ఆధార్‌ కార్డులను మట్టిలో పాతిపెట్టాడు..! | Odisha Postman Negligence on Post Aadhar Card Distribution | Sakshi
Sakshi News home page

మట్టిలో పాతిపెట్టాడు..!

Published Mon, Jun 8 2020 1:21 PM | Last Updated on Mon, Jun 8 2020 1:21 PM

Odisha Postman Negligence on Post Aadhar Card Distribution - Sakshi

మట్టిలో బయటపడిన ఆధార్‌కార్డులను ఏరుతున్న పోస్ట్‌మన్‌ వాంఛనిధి పరిడా

ఒడిశా, భువనేశ్వర్‌: ప్రజలకు అందజేయాల్సిన ఆధార్‌ కార్డులను ఓ పోస్ట్‌మన్‌ మట్టిలో పాతిపెట్టిన సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. బాలాసోర్‌ జిల్లాలోని బలియాపాల్‌ సమితి, బొడాస్‌ పంచాయతీ జొగాయి పోస్ట్‌ ఆఫీస్‌ పోస్ట్‌మన్‌ వాంఛనిధి పరిడా ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. చెరువు తవ్వకాల పనుల్లో మట్టిలో పాతిపెట్టిన ఆధార్‌కార్డులు గుట్టలుగుట్టలుగా బయటపడడంతో విషయం బయటపడింది. ఈ దృశ్యం గ్రామస్తుల దృష్టికి రావడంతో ఆ ఆధార్‌ కార్డులను పరిశీలించి, పోస్ట్‌మన్‌ తప్పిదంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి కూడా తప్పు ఒప్పుకున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement