సికింద్లాపూర్ జాతరకు తరలివచ్చిన భక్తజనం | many Devotees attend Sikindlapur fair | Sakshi
Sakshi News home page

సికింద్లాపూర్ జాతరకు తరలివచ్చిన భక్తజనం

Published Mon, Mar 17 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

సికింద్లాపూర్ జాతరకు తరలివచ్చిన భక్తజనం

సికింద్లాపూర్ జాతరకు తరలివచ్చిన భక్తజనం

 శివ్వంపేట, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనృసింహస్వామి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా ధనుర్మాసంలో మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
 
  మొదట పవిత్ర కోనేరులో స్నానం ఆచరించి కోనేరు పక్కన ఉన్న లక్ష్మీనృసింహస్వామితోపాటు గుట్టపై కొలువైన లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దంపతులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. పరిసరాల్లోనే గుడారాలు వేసుకున్న భక్తులు సాయంత్రం వరకు అక్కడే గడిపారు. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement