
సీతానగరం: మండల కేంద్రంలో సువర్ణముఖి నదీతీరాన వేంచేసిన లక్ష్మీనర్సింహస్వామి కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలంకరణతో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మీనర్సింహ స్వామివారిని కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.
వందలాది మంది భక్తులతో వేకువ జామునుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ స్వామివారికి భక్తులు కానుకగా సమకూర్చిన కరెన్సీ నోట్లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన పుష్పాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment