యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే శ్రీ లక్ష్మి నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. యాదాద్రి కొండపై సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. వ్రత టికెట్ల కోసం భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.