purushothapatnam
-
గోదారి తీరంలో టాప్ హీరోయిన్ రహస్య పర్యటన
సాక్షి, సీతానగరం(తూర్పుగోదావరి): సినీనటి అనుష్క పురుషోత్తపట్నం వద్ద గోదావరి వద్ద కొద్దిసేపు విహరించారు. బెంగళూరు ఏఎంసీ విద్యాసంస్థల అధినేత కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంస నాలుగు రోజుల క్రితం సినీనటి అనుష్కతో పురుషోత్తపట్నంలోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే గోదావరిలో విహారయాత్ర జరిపినట్టు సమాచారం. ఈ యాత్రను అత్యంత గోప్యంగా ఉంచారు. బుధవారం అనుష్క తదితరులు మరపడవపై దేవీపట్నం మండలం గండి పోశమ్మ అమ్మవారిని, పట్టిసీమ వీరభద్రుని దర్శించిన అనంతరం తిరిగి పురుషోత్తపట్నం ఉదయం 11 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గీతా పరమహంసతో పాటు తిరుగు పయనమయ్యారు. చదవండి: పోలవరంలో హీరోయిన్ అనుష్క -
ప్రజాధనం గోదారి పాలు.. టీడీపీ నిర్వాకం
రాజుల సొమ్ము.. రాళ్లపాలు అన్నట్టుగా.. నాటి చంద్రన్న సర్కారు కమీషన్ల కక్కుర్తితో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదారి పాలు చేసింది. సరైన అనుమతులు లేకుండానే నాటి ప్రభుత్వం నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భారీగా కమీషన్లు ఎత్తిపోశారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అసలు ఈ ఎత్తిపోతల పథకమే వృథా అని చాలామంది అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికీ కమీషన్ల కక్కుర్తితో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం ఆగమేఘాల మీద నిర్మించేసింది. ఇప్పుడీ పథకం ‘ఉత్తిపోతలు’గా మారినట్టే కనిపిస్తోంది. దీని నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయడానికి వీల్లేదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారగా.. దీనికోసం ఖర్చు చూపించిన రూ.1,638 కోట్లను చంద్రన్న ప్రభుత్వం గోదారిలో కలిపినట్టయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాలకుల స్వలాభపేక్ష ఫలితంగా ప్రజాధనం ఎలా దురి్వనియోగం అవుతుందో కళ్లకు కడుతోంది పురుషోత్తపట్నం ఎత్తిపోల పథకం. మెట్ట ప్రాంత సంజీవనిగా పిలిచే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీటిని పంపింగ్ చేస్తామని నమ్మించి, నాటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఈ పథకం ద్వారా గత పాలకులు రూ.కోట్లు కొల్లగొట్టేశారు. 2017 ఆగస్టు 15న అప్పటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. సాగునీరు విడుదల చేస్తున్నట్టు పెద్ద ఆర్భాటమే చేశారు. 2017లో పాక్షికంగా 1.63 టీఎంసీలు, 2018–19 ఖరీఫ్‌న్‌లో 7.81 టీఎంసీలు.. అది కూడా గోదావరికి వరదలు వచ్చినప్పుడు విడుదల చేశారు. పోలవరం ఎడమ కాలువ, ఏలేరు ప్రాజెక్టులు ఉండగా ఈ ఎత్తిపోతల పథకం వృథా అని రైతులు, ఇంజినీర్లు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు చెవికెక్కలేదు. ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే.. కమీషన్లకు కక్కుర్తి పడి, అధికార బలంతో రూ.1,638 కోట్ల ప్రజల సొమ్ము గోదావరిపాలు చేశారు. అనుమతులు తీసుకోకుండానే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం, రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై ఎన్జీటీ, న్యాయస్థానాలు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయరాదంటూ ఎన్జీటీ తాజాగా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. బలవంతపు భూసేకరణ.. అక్రమ కేసులు వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆద్యంతం వివాదాస్పదంగానే జరిగింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూ పరిధిలో భూములకు పరిహారం తక్కువని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని 70 ఎకరాలకు చెందిన 85 మంది రైతులు అప్పట్లో డిమాండ్ చేశారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు క్రిమినల్ కేసులు పెట్టి, బలవంతంగా నాటి ప్రభుత్వం భూములు తీసుకుంది. దీనిపై 30 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి న్యాయ పోరాటానికి మద్దతుగా ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అప్పట్లో ఆమరణ దీక్ష కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జక్కంపూడి రాజా పురుషోత్తపట్నం రైతుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై చంద్రబాబు సర్కార్ పెట్టిన అక్రమ కేసులను ఇటీవల ఎత్తివేయించారు. దీంతో ఆ రైతులకు ఉపశమనం లభించింది. ‘ఏలేరు’లో సమృద్ధిగా జలాలు ఏలేరు రిజర్వాయర్ కింద ఖరీఫ్‌లో 60 వేలు, రబీలో 40 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఒక టీఎంసీ జలాలతో 10 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 12.21 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ఆయకట్టుకు ఎటువంటి ఢోకా లేదు. సీజన్ ప్రారంభంలోనే సమృద్ధిగా నిల్వలుంటే వర్షాలు విస్తారంగా పడితే ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ– రామవరం లిఫ్ట్‌తో సంబంధం లేకుండానే ఏలేరు ఆయకట్టులో రెండు పంటలకూ సమృద్ధిగా నీరందుతోంది. ఇటువంటి ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని ఎత్తి పోస్తామని నమ్మబలికి, రైతుల పేరుతో పురుషోత్తపట్నం పథకాన్ని తీసుకువచ్చి, కమీషన్ల రూపంలో రూ.కోట్లు కొట్టేశారని మెట్ట ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టు రైతులపై ప్రేమ కంటే కమీషన్ల పై యావ ఎక్కువయ్యే చంద్రబాబు అండ్ కో ఇలా చేశారని రైతు ప్రతినిధులు విమర్శిస్తున్నారు. రామవరం లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా రామవరం వద్ద రెండో లిఫ్ట్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఏలేరు ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేశారు. రామవరం పంపు హౌస్‌కు మూడు కిలోమీటర్లు దూరాన కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం, ఏలేరు కాలువలు క్రాస్ అవుతున్నాయి. రెండో దశ లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండానే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని ఏలేరు ప్రధాన కాలువలోకి మళ్లించవచ్చు. అలా చేసే అవకాశం ఉన్నప్పటికీ రెండో దశ లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా చేశారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. నీటి విడుదలకు ఎన్జీటీ ‘నో’ అనుమతులు లేకుండానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నారంటూ ప్రారంభంలోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా దీని నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం, పర్యావరణ అనుమతి, కేంద్ర జలసంఘం నుంచి అనుమతి వచ్చే వరకూ ‘పురుషోత్తపట్నం’ నుంచి నీటి విడుదలను నిలుపు చేయాలని తాజాగా ఆదేశించింది. కీలకమైన ఈ అనుమతులేవీ తీసుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతల పథకం చేపట్టి ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేశారని రైతులు దుయ్యబడుతున్నారు. కేసులు పెట్టి వేధించారు పురుషోత్తపట్నం పథకంలో నేను 4.32 ఎకరాలు కోల్పోయాను. నా అనుమతి లేకుండా, సంతకం చేయకపోయినా భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. భార్యతో సహా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయతి్నస్తే పోలీసులు అడ్డుకుని, ఇంటిలోనే బంధించారు. నా అంగీకారం లేకుండానే క్రిమినల్ కేసులు పెట్టి మరీ భూమిని బలవంతంగా తీసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను రద్దు చేసింది. – కరుటూరి శ్రీనివాస్, రైతు,రామచంద్రపురం,సీతానగరం మండలం జక్కంపూడి కృషితో కేసులు ఎత్తేశారు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని అడిగాం. ఆ చట్టం ప్రకారం ఎకరాకు రూ.39 లక్షలు వస్తుంది. అలా పరిహారం చెల్లించకుండా పోలీసు బందోబస్తుతో బలవంతంగా భూముల్ని లాగేసుకుని మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా మాపై ఉన్న కేసులను ఎత్తేశారు. కేసులు ఎత్తివేసినట్టే పరిహారం విషయంలో కూడా ఆదుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. – ఐఎస్ఎన్ రాజు, చినకొండేపూడి, సీతానగరం మండలం ‘పురుషోత్తపట్నం’లో ‘బాబు’ లూటీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో చంద్రబాబు అండ్ కో రూ.కోట్లు లూటీ చేసింది. రూ.1,638 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసినా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని పరిస్థితి చంద్రబాబు నిర్వాకంతోనే ఏర్పడింది. ఆయనకు కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడంలో లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చినా లెక్క చేయలేదు. దానికి అభ్యంతరాలు ఎదురైనా ఇక్కడ పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి హడావుడిగా పూర్తి చేసి, కమీషన్లు నొక్కేశారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకపోగా, తిరిగి వారిపై అక్రమంగా కేసులు పెట్టి బలవంతంగా భూములు లాగేసుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి రైతులపై కేసులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అవసరం లేదన్న నిపుణుల సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టి ప్రజల సొమ్మును దుబారా చేశారు. పోలవరం యుద్ధప్రాతిపదికన జరుగుతోందని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో భాగంగానే దీనిని చేపడుతున్నామని అప్పట్లో చెప్పారు. దీనిలో ఆంతర్యమేమిటి? – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం -
నారా లోకేష్‌ను అడ్డుకున్న రైతులు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని సీతానగరంలో టీడీపీ నేత నారా లోకేష్‌ను రైతులు అడ్డుకున్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా తమను మోసం చేసిందని ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం సీతానగరంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన లోకేష్‌ను బాధిత రైతులు నిలదీశారు. టీడీపీ హయాంలో బలవంతంగా తమ భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గో బ్యాక్ అంటూ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్‌కు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన రైతులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో రైతులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నేతల దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. అయితే లోకేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి చిరునవ్వుతో ముందుకు వెళ్లిపోయారు. -
సాగునీరు లేకుండా చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న రైతులు వెయ్యి ఎకరాల్లో వరినాట్లు వేయని వైనం తరలివెళ్లిన పోలీసులు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు లేక వరినాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానం కారణం పైప్‌లైన్ పనులేనని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు ఆవలి పక్కనే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే నీరు పైప్‌లైన్ పనులకు ఇవతల వైపున ఉన్న 1,000 ఎకరాలకు అందాలి. పైప్‌లైన్ పనుల వల్ల నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఇంత వరకూ వరినాట్లు వేయలేకపోయారు.అదీ వారి ఆగ్రహానికి కారణం. దీంతో తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు, కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ. వెంకటేశ్వరావు, 20 మంది పోలీస్ సిబ్బంది తరలివెళ్లారు. అధికారులు ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆగస్టు 2కు వాయిదా వేసిందని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తే వాటి ఆధారాలు చూపాలని ప్రభుత్వ అడ్వకేట్‌ను కోరారని, అంతవరకూ పనులు చేయడానికి వీల్లేదని రైతులు కలగర బాలకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, ప్రసాద్, చల్లమళ్ళ విజయ్‌కుమార్ చౌదరి తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన అధికారులు ఇందులో పనులు ఆపమని చెప్పలేలే అని వివరించారు. రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పనులు చేయమని ఆర్డర్ చూపాలని మెగా ఇంజనీరింగ్ ఆధికారులను నిలదీశారు. దానికి అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకునే అధికారం మీకు లేదని, కోర్టు అర్డరులో పనులు ఆపమని లేనందున పనులు యథావిదిగా చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంతేగాకుండా అధికారులు పోలీసుల రక్షణలో పనులు కొనసాగించారు. వరినాట్లు వేయడానికి తొర్రిగెడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు వెళ్లడానికి పైప్‌లైన్ వద్ద కాలువను కలుపుతామని చెప్పి తక్షణమే పనులు చేపట్టారు. దీనితో రైతులు మద్యాహ్న 1.30 గంటలకు అక్కడ నుండి తరలి వెళ్లారు. ఎత్తిపోతల పథకం పనులు యధావిదిగా కొనసాగించారు. -
రైతులపై కేసులు పెట్టడం అన్యాయం
- సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : నష్ట పరిహారం చెల్లించకుండా తమ భూముల జోలికి వెళ్ళవద్దన్న రైతులపై 356 సెక్షన్ కింద నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయకుండా వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం పురుషోత్తపట్నం, రామచంద్రరావు పేట, నాగం పేట, చిన కొండేపూడి, వంగలపూడి గ్రామాల్లో 240 ఎకరాలు సేకరిస్తోందన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక ఎత్తిపోతల పథకాల కింద రైతుల భూములను లాక్కొందని, ఉన్న కాస్త భూమిని కూడా ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరిట స్వాధీనం చేసుకుంటోందన్నారు. మూడు పంటలు పండే భూమికి కేవలం రూ. 17.50 లక్షలు, రూ.19.50 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకరాకు రూ. 40 లక్షలు పలుకుతోందన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులకు రూ. 28 లక్షలు ఇవ్వడానికి అవార్డ్ ప్రకటించారని, ఒప్పందం కదుర్చుకోకుండా కోర్టుకు వెళ్ళిన రైతుల నుంచి మాత్రం బలవంతంగా భూమిని లాక్కోవడానికి చూస్తున్నారన్నారు. రైతుల తరపున పోరాడేందుకు వెళ్ళిన రాజకీయ పార్టీల ప్రతినిధులను సీతానగరంలోనే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయ బద్ధంగా నష్ట పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. రైతు నాయకుడు సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూమికి భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. భూమి కోల్పోతే తమకు భవిష్యత్తు లేదన్నారు. పుష్కర 1, 2 కాలువలను ఈ పథకం కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని లాక్కోంటోందన్నారు. సీపీఎం నగర కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, పురుషోత్తపట్నం రైతులు రాంబాబు, సతీష్, తాతారావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. -
మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలి
‘పురుషోత్తపట్నం’పై అఖిలపక్షం డిమాండ్ 2013 భూసేకరణ చట్ట సవరణలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, భూసేకరణ చట్టం–2013ను యథాతథంగా అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యాన ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు, రైతులు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానాన్ని ఎండగట్టారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా, ఇసుక దందాలు, భూకబ్జాలు, ఏవేవో పరిశ్రమల పేరిట విలువైన భూములను అస్మదీయులకు కట్టబెట్టడం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీదారీ వ్యవస్థ నడుస్తోందని, ప్రభుత్వమే చట్టాలను నీరుగారుస్తోందని అన్నారు. రైతుల కోసం ఎటువంటి ఉద్యమానికైనా తాము సిద్ధమని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, రైతుల అంగీకారంతో మాత్రమే భూములు తీసుకోవాలని, పరిశ్రమల స్థాపనకు పర్యావరణ, సామాజిక అంశాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ రెండూ బోగస్ ప్రాజెక్టులేనని, ఎన్నికల తరువాత అవి ఉండవని అన్నారు. రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలని, పది రూపాయలు ఎక్కువిచ్చినా తప్పు లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కొందరు ‘పెద్దలు’ పోలవరం కుడి కాలువ పనులను న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ‘‘పురుషోత్తపట్నం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని నాయకులు చెబుతున్నారు. అయితే కేంద్ర జలవనరుల సంఘం నాడు ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు’’ అని ఆయనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో జరుగుతున్న అవినీతిని గురించి తాను ఎన్ని ఉత్తరాలు రాసినా, చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని ఉండవల్లి అన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరిత ధోరణి అవంబిస్తోందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మాత్రమే భూములు సేకరించాలని, భూములు కోల్పోయినవారికి మార్కెట్ ధరను అనుసరించి పరిహారం ఇవ్వడంతో పాటు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణల ద్వారా ప్రజాభిప్రాయానికి తిలోదకాలివ్వడం, నష్టపరిహారానికి చట్టబద్ధత కల్పించకపోవడం, పోలీసుల ద్వారా రైతులను భయభ్రాంతులను చేయాలనుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లకు, అధికార పక్షం నాయకులకు, కార్యకర్తలకు లబ్ధి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అక్రమ సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి మించిన బలమైన శక్తి లేదన్న విషయం గుర్తుచుకోవాలని అన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం నేత టి.అరుణ్ తదితరులు ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నçష్టపరిహారం ఇవ్వాలని, ఏప్రిల్ మూడో తేదీన అఖిలపక్ష నాయకులతో, పురుషోత్తపట్నం రైతులతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ¯ŒSవీ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, ఉభయ గోదావరి జిల్లాల వర్తక సమాఖ్య ప్రతినిధి నందెపు శ్రీనివాస్, గోలి రవి, పురుషోత్తపట్నం నిర్వాసిత రైతు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల కడుపు కొట్టొద్దు 2013 భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను రద్దు చేయాలి. చట్టాలను దుర్వినియోగం చేసి, రైతుల కడుపు కొట్టొద్దు. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. బలవంతంగా భూములు తీసుకునే పద్ధతి విడనాడాలి. – కలగర బాలకృష్ణ, రైతు, పురుషోత్తపట్నం అయోమయంలో రైతులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతుల పరిస్థితి అయోమయంలో ఉంది. నావి రెండున్నర ఎకరాలు పోయాయి. భూములకు పరిహారం ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి దాపురించింది. నాకు వ్యవసాయం తప్ప మరో బతుకుతెరువు లేదు. – చెరుకూరి పోసిబాబు, రైతు కోర్టు తీర్పునుపట్టించుకోవడంలేదు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో 30 సెంట్ల భూమి కోల్పోయాను. భూమి ఇవ్వనని రాతపూర్వకంగా తెలియజేశాను. న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. 2013 చట్టాన్ని అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పులను పట్టించుకోవడం లేదు. – గద్దే రామకృష్ణ, చినకొండేపూడి, సీతానగరం మండలం వక్రభాష్యాలు చెబుతున్నారు న్యాయస్థానం పిటిష¯ŒSను డిస్పోజ్ చేశామని చెబితే, డిస్మిస్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? 788 జీఓ ప్రకారం పట్టిసీమ రైతులకు ఇచ్చినవిధంగానే నష్టపరిహారం చెల్లించాలి. – రమేష్‌బాబు, పట్టిసీమ -
జూలైకి ‘పురుషోత్తపట్నం’ పూర్తి
పురుషోత్తపట్నం (సీతానగరం): 2017 జూలై నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పోలవరం ఎడమకాలువ ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. శుక్రవారం పురుషోత్తపట్నం పథకం నెలకొల్పే స్థలాన్ని ఆయన, ఈఈ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పథకంలో పది మోటార్లతో అయిదు పైప్‌లై¯ŒSలు పది కిలోమీటర్లు పొడవునా వెళతాయన్నారు. 240 ఎకరాల భూసేకరణ సేకరించాలని, అందులో ప్రభుత్వ భూమి ఎంత, రైతుల భూమి ఎంత అనేది నిర్ధారించవలసి ఉందన్నారు. రైతుల నుంచి తీసుకునే భూమికి నష్టపరిహారమా లేదా లీజు అనేది వారి సూచనల మేరకు ఉంటుందన్నారు. 58 కిలోమీటర్లు ఏలేరు రిజర్వాయర్ వరకు పోలవరం ఎడమ కాలువ పనులు మూడు ప్యాకేజీలుగా జరుగుతున్నాయన్నారు. రెండు, మూడు ప్యాకేజీ పనులు పూర్తి అయ్యాయని, ఒకటవ ప్యాకేజీలో 7 లేదా 8 స్ట్రక్చర్స్ ఉన్నాయని, వాటిని జూలై నాటికి పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్‌లో నీటిని పంపిస్తామన్నారు. 2017నాటికి ఏలేరు పరిధిలో 53 వేల ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న 23 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, 2018 నాటికి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఏలేరు రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఈ పథకం ద్వారా రెండు పంటలకు నీరు అందించవచ్చన్నారు. 225–11 విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS నెలకొల్పి పురుషోత్తపట్నం, పుష్కర పథకాలకు పుష్కలంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సుమారు రూ.1,450 కోట్లతో నెలకొల్పే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని సుగుణాకరరావు తెలిపారు. -
నిధుల ఎత్తిపోతలకేనా!
కొవ్వూరు : ఓవైపు పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామంటున్న సర్కారు మరోవైపు గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం పూర్తయితే ఈ పథకం అవసరం ఏముంటుందని నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా గోదావరిపై తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూ.1,638 కోట్లు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని చేపడుతున్నది నిధులను ఎత్తి జేబుల్లో పోసుకోవడానికా? లేక ప్రభుత్వం చెబుతున్నట్టు పోలవరం పథకం రెండేళ్లలో పూర్తికాదా? అనే సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి. ఆ పథకం పనుల తీరు పరిశీలించినా ఇదే భావం కలుగుతోంది. ప్రాజెక్టును రెండేళ్లలోనే పూర్తిచేసేట్టయితే గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకాల అవసరం ఉండదు. కానీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో రూ.1,638 కోట్లు వెచ్చించి పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణానికి సర్కారు సిద్ధం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇలాగే తహతహలాడిన సర్కారు రూ.1420 కోట్లు వెచ్చించింది. అయినా ఆ పథకం లక్ష్యం నెరవేరలేదు. దీనిద్వారా నిర్దేశించిన లక్ష్యంలో సగం నీటిని కూడా కృష్ణానదికి తరలించలేకపోయింది. ఈ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే వచ్చే సీజన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం వెంపర్లాడుతోంది. ఈ పథకం పూర్తి కావాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. ఆ సమయానికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇక దీని అవసరం ఏముందనే విషయాన్ని విస్మరిస్తోందని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదా! లేక పథకం ప్రకారమే రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సర్కారు యత్నిస్తోందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘పట్టిసీమ’తో తరలించింది 22 టీఎంసీలే అత్యంత ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ పథకం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 29 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణానదికి తరలించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ 24 పంపులు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో పనిచేసింది తక్కువ రోజులేనని చెప్పాలి. ఈ పథకం ద్వారా కృష్ణా ఆయకట్టులో 10 లక్షల ఎకరాలకు నీటిని అందించామని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెబుతున్న మాటలు వట్టిదేనని దీనిని బట్టి అర్థమవుతోంది. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో గరిష్టంగా 11,500 ఎకరాల వరి పంటకు నీరు అందించవచ్చు. ఈ లెక్కన ఎక్కువంటే 30 టీఎంసీల నీరు సరఫరా అయితే 3.45లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. పట్టిసీమ ద్వారా 29 టీఎంసీలనే కృష్ణానదికి తరలించారు. మరి పదిలక్షల ఎకరాలకు నీరు ఎక్కడ అందించారన్నది ప్రభుత్వమే చెప్పాలి. పుంజుకోని పోలవరం పనులు పోలవరం : ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలిస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, పవర్ హౌస్, అప్రోచ్ చానల్ పనులకు సంబంధించి 10.83 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. మూడేళ్లుకుపైగా ఈ పనులు జరుగుతున్నా.. ఇప్పటి వరకు 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ జీతాలు చెల్లించడం లేదని కార్మికులు, పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదని సబ్‌కాంట్రాక్టు సంస్థ త్రివేణి పదిరోజులు పనులు నిలిపివేశాయి. ఇటీవల చంద్రబాబు స్వయంగా పనులను పరిశీలించి రోజుకు 2.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం (ఎర్్తవర్క్) పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా ఆ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇలాగైతే సీఎం చెబుతున్నట్టు 2018 నాటికి పోలవరం పూర్తి చేయడం అసాధ్యమని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
పోలవరం ప్రాజెక్ట్‌కు సమాధి
-
సమ్మె బాటలో సత్యసాయి సిబ్బంది
పురుషోత్తపట్నం (సీతానగరం) : ఉభయ గోదావరి జిల్లాల్లోని 458 గ్రామాలు గుక్కెడు నీటికి ఇక్కట్లు పడనున్నాయి. రెండు జిల్లాల్లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మె చేయక తప్పడం లేదని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు నిర్వహణ కార్మికుల సంఘం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి శాఖల అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, మామిడిపల్లి వెంకట రామసత్య వరప్రసాద్ బుధవారం పురుషోత్తపట్నంలో తెలిపారు. ఈ నెల 16 లోపు జీతాలు ఇవ్వకపోతే అక్టోబర్ 10 నుంచి సమ్మెకు దిగుతామని గతనెల 28న కలెక్టర్, లేబర్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు, ప్రాజెక్టును నిర్వహించే ఎల్అండ్టీకి నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. తూర్పుగోదావరిలో 120 మంది, పశ్చిమ గోదావరిలో 152 మంది జీతాలందక క ష్టాలు పడుతున్నామని, గత్యంతరం లేక సమ్మె చేస్తున్నామని చెప్పారు. మూడులక్షల మందికి నీటికష్టాలు.. జిల్లాలో పురుషోత్తపట్నంలోని సత్యసాయి ప్రాజెక్టు నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండ లాల్లోని 74 గ్రామాలకు, కుట్రవాడ ప్రాజెక్టు నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల మండలాల్లోని 125 గ్రామాలకు, సీలేరు ప్రాజెక్టు నుంచి 17 గ్రామాలకు, పశ్చిమ గోదావరిలోని పోలవరం సత్యసాయి ప్రాజెక్టు నుంచి పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు తదితర 17 మండలాల్లోని 242 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 458 గ్రామాల్లోని మూడు లక్షల మంది సమ్మె కారణంగా తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తుంది.