
సాక్షి, సీతానగరం: అఖండ గోదావరి మధ్యలో ఉండే ములకల్లంక పంచాయతీలో ఓటర్లు కేవలం 667 మంది. వారిలో పురుషులు 335, మహిళలు 332 మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది. గోదావరి వరద సమయంలో ప్రధానమైన రెండు రాజకీయ పార్టీలకు చెందిన రెండు పడవలపై గ్రామస్తులు వెళుతుంటారు. మామూలు సమయంలో గోదావరి పాయలో వేసిన తాత్కాలిక రోడ్డే ఆధారం. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా బొబ్బిల్లంక నుంచి ములకల్లంకకు బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment