సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని సీతానగరంలో టీడీపీ నేత నారా లోకేష్‌ను రైతులు అడ్డుకున్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా తమను మోసం చేసిందని ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం సీతానగరంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన లోకేష్‌ను బాధిత రైతులు నిలదీశారు. టీడీపీ హయాంలో బలవంతంగా తమ భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ గో బ్యాక్ అంటూ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్‌కు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన రైతులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో రైతులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నేతల దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. అయితే లోకేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి చిరునవ్వుతో ముందుకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment