seethanagaram
-
లక్ష్మీనర్సింహస్వామికి కరెన్సీ నోట్లతో అలంకరణ
సీతానగరం: మండల కేంద్రంలో సువర్ణముఖి నదీతీరాన వేంచేసిన లక్ష్మీనర్సింహస్వామి కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలంకరణతో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మీనర్సింహ స్వామివారిని కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వందలాది మంది భక్తులతో వేకువ జామునుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ స్వామివారికి భక్తులు కానుకగా సమకూర్చిన కరెన్సీ నోట్లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన పుష్పాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించామన్నారు. -
దారుణానికి ఒడిగట్టిన భార్య.. భర్త మృత దేహాన్ని పరిశీలించగా..
సాక్షి, తూర్పుగోదావరి(సీతానగరం): ఓ వ్యక్తిని అతడి భార్యే క్రూరంగా హతమార్చిన వైనమిది. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురం యానాదుల కాలనీలో మర్రే అబ్బులు (46), అతడి భార్య ముత్యాలమ్మ మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఇంటి వద్ద గొడవ పడ్డారు. ఇద్దరూ గొడవ పడుతూనే ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ముత్యాలమ్మ మాత్రమే ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం రాపాక రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద అబ్బులు మృతదేహాన్ని చూసిన స్దానికులు ముత్యాలమ్మకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేయడానికి శ్మశానవాటికకు తరలించే ప్రయత్నంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్సై శుభశేఖర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తన భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని వారిని నమ్మించేందుకు ముత్యాలమ్మ ప్రయత్నించింది. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) మృతదేహాన్ని పరిశీలించగా అబ్బులు మర్మాంగం కట్ చేసి ఉంది. అతడి ముఖంపై కొట్టి హతమార్చినట్టు గుర్తించారు. దీనిపై తమదైన శైలిలో విచారణ జరిపారు. దంపతులిద్దరూ గొడవలు పడుతూ గ్రామ శివారుకు వెళ్లారని, అక్కడ వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్‌తో అబ్బులును అతడి భార్య ముత్యాలమ్మ బలంగా కొట్టి ఇంటికి వచ్చేసిందని తెలిపారు. తన భర్త అనారోగ్యంతో మరణించినట్లు చిత్రీకరించేందుకు ఉదయం ప్రయత్నించింది. హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. అబ్బులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని, హత్య కేసుగా ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
అక్కడ 667 మందే ఓటర్లు
సాక్షి, సీతానగరం: అఖండ గోదావరి మధ్యలో ఉండే ములకల్లంక పంచాయతీలో ఓటర్లు కేవలం 667 మంది. వారిలో పురుషులు 335, మహిళలు 332 మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది. గోదావరి వరద సమయంలో ప్రధానమైన రెండు రాజకీయ పార్టీలకు చెందిన రెండు పడవలపై గ్రామస్తులు వెళుతుంటారు. మామూలు సమయంలో గోదావరి పాయలో వేసిన తాత్కాలిక రోడ్డే ఆధారం. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా బొబ్బిల్లంక నుంచి ములకల్లంకకు బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. -
పెళ్లయిన తొమ్మిది నెలలకే...
ఆ వధూవరులకు వివాహమై తొమ్మిది నెలలే అయ్యింది. కొత్త జీవితంలోకి అడుగిడిన వారు ఆనందంగా.. సంతోషాల సంబరంగా ఉన్న దాంట్లో సంతృప్తితో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. కాళ్లపారాణి ఆరక ముందే భర్త దుర్మరణం చెందడంతో ఆ నవ వధువు కన్నీరుమున్నీరవుతోంది. ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... సాక్షి, విజయనగరం(కొమరాడ/సీతానగరం): కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గొబ్బరు వెంకటరమణ, జయలక్ష్మి దంపతుల మొదటి సంతానం గొబ్బరు ప్రవీణ్(27), రెండో సంతానం ప్రదీప్. వీరంతా కూరగాయల సాగు చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రవీణ్‌కు ఇదే పంచాయతీ కందివలసకు చెందిన మార్కొండ రామచంద్ర, చిన్నమ్మడు దంపతుల కుమార్తె రోజాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. రామచంద్ర కొన్నాళ్ల కిందట బతుకు జీవనం కోసం కుటుంబ సభ్యులతో ఏలూరు వెళ్లిపోయారు. ప్రవీణ్ పండిన కూరగాయాలను బొబ్బిలి మార్కెట్‌కు బొలేరో వాహనంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి తీసుకువెళ్లేందుకు బయలుదేరాడు మార్గంలో సీతానగరం మండలం ఎన్సీఎస్ సుగర్స్ వద్ద కింతలిపేట రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని బొలేరో ఢీకొంది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రవీణ భార్య ఆరు నెలల గర్భిణి. ప్రవీణ్ పెద్ద కొడుకు కావడంతో కుటుంబ జీవనంలో తన వంతు పాత్ర పోషిస్తూ తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ప్రదీప్, భార్య రోజాను తనకు కలిగినంతలో హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (నాన్నా... నీ వద్దకే వస్తున్నాం!) వివాహమైన తొమ్మిది నెలలకే నవ వరుడు ఇలా దుర్మరణం చెందడం, భార్య ఆరు నెలల గర్భిణి కావడంతో అంతా తల్లడిల్లుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటనా స్థలానికి ఇన్చార్జి ఎస్ఐ సురేంద్రనాయుడు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ఆ లారీ అక్కడే ఉండగా మూడు రోజుల కిందట మోటారు సైకిల్‌తో ఓ విద్యార్థి లారీని ఢీకొని గాయాల పాలయ్యాడు. ఇప్పటికైనా మరమ్మతులకు గురైన లారీని అక్కడ నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (ఇష్టంలేని పెళ్లి.. నవవధువు బలవన్మరణం) -
గురివిందలా మాటలు.. నక్కజిత్తుల ఆటలు
ఓ కొంగ ఓ చెరువు పక్కన ఒంటి కాలిపై జపం చేస్తున్నట్టు నటిస్తోంది. అది చూసిన చెరువులో చేపలు ఎంతో సంతోషించాయి. తమ శత్రువు ఆధ్యాత్మికంగా మారిపోయాడని ... ఇక తమ బతుకులకు ఢోకా ఉండదని భ్రమపడి పైకి వచ్చి స్వేచ్ఛగా విహరించసాగాయి. అంతే తన దగ్గరకు వచ్చిన ఒక్కో చేపను గుటుక్కున మింగి మళ్లీ జపం చేస్తున్నట్టు నటించేది. కొద్ది రోజులకు కుట్రను గమనించిన ఆ చేపలు దేవుడి దగ్గరకు వెళ్లి ‘మమ్మల్నే కాదు... జపం పేరుతో మిమ్మల్ని కూడా మోసం చేసిందని...మమ్మల్ని రక్షించండని ప్రభూ’ అని వేడుకున్నాయి. ఇప్పటికి కళ్లు తెరిచారు కదా...ఇక నుంచి మీకు రక్షే వెళ్లండ’ని దీవించి పంపించాడు దేవుడు. ఆ కథలోలా అప్పటి సీఎం చంద్రబాబు కొంగ జపం చేసి రాష్ట్ర దళితులను వేధించుకు తినడమే కాకుండా తీవ్ర అవమానాలకు గురిచేశాడు. అయితే ఆ అమాయక చేపల్లా ఇక్కడి దళితులు ఎవరినీ వేడుకోలేదు..ఆ కుట్రలను, మోసాలను గమనించారు. పిడికిలి బిగించి వాస్తవాలను గ్రహించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని దాదాపుగా సమాధి చేశారు. అయినా బుద్ధి తెచ్చుకోని ఆ నేతలు ఇంకా కుటిల రాజకీయాలకు తెరదీస్తూనే ఉన్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద గింజ మాదిరిగా మాటలాడుతూ నక్క జిత్తుల రాజకీయాలకు తెరదీస్తున్న టీడీపీ నేతలపై దళిత వర్గ ప్రజలే మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న దళిత ఘటనల్లో స్పందనకు ... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తక్షణ చర్యలకు నక్కకు...నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆ వర్గ నేతలే ఉదాహరణలతో చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్‌లో నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా న్యాయం అందని ద్రాక్షే. బాధితులు న్యాయం కోసం వెళితే అది దక్కకపోగా ఎదురు కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు. అటువంటి పరిస్థితులన్నీ ఈ ఏడాది కాలంలో పూర్తిగా మారిపోయాయి. తప్పు చేసే వారు ఎంతటి వారైనా చివరకు సొంత పార్టీ వారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వదిలి పెట్టడం లేదు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు, వారి తాబేదారులకు కంటగింపుగా మారింది. మునికూడలి ఘటనలో తక్షణ చర్యలు సీతానగరం మండలం మునికూడలిలో ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తికి కాలు విరిగిందని (కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు విజయ్ తనను లారీ ఢీకొట్ట లేదని బైక్ బోల్తా పడి పడిపోయానని, తన పేరు, కులాన్ని అనవసరంగా నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు.) దళిత యువకులు లారీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా కారులో వెళుతున్న మునికూడలి వైఎస్సార్సీపీ నేత కవల కృష్ణమూర్తి ఆ వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా వారు అతని కారు అద్దాలు పగలగొట్టారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం) వారించిన అడపా పుష్కరాన్ని కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఐదుగురు దళిత యువకులపై వారిచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 20న ఒక నిందితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి సిబ్బందితో కలిసి చిత్రహింసలకు గురిచేసి జుత్తు కత్తిరించిన ఘటనపై స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పరిగణించి జారీ చేసిన ఆదేశాలతో ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వరప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. బాధ్యత కలిగిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆస్పత్రిలో ఉన్న బాధితుడు వరప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇవిగో సాక్ష్యాలు.. ►ఏవీ చర్యలు ? చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు ? ►తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డారు. ►2016లో తుని కాపు గర్జన అనంతరం ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ►ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగిన పాపానికి దళితులపై అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. (ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ) బాబు హయాంలో ఎదురు దాడులే కదా... చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కుక్క యజమాని అప్పటి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయానా సోదరుడు జగ్గయ్యనాయుడే. హోం మంత్రి సోదరుడు కావడంతో దళిత సంఘాల ఒత్తిడి నేపథ్యంలో చాలా రోజుల తరువాత కేసు నమోదు చేసినా ఆ దళిత బాలుడు పెంపుడు కుక్క తరమడం వల్లే కాల్వలో పడి చనిపోయాడని ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలో నివాసం ఉండే రాజప్ప కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా మనసు రాలేదు. తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డ ఘటనలు కోకొల్లలు. తాండవ నదిలో యనమల సోదరుల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురిపై అక్రమ కేసులు బనాయించారు. 2016లో తుని కాపు గర్జన అనంతర ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ఆ బాధితుల జాబితాలో ప్రస్తుత ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, కోటనందూరు మండలం భీమవరపుకోట మాజీ సర్పంచి జిగటాల వీరబాబు, బీసీ వర్గానికి చెందిన లగుడు శ్రీను, కొయ్యా శ్రీను, రేలంగి రమణాగౌడ్ ఉండటం గమనార్హం. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగినందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. ఈ వివాదంలో ఆ నియోకవర్గం మొత్తం మీద 400 మంది దళితులపై కేసులు బనాయించారు. రాజకీయ రంగు... సీఎం స్థాయి నుంచి ఎస్పీ వరకూ అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చర్యలు తీసుకున్నారు. ఇంత చేస్తే కేవలం ప్రచారం, రాజకీయ ఉనికి కోసం టీడీపీ తెర వెనుక ఉండి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగుతోంది. దళితులు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారనే దుగ్ధతో వారిని పార్టీకి దూరం చేయాలనే కుట్రలో భాగంగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మునికూడలి ఘటనలో బాధితుడు వరప్రసాద్ టీడీపీ క్రియాశీలక కార్యకర్త. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవల కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నాయకుడు. ప్రభుత్వం పార్టీ పక్షాన నిలిచి ఉంటే కృష్ణమూర్తిపై కేసు నమోదయ్యేదా, ఎస్ఐ ఇతర పోలీసుల సస్పెన్షన్, ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసు నమోదు చేసే వారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిష్పాక్షికత కనిపిస్తున్నా మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి నాయకులు ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేయడాన్ని దళిత మేధావులే గర్హిస్తున్నారు. -
మలుపు తిరిగిన శిరోముండనం ఘటన
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో దళిత యువకుడు ఇండుగుపల్లి ప్రసాద్ శిరోముండనం ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు ఇసుక లారీ ఢీకొట్టడం వల్ల తనకు గాయాలవడంతో వివాదం తలెత్తినట్టుగా ప్రసాద్ చెబుతున్నది వాస్తవం కాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో దళిత యువకుడు కానేటి విజయకుమార్ శనివారం స్పృహలోకి వచ్చి స్పష్టం చేశాడు. ఇంకా అతడు ఏం చెప్పాడంటే.. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) ► ఈ నెల 18 రాత్రి ప్రసాద్, మరికొంతమంది మిత్రులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా బైకు బోల్తా పడి పక్కనే ఉన్న గోతిలో పడింది. దీంతో కాలు విరిగింది తప్ప లారీ ఢీకొని కాలు విరగలేదు. ► లారీ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే గొడవ పడినట్టు ప్రసాద్ చెబుతున్న దానిలో నిజం లేదు. అసలు ప్రసాద్ ఆ సమయంలో అక్కడ లేనే లేడు. ► ఈ ఘటనలో నా పేరును ప్రసాద్, మరికొంత మంది దళిత నాయకులు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ► నిజానికి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త. గత ప్రభుత్వ హయాం నుంచే ఇసుక లారీల వద్ద వసూళ్లకు పాల్పడేవాడు. ఇవ్వని వారితో గొడవ పడుతుండేవాడు. ► 2019, మార్చి 10న మరో ఇద్దరితో కలిసి సీతానగరం పలావ్ సెంటర్ వద్ద పలసపూడి నాగేంద్ర అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో ప్రసాద్‌పై సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో 74/2019, ఐపీసీ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ► ప్రమాదం బారినపడ్డ నన్ను ఏ దళిత నాయకుడూ పరామర్శించలేదు. ► మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా దీన్ని రాజకీయం చేస్తుండటం నాకు బాధ కలిగిస్తోంది. (శిరోముండనం కేసు; కొత్త కోణం) -
లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్‌బాబు
-
శిరోముండనం కేసు; కొత్త కోణం
సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్‌బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు. విజయ్‌బాబు ఏమన్నాడంటే... ‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్‌తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్‌పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్‌కు సంబంధం లేదు’ అని విజయ్‌బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) -
హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి
-
బాధ్యులపై చర్యలు తప్పవు: మంత్రి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: సీతానగరం ఘటన బాధితుడిని మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాదితుడిని బుధవారం రోజున పరామర్శించిన మంత్రి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దళిత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఘటనకు సంబంధించిన బాధ్యులైన వారందరిపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) లైంగికదాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కూడా మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి, ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. (బాలికపై సామూహిక అత్యాచారం) (పీఎస్‌లో యువకుడికి శిరోముండనం) -
నారా లోకేష్‌ను అడ్డుకున్న రైతులు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని సీతానగరంలో టీడీపీ నేత నారా లోకేష్‌ను రైతులు అడ్డుకున్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా తమను మోసం చేసిందని ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం సీతానగరంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన లోకేష్‌ను బాధిత రైతులు నిలదీశారు. టీడీపీ హయాంలో బలవంతంగా తమ భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గో బ్యాక్ అంటూ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్‌కు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన రైతులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో రైతులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నేతల దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. అయితే లోకేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి చిరునవ్వుతో ముందుకు వెళ్లిపోయారు. -
మా బిడ్డను కాపాడండి
సీతానగరం (రాజానగరం) : నవమాసాలు మోసి, కన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని.. బోసి నవ్వులతో.. ఇంట ఆనందాల జల్లులు కురిపించి, మురిపించి, తమ కష్టాలను మరిపించాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ, పుట్టిన ఐదు నెలలకే ప్రాణాంతక వ్యాధి బారిన పడితే వారి కన్నీటికి అంతే ఉండదు. ఇలాగే తల్లడిల్లిపోతున్నారు సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన గోసంగి వీరవెంకట సత్యనారాయణ, కోటీశ్వరి దంపతులు. వారికి ఐదు నెలల కిందట ఓ కుమారుడు పుట్టాడు. మూడు నెలల వరకూ బిడ్డ ఆరోగ్యంగానే ఉండేవాడు. అతడికి తెల్లగా మల విసర్జన అవుతుండడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలో వైద్య పరీక్షలు చేయించగా.. తమ చిన్నారి కాలేయ సంబంధ సమస్యతో బాధ పడుతున్నాడని తెలిసి తీరని వేదనకు గురయ్యారు. బిడ్డను కాపాడుకొనేందుకు చెన్నై ఎగ్మోర్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఆ సందర్భంగా 28 రోజులు అక్కడే ఉన్నారు. ఆ బిడ్డకు కాలేయం దెబ్బ తిందని, దానిని మార్చాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమని అక్కడి వైద్యులు చెప్పారు. కొడుకును కాపాడుకొనేందుకు తన లివర్ ఇవ్వడానికి తండ్రి సత్యనారాయణ ముందుకు వచ్చాడు. సంబంధిత శస్త్రచికిత్స కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లోని గ్లేన్ ఈగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఇందుకు రూ.25 లక్షలు అవుతుందని వారు తెలిపారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక.. ఈ నెల 20న ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన రూ.10 లక్షలూ ఎక్కడి నుంచి తేవాలో తెలీక వారు తల్లడిల్లిపోతున్నారు. కూలి పనికి వెళ్తేనే కానీ పూట గడవని తమకు అంత ఖరీదైన శస్త్రచికిత్స చేయించే స్తోమత లేదని, దాతలు ముందుకు వచ్చి మిగిలిన రూ.10 లక్షలూ సమకూర్చి, తమ కుమారుడికి ఆయుష్షు పోయాలని సత్యనారాయణ, కోటీశ్వరి కోరుతున్నారు. మానవత్వంతో స్పందించేవారు 99 515 46 396 నంబర్లో తమను సంప్రదించాలని వారు కోరారు. -
తొర్రిగడ్డ.. అవినీతికి అడ్డా..
–టీడీపీ అనుయాయులకు కాలువ పనులు –రూ.2.30 కోట్లు కేటాయిస్తే లక్షల్లోనే వ్యయం -మెటల్‌కు బదులు ఎర్రమట్టి వాడకం -సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువగా బెడ్ కాంక్రీట్ సీతానగరం (రాజానగరం) : రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం కాలువ పనులలో నాణ్యతలో తీసికట్టుగా ఉంది. కేటాయించిన నిధులు కోట్లలో ఉంటే ఖర్చు పెట్టినది లక్షలలో మాత్రమే. మిగిలిన సొమ్ము ఏమైందో ఏలిన వారికే ఎరుక. అనుయాయుల స్వలాభం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనులను వారికే కట్టబెట్టడంతో వారు లాభాలు మినహా నాణ్యత గురించి పట్టించుకోవడం లేదు. మరో వారం రోజులలో నీటిని విడుదల చేయవలసి ఉండగా ఇంత వరకూ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అరకొర నిర్మాణంతోనే నీటిని విడుదల చేస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉంది. పురుషోత్తపట్నంలోని తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ పనులకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.2.30 కోట్లతో పనులు ప్రారంభించారు. 2.285 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన కాలువకు రూ 1.40 కోట్లు, కిలోమీటరు పొడవు గల కుడి కాలువకు రూ.70 లక్షలు కేటాయించారు. కాలువలో పూడిక తీసి గ్రావెల్ వేసి, ఆపై బెడ్ కాంక్రీట్ వేయాలి. అయితే కాలువ పనులలో నాణ్యత లేకుండా చేశారు. కాలువలో మట్టి తీసిన అనంతరం గ్రావెల్ వేసి, దానిని వాటరింగ్ చేయాల్సి ఉంది. ఆపై 20 ఎంఎం నుంచి 40 ఎంఎం మెటల్ వేసి బెడ్ కాంక్రీట్ వేసి, దానికి ఇరువైపులా భూమిలోకి వాల్ కట్టవలసి ఉంది. అయితే కాలువ పనులలో ఎర్ర మట్టి వేసి చేతులు దులుపుకొన్నారు. కారు చౌకగా వస్తుందని రామచంద్రపురంలోని కొండ వద్ద నుంచి తెచ్చి వేసిన ఎర్రమట్టి కొద్దిపాటి వర్షానికే బురదగా మారిపోతోంది. బెడ్ కాంక్రీట్ పనులకు ఉపయోగించే సిమెంట్, ఇసుకలో కూడా సరైన విధానం పాటించలేదు. సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువగా వేసి పనులు పూర్తి చేశారు. బెడ్ కాంక్రీట్ వేసిన అనంతరం భూమిలోకి ఇరువైపులా కట్టవలసిన గోడను కట్టకుండానే మమ అనిపించారు. ప్రధాన కాలువ, కుడి కాలువ పనులు పూర్తి చేశామని కాంట్రాక్టర్ చెబుతున్నా, ప్రధాన కాలువలో, అలాగే కుడి కాలువలో కూడా కొన్ని ప్రాంతాలలో పనులు చేయకుండా వదిలేశారు. దీనితో ఖరీఫ్‌కు నీటి విడుదలలో ఆటంకం కలిగే అవకాశం ఉంది. అధికారులుపనులు పూర్తి చేసినట్లుగానే రికార్డులలో చూపి నీటిని విడుదల చేస్తారేమో చూడాల్సిందే మరి! కేటాయింపు కోట్లలో, ఖర్చు లక్షల్లోనే.. కాలువ పనులకు రూ 2.30 కోట్లు కేటాయించినా కాంట్రాక్టర్ పూర్తి చేశామని అంటున్న అరకొర పనులకు అతి తక్కువ ఖర్చు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాలువలో వేసిన బెడ్ కాంక్రీట్‌కు కేవలం రూ.70 లక్షలు అయినట్లుగా సమాచారం. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతుందోనని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండో పంటకు నీరు నిలిపివేత! గత ఏడాది కాలువ పనులను దృష్టిలో ఉంచుకుని, రెండో పంట మొక్కజొన్నకు నీటిని నిలిపివేశారు. దీనితో మొక్కజొన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది కాలువ పనులు చేస్తారని ఆశించిన రైతులకు చుక్కెదురైంది. కాలువలో అరకొర పనులతో సరిపెట్టారు. వచ్చే ఏడాది లైనింగ్ పనులు అంటూ కాలువ నుంచి నీటిని ఆపివేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులనుచూస్తే హడావిడి ఎక్కువ చేతలు తక్కువ అన్న చందాన ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ డీఈ, ఏఈఈల వివరణకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. పనుల్లో అవినీతి.. తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ పనులు నాణ్యతలోపంతో జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. అవినీతి రాజ్యమేలింది. కాలువ పనులకు కోట్లాది రూపాయలు కేటాయించి, లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మమ అనింపిచారు. దీని వలన ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ పనుల వలన ఉపయోగం లేదు. – పెదపాటి రమేష్‌బాబు (డాక్టర్‌బాబు), వైఎస్సార్సీపీ సీతానగరం మండల కన్వీనర్ -
చిట్టిబాబాజీ సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్
సీతానగరం (రాజానగరం) : సుప్రీం కోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ సతీసమేతంగా సోమవారం రాత్రి రఘుదేవపురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీచిట్టిబాబాజీ సంస్థానానికి వచ్చా రు. వారికి రాజమండ్రి 6వ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశ్వరరావు, కోరు కొండ సీఐ మధుసూదనరావు, సీతానగరం ఎస్సై వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. జస్టిస్ చలమేశ్వర్ మంగళవారం సాయంత్రం వరకు సంస్థానంలో ఉంటారని నిర్వాహకులు జగ్గబాబు తెలిపారు. -
సమీకరణమే
రూ. 28 లక్షలు పరిహారం వద్దన్న రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ఎకరానికి రూ. 50 లక్షలు డిమాండ్ అలా అయితేనే... లేకుంటే భూములే ఇవ్వం.. బలవంతంగా తీసుకుంటే ప్రాణత్యాగానికి సిద్ధం విష గుళికలతో బైఠాయింపు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి పంట భూములు ఇచ్చేది లేదంటూ భూ నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రామచంద్రపురం, చినకొండేపూడి, వంగలపూడి, నాగంపల్లి రైతులు నిరసన కార్యక్రమం జరిపారు. వారి వెంట పంటపొలంలో వేసే గుళికల ప్యాకెట్ తెచ్చి బలవంతంగా భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. మా భూములు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని రైతులు ధీమా వ్యక్తం చేశారు. మూడు పంటలు పండే భూములకు కేవలం రూ.28 లక్షలు ముష్టిగా ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. ఎకరానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదీ ఒ¯ŒSటైమ్ సెటిల్మెంట్గా నగదు అందించిన తర్వాతే భూముల్లో పనులు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టులో భూసేకరణ నాలుగేళ్ళ నుంచీ జరుగుతోందని, పట్టిసీమ ఎత్తిపోతల ప«థకం భూ నిర్వాసితులకు ఇంకా పరిహారం అందుకోని రైతులున్నారని వివరించారు. పైప్‌లై¯ŒS పనులు జరగనిచ్చేది లేదని, రైతులను విడగొట్టి, భయపెట్టి సంతకాలు పెట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు రైతులు వినతిపత్రాలను అందించారు. పెద్ద ఎత్తున రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. -
కాశీ విశ్వనాథ్ దంపతులకు ఘనసన్మానం
సీతానగరం (రాజానగరం) : వంద చిత్రాల్లో నటించిన సందర్భంగా దర్శకుడు, సహజ నటుడు యనమందల కాశీ విశ్వనాథ్, హేమలత దంపతులను ఆదివారం రాత్రి వంగలపూడి గ్రామస్తు లు ఘనంగా సన్మానించారు. స్థానిక రామాలయం వద్ద ముసునూరి వీరబాబు ఆధ్వర్యాన, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అధ్యక్షతన ఈ పౌర సన్మాన సభ నిర్వహించారు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 23 మంది హీరోలతో, 350 సినిమాలకు రాసే అదృష్టాన్ని తెలుగు సినీ పరిశ్రమ తనకు కల్పించిందన్నారు. ‘వైశాఖం’ చిత్రంతో ఆరేళ్లలో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న కాశీ విశ్వనాథ్ అభినందనీయుడన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పండగ సందర్భంగా ఈ ప్రాంత నటుడిని సన్మానించడం అభినందనీయమన్నారు. కాశీ విశ్వనాథ్‌లో 1500 చిత్రాల్లో నటించే సత్తా ఉందని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS బైర్రాజు ప్రసాదరాజు, ప్రముఖ సినీ నటి హేమ, దర్శకుడు శ్రీవాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పోలవరం’ వైఎస్సార్ చేపట్టినదే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చేపట్టినది వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నది ముమ్మాటికి నిజమని నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. కాశీ విశ్వనాథ్ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకసారి కలిశానని, వైఎస్సార్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, సస్యశ్యామలం చేయాల్సిందిగా కోరానని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి నీరుకొండ వెంకట రామారావు వంగలపూడిలో జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. చిత్రరంగంలో అందరికీ తలలో నాలుకగా నిలిచే నటుడు కాశీవిశ్వనాథ్ అని కొనియాడారు. అనంతరం ‘ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా’ పాటను ఆలపించి సభికులను ఉర్రూతలూగించారు. అనంతరం కాశీవిశ్వనాథ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవ కమిటీ సభ్యులు వెండి కిరీటంతో సత్కరించారు. -
రామయ్యా.. అదుగోనయ్యా.. పుష్కర వేణీ!
-
ఇసుక అమ్మకాలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు
సీతానగరం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గల్ల గ్రామంలో ఇసుక విక్రయాలను డ్వాక్రా మహిళలు, కూలీలు సోమవారం అడ్డుకున్నారు. గోదావరి నదీ తీరం వద్ద ఇసుక విక్రయాల బాధ్యతను అధికారులు మండల సమాఖ్యకు అప్పగించారు. అయితే గ్రామానికి చెందిన తమకే ఈ పనులు అప్పగించాలని డ్వాక్రా మహిళలు, ఇసుక రేవులో తమకు పనులు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తూ ఇసుక విక్రయాలను అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరికలు
సీతానగరం, న్యూస్‌లైన్: మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో టీటీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలు కుటుంబాలు బుధవారం వైఎస్ఆర్ సీపీలో చేరాయి. ఈ మేరకు పార్టీ నాయకులు హరిగోపాలరావు, పి.నాగభూషణరావు, సర్పంచ్ మర్రాపు శ్రీదేవి, పోల తాతబాబులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న బొబ్బిలి రాజులకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా గుచ్చిమి నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మరిశర్ల సత్యవతమ్మ, అప్పలనాయుడు, లక్షున్నాయుడు, ముసలినాయుడు, ఆనం ద్, అప్పలనాయుడు, శ్రీ ను, కామేశ్వరరావుతో సహా 40 కుటుంబాలు పార్టీలో చేరాయి. అలాగే జోగింపేట నుంచి మాజీ సర్పంచ్ పోల ఈశ్వరనారాయణ, శ్రీనివాసరావులతో సహా 30 కుటుం బాలు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని డీసీసీబీ డెరైక్టర్ బి.చిట్టిరాజు, తెంటు వెంకటప్పలనాయుడు, ధనుంజయ్‌నాయుడులు కోరారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఎన్.రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అంబటి కృష్ణంనాయుడు, పి.వెంకటనాయుడు, సబ్బాన శ్రీనివాసరావు, గోపాల్, సత్యం తదితరులుపాల్గొన్నారు. -
సింగవరంలో దారుణం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఓ భర్త అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికలు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ దాడిలో గాయపడిన వారిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి మృతదేహన్ని కూడా పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.