సరుకుల సరఫరా కాంట్రాక్టర్‌ను మామూళ్లడిగిన టీడీపీ నేత
ఇవ్వలేనని చెప్పడంతో కాంట్రాక్ట్ బంద్ చేయించిన వైనం
వారం రోజులుగా ప్రసాదం కౌంటర్లు మూత
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది.
ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు.
ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment