ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైమ్ రిపోర్టర్‌పై దాడి
Published Sun, Dec 4 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్‌లో నివాసం ఉంటున్న ఎక్స్‌ప్రెస్ టీవీ క్రైం రిపోర్టర్ పవన్‌కుమార్(40), ఆయన మేనత్త హైమవతిపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. పవన్ సమీప బంధువు శ్రీనివాస్(36) ఇద్దరిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు క్షతగాత్రులను నాగోల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలవల్లే ఈ దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement