
సాక్షి, సీతానగరం(తూర్పుగోదావరి): సినీనటి అనుష్క పురుషోత్తపట్నం వద్ద గోదావరి వద్ద కొద్దిసేపు విహరించారు. బెంగళూరు ఏఎంసీ విద్యాసంస్థల అధినేత కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంస నాలుగు రోజుల క్రితం సినీనటి అనుష్కతో పురుషోత్తపట్నంలోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే గోదావరిలో విహారయాత్ర జరిపినట్టు సమాచారం. ఈ యాత్రను అత్యంత గోప్యంగా ఉంచారు. బుధవారం అనుష్క తదితరులు మరపడవపై దేవీపట్నం మండలం గండి పోశమ్మ అమ్మవారిని, పట్టిసీమ వీరభద్రుని దర్శించిన అనంతరం తిరిగి పురుషోత్తపట్నం ఉదయం 11 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గీతా పరమహంసతో పాటు తిరుగు పయనమయ్యారు. చదవండి: పోలవరంలో హీరోయిన్ అనుష్క
Comments
Please login to add a commentAdd a comment