మళ్లీ ఆయన సీఎం అయితేనే గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
‘ఆడుదాం ఆంధ్రా’ వల్లే చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణకు ఎంపిక
‘సాక్షి’తో క్రికెట్ క్రీడాకారుడు పవన్
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక ఎందరో క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర మంతా భారీఎత్తున నిర్వహించారు. ఎందరో క్రీడాకారులు ముందుకెళ్లడానికి ఇది దారిచూపింది. అలా వెలుగులోకి వచి్చన వారిలో ఆనంద్‌పాల్ అలియాస్ పవన్ ఒకరు. విజయనగరం జిల్లా జామి మండలంలోని మారుమూల గ్రామం అలమండకు చెందిన ఈ కుర్రాడు ధోనీ సారధ్యంలోని ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని వచ్చిన అనంతరం పవన్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. – సత్యార్థ్
సెమీ ఫైనల్స్‌లో ఓడినా..
అన్ని చోట్లా మా టీమ్ గెలుపొందింది. చివరకు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లు వీక్షించడానికి వచి్చన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ నన్ను దత్తత తీసుకుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక అద్భుతం అనుకుంటే.. ఏకంగా సీఎస్‌కే టీమ్ ట్రైనింగ్‌కు ఎంపికవడం.. శిక్షణ అనంతరం నాకెంతో ఇష్టమైన క్రికెటర్ ధోని ఆధ్వర్యంలోని టీమ్‌లో సభ్యుడిగా ఆడే అవకాశం నాకు దక్కవచ్చని తెలిసి పొంగిపోయాను. ఈ అవకాశం సది్వనియోగం చేసుకుని క్రికెటర్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
చేనులో ఆట నుంచి ‘చెన్నై’ దాకా...
నా తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. పొలాలమ్మట, గల్లీల్లో ఆడుతూ ఉండేవాడిని. ‘చదువుకుని ఉద్యోగం చేసుకోక క్రికెట్ అంటూ తిరుగుతున్నావ్ ఏంట్రా’.. అంటూ అమ్మ కోప్పడుతూ ఉండేది. ఫ్రెండ్స్ మాత్రం క్రికెట్ బాగా ఆడతానని పొగుడుతుండేవారు. అడపాదడపా గ్రామాల్లో జరిగే మ్యాచ్‌లలో ఆడి స్వల్ప పారితోషకాలు అందుకోవడం తప్ప ఆటకు ఎలా సానబెట్టుకోవాలో నాకు తెలియలేదు. అదే సమయంలో దేవుడిచి్చన వరంలా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మా గ్రామ సచివాలయం ద్వారా ఆ కార్యక్రమానికి ఎంపికయ్యాను.
థాంక్స్ టూ జగన్ సార్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాను. థాంక్స్ టూ జగన్ సార్.. ఆయనెప్పుడూ పేదల పక్షానే ఉంటూ.. ఎన్నో మంచి పథకాలు అమలుచేస్తున్నారు. క్రీడల విషయంలోనూ పేదలకు మేలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారు. గల్లీల్లో ఆడుకునే నాలాంటి వాడు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. మరోసారి ఆయనే సీఎం కావాలని.. ఆడుదాం ఆంధ్రాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment