
వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవుడి గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 22న ఉదయం ముత్యాల పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం నిర్వహిస్తారు. 24న రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం ఉంటాయి. 25న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం, 26న వసంతోత్సవం, అనంతరం చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం ఉంటాయి.
27న రాత్రి 7 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయ నిర్మాతలైన రాయల వంశీకులు తవ్వించిన పుష్కరిణి గనుక ఇందులో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు, దేవుని కడప క్షేత్రానికి హైదరాబాదు, బెంగుళూరు, మద్రాసు, తిరుపతిల నుంచి నేరుగా రైలు, బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు నుంచి 420 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది.
– పంతుల పవన్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment