lakshmi narasimha swamy
-
మత్స్యావతారంలో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి
-
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి
దక్షిణకాశీగా పేరొందిన అంతర్వేది క్షేత్రం మహిమాన్వితమైనది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో విరాజిల్లుతున్న నర్శింహుని క్షేత్రాలలో ఇది పురాణ ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. స్వామివారి కల్యాణంలో భక్త కుటుంబాల వారే కర్తలుగా శుభ కార్యక్రమం జరిపించడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించారు. ఏటా మాఘమాసంçలో శుద్ధ సప్తమి (రథసప్తమి)నుంచి తొమ్మిది రోజులపాటు క్షేత్రంలో లక్ష్మీనరసింహుని దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు కనుల వైకుంఠంగా సాగుతాయి. మాఘమాసం సూర్యభగవానుడికి ప్రీతికరమైంది. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తూ నారాయణ స్వరూపం. కలియుగంలో కనిపించే దేవుడు సూర్యనారాయణుడు. ఈ కారణంగా రథ సప్తమి రోజు నుంచి కళ్యాణోత్సవాలు మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 7వ తేదీ దశమి నాడు రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో జరగనున్నాయి. తరువాత 8వ తేదీ భీష్మ ఏకాదశి నాడు నూతన వధూవరులుగా మూర్తీభవించే శ్రీస్వామి, అమ్మవార్లను రథంపై ఉంచి యాత్ర నిర్వహించనున్నారు.12వ తేదీ మాఘ పౌర్ణమి రోజున వశిష్ఠ నదీ సంగమ ప్రాంతాలలో స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు.భక్తజనమే పెళ్లిపెద్దలుగా...లక్ష్మీ నర్శింహస్వామి ఆలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి ఆయన కళ్యాణంలో పలు కుటుంబాల వారు కర్తలుగా నిలబడి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నరసింహుని కళ్యాణంలో గోదావరికి ఇరువైపుల వారు భాగస్వాములే. ఇటు కోనసీమ వాసులతోపాటు.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఈ కళ్యాణతంతు లో తమ వంతు సేవలందిస్తారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చక్రస్నానం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు వేద పండితుల చేతులు మీదుగా నిర్వహిస్తుండడం దశాబ్ధాల కాలంగా వస్తోంది. కళ్యాణానికి ముందు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, కుమార్తెలు చేసే అవకాశం బెల్లంకొండ, ఉండపల్లి వారి కుటుంబాల వారికి దక్కింది.రథసప్తమి రోజున నిర్వహించే ముద్రికాలంకణలో స్వామికి పంచెను బెల్లంకొండ కుటుంబాల వారు, అమ్మవారికి చీర ఉండపల్లి కుటుంబాల వారు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు రాజులు పెండ్లి కుమారుడి తరుపున నిలబడి కళ్యాణంలో పాల్గొంటారు. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజాబహుద్దర్ కళ్యాణోత్సవాలకు కల్యాణం లో స్వామివారి తరపున నిలబడతారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి కుటుంబానికి చెందిన సుబ్బరాజు ఆధ్వర్యంలో కల్యాణోత్సవానికి తలంబ్రాలను తీసుకువస్తున్నారు. అలాగే శృంగవరపాడుకు చెందిన రావి, యెనుముల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. పల్లకి ముందు భాగంలో రావి కుటుంబానికి చెందివారు... వెనుక భాగంలో యెనుముల కుటుంబాల వారు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకు వస్తారు. ఇలా పలు కుటుంబాల వారు స్వామి వారి కళ్యాణంలో భాగస్వాములు.లక్ష్మీనరసింహుడే ఇక్కడ ఆదిదేవుడుసాధారణంగా పరమేశ్వరుడికే ఆదిదేవుడని పేరు. అయితే కలియుగంలో నర, మృగ అవతారంలో మొట్టమొదటిగా ఉద్భవించిన రూపం లక్ష్మీ నరసింహస్వామి. ఈ కారణంగా పరమశివుడినే కాకుండా లక్ష్మీ నర్శింహ స్వామివారిని కూడా ఆదిదేవునిగా కొలుస్తారు ఇక్కడ.ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు కల్యాణోత్సవాలు 7వ తేదీ రాత్రి 12.55 గంటలకు కళ్యాణ ముహూర్తం స్వామివారి కళ్యాణ తంతులో పలు కుటుంబాల భాగస్వామ్యం మొగల్తూరు రాజ వంశీయులతోపాటు సామాన్య కుటుంబాల వరకు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక– నిమ్మకాయల సతీష్ బాబు, వి.ఎస్.బాపూజీసాక్షి, అమలాపురం, సఖినేటిపల్లిఫోటోలు: గరగ ప్రసాద్ -
అహోబిలేషుడి లడ్డూకు కమీషన్ పోటు
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది. ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు. -
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్‌నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నూతన చైర్మన్‌గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్‌రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు.వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
వైభవంగా సింహ‘గిరి’ ప్రదక్షిణ
సాక్షి, విశాఖపట్నం: మహావిశాఖ నగరం.. భక్తజన సంద్రంగా మారింది. శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహా్ననికి భక్తుల సంఖ్య లక్షలకు చేరింది. సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచా వద్ద మధ్యాహ్నం 2.40 గంటలకు సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ్, నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచార రథయాత్రని ప్రారంభించారు. సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం.. వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఏటా గిరి ప్రదక్షిణ రోజు నగరంలో వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో సింహాద్రి అప్పన్న మహిమ అంటూ.. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాల్లో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని పరిశీలించారు. సముద్రస్నానం చేసే భక్తులకు అప్పూఘర్ వద్ద ఏర్పాట్లు చేశారు. అనేకమంది భక్తులు సముద్రస్నానం ఆచరించి మళ్లీ ప్రదక్షిణ కొనసాగించి.. స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు సీపీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో భక్తులు గిరిప్రదక్షిణ సమయంలోను, స్వామి దర్శన సమయంలోను ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ చర్యలు చేపట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మొత్తం 102 పాయింట్లలో 7.34 లక్షల మందికి మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 31 వైద్య శిబిరాలను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. 20కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించాయి. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ వంతున మొత్తం 16 అంబులెన్స్‌లను ఉంచారు. గిరి ప్రదక్షిణ మార్గములో పలు స్వచ్ఛంద సేవాసంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా తాగునీరు, శీతలపానీయాలు, మజ్జిగ, టీ, బాదంపాలు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశాయి. నేడు ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ అనంతరం సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నని లక్షలాదిమంది దర్శించుకోనున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న క్యూ లైన్లకు అదనంగా క్యూ లైన్లను కొండపైన ఉన్న బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. సోమవారం ఆర్జితసేవల్ని రద్దుచేసిన దేవస్థానం.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతి వేళలుగా నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యాన్నదానం చేయనున్నారు. -
ఘనంగా లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఓటర్లను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలించి ప్రమాణం చేయించడంపై ఎన్నికల కోడ్ ప్రత్యేక బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన సుమారు 700 మందిని యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా 15 ఆర్టీసీ బస్సుల్లో ఆ గ్రామ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు. ఓటర్లను తీసుకొనిపోయి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి, ఆలయంలో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించారని పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఫొటోలు, వీడియోగ్రఫీ సాక్ష్యాల ఆధారంగా టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారానికైన వ్యయాన్ని మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. -
లక్ష్మీనర్సింహస్వామికి కరెన్సీ నోట్లతో అలంకరణ
సీతానగరం: మండల కేంద్రంలో సువర్ణముఖి నదీతీరాన వేంచేసిన లక్ష్మీనర్సింహస్వామి కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలంకరణతో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మీనర్సింహ స్వామివారిని కరెన్సీ నోట్లు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వందలాది మంది భక్తులతో వేకువ జామునుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ స్వామివారికి భక్తులు కానుకగా సమకూర్చిన కరెన్సీ నోట్లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన పుష్పాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించామన్నారు. -
కళ్లారా చూసుకోవద్దా..
సాక్షి, యాదాద్రి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తులకు యాదగిరీశుని కనులారా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉద్ఘాటన అనంతరం యాదాద్రీశుని సంపూర్ణ దర్శనం లభించడం లేదు. తిరుమల తరహాలో బంగారు వాకిలి నుంచే శ్రీ స్వామివారి దర్శనానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత గర్భాలయంలోని స్తంభోద్భవుని దర్శనం కోసం తపిస్తున్న భక్తులు ఇక్కడికి రాగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. గతంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించి దగ్గర నుంచి స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆనవాయితీకి విరుద్ధంగా..: యాదగిరిగుట్టలో స్వయంభూ దర్శనం గర్భాలయంలోనే కల్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్ల నుంచి బాలాలయంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయం తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ పునరుద్ధరణలో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గర్భాలయం ద్వారాలను కూడా వెడల్పు చేశారు. దీంతో మరింత సులువుగా స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉన్నా భక్తులను వాకిలి (గర్భాలయం గడప వద్ద ) నుంచే పంపేస్తున్నారు. భక్తులు ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆనందపడుతున్నా.. స్వామి దర్శనం విషయంలో మాత్రం సంతృప్తి చెందడం లేదు. బుధవారం నుంచి ప్రారంభించిన సువర్ణ పుష్పార్చన ముఖ మండపంలోనే ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు ప్రధానాలయంలోకి వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి మెట్లమార్గాన దిగి దర్శనం అనంతరం పడమర రాజగోపురం వైపు మళ్లీ మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అలాగే క్యూలైన్లలో నిలబడేందుకు వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భగుడిలోకి అనుమతించాలి స్వామివారిని దర్శించుకోవడానికి 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నా. అలాగే కొత్త గుడి కట్టిన తర్వాత దర్శనానికి వచ్చా. కానీ అధికారులు బయటి నుంచే పంపించారు. భక్తులను గర్భాలయంలోకి పంపించి స్వామి నిజ దర్శనం కల్పించాలి. ఈ విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలి. – మహాలక్ష్మి భక్తురాలు, హైదరాబాద్ త్వరలో అనుమతిస్తాం వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బంగారు వాకిలి నుంచే దర్శనం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరలో గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. – గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ ఏఈఓ -
ప్రపంచంలోనే ఎత్తయిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో ఉన్న శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆదివారం వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా ప్రసిద్ధి గాంచింది. 2018 నవంబర్ 24న విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. రూ.2.50 కోట్ల విరాళాలతో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దివంగత పోతరాజు సూరయ్య కుమారులు దానంగా ఇచ్చిన 25 సెంట్ల స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా, 5 రోజుల పాటు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ అలజడి ఎవరి మనోరథం?
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఘటనపై తక్షణం స్పందిస్తూ వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమని, బాధ్యులు ఎవరైనాసరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కొందరు పనిగట్టుకుని దీన్ని రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నినట్లు జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ ఘటన ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సత్వరమే స్పందించిన ప్రభుత్వం – జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అగ్నిమాపక, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని నియమించారు. – విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) నల్లం సూర్య చక్రధరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో యర్రశెట్టి భద్రజీరావును కొత్త ఈవోగా నియమించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ సిబ్బంది, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంది. – రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వేణగోపాలకృష్ణ, పినెపి విశ్వరూప్ రెండవసారి మంగళవారం అంతర్వేది వెళ్లి దర్యాప్తు తీరును సమీక్షించారు. – కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు వెంటనే మంజూరు చేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి ప్రకటించారు. కుట్రకు యత్నిస్తున్న అసాంఘిక శక్తులు – ఈ ఘటనలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని కుట్రలు పన్నుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బయట నుంచి అసాంఘిక శక్తులను అంతర్వేదిలోకి పంపించి మరీ ఉద్రిక్తతలను సృష్టించడానికి యత్నించడం వారి కుట్రను తేటతెల్లం చేస్తోంది. – ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నేతలు ముగ్గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆలయాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం గమనార్హం. – ఆ మర్నాడే కొందరు అసాంఘిక శక్తులు అంతర్వేదిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు మంగళవారం నానా రభస చేయడమే కాకుండా దాడులకు తెగించడం గమనార్హం. విజయవాడ నుంచి వచ్చిన కొందరు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. – వారు ఏకంగా అంతర్వేదిలో ఓ ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడం ఆందోళనకరంగా మారింది. ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికే ఇంతకు తెగించారన్నది స్పష్టమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో వర్గ ఘర్షణలను రేకెత్తించడానికి రాజకీయ శక్తులు పకడ్బందీగా పన్నాగం పన్నుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రప్రాధాన్యం – ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనపు పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది. – రాళ్లు రువ్వి అంతర్వేదిలో అలజడులు సృష్టించేందుకు యత్నించిన దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 30ని విధించారు. బయట వ్యక్తులు ఎవరూ అంతర్వేదిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. – అదనపు డీజీ(శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ అంతర్వేదిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మంగళవారం రాత్రి విజయవాడ వచ్చి డీజీపీ గౌతం సవాంగ్‌కు పరిస్థితిని వివరించారు. – ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావును అంతర్వేదిలో క్యాంప్ చేయాల్సిందిగా డీజీపీ సవాంగ్ ఆదేశించారు. ప్రస్తుతం అంతర్వేదిలో పరిస్థితి అంతా అదుపులో ఉంది. ఎంతటివారినైనా ఉపేక్షించం అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. – గౌతం సవాంగ్, డీజీపీ -
గోల్డెన్ టెంపుల్ తరహాలో యాదాద్రి ఆలయం
-
సింహాచలంలో శ్రీవరహలక్ష్మీనృసింహస్వామి నౌకావిహారం
-
దేవుని గడపలో బ్రహ్మోత్సవాలు
వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవుడి గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 22న ఉదయం ముత్యాల పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం నిర్వహిస్తారు. 24న రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం ఉంటాయి. 25న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం, 26న వసంతోత్సవం, అనంతరం చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం ఉంటాయి. 27న రాత్రి 7 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయ నిర్మాతలైన రాయల వంశీకులు తవ్వించిన పుష్కరిణి గనుక ఇందులో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు, దేవుని కడప క్షేత్రానికి హైదరాబాదు, బెంగుళూరు, మద్రాసు, తిరుపతిల నుంచి నేరుగా రైలు, బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు నుంచి 420 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది. – పంతుల పవన్ కుమార్ -
కదిరిలో ఘనంగా లక్ష్మీ నారసింహడి రథోత్సవం
-
యాదాద్రిలో అడ్వాన్సు బుకింగ్
తిరుమల తరహాలో సాఫ్ట్వేర్ రూపొందించనున్న వైటీడీఏ ► వ్యర్థ జలాల శుద్ధికి భారీ ప్లాంట్ ►సీఎం సూచనలతో ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: అడుగడుగునా ఆధ్యాత్మిక భావన కలిగించే నిర్మాణాలు, ఆధునిక హంగుల మేళవింపుతో దేశంలోనే గొప్ప క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకోనుంది. భవిష్యత్తులో తిరుమల తరహాలో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దర్శనం విషయంలో ఎవరూ నిరాశ చెందకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా తిరుమల వెంకన్న దర్శన సమయాన్ని కొన్ని రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్న తరహాలోనే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దర్శనానికీ అడ్వాన్స బుకింగ్స వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. తిరుమలలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి తదనుగుణంగా సాఫ్ట్వేర్ రూపొందించాలని నిర్ణరుుంచారు. అలాగే ఆలయానికి దిగువన 40 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించొద్దని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ కొన్ని నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ ప్రాంతంలో వీఐపీల కార్ల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెల్లార్ స్థలం ఖాళీగా ఉంటున్నందున అందులో 2 వేల కార్లు పార్క్ చేయగలిగేలా మల్టీలెవల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి దేవాలయానికి చేరుకోవటానికి ప్రత్యేకంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తారు. దిగువన మరో 35 ఎకరాల స్థలాన్ని బస్ డిపో, పోలీసు, ఫైర్స్టేషన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టుల కోసం కేటాయించారు. ఆలయానికి చేరువలో పూలతోట కోసం 25 ఎకరాలు కేటాయించారు. కల్యాణమండపం, ప్రవచన వేదికలు, భారీ సంఖ్యలో భక్తులు కూర్చోవటానికి ఏర్పాట్లు కోసం 50 ఎకరాలు కేటాయించారు. గుట్టపై నుంచి దిగువకు వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసి వెలుపలికి పంపేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భారీ నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. భక్తుల వసతి కోసం 100 చొప్పున నాన్ఏసీ, ఏసీ, ఉచిత గదులను, భారీ డార్మిటరీని నిర్మించనున్నారు. కాటేజీల నిర్మాణం కోసం దాతలు ముందుకొస్తున్నందున ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. మరోవైపు యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన నేపథ్యంలో భారీ విగ్రహాల తయారీలో ప్రసిద్ధి చెందిన చైనాలో అధికారులు పర్యటించి అక్కడి విగ్రహాల ఏర్పాటును పరిశీలించనున్నారు. -
అంతర్వేదికి పోటెత్తిన భక్తులు
తూర్పు గోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు 3 లక్షల మంది సముద్ర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాల్లో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే శ్రీ లక్ష్మి నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. యాదాద్రి కొండపై సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. వ్రత టికెట్ల కోసం భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. -
తిరుకల్యాణ మహోత్సవం
-
తిరుకల్యాణ మహోత్సవం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున యాదగిరి నర సింహస్వామి, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లను హనుమంత వాహనసేవపై ఆలయ తిరువీధులలో బాజా భజంత్రీలు, ఆలయ అర్చకుల వేదమంత్రాల నడుమ ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవార్లను పెళ్లికూతురు, పెళ్లికుమారుడిగా ముస్తా బు చేసి పలు పుష్పాలతో అలంకరించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ దంపతులు.. దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను, సీఎం సమర్పించిన పట్టువస్త్రాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అర్చకులు, వేద పండితులు, రుత్వికుల వేద పఠనంతో, వేద మంత్రోచ్ఛరణల మధ్య రాత్రి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టారు. యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణచేసి తలంబ్రాలను పోయించారు. కల్యాణంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గుట్ట అభివృద్ధి మండలి ప్రత్యేక అధికారి కిషన్‌రావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు దంపతులు పాల్గొన్నారు. -
అప్పన్నను దర్శించుకున్న జగన్
సింహాచలం: వైఎస్సార్ సిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ద ర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధ్వజస్తభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మోహన్రెడ్డి ఆల యంలో ఉన్న కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షి ణ చేశారు. అంతరాలయంలో జగన్మోహన్రెడ్డి పేరిట అర్చకులు అష్టోత్తరం పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆలయ ఆస్థానమండపంలో నాలుగు వేదాలతో ఆశీర్వచనం అందజేశారు. స్వామి ప్రసాదాన్ని ఈవో అందజేశారు. కచ్చితంగా భూములను క్రమబద్ధీకరించాలి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను కచ్చితంగా క్రమబద్ధీకరించాలని, వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి క్రమబద్ధీకరించేవాళ్లమని జగన్మోహన్రెడ్డి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం మధ్యాహ్నం దర్శించుకునేందుకు వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నానన్నారు. దేవస్థానం భూములను కచ్చితంగా క్రమబద్ధీకరించాలన్నారు. సింహాచలంలో ఘన స్వాగతం సింహాచలం వచ్చిన జగన్‌కి ఘన స్వాగతం లభించింది. సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం రాజగోపురం దిగిన జగన్ వద్దకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు తరలివచ్చారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా జగనన్నా అంటూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కరచాలనం చేశారు. భక్తులు, అభిమానుల తాకిడితో జగన్ పావుగంటసేపు రాజగోపురం వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. గోశాల లేఅవుట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, భీమిలి వైఎస్సార్ సిపి సమన్వయకర్త కర్రి సీతారాం ఇంటిని సందర్శించారు. ఈ సంధర్బంగా కర్రి సీతారాం సతీమణి కర్రి పైడిరాజు, కుటుంబసభ్యులు జగన్‌ని హారతులతో స్వాగతం పలికా రు. సీతారాం ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. -
సికింద్లాపూర్ జాతరకు తరలివచ్చిన భక్తజనం
శివ్వంపేట, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనృసింహస్వామి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా ధనుర్మాసంలో మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదట పవిత్ర కోనేరులో స్నానం ఆచరించి కోనేరు పక్కన ఉన్న లక్ష్మీనృసింహస్వామితోపాటు గుట్టపై కొలువైన లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దంపతులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. పరిసరాల్లోనే గుడారాలు వేసుకున్న భక్తులు సాయంత్రం వరకు అక్కడే గడిపారు. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. -
వైభవంగా నృసింహుని పెళ్లి కుమారుడి ఉత్సవం
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి పెళ్లి కుమారుడి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అఖిలలోక పవిత్ర గోత్రజుడైన స్వామి అందరికీ పవిత్రత కలుగజేసేందుకు పెళ్లికుమారుడిగా దర్శనమిచ్చారు. మంగళాద్రి నారసింహుని బ్రహ్మోత్సవాలు పెళ్లి కుమారుని ఉత్సవంతో ప్రారంభం కావడం ఆనవాయితీ. ఉదయాన్నే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించి అర్చక స్వాములు స్వామి వార్లను పెళ్లి కుమారునిగా, అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించారు. పెళ్లికుమారుడైన స్వామివారిని కనులారా తిలకిం చేందుకు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి పెళ్లి కుమారుని గ్రామోత్సవం ఘనంగా జరిగిం ది. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆయా కూడళ్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని టెంకాయ లు కొట్టి, హారతులిచ్చారు. నృసిం హుని పెళ్లి కుమారుని ఉత్సవాన్ని తిలకిస్తే నిత్యశుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ప్రతి నిధులు కైంకర్యపరులుగా వ్యవహరించగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. తాడేపల్లికి చెందిన శ్రీరామ యజ భజన మండలి ఆధ్వర్యంలో కోలాటం, శ్రీ అభయాంజనేయస్వామి భజన సమాజం, మంగళగిరి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, పట్టణానికి చెందిన పి.దుర్గాభవాని అన్నమాచార్య సంకీర్తనలు, సాయిసుధ భక్తి సుధ భక్తి రంజని కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు ధ్వజారోహణం... బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి తొమ్మిది గంటలకు స్వామి వారి ధ్వజారోహణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
వైభవంగా అంతర్వేది లక్షినరసింహ కళ్యాణం
-
మాస్టర్‌ప్లాన్‌తో గుట్ట ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు
భువనగిరి/యాదగిరికొండ, న్యూస్‌లైన్ ఎంతో ప్రశస్తమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య ఏరోజు కారోజు పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా సౌకర్యాలు మాత్రం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తున్నది. ఇక వచ్చే 30 ఏళ్లలో ఈ ఆలయానికి భక్తుల రాక మరింత పెరగనుంది. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినన్ని సౌకర్యాలు కల్పించేందుకుగాను మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఆ శాఖ ముఖ్యసమావేశంలో దీనిపై చర్చించారు. యాదగిరిగుట్ట దేవస్థానం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఏటా *50కోట్ల రాబడి గల ఈ క్షేత్రం.. విశేషదినాలు, వారాంతపు రోజుల్లో వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే ఇక్కడ సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శని,ఆదివారాల్లో 50 వేల నుంచి 80వేల మంది భక్తులు వస్తారంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సామాన్య భక్తులకు పెద్దగా వసతులు లేవు. ధర్మదర్శనం నుంచి, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనం కోసం ఒక భక్తుడు క్యూలైన్లోకి వెళ్లి బయటికి రావడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమ యం పడుతుంది. అంతే కాకుండా అద్దె గదులు, మంచినీరు, ప్రసాదాలు, రవాణా, పార్కింగ్ వంటి విషయాల్లో నిత్యం అవస్థలే ఎదురవుతున్నాయి. 2003-04లో ఒకసారి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇందులో శాఖా పరమైన అనుమతుల్లో ఇబ్బందులు, నిధుల కొరత మా స్టర్‌ప్లాన్ అమలుకు అడ్డంకిగా మారాయి. దేవస్థానం ఈఓలు మారినపుడల్లా ఆలయంలో అభివృద్ధికార్యక్రమాల ప్రాధాన్యతలు మారుతున్నాయే కానీ భక్తుల ఇబ్బందులు తీరడం లేదన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 30 ఏళ్లలో పెరిగే భక్తుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఇటీవల నిర్వహించిన దేవాదాయశాఖ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఈ అంశాలపైనే.. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ ఆధ్యాత్మిక భావన, సంస్కృతి సంప్రదాయాలకు, భక్తుల మనోభావాలు, స్థల పురాణం వంటి అంశాలకు పెద్ద పీట వేస్తూ పుణ్య క్షేత్రంలో వసతులు కల్పించాలన్నదే మాస్టర్‌ప్లాన్ ప్రధాన ధ్యేయం ఇవీ.. నిర్మించనున్నవి ఆలయం చుట్టూ తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర నాలుగు దిక్కుల్లో 4 ద్వారాలు ఏర్పాటుచేసి వీటికి మహా రాజగోపురాలు నిర్మిస్తారు. సుమారు వెయ్యి మంది భక్తులు సేద తీరడానికి , నిద్రించడానికి వీలుగా విశాలమైన డార్మెటరీ హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. భక్తుల కోసం 41 గదులు నిర్మిస్తారు. సుమారు వెయ్యి వాహనాలు పట్టే విశాలమైన పార్కింగ్ రూపొందించనున్నారు. ఆలయానికి ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఇంటి ప్రక్కన గల దుకాణాల సముదాయాన్ని తొలగించి ఆక్కడి నుంచి సంగీత భవనం, ఆండాళ్ నిలయం వెనక వైపు నుంచి విశాలమైన ప్రహరీని నిర్మించనున్నారు. వీఐపీలకు 100, సామాన్య భక్తులకు 50 చొప్పున చెల్లించి ఉండేందుకు వీలుగా అద్దె గదులు నిర్మిస్తారు. అలాగే ఉచితంగా ఉండేలా మరికొన్నింటిని రూపొందిస్తారు. ఇందులో భక్తులు నిద్రించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం చుట్టూ మంచి లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌తో రానున్న మరో 30 సంవత్సరాల వరకు ఆలయ రోడ్లు, డ్రెయినేజీ, మంచినీరు, విద్యుత్ సరఫరా, వాటి నిర్వహణ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. ఎంతటి దూరం నుంచైనా చూస్తే ఆలయం కనిపిం చేలా ఆలయ పరసరాలను నిర్మాణం చేయనున్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే విద్యుత్ సమస్యను తీర్చడానికి సోలార్ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నెడ్‌క్యాప్ సహకార ంతో ఏర్పాటు చేసే గ్రిడ్ నుంచి సగం విద్యుత్ దేవస్థానానికి, సగం విద్యుత్‌ను బయట విక్రయించడానికి నిర్ణయించుకున్నారు. భక్తులరాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు రెండో ఘాట్ రోడ్డు పూర్తి చేయనున్నారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కొండపైన, కొండ కి ంది భాగంలో వసతుల కల్పనకు చర్యలుతీసుకోనున్నారు. మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నాం, : క్రిష్ణవేణి , ఈఓ యాదగిరిగుట్ట దేవస్థానం 30 సంవత్సరాల్లో పెరిగే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన రాఘవ ఆర్కిటెక్చర్ వారు ఈనెల 29 న ఈ దేవస్థానం మాస్టర్ ప్లాన్‌ను అప్పగిస్తారు. మరో 5 సంవత్సరాల తర్వాత ఈ ఆలయం రూపు రేఖలు మారిపోతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలతో ప్లాన్‌ను రూపొందిస్తున్నాం. భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట : బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే ఆలేరు భక్తులకు వసతులు కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండవ ఘాట్ రోడ్డు టెండర్ ప్రక్రియలో ఉంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. మాస్టర్ ప్లాన్‌తో గుట్ట రూపు రేఖలు మారిపోతాయి.