు. పంచకుండా పేరుకుపోయిన పాత తపాలా భాండాగారం పోస్ట్‌ఆఫీసు కార్యాలయం మార్పుతో బట్టబయలైంది. ఒరిస్సాలోని సదురు పోస్టాఫీసుని వేరే బిల్డింగ్‌లోకి మార్చడంతో అక్కడ కుప్పలుకుప్పలుగా పేరుకుపోయిన విలువైన సమాచారాన్నందించే ఉత్తరాలతో స్థానికుల పిల్లలు ఆటలు ఆడుకోవడాన్ని పెద్దలు గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేంజరిగిందని ఆరాతీస్తే ఆ ప్రాంతంలోని సదరు పోస్ట్‌మాన్ గత దశాబ్దకాలంగా ఉత్తరాలను బట్వాడా చేయడం లేదని తేలిపోయింది? అయితే ట్రాకింగ్‌కి అవకాశమున్న స్పీడ్ పోస్టలూ, రిజిస్టర్ పోస్ట్ ఉత్తరాలను మాత్రం సమయానికి అందించేసి, మిగిలిన వాటిని ఓ మూలన పడేసేవాడు అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ అయిన జగన్నాథ్ పూహాన్. ఇదే విషయమై పోస్ట్మాన్ని నిలదీస్తే తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతమంతటికీ తానొక్కడ్నే పోస్ట్మాన్ననీ, జీవితకాలమంతా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచే తనకు గత పదేళ్ళుగా కాళ్ళు పనిచేయడం లేదనీ తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదు, చివరకు సస్పెండ్ అయ్యాడు. పాపం దశాబ్దకాలం తర్వాత కూడా ఆ ఉత్తరాలను పోస్టల్ శాఖ పంచేకార్యక్రమం ఏర్పాటు చేసింది. పాడై చిరిగిపోయినవి పోగా, శిథిలావస్థలో ఉన్నవి తీసేసి మిగిలిన వాటిల్లో దాదాపు 1500 ఉత్తరాలను పంపిణీచేసింది. అందులో 2011లో ఇండియన్ నావీ స్థానిక యువకుడికి పంపిన ఎంప్లాయ్మెంట్ లెటర్ కూడా ఉంది. స్థానికులెవ్వరూ కూడా తమకు రావాల్సిన ఉత్తరాలు ఎందుకు రావడం లేదని ఆరా తీయకపోవడమేంటా అని పోస్టల్ డిపార్ట్మెంట్ జుట్టుపీక్కుంటోంది. -
నగదు బ్యాగ్‌తో గోదావరిలో ఈదుకుంటూ..
తూర్పుగోదావరి : /ముమ్మిడివరం: ఒక వైపు పడవ మునిగి గోదావరిలో కొట్టుకుపోతుంటే.. కూలీలకు చెందాల్సిన సొమ్మును భద్రంగా ఒడ్డుకు చేర్చి ఆ కూలీలకు అందజేసిన పోస్టుమాస్టర్‌ను గ్రామస్తులందరూ అభినందించారు. శేరులంక పోస్టుమాస్టర్ పోతుల నాగేశ్వరరావు శనివారం ఉపాధి కూలీలకు సంబంధించి రూ.3 లక్షలు ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం సబ్ పోస్టాఫీస్ నుంచి డ్రా చేశారు. ఆ సొమ్ముతో సైకిల్‌పై శేరులంకలో బయలుదేరి పశువుల్లంక రేవులో పడవ ఎక్కాడు. పడవ ప్రమాదానికి గురై సైకిల్‌పై పెట్టిన బ్యాగ్ గోదావరిలో పడిపోయాయి. గోదావరిలో కొట్టుకుపోతున్న నగదు బ్యాగ్‌ను తోటి ప్రయాణికుడు కొండేపూడి గంగశాస్త్రి పట్టుకొని పోస్టుమాస్టర్‌కు అప్పగించారు. ఆ బ్యాగ్‌తో అతి కష్టంమీద ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. తడిసి ముద్దయిన నోట్లను ఆరపెట్టి మంగళవారం కూలీలకు అందజేశారు. సైకిల్ గోదావరిలో కొట్టుకుపోయినా కూలీలకు దక్కాల్సిన సొమ్మును భద్రంగా తీసుకొచ్చి అందజేసిన ఆయన నిజాయితీని గ్రామస్తులు అభినందించారు. -
గ్రామీణ పోస్టుమ్యాన్‌కు పండగే!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్ సేవక్ (పోస్టుమ్యాన్)ల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. దీంతో వీరు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని అందుకోనున్నారు. 2016 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలను ఒకే వాయిదాలో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం నెలకు రూ.2,295ల వేతనం అందుకుంటున్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లు ఇకపై రూ. 10వేల వేతనాన్ని అందుకుంటారు. రూ. 2,745 ఉన్నవారు.. రూ. 10వేలు, రూ. 4,115 ఉన్న వారు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని పొందుతారు. దేశ పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతోంది. పోస్టల్ పార్శిల్ డైరెక్టరేట్‌ను ప్రారంభించాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రాబోతుంది. జీడీఎస్‌లు ఇందులో కీలకం కానున్నారు’ అని కేబినెట్ నిర్ణయాలను కేంద్రం టెలికం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ వేతనంతో పాటుగా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం జీడీఎస్‌లకు 7% కరవు భత్యం కూడా చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 1.3 లక్షల గ్రామీణ పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు. 2.6లక్షల మంది జీడీఎస్‌లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.1,257.75 కోట్ల భారం పడనుంది. జీడీఎస్‌ల పనివేళల్లో ఏ మాత్రం మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. డిమాండ్లను అంగీకరిస్తూ.. వేతనాలు పెంచాలంటూ జీడీఎస్‌లు కొంతకాలంగా ధర్నా చేస్తున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించేందుకు కేంద్రం పోస్టల్ బోర్డు సభ్యు డు కమలేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. దీని ఆధారంగానే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జీడీఎస్‌లు డిమాండ్ చేసినట్లుగా ప్రతి ఏటా 3శాతం పెంచేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. జీడీఎస్‌ల డిమాండ్లకు అంగీకరించినందున వీరంతా తిరి గి విధులకు హాజరవ్వాలని మంత్రి కోరారు. ‘గతంలో ఎన్నడూ లేనట్లుగా రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సు (నెలకు రూ.500)ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతోపాటుగా ఆఫీసు నిర్వహణ అలవెన్సు, ఉమ్మడి విధుల అలవెన్సు, క్యాష్ కన్వేయెన్స్ చార్జీలు, సైకిల్/బోట్ మెయింటెనెన్స్ అలవెన్సు (గతంలో రూ.50–ప్రస్తుతం రూ.115), ఫిక్స్డ్ స్టేషనరీ చార్జీలను కూడా పెంచాం’ అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ► సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా చెరుకు రైతుల ఆదాయాన్ని, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మిల్లులను నష్టాల్లోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుందని కేంద్రం భావిస్తోంది. మిల్లుల వద్ద కేజీ చక్కెర కనీస అమ్మకపు ధరను రూ.29గా నిర్ణయించింది. పంట మొదలైనప్పటినుంచి మిల్లులకు చేర్చేంతవరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మూడునెలలకోసారి నేరుగా రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. ► అలహాబాద్‌లో గంగానదిపై 10కి.మీ. వంతె నను నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్ 96పై 6లేన్లతో నిర్మించే ఈ వంతెన 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ► డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఒమన్ సహా పలు దేశాలతో సుస్థిర అభివృద్ధి, స్మార్ట్ అర్బన్ డెవలప్మెంట్, అంతరిక్ష రంగంలో అభివృద్ధి తదితర అంశాలపై కుదిరిన ఒప్పందాలపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ► పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాల కొనసాగింపు కోసం రూ.10వేల కోట్ల విడుదలకూ ఆమోదం. -
నేరం చేసిన 30 ఏళ్లకు తీర్పు
అహ్మదాబాద్: నేరం చేయకున్నా ఒక్కోసారి శీఘ్రంగా శిక్షలకు గురయ్యేవారు కొందరైతే.. నేరం చేసినప్పటికీ దశాబ్దాలు గడిచినా ఆ శిక్షకు గురవ్వకుండా దర్జాగా తిరిగే వ్యక్తులు కొంతమంది. న్యాయవ్యవస్థను తప్పుబట్టలేంగానీ, వారి వద్ద ఉన్న డబ్బు, న్యాయవ్యవస్థలోని లొసుగులు ఉపయోగించుకొని ఇలాంటివి చేస్తుంటారు. కానీ, చివరకు శిక్ష మాత్రం పడుతుంది. కానీ, ఆలోగా జరగాల్సినవి జరిగిపోతాయి. సరిగ్గా గుజరాత్లో ఓ కేసు విషయంలో ఇదే జరిగింది. కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషులకు శిక్ష విధించే సరికి అందులో ఒకరు ఇప్పటికే చనిపోయి ఉండగా మరొకరు నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. అది కూడా మూడు దశాబ్దాల తర్వాత. అంటే ముప్పయ్యేళ్ల తర్వాతన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో ప్రకాశ్ త్రివేది, లక్ష్మీచంద్ పర్మార్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిద్దరు 1982 నుంచి 1984 మధ్య పోస్ట్మేన్లుగా పనిచేశారు. ఆ సమయంలో మనీ ఆర్డర్లు, పోస్టల్ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్టులు, చెక్కులు దొంగిలించడమే కాకుండా నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అలా దొంగిలించిన సొమ్మంతా ఆ ఖాతాల్లో జమచేశారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో 1986లో కేసు ఫైల్ చేసిన పోలీసులు వారిని అరెస్టు కోర్టుకు అప్పగించగా వారిని జైలులో వేసింది. అయితే, వారు బెయిల్ సహాయంతో బయటకొచ్చి హైకోర్టులో సవాల్ చేశారు. చివరకు ఈ కేసును సీబీఐ విచారించి వారు నేరం చేసినట్లు కోర్టుకు ఆధారాలతో సహా అందించింది. దీంతో కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి నాలుగేళ్లు జైలు జీవితం గడపాలని ఆదేశించింది. అయితే, లక్ష్మీచంద్ పర్మార్ ఇప్పటికే చనిపోగా నాలుగు వారాల్లోగా ప్రకాశ్ త్రివేదిని కోర్టుకు తీసుకురావాలని పోలీసులకు ఆదేశించింది. -
పోస్టుమన్ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : పోస్టల్ శాఖ తరపున ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. పోసుమన్, మెయిల్గార్డ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం 82 పోస్టులను మంజూరు చేయగా తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100 నామినల్ ఫీజుతో పాటు రూ. 10 సర్వీస్ ట్యాక్స్‌ని కలిపి పోస్టాఫీస్‌లో స్వీకరిస్తున్నారు. ఓబీసీ జనరల్ అభ్యర్థులకు రూ. 500, అదనంగా రూ.10 చూప్పున ఫీజులను స్వీకరిస్తున్నారు. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు పోస్టల్ తరపున కోడ్ కేటాయించగా వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. 18–27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, బుధవారానికి దాదాపు 2వేల దరఖాస్తులు వచ్చినట్లు హెడ్ పోస్ట్‌మాస్టర్ సుబ్రమణ్యం తెలిపారు. -
పోస్టుమాన్ ఉద్యోగ దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం : ఆంధ్రప్రదేశ్ తపాలాశాఖ సర్కిల్ ఆదేశానుసారం పోస్టల్ డిపార్టుమెంట్లో పోస్టుమాన్ ఉద్యోగాల భర్తీ ప్రారంభించారని అమలాపురం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టుమాస్టర్ కె.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 133 ఉద్యోగాలు ఉన్నాయని, వీటిలో డివిజన్‌కు మూడు చొప్పున ఖాళీ ఉన్నాయని తెలిపారు. కనీస విద్యా అర్హత ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్ ఉండాలన్నారు. దరఖాస్తు రూ.100, పరీక్షా రుసుం రూ.400 అని, అమలాపురం హెడ్‌పోస్టు ఆఫీస్‌లో చెల్లించాలన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా కూడా స్వీకరిస్తామని, వచ్చే నెల 4వ తేదీలోగా పంపాలని సూచించారు. -
‘ఆసరా’ డబ్బు కాజేసిన పోస్టుమన్
♦ దాదాపు రూ. 2 లక్షలు మింగేసిన వైనం ♦ లబోదిబోమంటున్న లబ్ధిదారులు ♦ పోలీసులకు ఫిర్యాదు ఇబ్రహీంపట్నం రూరల్: వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులు రూ. 2 లక్షలను ఓ పోస్టుమన్ కాజేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిం ది. వివరాలు.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం , కర్ణంగూడ గ్రామాల్లో మండల కేంద్రానికి చెందిన పోస్టుమన్ యాదగిరి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఉప్పరిగూడలో సుమా రు 300 పింఛన్లు, పోచారంలో 285 పెన్షన్లు, కర్ణంగూడలో మరికొన్ని పింఛన్లు బాధితులకు ఇవ్వాల్సి ఉంది. ఉప్పరిగూడలో 50 మంది లబ్ధిదారులకు మూడు, నాలుగు నెలల డబ్బులు, పోచారంలో 30 మందికి పింఛన్ ఇవ్వలేదని పలుమార్లు అయా గ్రామాల సర్పంచ్‌లు పోస్టుమన్ యాదగిరిని మందలించారు. దీంతో ఆయన ఉప్పరిగూడలో 30 మందికి ఇటీవల డబ్బులు పంపిణీ చేశాడు. పోచారంలో 20 మందికి పైగా రెండు, మూడు నెలల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు, రేపు డబ్బులు ఇస్తానని యాదగిరి తప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, గత నా లుగు రోజులుగా పోస్టుమన్ కనిపించకుం డా పోయాడు. అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వస్తోంది. సూమారు రూ.2 లక్షలకు పైగానే పోస్టుమన్ యాదగిరి డబ్బులు కాజేశాడని బాధితులు ఆరోపించారు. అయితే, పోచారం గ్రామానికి చెందిన కావలికారు రమేష్ వద్ద రూ.30 వేలతో పాటు అతడి బైక్ తీసుకొని వెళ్లిన యాదగిరి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో పోస్టాఫీస్ అధికారులు, కావలికారు రమేష్‌తోపాటు యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతాం ఆసరా పింఛన్లు అందలేదని.. పోస్టుమన్ యాదగిరి కాజేసినట్లు ఫిర్యాదులు అందాయని ఎంపీడీఓ అనిల్‌కుమార్ తెలిపారు. అతడు ఎంతమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.. అనే విషయాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు. -
దేవాలయంలో పోస్ట్ మ్యాన్ దారుణ హత్య
బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ పోస్ట్ మ్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో ఇది జరిగింది. పోస్ట్‌మ్యాన్‌గా పనిచేసే బి.సత్యం(38) కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో శనివారం రాత్రి మార్కండేయ స్వామి ఆలయంలో నిద్ర చేశాడు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో సత్యం తలపై మోది హత్య చేశారు. ఆదివారం ఉదయం ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
లేజీ.. పోస్ట్‌మన్!
కొండకరకాం (విజయనగరం రూరల్): మండల పరిధిలోని కొండకరకాం పోస్ట్‌మన్ నిర్వాకం తాళ్లపూడిపేట గ్రామ నిరుద్యోగులకు శాపంగా మారింది. పోస్ట్‌మన్ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల సమీప ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థి తి నెలకొంటోంది. మండల పరిధిలోని కొండకరకాం గ్రామ పోస్టాఫీస్ పరిధి లో కొండకరకాం, వైఎస్ఆర్ నగర్, ఆర్కె టౌన్షిప్, నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట, ఎల్‌ఎన్‌పేట గ్రామాలు ఉన్నాయి. కొండక రకాం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట గ్రామానికి వచ్చే ఉత్తరాలను పోస్ట్‌మన్ ఎం.చలపతిరావు సకాలంలో అందించడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడి నిరుద్యోగులు ప్రభు త్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అధికంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ సంస్థల నుంచి కాల్ లెటర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పుడో ఇంటర్వ్యూ గడువు దాటి 10, 20 రోజులు పోయిన తర్వాత వీరికి కాల్‌లెటర్లు అందుతున్నాయి. ఇవి తెలిసిన వరకే.. అందకుండా పోతున్నవి ఇంకెన్నో..! గత రెండేళ్ల కాలంలో తాళ్లపూడిపేట గ్రామానికి చెందిన ఆరుగురు నిరుద్యోగులకు కాల్‌లెటర్లను పోస్ట్‌మన్ అందించలేదు. ఇటీవల మరోసారి ముగ్గురు నిరుద్యోగులైన తాళ్లపూడి సూరప్పుడు, ధవళ పెంటంనాయుడు, ఎం.పైడిరాజులకు కాల్‌లెటర్లు అందించాల్సి ఉంది. వాటినీ సదరు పోస్ట్‌మన్ అందించలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు కొండకరకాం గ్రామంలో ఉన్న పోస్ట్‌మన్ ఇంటికి వెళ్లి ఉత్తరాలను పరిశీలించారు. పది రోజుల క్రితం వచ్చిన కాల్‌లెటర్లు పోస్ట్‌మన్ ఇంటిలోని టీవీ వెనుక ఉండడంతో వారంతా నిర్ఘాంతపోయారు. దీంతో వారంతా సోమవారం కొండకరకాం గ్రామానికి వచ్చి సర్పంచ్, ఎమ్పీటీసీ సమక్షంలో పోస్ట్‌మన్‌ను నిలదీశారు. అనంతరం విజయనగరంలోని హెడ్ పోస్టాఫీస్‌లో ఫిర్యాదు చేశారు. -
పింఛన్ డబ్బు కోసం నిరసన
- రోడ్డెక్కిన వృద్ధులు - రెండు గంటల పాటు రాస్తారోకో - నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసిన ఎస్ఐ జిన్నారం: ప్రభుత్వం తమకు పింఛన్లు మంజూరు చేసినా స్థానిక పోస్టుమన్, పంచాయతీ సిబ్బంది డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సోమవారం పలువురు వృద్ధులు రోడ్డెక్కారు. ఈ ఘటన జిన్నారం మండలం దోమడుగు ప్రధాన రహదారి పై చోటు చేసుకుంది. దోమడుగు పంచాయతీ పరిధిలో సుమారు 300 వరకు పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం డబ్బు మంజూరు చేసిం ది. అయితే రెండు నెలలుగా పోస్టు మన్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు డబ్బులు ఇవ్వడం లేదు. పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక వార్డు సభ్యులు గోవర్దన్ గౌడ్, యాదగిరి వృద్ధులకు మద్దతుగా రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిన్నారం ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పోస్టు మన్లతో ఎస్ఐ లాలూనాయక్ ఫోన్లో మాట్లాడి ఇక్కడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. గంటలోపు అర్హులకు పిం ఛను డబ్బు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఈ విషయాన్ని ఎస్ఐ లాలూనాయక్ ఆందోళన కారులకు చెప్పి వారి ని ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. -
పోస్ట్‌మేన్ నిర్లక్ష్యం ఖరీదెంత?
చిత్తూరు: జీవితంలో చాలా మందికి తమ గ్రామ, తమ ప్రాంత పోస్ట్ మేన్ గుర్తు ఉంటాడు. ఎందుకంటే అతను అన్ని రకాల సమాచారాలు మనకు చేరవేస్తుంటాడు. ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు, ప్రేమలేఖలు, శుభకార్యాలతోపాటు అశుభకార్యాల సమాచారం చేరవేస్తుంటాడు. పోస్ట్ మేన్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడినది. అటువంటి పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వహిస్తే, ఆ నిర్లక్ష్యం ఖరీదు ఎంత? ఆ ఖరీదు చెప్పడం సాధ్యంకాదు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీ పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవితాలు చిందరవందర అయ్యాయి. ఆధార్ కార్డులు - బ్యాంకు చెక్కులు, డిడిలు - ఇంటర్వ్యూ లెటర్లు - అపాయింట్మెంట్ ఆర్డర్లు, లేఖలు.....ఇలా అన్నిటి బట్వాడా నిలిచిపోయింది. దాదాపు మూడేళ్లుగా గ్రామస్తులకు ఎటువంటి సమాచారం అందలేదు. పోస్ట్‌మేన్ నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామస్తులు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన పోస్ట్‌మేన్ గత మూడేళ్లుగా వచ్చిన సమాచారాన్ని గాలికొదిలేశాడు. ఒకటేమిటి అన్నీ రకాల ముఖ్యమైన సమాచారాన్ని గమ్యస్థానానికి చేర్చకుండా దాచేశాడు. గోనె సంచిలో వేసి మిద్దపై పడేశాడు. దీంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసి పనికిరాకుండా పోయాయి. అనుకోకుండా అవి నిన్నబయటపడడంతో విషయం వెలుగుచూసింది. వందలాదిగా గ్రామస్తులు వచ్చి తమకొచ్చిన లేఖలను, కవర్లను ఏరుకున్నారు. విధి నిర్వహణ పట్ల అడ్డగోలుగా వ్యవహరించి, తమకు అన్యాయం చేసిన పోస్ట్‌మ్యాన్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులేక చాలా మందికి పెన్షన్ మంజూరుకాలేదని తెలిపారు. చాలా మంది యువకులకు ఉపాధికి సంబంధించిన లేఖలు అందక వారు చాలా నష్టపోయారని తెలిపారు. -
మిత్రమా.. కుశలమా?
తోకలేని పిట్టను తొంభై ఆమడలు నడిపించేవారు... వారు. వారొచ్చారంటే.. అయితే సంతోషం, లేదంటే దుఃఖం! వేలు విడిచిన మేనమామ పెద్దల్లుడి బావ మరిది పెళ్లి పత్రికైనా.. గంగా భగీరథీ సమానురాలైన పెదబామ్మ పోయిందన్న విషయమైనా.. వాళ్లొస్తేనే తెలిసేది. క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఇంటివాడయ్యేవారు. దగ్గరి వాళ్లు దూరమైపోతే.. ఓదార్చేవారు. మనియార్డర్ ఇచ్చి ధనయోగం కలిగించేవారు. ఇప్పుడు వారు ప్రాభవం కోల్పోయారు. అనుబంధాలూ కోల్పోతున్నారు. బ్యాంకు నోటిఫికేషన్లు, కోర్టు ఆర్డర్లు తెచ్చివ్వడానికే పరిమితమవుతున్నారు. గతమెంతో ఘనం అని చెప్పుకుని మురిసిపోయే పోస్టుమన్లను సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్ తనికెళ్ల భరణి ‘మిత్రమా.. కుశలమా’ అని పలకరించారు. ప్రశ్నోత్తరాలతో కొత్తకోణం ఆవిష్కరించారు. తనికెళ్ల భరణి: పోస్ట్‌మన్.. బంధుత్వం లేకపోయినా దగ్గరి బంధువు కన్నా ఎక్కువ. మంచి వార్తని నవ్వుతూ.. చెడు వార్తని దిగులుగా చెప్పే బంధువు. ఆ పోస్ట్‌మన్ ఇంకా ఉన్నాడా? ఓంకార్: మీ ఎదురుగా నిలబడ్డ మేమంతా అలాంటి పోస్ట్మన్లమే సార్. తనికెళ్ల భరణి: మీరున్నారు.. అనుబంధాలు కూడా అలాగే ఉన్నాయా? కమలాకర్: అనుబంధాలను పెంచే ఉత్తరాలుంటే కదా! అపాయింట్మెంట్ ఆర్డర్లు, బ్యాంకు నోటిఫికేషన్లు, కోర్టు ఆర్డర్లు వంటివే ఎక్కువగా వస్తున్నాయి. తనికెళ్ల భరణి: అనుబంధాలు.. ప్రేమను, కోపాన్ని.. అన్నింటినీ క్షణాల్లో చేరవేయడానికి చరవాణిలు (మొబైల్ ఫోన్లు ) ఉన్నాయి కదా మరి? ఇసాముద్దీన్: అయినా.. మాకుండే పని మాకుంది సార్. తనికెళ్ల భరణి: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? గోపాల్: పూర్వం పదో తరగతి. ఇప్పుడు ఇంటర్మీడియట్. తనికెళ్ల భరణి: అప్పటి సంగతి వేరు.. ఏడు ఎనిమిది చదివినా పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చేవారు. మా అన్నయ్య దీక్షితులు పోస్టల్ డిపార్ట్మెంట్లో యూసఫ్గూడలోనే పనిచేశాడు. తమ్ముడు కూడా జీపీఓలోనే పనిచేశాడు. ఒకప్పుడు పోస్ట్‌మన్ ఎప్పుడు వస్తాడా.. వచ్చినపుడు తన బ్యాగ్‌లో నుంచి ఏ ఉత్తరం తీస్తాడా అని ఎదురు చూసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు కదా? రామ్మోహన్: ఉత్తరాలున్నాయి సార్. ఎదురుచూసే ఉత్తరాలు కాదు.. వద్దన్నా వచ్చే ఉత్తరాలు. తనికెళ్ల భరణి: అర్థమైంది.. ‘నువ్వింత కట్టకపోతే నీ ఇల్లు వేలం పెడతాం’ అలాంటివన్నమాట(నవ్వుతూ...) చంద్రశేఖర్: డబ్బు, ఉద్యోగాలు.. వాటికి సంబంధించిన ఉత్తరాలే ఎక్కువగా ఉంటున్నాయి. తనికెళ్ల భరణి: రోజుకి ఒక పోస్ట్‌మన్ ఎన్ని ఉత్తరాలు ఇస్తాడు? రామ్మోహన్: తక్కువలో తక్కువ.. 500 వరకు. మాగ్జిమమ్.. 800 వరకూ చేరవేస్తాం. తనికెళ్ల భరణి: అమ్మో.. అన్ని ఉత్తరాలు ఎలా ఇస్తారు! బండి మీదా ? గోపాల్: పోస్ట్‌మన్ బండి ఎక్కడమేమిటి సార్. సైకిల్‌మీదే. తనికెళ్ల భరణి: ఇంకా సైకిలేనా..? మాధవరెడ్డి: బ్రిటిష్ జమానా నుంచి ఇప్పటి వరకూ మారని విషయం ఏదైనా ఉందంటే.. పోస్ట్‌మన్ ఇంకా సైకిల్ వాడటం. చంద్రశేఖర్: అవును.. మరీ విడ్డూరం కాకపోతే.. చిన్న మోటారు సైకిల్‌లాంటిది ఉండాలి కదా! చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. వాళ్లు పోస్ట్‌మెన్‌కి సైకిల్ మాత్రమే సౌకర్యంగా ఉంటుందంటారు. తనికెళ్ల భరణి: ఓహో.. ఉత్తరాలు వంటివి పెట్టుకోవడానికా! అయినా.. బైక్‌ని కూడా మీకు సౌకర్యంలా ఉండేట్టు మార్చుకోవచ్చు కదా! ఎత్తుగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? గోపాల్: ఏముంది సార్.. బలమంతా ఉపయోగించి ఆయాసపడుతూ తొక్కుకెళ్లాలి. నాకిప్పుడు 56 ఏళ్లు. అయినా తప్పదు.. ముఖ్యంగా మన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో కొన్ని ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా కష్టమవుతుంది. ఎత్తు పల్లాలు పక్కన పెడితే.. అపార్టుమెంట్లలో ఉండేవారికి ఉత్తరాలొస్తే ఇక నరకమే. తనికెళ్ల భరణి: అదేంటి.. అపార్ట్మెంట్ వల్ల మీకొచ్చిన కష్టమేంటి? కమలాకర్: మెట్లు ఎక్కాలి దిగాలి కదా సార్.. ఐదారంతస్తులుంటాయి. కొందరు లిఫ్ట్ వాడొద్దంటారు. ఒక్కోసారి కరెంట్ ఉండదు. కష్టమైనా.. చచ్చినట్టు అన్ని మెట్లు ఎక్కి దిగాల్సిందే. రోజుకి కనీసం వెయ్యి మెట్లు ఎక్కుతాం. తనికెళ్ల భరణి: క్షేమ సమాచారాలకు సంబంధించిన ఉత్తరాలు తక్కువైపోయినా.. ఈ మధ్యనే నేను తీసిన ‘మిథునం’ సినిమా చూసి బాపుగారు నాకు ఉత్తరం రాశారు. దాన్ని నేను నెట్లో పెట్టుకున్నాను. రామ్మోహన్: ఉత్తరం అపురూపమైంది సార్! తనికెళ్ల భరణి: ఇండియన్ పోస్టల్ సర్వీసుకి, ఫారెన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి తేడా గురించి ఏమైనా చెప్పగలరా? ఓంకార్: తప్పకుండా సార్. ప్రపంచంలో ఏ పోస్టల్ డిపార్ట్మెంట్ అయినా మన దేశం తర్వాతే సార్. పొరుగు దేశాల్లో అడ్రసులో ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఉత్తరం వెనక్కి తిరిగొచ్చేస్తుంది. ఇక్కడ అలా కాదు. మనిషి గురించి కనుక్కుని మరీ ఇస్తారు. తనికెళ్ల భరణి: నిజమే... దీని గురించి ఒక ఉదాహరణ చెబుతాను. హిందీ నటుడు మనోజ్‌కుమార్ తన గొప్పతనం గురించి చెబుతూ...మనోజ్‌కుమార్, బొంబాయి అని రాస్తే చాలు.. నా ఇంటికి ఉత్తరం వచ్చేస్తుంది.. అని అన్నాడట. వెంటనే మహమూద్ అందుకుని .. మహమూద్, ఇండియా అని రాస్తే చాలు నా ఇంటికి ఉత్తరం వచ్చేస్తుంది.. అన్నాడట. అది ఆ నటుల గొప్పతనం కాదు, మన పోస్టల్ డిపార్టుమెంటుదే. అదే పద్ధతిలో నేను సత్యజిత్‌రేకి ఉత్తరం రాశాను. ‘సత్యజిత్‌రే.. ఫేమస్ ఫిలిం డెరైక్టర్, వెస్ట్ బెంగాల్’ అని అడ్రస్ రాశాను. కాకపోతే ఓ వారం రోజుల్లో ఆ లెటర్ తిరిగొచ్చేసింది (నవ్వుతూ...) మాధవరెడ్డి: ఎందుకు సార్.. అడ్రస్ సరిగ్గా లేకుండా మీ పేరుతో ఉత్తరం వచ్చిందనుకోండి. హైదరాబాద్‌లో మీరెక్కడున్నా ఉత్తరం మీ చేతికి అందుతుంది. తనికెళ్ల భరణి: ఇప్పుడు మీ అందరికీ అన్ని భాషలూ రావాలని లేదు. హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ.. వంటి భాషల్లో అడ్రస్ ఉంటే మీకెలా అర్థమవుతుంది. గోపాల్: ఆఫీసులోనే ట్రాన్స్లేషన్ చేసి ఇస్తారు. తనికెళ్ల భరణి: సరే.. మరో ముఖ్యమైన ప్రశ్న. మీది డిలే సర్వీసు అనే మాట ఉంది. చాలాసార్లు.. పెళ్లయిపోయాక ఉత్తరాలు వచ్చిన సందర్భాలూ ఉంటాయి. మరి దానిమాటేమిటి ? చంద్రశేఖర్: అడ్రసులు సరిగ్గా రాయకపోవడమే కారణం. తనికెళ్ల భరణి: నాకు మొదటిసారి ఉత్తరం వచ్చింది. ఒక పత్రిక నుంచి ‘నీ కవిత ప్రచురింపబడుతోంది’ అని. జ్ఞానపీఠ్ అవార్డు వచ్చినంత ఆనందపడ్డాను. అదే ఉత్సాహంతో ‘కర్మ కాలిపోయింది’ అని ఒక కథ రాసి పంపించాను. ఓ పది రోజుల తర్వాత ‘నీ కర్మ కాలిపోయింది.. కథ స్వీకరింపబడలేదు’ అని తిరిగి మరో ఉత్తరం వచ్చింది(నవ్వుతూ...). మీ డిపార్డుమెంట్పైన హిందీలో ఒక అద్భుతమైన పాటొకటుంది. ‘చిట్టీ ఆయీహై’ అని నామ్ సినిమాలోనిది. కళ్లనీళ్లు పెట్టిస్తుంది. మరో విషయం.. పూర్వం ఉత్తరాలకు శుభవార్తయితే పసుపుతో, అశుభమైతే నలుపు రంగుని ఉత్తరం మూలన అంటించేవారు కదా? గోపాల్: శుభవార్త అయితే నవ్వుకుంటూ ఇచ్చేవాళ్లం. అశుభమైతే వాళ్లకంటే ముందు మేమే బాధపడుతూ ఇచ్చేవాళ్లం సార్. ఆ రోజుల మళ్లీ తిరిగి రావు. దూరాన ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినట్టు ఉత్తరమొస్తే.. మా బిడ్డలకు వచ్చినంత ఆనందపడేవాళ్లం. అమ్మకు బాగాలేదని, తండ్రి చనిపోయాడని ఉత్తరాలొస్తే మేం కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ 20 ఏళ్ల కింద ముచ్చట. తనికెళ్ల భరణి: పల్లెటూళ్లలో చదువు రానివారు పోస్ట్మన్తోనే ఉత్తరం చదివించుకునేవారు. మీరెప్పుడైనా అలా చేశారా? రామ్మోహన్: ఎందుకు చేయలేదు సార్.. అవసరమనుకుంటే ఉత్తరాలు తిరిగి రాసిపెట్టిన సందర్భాలున్నాయి. కాకపోతే కొందరి రాత అస్సలు అర్థమయ్యేది కాదు. తనికెళ్ల భరణి: మీ గురించి పూర్వం మరో బ్యాడ్‌టాక్ ఉండేది. ఎంఓలు నొక్కేస్తారని..? గోపాల్: కమలాకర్: అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగేవి. కానీ కంప్లయింట్ ఇవ్వగానే వెంటనే వాళ్లపై చర్యలు తీసుకునేవారు. తనికెళ్ల భరణి: పోస్ట్‌మన్ వచ్చాడు.. అనే మాట ఎప్పుడో గాని వినపడటం లేడు. అసలు ఉన్నారా.. ఉంటే ఎలా ఉన్నారనే ఆత్రుతతో ‘స్టార్ రిపోర్డర్’గా మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేశాను. థ్యాంక్యూ ఓంకార్: అన్ని వృత్తుల్లో ఒక వృత్తిలా కలసిపోయిన మమ్మల్ని పలకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్యూ వెరీమచ్! మా ఆవిడ రాసిన ఉత్తరాలు నేను దాచుకున్నాను. మనం రాసినవి చింపి అవతల పడేసినా.. వాళ్లవి మనం భద్రంగానే దాచుకుంటాం కదా! (నవ్వుతూ...). నేను మా ఆవిడకు రాసే ఉత్తరం చాలా వెరైటీగా ఉండేది. నేనిక్కడ క్షేమం.. నవ్వక్కడ క్షేమం.. అంటూ రొటీన్‌గా కాకుండా.. రచయితను కదా సినిమా స్టోరీలా రాసేవాడ్ని. ‘పొద్దునే లేచి టీ పెట్టుకుని తాగుతూ నీకు ఉత్తరం రాస్తున్నాను..’ అని మొదలుపెట్టేవాడ్ని. - రిపోర్టర్: తనికెళ్ల భరణి