తడిసిన నగదును ఆర బెడుతున్న పోస్టుమాస్టర్ నాగేశ్వరరావు
తూర్పుగోదావరి : /ముమ్మిడివరం: ఒక వైపు పడవ మునిగి గోదావరిలో కొట్టుకుపోతుంటే.. కూలీలకు చెందాల్సిన సొమ్మును భద్రంగా ఒడ్డుకు చేర్చి ఆ కూలీలకు అందజేసిన పోస్టుమాస్టర్‌ను గ్రామస్తులందరూ అభినందించారు. శేరులంక పోస్టుమాస్టర్ పోతుల నాగేశ్వరరావు శనివారం ఉపాధి కూలీలకు సంబంధించి రూ.3 లక్షలు ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం సబ్ పోస్టాఫీస్ నుంచి డ్రా చేశారు. ఆ సొమ్ముతో సైకిల్‌పై శేరులంకలో బయలుదేరి పశువుల్లంక రేవులో పడవ ఎక్కాడు. పడవ ప్రమాదానికి గురై సైకిల్‌పై పెట్టిన బ్యాగ్ గోదావరిలో పడిపోయాయి.
గోదావరిలో కొట్టుకుపోతున్న నగదు బ్యాగ్‌ను తోటి ప్రయాణికుడు కొండేపూడి గంగశాస్త్రి పట్టుకొని పోస్టుమాస్టర్‌కు అప్పగించారు. ఆ బ్యాగ్‌తో అతి కష్టంమీద ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. తడిసి ముద్దయిన నోట్లను ఆరపెట్టి మంగళవారం కూలీలకు అందజేశారు. సైకిల్ గోదావరిలో కొట్టుకుపోయినా కూలీలకు దక్కాల్సిన సొమ్మును భద్రంగా తీసుకొచ్చి అందజేసిన ఆయన నిజాయితీని గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment