![TRS MLA takes 700 villagers to Yadadri for special darshan - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/22/ec.jpg.webp?itok=T88jQg6c)
సాక్షి, యాదాద్రి: ఓటర్లను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలించి ప్రమాణం చేయించడంపై ఎన్నికల కోడ్ ప్రత్యేక బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన సుమారు 700 మందిని యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా 15 ఆర్టీసీ బస్సుల్లో ఆ గ్రామ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు.
ఓటర్లను తీసుకొనిపోయి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి, ఆలయంలో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించారని పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఫొటోలు, వీడియోగ్రఫీ సాక్ష్యాల ఆధారంగా టీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారానికైన వ్యయాన్ని మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment