
మాగల్లు గ్రామంలో ప్రతిష్టించిన 108 అడుగుల భారీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం
కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో ఉన్న శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆదివారం వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా ప్రసిద్ధి గాంచింది. 2018 నవంబర్ 24న విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో ఉన్న శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆదివారం వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా ప్రసిద్ధి గాంచింది. 2018 నవంబర్ 24న విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. రూ.2.50 కోట్ల విరాళాలతో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
దివంగత పోతరాజు సూరయ్య కుమారులు దానంగా ఇచ్చిన 25 సెంట్ల స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా, 5 రోజుల పాటు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.