pavan kumar
-
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ
టైటిల్: యావరేజ్ స్టూడెంట్ నానినటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLPనిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరిసంగీతం: కార్తీక్ బి కొడకండ్లసినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024‘యావరేజ్ స్టూడెంట్ నాని’ కథేంటంటే..నాని(పవన్ కుమార్) ఓ యావరేజ్ స్టూడెంట్. అమ్మనాన్నలు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా.. అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అక్క(వివియా సంపత్) సహాయంతో మంచి ర్యాంక్ రాకపోయినా బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల సారా అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. నాని ఈ బాధలో ఉండగానే..కోమాలో ఉన్న తన అక్క తనకోసం చేసిన త్యాగం గురించి తెలుస్తుంది. తనవల్ల ఎవరికి ఉపయోగం లేదని భావించిన నాని.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? నానిని ప్రాణంగా ప్రేమించిన సారా..మరో వ్యక్తితో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది? నాని-సారాల లవ్‌స్టోరీ గురించి తెలిసిన తర్వాత కూడా అను నానితో ఎలా ప్రేమలో పడింది? యావరేజ్ స్టూడెంట్ అయినా నాని.. చివరకు అందరితో శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఎలా సంపాదించగలిగాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. హీరో యావరేజ్ స్టూడెంట్. అల్లరి చిల్లరగా తిరుగుతూ..చివరకు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటాడు.. ఇలాంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యావరేజ్ స్టూడెంట్ నాని కథ కూడా ఇదే. అయితే యూత్‌కి ఆకట్టుకునే విధంగా బోల్డ్, గ్లామర్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కొత్తూరి. దర్శకుడు రాసుకున్న పాయింట్ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం రొమాంటిక్ సీన్లతో కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫాదర్-సన్ రిలేషన్, సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా.. బోల్డ్ సీన్ల కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. అయితే యూత్ మాత్రం కొన్ని సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ అంతా నాని కాలేజీ లైఫ్.. సారాతో ప్రేమాయణంతో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సెకండాఫ్‌లో కాలేజీ సీన్లు బోర్ కొటించినా.. పాదర్-సన్ సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరిలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే పాట ఈళలు వేయిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథనం బోల్డ్‌గా సాగినా.. అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపించినా..యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ-నిర్మాణ బాధ్యతలు కూడా పవన్ కుమారే తీసుకున్నాడు. తను రాసుకున్నదే కాబట్టి నాని పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగా పండించాడు. ఎమోషన్ సీన్లలో చక్కగా నటించాడు. హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియల నటనకు పెద్దగా స్కోప్ లేదు కానీ..తెరపై అందంగా కనిపించ్ ఎంటర్టైన్ చేశారు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. చివర్లో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే మాస్ సాంగ్‌తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
Average Student Nani: ఆకట్టుకుంటున్న టీజర్
పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. . శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్ యూత్ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ టీజర్లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. -
'యావరేజ్ స్టూడెంట్ నాని' మోషన్ పోస్టర్ రిలీజ్
దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అందుకొంటున్నారు. 'మెరిసే మెరిసే' మూవీతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఇతడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. 'యావరేజ్ స్టూడెంట్ నాని' అనే చిత్రంతో హీరో, దర్శకుడు, నిర్మాతగా పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)యూత్‌ఫుల్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తుంటే, హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్లు హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతమందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్) View this post on Instagram A post shared by Sri Neelakanta Mahadeva Entertainments LLP (@snmmovies) -
మట్టిలో మాణిక్యాలకు జగన్ వల్లే వెలుగు
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక ఎందరో క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర మంతా భారీఎత్తున నిర్వహించారు. ఎందరో క్రీడాకారులు ముందుకెళ్లడానికి ఇది దారిచూపింది. అలా వెలుగులోకి వచి్చన వారిలో ఆనంద్‌పాల్ అలియాస్ పవన్ ఒకరు. విజయనగరం జిల్లా జామి మండలంలోని మారుమూల గ్రామం అలమండకు చెందిన ఈ కుర్రాడు ధోనీ సారధ్యంలోని ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని వచ్చిన అనంతరం పవన్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. – సత్యార్థ్ సెమీ ఫైనల్స్‌లో ఓడినా.. అన్ని చోట్లా మా టీమ్ గెలుపొందింది. చివరకు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లు వీక్షించడానికి వచి్చన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ నన్ను దత్తత తీసుకుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక అద్భుతం అనుకుంటే.. ఏకంగా సీఎస్కే టీమ్ ట్రైనింగ్‌కు ఎంపికవడం.. శిక్షణ అనంతరం నాకెంతో ఇష్టమైన క్రికెటర్ ధోని ఆధ్వర్యంలోని టీమ్‌లో సభ్యుడిగా ఆడే అవకాశం నాకు దక్కవచ్చని తెలిసి పొంగిపోయాను. ఈ అవకాశం సది్వనియోగం చేసుకుని క్రికెటర్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేనులో ఆట నుంచి ‘చెన్నై’ దాకా... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. పొలాలమ్మట, గల్లీల్లో ఆడుతూ ఉండేవాడిని. ‘చదువుకుని ఉద్యోగం చేసుకోక క్రికెట్ అంటూ తిరుగుతున్నావ్ ఏంట్రా’.. అంటూ అమ్మ కోప్పడుతూ ఉండేది. ఫ్రెండ్స్ మాత్రం క్రికెట్ బాగా ఆడతానని పొగుడుతుండేవారు. అడపాదడపా గ్రామాల్లో జరిగే మ్యాచ్‌లలో ఆడి స్వల్ప పారితోషకాలు అందుకోవడం తప్ప ఆటకు ఎలా సానబెట్టుకోవాలో నాకు తెలియలేదు. అదే సమయంలో దేవుడిచి్చన వరంలా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మా గ్రామ సచివాలయం ద్వారా ఆ కార్యక్రమానికి ఎంపికయ్యాను. థాంక్స్ టూ జగన్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాను. థాంక్స్ టూ జగన్ సార్.. ఆయనెప్పుడూ పేదల పక్షానే ఉంటూ.. ఎన్నో మంచి పథకాలు అమలుచేస్తున్నారు. క్రీడల విషయంలోనూ పేదలకు మేలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారు. గల్లీల్లో ఆడుకునే నాలాంటి వాడు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. మరోసారి ఆయనే సీఎం కావాలని.. ఆడుదాం ఆంధ్రాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. -
తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్ల విషాదం!
వరంగల్, మహబూబాబాద్: తాత సంవత్సరీకానికి వచ్చిన ఇ ద్దరు మనుమళ్లు వాగులో స్నానానికి వెళ్లి ప్ర మాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రా మంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల రాజీరు ఏడాది క్రితం చనిపోయాడు. శుక్రవారం సంవత్సరీకం (ఏడాది మాశికం). దీంతో అతని మనుమళ్లు తాటిపాముల పవన్(25), సిరిమల్లె శ్రీకాంత్ (17) (బావబామ్మర్దులు)లు వేములపల్లికి వచ్చారు. గ్రామంలోని పెద్దవాగులో స్నానానికి ఇద్దరు వెళ్లారు. వాగులో భారీ గుంతలు ఉండడం.. లోతు తెలియక దిగిన వారు ఈత రాకపోవడంతో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. చిట్యాల సీఐ వేణు చందర్, ఎస్సై జాడి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్లు వాగులో పడి చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఇవి చదవండి: అన్నీ సంచలనాలే.. ‘టీఎస్పీఎస్సీ’ కేసుతో కరీంనగర్‌కు లింకు! -
సిమెంట్ ఇటుక, చేతికడెంతో అతనిపై కిరాతకంగా..
కరీంనగర్: మద్యం మత్తులో మాటమాట పెరిగి యువకుడి మర్డర్‌కు దారితీసిందని టౌన్ ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ రాంనగర్‌లోని ఓ వైన్స్ పర్మిట్‌రూంలో బుధవారం రాత్రి జరిగిన హత్యకేసులో టూటౌన్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హత్యకు సంబంధించిన వివరాలు గురువారం టౌన్ ఏసీపీ నరేందర్ టూటౌన్ సీఐ రామచందర్‌రావుతో కలిసి టూటౌన్లో వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం ఎలగందుల్ గ్రామానికి చెందిన చేపూరి పవన్(36) వెల్డింగ్ పనులు చేస్తూ రాంనగర్‌లోని చేపలమార్కెట్ సమీపంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని బుధవారం రాత్రి రాంనగర్‌లోని వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్‌రూంలో మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన కామెర అరుణ్(20), ఎండీ.ఆఫ్రిద్(21)తో గొడవ జరిగింది. మాటమాట పెరగడంతో అరుణ్, ఆఫ్రిదిలు తమ స్నేహితులైన బచ్చల ప్రణయ్‌కుమార్(20), కల్వల పృథ్వీ(20), గాజుల ప్రేంకుమార్(21), విజయ్, లోకేష్‌ను అక్కడికి పిలిపించారు. వారందరూ కలిసి పవన్‌పై సిమెంట్ ఇటుక, చేతికడెంతో దాడిచేశారు. పర్మిట్రూం సిబ్బంది, పవన్‌తో వచ్చినవారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్ మృతిచెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. గురువారం అరుణ్, ఆఫ్రిది, బచ్చల ప్రణయ్‌కుమార్, కల్వల పృథ్వీ, గాజుల ప్రేంకుమార్‌ను అరెస్టు చేశారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. యువత మద్యంమత్తులో నేరాలకు పాల్పడుతున్నారని, పర్మిట్రూముల నిర్వాహకులు నిబంధనలు పాటించి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, చిన్న గొడవ జరిగినా.. పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు. -
ఎం జి కామెట్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అనువైన ధరలో
-
ఆప్టిమ్హైర్లో నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగానికి నియామక సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ ఆప్టిమ్‌హైర్ ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను 300లకు చేర్చనుంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది సిబ్బంది ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీకి 120కి పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మంది అభ్యర్థుల ముందస్తు ఇంటర్వ్యూలు పూర్తి చేశామని ఆప్టిమ్‌హైర్ ఫౌండర్, సీఈవో లక్ష్మి ఎం కొడాలి తెలిపారు. కో–ఫౌండర్ సీహెచ్.పవన్ కుమార్ రావు, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అశుతోష్ వ్యాస్‌తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగి నియామకానికి కంపెనీలకు ఆరు నెలల దాకా సమయం పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సాయంతో ఈ సమయాన్ని 12 రోజులకు కుదించగలిగాం. రెండు, మూడు ఇంటర్వ్యూ దశలను తగ్గించేలా అభ్యర్థులను వడపోస్తాం. మా వేదిక ద్వారా 5,700 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరి గరిష్ట వేతనం భారత్‌లో రూ.80 లక్షలు, యూఎస్‌లో రూ.3 కోట్ల వరకు ఉంది. రెఫరల్ పార్ట్నర్స్ 2,000 మంది ఉన్నారు. అభ్యర్థులను రెఫర్ చేయడం ద్వారా వీరు నెలకు రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు’ అని వివరించారు. -
పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య
సాక్షి, జగిత్యాల/మల్యాల (చొప్పదండి): హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాచర్ల పవన్ కుమార్‌ను పథకం ప్రకారం అతని బంధువులే హత్య చేశారని మల్యాల సీఐ కిశోర్ తెలిపారు. కుటుంబ కలహాలు, మంత్రాల నెపంతోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి పవన్ కుమార్ (38)పై సోమవారం రాత్రి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన విషయం విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్‌కు అక్కడ వివాహేతర సంబంధం ఉందని భార్య కృష్ణవేణికి అనుమానం రావడంతో ఇరువురి మధ్య స్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయం కృష్ణవేణి తన సోదరులు రాపర్తి విజయ్‌బాబా, రాపర్తి జగన్, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పవన్‌తో గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన పవన్.. బావమరిది జగన్‌ను నెలరోజుల్లో చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో జగన్ ఈ నెల 12వ తేదీన గుండెపోటుతో మరణించాడు. (చదవండి : మంత్రాల నెపంతో సజీవదహనం) అయితే.. పవన్ మంత్రాలు చేయడం వల్లే తన భర్త మృతి చెందాడని భావించిన జగన్ భార్య సుమలత.. పవన్ కుమార్‌ను హత్య చేయాలని పథకం వేసింది. రాపర్తి విజయ్, భార్య భవాని, తల్లి ప్రమీల, పవన్ కుమార్ భార్య కృష్ణవేణి, అక్క రాందేని స్వరూపతో కలసి ప్రణాళిక రూపొందించింది. కాగా, జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బల్వంతాపూర్‌కు చేరుకున్నాడు. జగన్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని పవన్ కుమార్‌ను పథకం ప్రకారం గదిలోకి పంపి డోర్ వేశారు. అప్పటికే తెచ్చుకున్న 20 లీటర్ల పెట్రోల్‌ను కిటికీలో నుంచి అతనిపై పోసి నిప్పంటించడంతో సజీవ దహనం అయ్యాడు. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు) ఏడుగురి రిమాండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి నట్లు మల్యాల సీఐ కిశోర్, ఎస్సై నాగరాజు మంగళవారం తెలిపారు. మృతుడు జగన్ భార్య సుమలత, రాపర్తి విజయ్, భార్య భవాని, తల్లి ప్రమీల, పవన్ కుమార్ భార్య కృష్ణవేణి, అక్క రాందేని, కొండగట్టుకు చెందిన ఉప్పు నిరంజన్లను రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు. మరో బావమరిదితోనూ వివాదం ప్రముఖ క్షేత్రం కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ శివారులో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాపర్తి విజయ్‌బాబా 12 ఏళ్ల క్రితం మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇక్కడ మంజునాథ సహస్త్ర శివాలయాన్ని నిర్మించి, అక్కడే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. కొన్ని నెలలుగా విజయ్‌బాబాకు బావ పవన్‌తో వివాదం నడుస్తోంది. కాగా మంగళవారం ఘటనాస్థలాన్ని ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు. ఇదిలాఉండగా.. తన కొడుకు పవన్ కుమార్‌ను పథకం ప్రకారమే హత్య చేశారని మృతుడి తండ్రి గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు వారి ఉరిశిక్ష అమలుపై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ఇద్దరు తమ శిక్ష అమలుపై స్టే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈనెల 3వ తేదీన వారికి ఉరి శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. దోషులు అక్షయ్ సింగ్, పవన్‌కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 2లోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా నోటీసులు జారీచేశారు. అక్షయ్ సింగ్ తన పిటిషన్లో తాజాగా మరో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశానని, అది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నాడు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని పవన్‌కుమార్ గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. -
విపత్తు ఏంటి?
చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా, రాధిక హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గండభేరుండ’. సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. శ్రీసాయిదేవ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ని దర్శక–నిర్మాత సాయివెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘గండభేరుండ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సూర్యన్ మాట్లాడుతూ– ‘‘గండభేరుండ’ అనే పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే కథాంశంతో రూపొందిన సోషియో ఫ్యాంటసీ హారర్ ఎంటర్టైనర్ చిత్రమిది. మలేసియాలో చేయించిన 17 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5న విడుదల కానున్న మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు చల్లమళ్ల రామకృష్ణ. రాధిక, పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, డైరెక్టర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్. -
రిలీజ్ కాకముందే రీమేక్ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కి ఇది రీమేక్. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్ మీద యు టర్న్‌ని పట్టించుకోం. రాంగ్ రూట్లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను. ► కన్నడ ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్‌లోనే రిలీజ్ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్ చేస్తాం అన్నారు. ► ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తుంటాం. కానీ రిలీజ్ కాకముందే సమంత రీమేక్ చేయాలనుకోవడం గ్రేట్. తనకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా స్టార్ట్ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్–యాక్టర్ ఈక్వేషన్ కంటే కూడా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం. ► నా ఫస్ట్ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఇంకా నిర్ణయించుకోలేదు. -
అలా చేయడం నాకు నచ్చదు
నాకు గ్లిజరిన్ వేసుకుని నటించడం నచ్చదని అన్నారు నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ నాటి మేటి నటీమణులను గుర్తుకు తెస్తున్నారు. ఇటీవల సమంత తమిళ, తెలుగు భాషల్లో నటించిన చిత్రాలన్నీ సక్సెస్‌లే. అలాంటి నటి తాజాగా మరో మైల్రాయిని టచ్ చేశారు. ఇప్పటివరకూ స్టార్ హీరోలకు సపోర్టింగ్ పాత్రల్లోనే నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఈ సుందరి తాజాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఓకె చెప్తున్నారు. కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న యూటర్న్ చిత్రం అదే పేరుతో సమంత కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. కన్నడ చిత్ర దర్శకుడు పవన్కుమార్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్థ అధినేత శ్రీనివాస సింధూరి, వీవై.కంబైన్స్, పీఆర్ 8 క్రియేషన్స్ అధినేత రాంబాబు బండారు కలిసి నిర్మిస్తున్న చిత్రం యూటర్న్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆది, రాహుల్ రవీంద్రన్, నరేన్, భూవిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టెయిన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ధనుంజయన్ విడుదల చేయనున్నారు. చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ కన్నడ చిత్రం యూటర్న్‌ను మరింత మెరుగు పరిచి తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చివరి 30 నిమిషాలు చాలా థ్రిల్లర్‌గా ఉంటుందన్నారు. కన్నడంలో ట్రైలర్ విడుదల సమయంలోనే సమంత ఈ చిత్రం గురించి తనతో మాట్లాడారని, ఆమె కోసమే ఈ రీమేక్ చిత్రానికి తాను దర్శకత్వం వహించానని తెలిపారు. సమంత, రాహుల్ రవీంద్రన్‌ల నుంచి తాను తమిళ భాషను కొంచెం కొంచెం నేర్చుకున్నానని దర్శకుడు పవన్‌కుమార్ తెలిపారు. నటి సమంత మాట్లాడుతూ యూటర్న్ ట్రైలర్ విడుదల రోజే 2 మిలియన్ల వీయూస్ పొందిందని, అంత మంది ప్రేక్షకులు ఆదరిస్తారని తానూ ఊహించలేదని అన్నారు. ఇందులో హీరో, హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరన్నారు. కథే పెద్ద హీరో అని పేర్కొన్నారు. కన్నడ చిత్రం లూసియా చూసినప్పుడే ఆ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌కు తాను వీరాభిమానిని అయిపోయానన్నారు. అప్పుడే ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని ఆశపడ్డానన్నారు. ఈ చిత్రం ద్వారా అది నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు. యూటర్న్ థ్రిల్లర్ కథా చిత్రం మాత్రమే కాదని, ఇదే పెద్ద జర్నీ అని చెప్పారు. ఇందులో అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయన్నారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళంలో ధనుంజయన్ విడుదల చేయడంతో మంచి చేతిలో పడ్డట్టు భావిస్తున్నానన్నారు. తనకు యథార్థంతో కూడిన పాత్రల్లో నటించడం చాలా ఇష్టం అన్నారు. అదే తనని చిత్రంలోకి తీసుకొచ్చిందని చెప్పారు. యూటర్న్ చిత్రంలో ఎమోషన్ సన్నివేశాలు చాలా ఉంటాయని చెప్పారు. తనకు గ్లిజరిన్ వేసుకుని నటించడం నచ్చదన్నారు. అలా కష్టపడి ఒక సన్నివేశంలో నటించిన తరువాత మరో భాష కోసం అదే సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని, అది చాలా ఛాలెంజ్ అనిపించిందని అన్నారు. హీరోల కష్టమేమిటో ఈ చిత్రంతో తాను అనుభవ పూర్వకంగా గ్రహించానని సమంత పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ అతిథిగా పాల్గొన్నారు. నటుడు ఆది, రాహుల్ రవీంద్రన్, నిర్మాత ధనుంజయన్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. -
దేవుని గడపలో బ్రహ్మోత్సవాలు
వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవుడి గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 22న ఉదయం ముత్యాల పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం నిర్వహిస్తారు. 24న రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం ఉంటాయి. 25న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం, 26న వసంతోత్సవం, అనంతరం చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం ఉంటాయి. 27న రాత్రి 7 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయ నిర్మాతలైన రాయల వంశీకులు తవ్వించిన పుష్కరిణి గనుక ఇందులో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు, దేవుని కడప క్షేత్రానికి హైదరాబాదు, బెంగుళూరు, మద్రాసు, తిరుపతిల నుంచి నేరుగా రైలు, బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు నుంచి 420 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది. – పంతుల పవన్ కుమార్ -
నువ్వే ప్రాణమని ఏడేళ్లుగా ప్రేమించి..
-
ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైమ్ రిపోర్టర్‌పై దాడి
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్‌లో నివాసం ఉంటున్న ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైం రిపోర్టర్ పవన్‌కుమార్(40), ఆయన మేనత్త హైమవతిపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. పవన్ సమీప బంధువు శ్రీనివాస్(36) ఇద్దరిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు క్షతగాత్రులను నాగోల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలవల్లే ఈ దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
పామిడి : పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డు సమీపంలో రామాంజనేయులు కుమారుడు పవన్‌కుమార్(16) రైలు కిందపడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్‌కుమార్ అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి. ఇటీవల తరచూ తీవ్ర తలనొప్పితో బాధపడేవాడు. తలనొప్పి తీవ్రకావడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు
-
తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు
అనంతపురం జిల్లా: రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న తోటి విద్యార్థిని చూసి ఓర్వలేక పవన్‌కుమార్(18) అనే వ్యక్తిని తోటి విద్యార్థులే కిరాతకంగా హతమార్చారు. జిల్లాలోని సూర్యానగర్ కంటి ఆసుపత్రి వద్దపవన్‌ను వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కొన ఊపిరితో ఉన్న పవన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. జిల్లాలోని బోయవీధికి చెందిన తలారి నగేష్‌తో పాటు మరో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'నా భర్తను నాతో పంపించండి'
ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జీవితంపై రంగుల కలలు కన్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు చేశారు. ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. భర్త తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. భరించలేక భార్య కేసు పెట్టింది. అవమానంగా భావించిన భర్త బెయిల్‌పై విడుదలై తల్లిదండ్రుల వద్దకు చేరాడు. భర్తకోసం ఎదురుచూసిన ఆమె అతను రాకపోవడంతో, మెట్టినింటికి చేరుకుంది. వారి ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. తిరుపతి : భర్తను తనతో పంపించాలంటూ ఓ మహిళ అత్తగారి ఇంటి ముందు మౌనదీక్షకు దిగిన సంఘటన ఆదివారం తిరుపతిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కుప్పానికి చెందిన శాంతిప్రియ(24), తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన రామయ్య, భాగ్యలక్ష్మిల కుమారుడు పవన్‌కుమార్ మధ్య డిగ్రీ చదివే రోజుల్లో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారడంతో శాంతిప్రియ, పవన్‌కుమార్ తల్లిదండ్రులను ఎదిరించి ఏడాది కిందట అప్పలాయగుంటలో ప్రేమ వివావాం చేసుకున్నారు. అనంతరం వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొద్ది నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. శాంతిప్రియకు రెండుసార్లు గర్భస్రావం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అతను కొట్టడం తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో నాలు గు నెలల క్రితం ఆమె భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో భర్త అరెస్ట్ ...ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అతను నేరుగా తిరుపతిలోని తల్లిదండ్రుల వద్దకు చేరాడు. గతంలో భర్త అప్పులు చేయడంతో వారంతా ఇంటికి వచ్చి అడగడం మొదలుపెట్టారు. ప్రేమ వివాహం చేసుకుందని శాంతిప్రియను తల్లిదండ్రులు సైతం ఆదరించలేదు. ఆమె ఆదివారం తిరుపతికి చేరుకుంది. భర్తతో కాపురం చేస్తానని, అత్తమామల నుంచి భర్తను కాపాడి తమకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇంటిముందు శాంతిప్రియ మౌనదీక్షకు దిగడంతో అత్త, మామ, భర్త ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. కాగా శాంతిప్రియను మోసం చేసిన భర్తను, అత్త, మామను అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండ్ చేశారు. ఈస్ట్ పోలీసులు శాంతిప్రియ వద్దకు చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు. -
రాజ్ భవన్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు మృతి
హైదరాబాద్: మూడు రోజుల క్రితం రాజ్ భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు ఆదివారం మృతి చెందాడు. సీఐ వేధింపుల్లో భాగంగా శుక్రవారం గవర్నర్ కలిసేందుకు వచ్చిన పవన్ కుమార్ అనే యువకుడ్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయువకుడు ఈ రోజు ఉదయం మృతి చెందాడు. గత కొంతకాలంగా సీఐ తనను వేధిస్తున్నాడంటూ కడపకు చెందిన పవన్ కుమార్ గవర్నర్ కలిసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాల్సిదింగా గవర్నర్ ను కలవడానికి వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనిలో భాగంగానే అతని వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. -
పాపం... పవన్
హైదరాబాద్: అతని పేరు పవన్‌కుమార్. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఎందరివో మృతదేహాలను బయుటకు తీశాడు.. ఆత్మహత్య చేసుకొనేందుకు ‘సాగర్’ జలాల్లో దూకిన ఎందరినో రక్షించాడు... చివరకు తానే ప్రమాదవశాత్తు అదే నీటిలో మునిగి చనిపోయూడు. ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలానికి చెందిన పవన్‌కుమార్ ట్యాంక్‌బండ్ కింద ఉండే కట్టమైసమ్మ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ఉంటూ జీవిస్తున్నాడు. ఏ పని చిక్కితే ఆ పని చేసేవాడు. హుస్సేన్‌సాగర్‌లో ఏదైనా మృతదేహం తేలియాడుతుంటే పోలీసుల ఆదేశాల మేరకు బయటకు తీసేవాడు. ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అలాగే, వినాయక నిమజ్జనం తర్వాత సాగర్ జలాల్లో ఉండే ఇనుప చువ్వలు తీసుకొని విక్రయించేవాడు. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నీటిలో ఉండిపోయిన ఇనుపచువ్వలు తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు ఆ చువ్వల్లో చిక్కుకొని మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో ఓ మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు బయుటకు తీయించారు. మృతుడు పవన్‌కుమార్‌గా గుర్తించి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో మృతదేహం వెలికితీత... హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మరో మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు సోమవారం వెలికి తీయించారు. సంజీవయ్యపార్కు వెనుకవైపు గల సాగర్ జలాల్లో ఓ మృతదేహం తేలియడుతుండగా బయటకు తీశారు. మృతుడికి 25- 30 ఏళ్లుంటాయని, ఒంటిపై ఆకుపచ్చ టీషర్ట్, నలుపు జీన్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధీకులు 9490157553 సెల్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పవన్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బౌలర్ పవన్ కుమార్ (6/37) విజృంభించడంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఎస్ఎన్ గ్రూప్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఎన్ గ్రూప్ 103 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ మూడే వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అజయ్ (42) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో నవజీవన్ ఫ్రెండ్స్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రణ ధీర్ (88), బౌలింగ్‌లో అంబాదాస్ (5/68) రాణించారు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సాక్రెడ్ హర్ట్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సాక్రెడ్ హర్ట్ 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జమీల్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నవజీవన్ ఫ్రెండ్స్ 5 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. వినయ్ 45 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు భారతీయ: 237 (సోమశేఖర్ 72, ప్రజ్వల్ 40, శ్రీకాంత్ నాయుడు 49; గుప్త 7/53); మహ్మద్ సీసీ: 198 (గుప్త 57; సోమశేఖర్ 3/15, అశోక్ కుమార్ 6/43). గగన్ మహల్ సీసీ: 143 (సాగర్ 32; మహబూబ్ అలీ 3/28. ముఖీత్ 5/35); యూత్ సీసీ: 144/5 (అనిరుధ్ రెడ్డి 36, అరుణ్ 40 నాటౌట్). తిరుమల: 196 (అశ్విన్ మానే 45; ఖాదర్ 3/43, సయ్యద్ సోహైల్ 3/14); డెక్కన్ బ్లూస్: 113 (సోహైల్ 39; అశ్విన్ మానే 5/32).