interview with sakshi
-
రేవంత్ ఇటుకతో కొడితే.. మేం రాయితో బదులిస్తాం
ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్టుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఇది. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరతమాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా? ఇప్పుడు బతుకమ్మ మాయం.. రేపు తెలంగాణ మాయం చేస్తారా?తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ద్రోహులు చేస్తున్న దాడి. ఈ సీఎం తెలంగాణ ఉద్యమంలో లేరు.. ఎన్నడూ జైతెలంగాణ అనలేదు. సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకుల పార్టీలో పనిచేసి.. కేసీఆర్ పట్ల వ్యతిరేకత, ద్వేషం పెంచుకున్నారు. కేసీఆర్ చేసిన ప్రతి పనికి ఉల్టా చేయడం రేవంత్ పని. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పుల అభిప్రాయాలు తీసుకుని ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి రూపకల్పన జరిగింది.2009లో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు పెట్టారు. కానీ ఈ మూర్ఖుడు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్లుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడిపై ప్రజలు నిరసన తెలపాలి. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరత మాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా?సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల ముసుగులో ఇచ్చిన 13 ప్రధాన గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వ తీరును నిలదీస్తామన్నారు. దళితబంధు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, ఆసరా పింఛన్ల పెంపు తదితర హామీల అమలు కోసం పట్టుబడతామని.. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రశ్నించడం ఆపేదే లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘24 ఏళ్ల ప్రస్థానంలో గత ఏడాది బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఉద్యమ సమయంలో గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్ర సాధన కోసం పనిచేశాం. తెలంగాణ సిద్ధించాక పదేళ్లు అధికారంలో కొనసాగినా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, కవిత అరెస్టు, కేసీఆర్ కాలికి గాయం వంటి అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి, నాయకులు, కార్యకర్తల పోరాట పటిమతో బీఆర్ఎస్ తిరిగి నిటారుగా నిలబడింది. తిరిగి అధికారంలోకి వచ్చి మరో 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతుందనే ఆత్మస్థైర్యం వచ్చింది. మాకు పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ కాదు. సమాధానం చెప్పలేకే రేవంత్ దూషణలు రేవంత్‌రెడ్డికి అనుకోకుండా అవకాశం వచ్చి సీఎం అయ్యారు. ఆయన పట్ల మాకు ఎలాంటి జెలసీ లేదు. ఆయనను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరితే దూషణలకు దిగుతున్నారు. మమ్మల్ని దూషించినా వయసులో చిన్న వాళ్లం సహిస్తాం. కానీ కేసీఆర్‌ను దూషించడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. తెలంగాణ సాధించిన మహానాయకుడిని స్థాయికి తగని వ్యక్తి విమర్శించడం సరికాదు.రేవంత్ వైఖరి మారకపోతే మాపై కేసులు పెట్టినా సరే... ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన భాషలోనే స్పందిస్తాం. ఇటుకతో కొడితే రాయితో బదులిస్తాం. రేవంత్ చేస్తున్న పనికి మేం ఎక్కడా అడ్డుపడటం లేదు. బలవంతపు భూసేకరణ, దళితబంధు ఆపేయడం, మూసీ పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ప్లాన్చేయడంపై మేం ప్రశి్నస్తుంటే.. రేవంత్‌కు జీర్ణం కావడం లేదు. సమాధానం చెప్పే సత్తా లేక దూషణలకు దిగుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న సీఎం... మొదట తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి లగచర్లకు, తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లాలి. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు.. ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో రేవంత్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎనీ్టఆర్, జయలలిత శపథం చేసి అసెంబ్లీకి రాలేదు. కానీ కేసీఆర్ అలా కాదు. రేవంత్ కోరుకున్నప్పుడు కాదు.. ప్రజలు కోరుకున్నపుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు. ప్రజలు కేసీఆర్ ఎక్కడని అడగటం లేదు. హామీల అమలు, ఆరు గ్యారంటీల గురించి ప్రశి్నస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. ఉద్యమాల నుంచి వచ్చిన మాకు కేసులు, నిర్బంధాలు, అరెస్టులు కొత్త కాదు. వందల కేసులు పెట్టినా వెనక్కి తగ్గం. ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా కార్యకర్తలను జైలుకు పంపుతోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని బలోపేతం చేసుకుంటాం. పోరాటాలకు కేడర్‌ను సిద్ధం చేస్తాం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. కేసీఆర్ పర్యవేక్షణలో సమర్థవంతమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. కేసీఆర్, పార్టీ నిర్ణయం మేరకు పాదయాత్ర నేను కచ్చితంగా పాదయాత్ర చేస్తా.. కానీ తొందరపడకుండా ప్రజల అవసరాన్ని బట్టి షెడ్యూల్ నిర్ణయిస్తాం. ఎప్పుడు పాదయాత్ర చేయాలో మా అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయిస్తుంది. రేవంత్‌కు రక్షణ కవచంలా బీజేపీ ఎంపీలు బీజేపీ ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా వారు రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచారు. మా ఓటమికి కారకులై కాంగ్రెస్ గెలుపునకు ఉపయోగపడ్డారు. బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, అరి్వంద్, బండి సంజయ్ వంటివారు రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు. అదానీ విషయంలో రేవంత్ వైఖరిపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుముల రేవంత్‌రెడ్డి బ్రదర్స్ అదానీలను మించి పోతున్నా కేంద్రం ఎలాంటి దర్యాప్తులు చేయడం లేదు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
3 లక్ష్యాలతో ఆర్టీసీకి జవసత్వాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉన్న ఆర్టీసీని పరిరక్షించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఆర్టీసీని ఉన్నతంగా నిర్వహించే విషయంలో మూడు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సంస్థ పరిపుష్టి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, సిబ్బంది సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తూ చర్యలు ప్రారంభించాం. తీవ్ర నష్టాలు, అస్తవ్యస్త విధానాలతో మూతబడే దుస్థితిలో ఉన్న ఆర్టీసీని మళ్లీ లాభాలబాట పట్టించడమే కాకుండా ప్రజలకు మరింత చేరువ చేశాం. ఇకపై సంస్థను విస్తరిస్తాం, పటిష్టపరుస్తాం, ఆధునీకరిస్తాం’అని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మహాలక్ష్మి’తో మహర్దశ... మా ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కలి్పంచాం. ఇది రాజకీయ హామీ కాదు.. సంస్థ గతిని మార్చే గొప్ప పథకం. కేవలం సంవత్సర కాలంలో ఏకంగా 116 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్లను ఆదా చేసుకున్నారు. ఆ మొత్తం ఆయా కుటుంబాలకు మరో రకంగా లబ్ధి చేకూర్చేందుకు కారణమైంది. కేవలం సిబ్బంది గొప్ప కృషి వల్లే ఈ పథకం ఇంతటి విజయం సాధించింది.మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నేరుగా కోల్పోయే టికెట్ ఆదాయాన్ని రీయింబర్స్ చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూడుస్తున్నాం. ప్రతినెలా ఆ మొత్తాన్ని చెల్లిస్తుండటంతో సంస్థకు ఆర్థిక చేయూత కలుగుతోంది. ఇది సంస్థ విస్తరణకు దోహదపడుతోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. వారిలో మహిళల సంఖ్య దాదాపు 36 లక్షలు. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేసింది... హైదరాబాద్‌లో ఒకప్పుడు దాదాపు 6 వేల సిటీ బస్సులు తిరిగేవి. కానీ గత ప్రభుత్వం ఒకేసారి 3 వేల బస్సులను తొలగించింది. ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందిపై భారం పెంచింది. ప్రయాణికులకు వసతులు కలి్పంచకుండా నిర్లక్ష్యం చేసింది. ఇలా అన్ని రకాలుగా సంస్థను దెబ్బతీసింది. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ మేం సంస్థను బలోపేతం చేస్తున్నాం. మేము వచ్చాక దశలవారీగా 1,500 కొత్త బస్సులు సమకూరాయి. ఇప్పుడు మహిళా సంఘాలు సొంతంగా బస్సులను సంస్థకు అద్దెకివ్వడం ద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాల ఆధ్వర్యంలో 600 బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. అద్దె బ స్సుల సంఖ్య నియంత్రణ లోనే ఉండేలా చూస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరించే యో చనే లేదని స్పష్టం చేస్తున్నా. ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. బకాయిలు చెల్లిస్తాం.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి 2017 నాటిది. వెంటనే దానికి సంబంధించి 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేశాం. 2013 నాటి వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బాండ్ల బకాయిలు చెల్లించాం. బకాయి ఉన్న డీఏను చెల్లించాం. ఇలా ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం. మిగతావి కూడా ఇదే క్రమంలో క్లియర్ అవుతాయి. చనిపోయిన లేదా మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామకాలను కూడా చేపట్టాం. ఈవీ పాలసీ కాలుష్యానికి విరుగుడే.. భాగ్యనగరంలో లక్షలాదిగా పెరుగుతున్న వాహనాల రూపంలో వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఈవీ పాలసీ తీసుకొచ్చాం. పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వారికి పన్ను మినహాయింపు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. దీన్ని అందుబాటులోకి తెచ్చాక విద్యుత్ వాహనాల కొనుగోలు మూడు రెట్లు పెరిగిందని గుర్తించాం. ఇదే కోవలో వాహన తుక్కు విధానాన్ని కూడా ప్రారంభించాం. దీనివల్ల 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను తుక్కుగా మార్చేందుకు వీలుపడుతుంది. తుక్కుగా మార్చే సెంటర్ల ఏర్పాటుకు ఇటీవలే రెండు సంస్థలకు అనుమతి ఇచ్చాం. రాజకీయ రిజర్వేషన్లకే కులగణన పరిమితం.... కులగణన ప్రస్తుతానికి రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది కూడా అందుకోసమే. కమిషన్ నివేదిక సమరి్పంచాక చర్చించి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉంటాయి. వాటన్నింటినీ కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కులగణనలో ప్రజలు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వట్లేదని మా దృష్టికి కూడా వచి్చంది. అందరూ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా పథకాల అమలు సులువవుతుంది. సమాచారం ఇవ్వని ప్రజలు తెలంగాణ వారు కాదన్నట్లు.. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయమని గత ప్రభుత్వం బెదిరించినట్లు మేం బెదిరించట్లేదు. అందరూ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠినచర్యలు.. జ్యోతిబా పూలే విద్యానిధి పథకం కింద 300 మంది విద్యార్థులకు వర్తించే పథకాన్ని 800 మందికి పెంచాం. త్వరలోనే వారందరికీ నిధులు మంజూరు చేస్తాం. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభు త్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అన్ని జిల్లాల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌లోనూ ఈ విషయం స్పష్టం చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు వారికి ఇచ్చే మెస్‌చార్జీలు పెంచాం. వివిధ బీసీ కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించినా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేకపోయాం. త్వరలోనే వాటికి నిధులు ఇస్తాం.త్వరలో నియామకాలు.. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల భర్తీకి 3 వేల కొత్త నియామకాలు చేపట్టబోతున్నాం. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా నియామకాల ప్రక్రియ మొదలైంది. సాంకేతిక కారణాలతో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరలో ఆ పోస్టులు భర్తీ అయ్యేలా చూస్తాం.కాలుష్య నియంత్రణ చర్యలు ఆర్టీసీతో మొదలు.. వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఆ దుస్థితి హైదరాబాద్‌కు పట్టకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు సమకూరుస్తున్నాం. వచ్చే రెండేళ్లలో అవి విడతలవారీగా అందుబాటులోకి వస్తాయి. బస్సుల తరహాలో ఎలక్ట్రిక్ ఆటోలు.. ఆర్టీసీ డీజిల్ బస్సులను తొలగించిన తరహాలోనే నగరం నుంచి డీజిల్ ఆటోలను కూడా తొలగించే ఆలోచన ఉంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడతాం. ఈ మేరకు ఆటో డ్రైవర్లను త్వరలోనే చైతన్యపరిచే కసరత్తు మొదలుపెడతాం. కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే విషయంలో ఆటోవాలాలకు చేయూత అందించను న్నాం. అది ఏ రూపంలో అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. -
వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లతోపాటు అంచనాలను సవరించి వచ్చే వేసవిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నామని.. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామని అన్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను పునఃసమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటితో (డిసెంబర్ 7) ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, పాలనా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘కాళేశ్వరాన్ని’ సాధ్యమైనంత వరకు వాడుకుంటాం... తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉండాలనే రాజకీయ దురుద్దేశాలు మాకు లేవు. ప్రాజెక్టును ఏ మేరకు ఉపయోగంలోకి తీసుకురాగలమో అంతవరకు తీసుకొస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక కోసం నిరీక్షిస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు బరాజ్‌లను రక్షించుకోవడానికి గ్రౌటింగ్ పనులను అధికారులు చేయడంపై ఎన్డీఎస్ఏ అభ్యంతరం తెలపడం వాస్తవమే.మేడిగడ్డ బరాజ్ కుంగినందున అన్నారం, సుందిళ్ల బరాజ్లనైనా వాడుకోవచ్చా? అని ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను అడిగా. మూడు బరాజ్‌లకు సికెంట్ పైల్స్ వాడటంతో వాటి భద్రతపై అనుమానాలున్నాయని.. క్లియరెన్స్ ఇవ్వలేమని ఆయన బదులిచ్చారు. దీనిపై డిసెంబర్ ఆఖరిలోగా పరిశీలించి చెప్తామన్నారు. ‘కాళేశ్వరం’లేకున్నా రికార్డుస్థాయి దిగుబడి.. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లలో చుక్క నీళ్లు నిల్వ చేయకపోయినా గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండటం దేశంలోనే రికార్డు. ధాన్యం అమ్మకాలతో రైతులు రూ. 35–40 వేల కోట్లు ఆర్జించారు. సన్నాలకు పరిమితి లేకుండా రూ. 500 చొప్పున 1,87,532 మంది రైతులకు బోనస్ ఇచ్చాం. యాసంగిలో సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. దొడ్డు వడ్లనూ కొంటాం. పాత, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక కమీషన్లు వచ్చే పనులకే ప్రాధ్యాతనిచి్చంది. మేము సాగునీటి ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు ఇచ్చే పనులను చేస్తున్నాం. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, డిండి, దేవాదుల, గౌరవెల్లి, ఎస్సారెస్పీ, అచ్చంపేట లిఫ్టుతోపాటు కొత్తగా చేపట్టిన కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం. నా ప్రధాన బాధ్యతగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తా. జాతీయ విధానం ఆధారంగా లోయర్ మానేరు, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో చేపడతాం. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధికి నిధులు సమీకరిస్తారని నమ్ముతున్నా.. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ. 22,160 కోట్లు కేటాయిస్తే అందులో రుణాలు, వడ్డీల చెల్లింపులు పోగా మిగిలిన రూ. 11 వేల కోట్లను ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు, రాష్ట్రాభివృద్ధికి సరిపడా నిధులు సమీకరిస్తారని నమ్మకం ఉంది. అన్ని జిల్లాలూ సమానమే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులకే ప్రాధ్యాత ఇస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం. కరీంనగర్లో గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 500 కోట్లు ఇచ్చాం. చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తున్నాం. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మాకు అన్ని జిల్లాలు సమానమే. గత సర్కారు చుక్క నీటినీ సాధించలేదు.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలపై రాజీ ప్రసక్తే లేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల ఉమ్మడి ఏపీ వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపింది. తాజాగా అందుకు అంగీకరించబోమని.. 70 శాతం పరీవాహక ప్రాంతంగల తెలంగాణకే 70 శాతం జలాలను కేటాయించాలని కేంద్రంతో కోట్లాడుతున్నాం. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టులకు చుక్క నీటి కేటాయింపులను కూడా గత సర్కారు సాధించలేదు. మా ప్రయత్నాలతో సీతారామకు 67 టీఎంసీల కేటాయింపులు తుది దశకు చేరాయి. శ్రీశైలంపై 10 రోజుల్లో సుప్రీంకు... (బాక్స్ ఐటెమ్) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుండడంపై వారం 10 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే నాగార్జునసాగర్‌పై నియంత్రణ సీఆర్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం. సాగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి చట్టప్రకారం అన్నీ చేస్తాం. ఇంజనీర్ల పదోన్నతులపై హైకోర్టులో స్టే తొలగిన వెంటనే నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నాం. జనవరి లేదా ఫిబ్రవరిలో రేషన్‌కార్డులకు సన్న బియ్యం.. రైతులు సన్నాలను అధిక ధరకు ధాన్యం వ్యాపారులకు అమ్ముకోవడం సంతోషకరం. రేషన్‌కు కొరత లేకుండా అవసరమైన సన్న బియ్యాన్ని సమీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు రూ. 58,623 కోట్లు ఉండగా 10 నెలల్లో రూ. 11,600 కోట్లను కట్టేశాం. సంస్కరణల్లో భాగంగా మరో రెండు పంటల నాటికి మిల్లర్ల నుంచి 100 శాతం బ్యాంకు గ్యారంటీ అడుగుతాం. డిఫాల్టర్ల నుంచి చట్టపరమైన చర్యలతో రికవరీ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయ్యాక రేషన్‌కార్డుల జారీకి మళ్లీ కసరత్తు ప్రారంభిస్తాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో... తెలంగాణ ప్రజాకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. వన్ మ్యాన్ షో.. వన్ ఫ్యామిలీ షో అన్నట్లుగా పాలన సాగింది. నిలువెల్లా అహంకారం, నియంత్రతృత్వ ధోరణి, అవినీతితో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాటి సర్కార్ నీరుగార్చింది. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. సమర్థంగా శాఖలను పరుగెత్తిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులకు గౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుంది. బీఆర్ఎస్ అతిచేస్తోంది.. మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇదైపోయింది... అదైపోయిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదు. మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కుంభకోణం అనడం అతి. బీజేపీ, బీఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధి కల్పనలో పదేళ్లు విఫలమయ్యారు. 10 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం. నిన్న ఇంకా 9 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏడుపే. పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. మేము 11 వేల మంది టీచర్లను నియమించాం. నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలను భర్తీ చేశాం. -
మేం డిస్టింక్షన్లో పాస్
కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది.గత ఏడాది పాలనలో తాము డిస్టింక్షన్లో పాస్ అయ్యామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని రెండు కళ్లుగా సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని.. ఆ అప్పులు తీర్చుకుంటూ, ప్రజలపై భారాన్ని తగ్గించుకుంటూ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రజల కిచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశలో అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో ఆదాయంతో పాటు తెచ్చిన అప్పులను కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ అప్పులు కట్టాల్సిన సమయంలో రాష్ట్ర పగ్గాలు మా చేతికి వచ్చాయి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకోగలగడం వల్ల వారికి లాభం కలిగింది. ఇప్పుడు అవన్నీ కట్టాల్సి రావడం మాకు భారంగా మారింది. మేం ఏడాదిలో రూ.52,118 కోట్లు అప్పులు తెచ్చి.. రూ. 64,516 కోట్ల అప్పులు తీర్చాల్సి వచ్చింది.అయినా అభివృద్ధి, సంక్షేమంలో వెనకబడకుండా జాగ్రత్త పడుతున్నాం. ప్రణాళిక వ్యయం కింద రూ. 24 వేల కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాం. అదే సమయంలో రూ. 61,194 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం. ప్రతి పైసా అర్థవంతంగా ప్రజలకు చేరాలన్నదే మా తపన.ఆ మూడూ మా పేటెంట్లు..వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా పేటెంట్ పథకం. పకడ్బందీగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ, మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం పేటెంట్లు కూడా కాంగ్రెస్‌వే. వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు రుణాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంఅందులో ఈ ఏడాది రూ.20 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటికే రూ.18 వేల కోట్లు రుణాలిచ్చాం. కొత్త రేషన్ కా ర్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం. తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. పింఛన్లు పెంచుతాం. అన్ని హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తాం. గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ఏమీ చేయలేకపో యాయి. కానీ మమ్మల్ని మాత్రం ఏడాదిలోనే అన్నీ చేసేయాలంటున్నాయి.మేం ప్రచారంపై దృష్టి పెట్టలేదు..మేం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రచారం మీదనే బతుకుతోంది. మేం రైతు రుణమాఫీ ప్రారంభించినప్పుడు ఏమీ కాలేదన్నారు. అక్కడితో ఆగిపోతామని అనుకున్నారు. కానీ మేం ఆగలేదు. నిజానికి రేషన్‌కార్డులు లేని రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ కాదా? గత పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజలకు ఏమేం చేయాలన్న దానిపై మా దృష్టి ఉంటే.. వాళ్లు పదేళ్లు ప్రచార పటాటోపంతో నెట్టుకొచ్చారు.మేం బీఆర్ఎస్లా కాదు.. చెప్పినవన్నీ చేస్తున్నాం. దుబారా చేయకుండా కస్టోడియన్‌గా ప్రజల సంపదను ఖర్చు పెడతాం. రైతు భరోసా విషయంలో అదే చేస్తాం. ఒకదాని తర్వాత ఇంకోటి అమలు చేస్తూనే ఉంటాం. పాలనపై సంపూర్ణంగా పట్టు వచ్చింది. ఈ ఐదేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేది మేమే. ప్రతిపక్షాలు నిరంతరం మా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు.సంవత్సరం కూడా ఆగలేకపోతున్నారుగురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం దురదృష్టకరం. అయితే పార్టీలు దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. అడ్డగోలుగా అనుభవించిన అధికారం దూరంకావడంతో ఏడాది కూడా ఉండలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలుండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ‘రైజింగ్ తెలంగాణ హాస్ టుబీ రైజ్ ఆల్ ద టైం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారుమూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. మూసీ నీటిని శుద్ధి చేయడం, పెట్టుబడుల ద్వారా పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఆ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం మా ఉద్దేశం. ఇవన్నీ పూర్తయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో... బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేశాయి. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కావాలంటున్నారు. ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.త్వరలో కొత్త విద్యుత్ విధానం..త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో కొత్త విద్యుత్ పాలసీని ప్రవేశపెట్టి చర్చిస్తాం. 2029–30 నాటికి 20 వేల మెగావాట్లు, 2035–36 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ విద్యుత్‌ను రాష్ట్రంలో వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకుంటాం.పెరిగే సామర్థ్యానికి తగ్గట్టు సరఫరా, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను అసెంబ్లీలో పెడతాం. గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన డైరెక్టర్లను తొలగించాం. త్వరలోనే విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లను నియమిస్తాం. -
దంత వైద్య విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత చికిత్సలు అందించడానికి కృషి చేస్తానని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) నూతన ప్రెసిడెంట్ డాక్టర్ కె.సతీశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డీఐసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వైద్యుడైన డా.సతీశ్‌కుమార్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. స్కూల్, కాలేజీ విద్యను నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేసిన ఆయన.. హైదరాబాద్‌లోని ఉస్మానియాలో బీడీఎస్, ఎండీఎస్ విద్యనభ్యసించారు. ఉమ్మడి ఏపీ డెంటల్ కౌన్సిల్‌కు రెండు సార్లు, విభజిత ఏపీ కౌన్సిల్‌కు ఒకసారి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల డీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.సతీశ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..యూజర్ చార్జీలపై మార్గదర్శకాలు..వైద్య విద్యార్థులకు శిక్షణ సమయంలో ఎంత ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటే వారు అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ మేర సామర్థ్యాలు పెరిగి.. భవిష్యత్‌లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనకు వీలవుతుంది. డీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీకి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో రోజుకు నిర్దేశించిన స్థాయిలో ఓపీలు, ఐపీలు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలోని దంత వైద్య కళాశాలల్లో రోగుల కొరత ఉంటోంది.దీంతో విద్యార్థులు శిక్షణ సమయంలో ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత వైద్య కళాశాలల ద్వారా చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ప్రైవేట్ కళాశాలల్లో చికిత్సలకు యూజర్ చార్జీలపై మార్గదర్శకాలను రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.వేలల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా.. దంత వైద్య కళాశాలల్లోని ఆస్పత్రులకు వెళ్లాలి. అక్కడ నిపుణులైన సీనియర్ వైద్యులుంటారు. ఇబ్బడిముబ్బడిగా దంత వైద్య కళాశాలలు..దేశంలో దంత వైద్య కళాశాలలు ఎక్కువయ్యాయి. దీంతో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ బయట ఉపాధి దొరకడం లేదు. ఇబ్బడిముబ్బడిగా కళాశాలల ఏర్పాటుతో విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కళాశాలలకు ప్రతిపాదనలు పంపొద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు డీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి కొత్త కళాశాలల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త కళాశాలలు నెలకొల్పకుండా నియంత్రించే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు ఆమోదించడం, తిరస్కరించడం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. డెంటల్ ఎడ్యుకేషన్‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపైనా దృష్టి సారిస్తాం. -
లొంగని బ్యాక్టీరియాకు విరుగుడు
సాక్షి, అమరావతి : ‘అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వాడకంవల్ల శరీరంలోని చెడు బ్యాక్టీరియా రోగనిరోధకత పెరుగుతోంది. దీంతో కొన్నిరకాల బ్యాక్టీరియాపై యాంటిబయోటిక్స్ పనిచేయకుండాపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెనువిపత్తులా మారింది. ఇలా యాంటిబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఫేజ్ థెరపీతో చెక్‌పెట్టొచ్చు’.. అని క్లినికల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్), యూరోపియన్ స్టడీ గ్రూప్ ఆన్ నాన్–ట్రెడిషనల్ యాంటిబయోటిక్స్ సొసైటీ (ఈఎస్జీఎన్టీఏ) సభ్యులు డాక్టర్ కళ్యాణచక్రవర్తి అన్నారు.జార్జియా, రష్యా, అమెరికా, యూరప్ దేశాల్లో న్యూమోనియా, క్షయ, చర్మ, మూత్రనాళ, ఇతర బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లలో యాంటిబయోటిక్స్‌కు బ్యాక్టీరియా లొంగని క్రమంలో ఫేజ్ థెరపీ వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడా ఇది వినియోగంలో ఉన్నా ఈ విధానం భవిష్యత్తులో పెద్దఎత్తున వాడుకలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఈఎస్జీఎన్టీఏ ఆధ్వర్యంలో ఫేజ్ థెరిపీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డా. కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్సల్లో ఫేజ్ థెరఫీకి సంబంధించిన అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. 1900 దశకంలోనే..బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి బ్యాక్టీరియా వైరస్ (ఫేజ్)లను వినియోగించడమే ఫేజ్ థెరపీ. యాంటిబయోటిక్స్ కనిపెట్టడానికంటే ముందు 1900 దశకం ప్రారంభంలో ఈ ఫేజ్ థెరపీ వినియోగంలో ఉండేది. మానవులపై దాడిచేసి వ్యాధుల బారినపడేలా చేసే బ్యాక్టీరియాను నశింపజేసే బ్యాక్టీరియా ఫేజ్‌లు ప్రకృతిలో ఉంటాయి. నీరు, మట్టి, ఇతర ప్రకృతి వనరుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ప్రయోగశాలల్లో శుద్ధిచేసి అందులోని చెడు రసాయనాలను వేరుచేసిన అనంతరం ఫేజ్లను సాధారణ మందుల మాదిరిగానే చికిత్సలో వినియోగిస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనిపెట్టిన అనంతరం పెద్దఎత్తున యాంటిబయోటిక్ మందులు అందుబాటులోకి రావడంతో ఫేజ్ థెరపీ కనుమరుగైంది.రోగ నిరోధకత పెరుగుదల..మార్కెట్లో ఉన్న యాంటిబయోటిక్స్‌కు లొంగకుండా బ్యాక్టీరియా రోగ నిరోధకత పెంచుకోవడంతో మందులు పనిచేయకుండాపోతున్నాయి. ఆస్ప త్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం, ఆస్పత్రులకు వచ్చే వారిలో 50 శాతం మందిలో యాంటిబయోటిక్స్ పనిచేయని దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచానికి ఫేజ్ థెరపీ ప్రత్యామ్నాయంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం నేను న్యుమోనియాతో బాధపడే 60 ఏళ్ల వృద్ధురాలికి ఈ విధానం ద్వారా నయంచేశాను. రోగుల డిమాండ్ మేరకు ఆస్పత్రుల్లోని ఎథిక్స్ కమిటీ ఆమోదంతో మన దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగి స్తున్నారు. ఈ విధానంలో రోగుల్లో రోగనిరోధకత పెరగడంతో పాటు, త్వరగా వ్యాధుల నుంచి కోలుకుంటారని పలు పరిశో«ధనల్లో సైతం వెల్లడైంది. మార్పు రాకపోతే కష్టం..ప్రజలు, కొందరు వైద్యులు లెక్కలేనితనంగా యాంటిబయోటిక్స్‌ను వినియోగిస్తుండటంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా అవతరించింది. ఏఎంఆర్ పెను ఆరోగ్య సమస్యగా మారి ఫేజ్ థెరపీని ఆశ్రయించాల్సిన దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మనం పెరట్లో పెంచుకునే మొక్కకు తెగులు వస్తే ఆ తెగులు ఏంటో నిర్ధారించుకుని మందు కొని పిచికారి చేస్తాం. మొక్కకే ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ఇవ్వకపోతుండటం దురదృష్టకరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ చిన్నజబ్బు వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్‌కు వెళ్లి వాళ్లిచ్చే యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఈ దురలవాటును ప్రతిఒక్కరూ విడనాడాలి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరానికి యాంటిబయోటిక్స్ వాడొద్దు. వైద్యుడిని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని, వైద్యుడి సూచన మేరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడితే చాలావరకూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. -
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
ప్రతి గింజా కొంటాం
సాక్షి, హైదరాబాద్: రైతు పండించిన ప్రతి గింజకు మా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. 7,750 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం. ఇది గత ప్రభుత్వం కంటే చాలాఎక్కువ. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించాం. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు కూడా సమీకరించాం. రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 70–75 శాతం మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు సహకరిస్తున్నారు. వారు సహకరించని ప్రాంతాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు’అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు సహకరించక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా ? ఉత్తమ్: ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలని మిల్లర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతు ధరకన్నా, తక్కువ చెల్లింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. మిల్లర్లు సహకరించని ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసి గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా మేజర్ సమస్యల్లేవు. ప్రశ్న: బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉపసంహరించాలని మిల్లర్లు కోరుకుంటున్నారు కదా? ఉత్తమ్: గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద స్టాక్ ఉంచి ఏ సెక్యూరిటీ తీసుకోలేదు. ఏపీలో 100 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మన దగ్గర సైతం ప్రారంభ దశలో మిల్లర్ల ట్రాక్ రికార్డు ఆధారంగా స్టాక్ విలువలో 10 శాతం, 20 శాతం, 25 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర మిల్లర్ల సంఘం ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. బాండ్ పేపర్‌పై పూచీకత్తు రాసిచ్చి కూడా ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాం. ప్రశ్న: మిల్లర్లకు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా? ఉత్తమ్: ఏపీతో పోలి్చతే రాష్ట్రంలో బ్యాంకు గ్యారంటీలు చాలా తక్కువే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు టన్నుకు రూ.10 చొప్పున మిల్లింగ్ చార్జీలు చెల్లించగా, ఇప్పుడు మేము దొడ్డు రకానికి రూ.40, సన్న రకానికి రూ.50 చొప్పున పెంచాం. ఏపీలో డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 150 శాతం జరిమానా వసూలు చేస్తే, మన దగ్గర 120 శాతమే వసూలు చేస్తున్నాం.గతంలో మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగేది. ఇప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం ఆధారంగా ఏ మిల్లర్‌కు ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఇస్తున్నాం. ప్రశ్న: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వార్తలొచ్చాయి ? ఉత్తమ్: ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకరిద్దరు మినహా స్థానిక మిల్లర్లందరూ సహకరిస్తున్నారు. (మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు అప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. కలెక్టర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉందని చెప్పారు.) ప్రశ్న: ఈ సారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచి్చంది.ఎలాంటి ఏర్పాట్లు చేశారు ? ఉత్తమ్: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో 66.7లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 155 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో వరి ధాన్యం పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నదంతా అబద్ధమని ఈసారి తేటతెల్లమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి చుక్కనీరు సరఫరా చేయకపోయినా ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. ప్రశ్న: సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నా, రైతులు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు కదా ? ఉత్తమ్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో దొడ్డు రకం ధాన్యం, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.500 బోనస్ చెల్లించి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు సన్న రకం ధాన్యం ఎంత వచ్చినా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తాం. పండించిన ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులపై ఆంక్షలు లేవు. సన్నాలకు మద్దతు ధర రూ.2320కు బోనస్ రూ.500 కలిపితే వచ్చే ధర కంటే అధిక ధరతో అమ్ముకునే అవకాశం వస్తే రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి మంచిది. ప్రశ్న: రైతులు సన్నాలను ప్రభుత్వానికి అమ్మకపోతే వచ్చే సంక్రాంతి నుంచి రేషన్‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఎలా చేస్తారు ? ఉత్తమ్: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఇబ్బంది లేకుండా అవసరమైన సరుకు సమీకరణ చేస్తాం. ఇబ్బందులేమీ రావు. ప్రశ్న: ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి ? ఉత్తమ్: నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం వీడియోలు తీసి రైతులు రోడ్లపై పారబోశారని బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17శాతం, ఆలోపే తేమ ఉండాలని కేంద్రమే నిర్దేశించింది. మద్దతు ధర సైతం కేంద్రమే నిర్ణయించింది. దాని ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుంటే బీజేపీ నేతలు కేంద్రాలకు వెళ్లి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. -
జగన్ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది
‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఏపీఈఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ⇒ ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం. ⇒ మూడు గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్‌ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు. ⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం. ⇒ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్ మిల్లులు, పల్వరైజర్ పరిశ్రమలకు 150 హెచ్‌పీ లోడు వరకు ఎల్టీ టారిఫ్ ద్వారా విద్యుత్ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్ ట్రస్ట్‌లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం. ⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం. ⇒ గృహ విద్యుత్ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్ పాయింట్ బిల్లింగ్ ప్రతిపాదనలను తిరస్కరించాం. -
పిల్లలపైనా మైగ్రేన్ దాడి
సాక్షి, విశాఖపట్నం: పిల్లల్లోనూ పార్శ్వపు (మైగ్రేన్ హెడేక్) తలనొప్పి విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ న్యూరో నిపుణురాలు డాక్టర్ డెబోరా ఫ్రెడిమాన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మైగ్రేన్‌కు సంబంధించిన పరిశోధనలు, చికిత్సలపై ఆదివారం మాట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే...ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి..15 నుంచి 40 ఏళ్లలోపు వారిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సమస్యలతో వచ్చే వంద మందిలో 40 మంది మైగ్రేన్ అని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రేన్ ఉంది. గడచిన పదేళ్లలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య దాదాపు 80 శాతం పెరిగింది. ఇది కలవరపాటుకు గురిచేసే అంశం.‘ఆరా’ రావడం వల్లే..ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. వీరిలో 4 శాతం మందికి తలనొప్పి వచ్చే ముందు ‘ఆరా’ అనే అనుభవం ఉంటోంది. కళ్లముందు మెరుపులు వచ్చినట్టు.. చుట్టూ బైర్లు కమ్మినట్లు, శరీరమంతా మొద్దుబారిన భావనకు గురవుతున్నారు. దీన్నే ఆరా అని పిలుస్తున్నాం. ఈ ఆరా ద్వారానే మైగ్రేన్‌కు మంచి చికిత్సల్ని తీసుకురాగలుగుతున్నాం. దాదాపు 20 ఏళ్లుగా మైగ్రేన్‌పై పరిశోధనలు చేస్తున్నాను. మెదడులో ఉండే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) అనే ద్రవం అలల మాదిరిగా కదులుతూ మెదడులోని మలినాల్ని శుభ్రం చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సీఎస్ఎఫ్లోకి సమస్యాత్మక ప్రోటీన్స్ వచ్చినప్పుడు ఆరా మొదలై.. మైగ్రేన్ అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆరాకు కారణమవుతున్న ప్రోటీన్లను అడ్డుకునేలా మందులు కనిపెట్టాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం.ఒత్తిడికి దూరంగా ఉండాలిమైగ్రేన్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించడం లేదు. 25 శాతం మంది మాత్రమే మైగ్రేన్ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. మైగ్రేన్ వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే.. దానికి తగినట్లుగా మందులు వాడుతుంటే.. క్రమంగా నివారించగలం. మైగ్రేన్‌కు సరైన చికిత్స లేదు. కానీ.. ఇటీవల కాలంలో సీజీఆర్‌పీ వంటి కొత్త చికిత్సలతో పాటు లాస్మిడిటన్, ట్రిప్టాన్స్ వంటి మందులు అందుబాటులోకి రావడంతో మైగ్రేన్ అటాక్స్‌ని తగ్గించగలుగుతున్నాం. అయితే.. జీవనశైలిలో మార్పులు రావాలి. సమయానికి నిద్ర,మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారానే మైగ్రేన్ని నియంత్రించగలం.చిన్నారులూ బాధితులేమరో బాధాకరమైన విషయమేమిటంటే.. మైగ్రేన్‌కు చిన్నారులూ బాధితులుగా మారుతున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 20 మంది దీనిబారిన పడుతున్నారు. బాలికలతో పోలిస్తే బాలురులో ఎక్కువగా ఇది కనిపిస్తోంది. తమకు తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పినా.. వాళ్లు నమ్మడం లేదు. స్కూల్ ఎగ్గొట్టేందుకు చెబుతున్న కుంటిసాకులుగానే తీసుకుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. తేలిగ్గా తీసుకుంటే మైగ్రేన్ ముప్పుగా మారుతుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. యుక్తవయసులో మాత్రం ఇది అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. -
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
తాతయ్య ప్రోత్సాహమే నడిపించింది
సాక్షి, అమరావతి: మెకానిక్ కొడుకు.. సరిగమలలో చెలరేగిపోతుంటే సంగీత సరస్వతి పులకించింది. ‘ఈ పేటకు నేనే మేస్తిరీ.. నిరుపేదల పాలిట పెన్నిది’ అంటూ ఓ పేదింటి కుర్రాడు పాడుతుంటే.. సంగీత దర్శకులు, గాయకులు, వీక్షకుల మనస్సులు చిందులు వేశాయి. తాత ఇచ్చిన ప్రోత్సాహం.. అమ్మ లేని ఆ యువకుడి అకుంఠిత దీక్ష.. ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్–3లో విజేతగా నిలిపింది. కష్టాలే మెట్లుగా, కన్నీళ్లే ఇంధనంగా మలుచుకుని తన అద్భుత స్వరంతో సంగీత ప్రియుల హృదయాలను గెలిచిన యువ సంచలనం నజీరుద్దీన్ షేక్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆ విశేషాలు నజీర్ మాటల్లోనే.. అమ్మ లేని బాధ నుంచి బయటపడటానికి.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మా ఊరు. మా నాన్న షేక్ బాజీ మోటర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పొషిస్తుండేవారు. అమ్మ మదీనా గతేడాది అనారోగ్యంతో మాకు దూరమయ్యారు. ఆ బాధ నుంచి బయటపడటానికి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్–3ని ఉపయోగించుకున్నా. మా తాతయ్య షేక్ ఖాసిం దాదాపు 47 ఏళ్లుగా ఘంటసాల గాన సభ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఘంటసాల విగ్రహం కూడా పెట్టించారు.రాగమయి ఆర్కెస్ట్రా స్థాపించి గాన కచేరీలు నిర్వహించేవారు. నాకు సంగీతంపై మక్కువ కలగడానికి.. ఆయనే కారణం. నా ఆసక్తిని గమనించి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే షణ్ముకి ఆంజనేయులు కుమారుడు షణ్ముకి వినయ్ వద్ద కీ బోర్డు నేరి్పంచారు. ఐదేళ్లకే పాటలు పాడేందుకు శిక్షణ ఇచ్చారు. తొమ్మిదేళ్లు వచ్చేసరికి నేను వేదికలపై పాటలు పాడే స్థాయికి చేరా. తాతయ్య చెల్లెలు షేక్ ఫాతిమా కూడా ఓ ప్రైవేటు స్కూల్లో సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమె నుంచి సంగీతంలో మెళకువలు నేర్చుకున్నా. రూ.పది లక్షల కన్నా.. ప్రపంచ గుర్తింపే గొప్ప హైదరాబాద్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం కోసం ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకుని పోటీకి ఎంపిక చేశారు. దాదాపు 15 వేల మంది ఆడిషన్లకు వస్తే.. 12 మందికి మాత్రమే పోటీచేసే అవకాశం లభించింది. ‘ఆహా’ ఓటీటీ వేదికగా దాదాపు 28 వారాల పాటు పోటీ జరిగింది. అందులో విజేతగా నిలవడం జీవితంలో అతి పెద్ద విజయంగా భావిస్తున్నా. పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు నాని, సుధీర్‌బాబు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కింది. బహుమతిగా వచి్చన రూ.10 లక్షలకన్నా.. నా కష్టాన్ని, టాలెంట్‌ను ప్రపంచం గుర్తించిందనే సంతోషం ఎక్కువగా ఉంది. ప్రముఖ గాయకులతో కలిసి విదేశాల్లో త్వరలో సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నానంటే నన్ను ఆదరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే. తెలుగు ఇండియన్ ఐడల్ వల్ల సంగీత దర్శకుడు తమన్, గాయకులు కార్తీక్, గీతామాధురితో పాటు సహ గాయకుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. సీఏ పూర్తి చేసి చదువులోనూ, సినీ గాయకుడిగానూ రాణించాలనుకుంటున్నా. ఏఆర్ రెహా్మన్ సినిమాల్లో పాడటం నా కల. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంటా. -
విద్యార్థులే భవిష్యత్ హీరోలు!!
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. – నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అప్పుడే చదివిన చదువుకు సార్థకత..సాంకేతిక కోర్సులు అభ్యసించాలనుకునే ఔత్సాహిక విద్యార్థులంతా ఐఐటీల్లో సీట్లు సాధించాలని భావిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే.. ఐఐటీ సర్టిఫికెట్ ఉంటే వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు, అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తాయనే ఆలోచనలకే పరిమితం కాకూడదు. ఐఐటీల్లో తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. యువత ముందు వరుసలో ఉండాలి..2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. ముఖ్యంగా సామాజిక అభివృద్ధికి చేసే పరిశోధనలు, ఆవిష్కరణల్లో యువత ముందు వరుసలో ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు సంకుచిత లేదా పరిమిత ఆలోచనల చట్రంలోంచి బయటకు రావాలి. విశాల దృక్పథంతో తమ ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాలి. దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలి.30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఈ రెండే కీలకం..ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాలను సాధించడానికి.. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి.. విద్య, నైపుణ్యాలే ఎంతో కీలకం. ప్రస్తుతం మనదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కూడా ఈ రెండు అంశాలే ప్రధాన కారణం. ఈ క్రమంలో చేతివృత్తుల నుంచి ఐటీ రంగం వరకు.. అన్ని రంగాల్లోని వారు నిరంతరం ఆధునిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇప్పుడు చేసే పనిని భవిష్యత్తులో రోబోలు చేయొచ్చు. అప్పుడు అకస్మాత్తుగా ఆ మార్పును అందిపుచ్చుకోలేక వృత్తిలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇక.. ఐటీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఏఐ, ఐవోటీ వంటి ఆధునిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాలి. వాటిలో పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో ముందుండటానికి అవకాశం ఉంటుంది.స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా..ఇటీవల కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలవడానికి మరో ప్రధాన కారణం.. స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా పలు చర్యలు తీసుకోవడం. విద్యా సంస్థల స్థాయిలోనే ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఏంజెల్ ఫండింగ్ చేసేందుకు పెట్టుబడిదారులు అంగీకరించేలా ప్రణాళికలు రూపొందించడం వంటి చర్యలతో స్టార్టప్స్ సంఖ్య పెరుగు తోంది. ముఖ్యంగా ఐఐటీల్లో ఇవి విస్తృతమవుతున్నాయి. దేశంలో 100కు పైగా ఉన్న యూనికార్న్ స్టార్టప్స్‌లో 15 శాతం సంస్థలు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల స్టార్టప్స్‌కు తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ముందుకు రావాలి..దేశాభివృద్ధికి తోడ్పడే యువతను తీర్చిదిద్దడంలో ప్రైవేట్ విద్యా సంస్థలూ ముందుకు రావాలి. కేవలం లాభాపేక్షతో విద్యా సంస్థలను నిర్వహించే ధోరణి విడనాడాలి. తమ విద్యార్థులు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాము లయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇంక్యుబేషన్ కేంద్రాలు, స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి..వేల సంవత్సరాల క్రితమే.. భారత్ అన్ని రకాలుగా ఎంతో ముందున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అలాంటి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే.. అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానంలోని మార్గదర్శకాలు సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా ఫలాలు అందేలా జాతీయ విద్యా విధానం రూపకల్పన జరిగింది.గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారత్..విదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ విద్యార్థులే మన దేశానికి వచ్చేలా, మన దేశాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడాన్ని విజన్–2047 లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో 2047 నాటికి ఏటా ఐదు లక్షల మంది విదేశీ విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చేలా విద్యా రంగంలో మార్పులు చేయనున్నాం. అదే విధంగా మన విద్యార్థులు కూడా స్వదేశంలోనే చదువుకునేలా ఇక్కడి విద్యా సంస్థలను మెరుగుపరిచే చర్యలకు కూడా సిఫార్సు చేశాం.పరిశ్రమలు– విద్యా సంస్థల భాగస్వామ్యందేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర కానున్న నేపథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కూడా ఎంతో ప్రధానమని గుర్తించాలి. పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు లేకపోతే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు పరిశ్రమలు, ఇటు విద్యా సంస్థలు నిరంతరం సంప్రదింపులు సాగించాలి. పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులకు విద్యా సంస్థలు నైపుణ్యాలు అందించాలి.అప్పుడు విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. అందుకే విద్యా సంస్థల కరిక్యులం, ఇతర బోధన వ్యవహారాల్లో పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి పరిశ్రమలు–విద్యా సంస్థల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణం.బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రొఫెల్ఛత్తీస్గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిజమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సంయుక్త కార్యదర్శి వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2022లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.2023లో నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.విజన్–2047 డాక్యుమెంట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. -
పరిశోధనలతో సమాజానికి మేలు
(వివేకానంద్ తంగెళ్లపల్లి) ; పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధనా రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువగా దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. తగినంత మంది అధ్యాపకులు ఉండాలి ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయతి్నస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కలి్పస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదుపరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’అని చెప్పారు. -
వ్యవ‘సాయం’ పెరిగింది.. ఖర్చులూ పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో తెలంగాణలో వ్యవ‘సాయం’పెరిగిందని, దీనికి సమాంతరంగా ఆధునిక భూస్వామ్యం కూడా శరవేగంగా పెరుగుతోందని అంటున్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం. కార్పొరేట్ వర్గాలు, ధనిక రైతులు, బడా అధికారుల చేతుల్లో భూమి కేంద్రీకృతమవుతుంటే 80 శాతం ఉండే సన్న, చిన్నకారు, ఉపాంత రైతుల పరిస్థితి కూలీల స్థాయిలోనే ఉండిపోయిందన్నారు.పాలకులు, కార్పొరేట్ వర్గాల ఐక్యతకు తెలంగాణ రాష్ట్రం నిదర్శనంగా నిలుస్తోందని, ఈ వర్గాల ఐకమత్యం కారణంగా రాజకీయ అవినీతి పెచ్చురిల్లుతోందని చెప్పారు. ఈ రెండు అంశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన దుష్పరిణామాలని, వీటికి వీలున్నంత త్వరగా చెక్ పెట్టకపోతే భవిష్యత్ తెలంగాణ మనుగడ ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పిన అందె సత్యం గుజరాత్, పంజాబ్, హరియాణ, కేరళ రాష్ట్రాల అనుభవాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సామాజిక పరిణామాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే... ! భూములు పంచాలి... ఉద్యోగాలివ్వాలి పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో 14 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇప్పుడు తెలంగాణలోనే 25 మిలియన్ టన్నులు దాటింది. సాగునీటి ప్రాజెక్టుల వినియోగం, వర్షాలు, కాళేశ్వరం లిఫ్టు కారణంగా పెరిగిన భూగర్భజలాలు, మిషన్‌కాకతీయ లాంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. సుస్థిర పంటల సాగు వైపునకు రైతులను మళ్లించాల్సి ఉంది. పంటల మార్పిడి విషయంలో దశాబ్దకాలంగా ముందడుగు పడలేదు.వ్యవసాయ ఉత్పత్తులే కాదు సాగు ఖర్చు కూడా అంతే పెరిగింది. పెరిగిన సంపద క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు లబి్ధదారులను తయారు చేస్తున్నాయి తప్ప వారిని ఆర్థిక వ్యవస్థలో పాత్రధారులను తయారు చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో పేదల పాత్ర ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకోసం భూపంపిణీ, ఉద్యోగాల కల్పన జరగాలి. మెట్రోపాలిటన్‌లో మనమే ముందున్నాం గత పదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ లక్షణాలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్, ఇతర అభివృద్ధి రంగాలన్నీ సానుకూల దిశలోనే ప్రభావితమయ్యాయి. ఐటీ పరిశ్రమ కారణంగా రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఆధునికత సంతరించుకుంది. ఉపాధి పెరిగింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరపతి కూడా పెరిగింది. సంఘటిత ఉపా ధి కల్పనలో ఐటీ పాత్ర అమోఘం.నిర్మాణరంగంలో దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే మనమే ముందున్నాం. విద్యాసంస్థల సంఖ్య పెరగడం, నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల ఆసక్తి, తల్లిదండ్రుల ఆపేక్ష పెరగడంతో నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ మారింది. విద్యుచ్ఛక్తి సామర్థ్యం పెరిగిన ఫలితాలు మరో ఏడాదిలో అందుతాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు చోదకశక్తిగా మారనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాల కల్పన జరిగింది. శాంతిభద్రతలు గత పదేళ్లుగా బాగున్నాయి. మూలధన ఖర్చు పెరగాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి చైనా ఒక ఉదాహరణ. పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగితేనే సంఘటిత ఉద్యోగాలు పెరుగుతాయి. తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకోవాలి. ఏటా రూ. 2–3లక్షల కోట్ల ప్రతిపాదించి ఖర్చు చేస్తున్నా, మూలధన వ్యయం (ఆస్తుల కల్పనకు ఖర్చు) రూ.20–30వేల కోట్ల మధ్యనే ఉంటోంది. దీర్ఘకాలిక అభివృద్ధి నెమ్మదించడానికి ఈ ఖర్చు కారణమవుతుంది. విద్య కార్పొరేటీకరణ రోజురోజుకూ పెరిగిపోతోంది. వైద్య రంగం కూడా శరవేగంగా కార్పొరేట్ బాట పడుతోంది. నికర అప్పులతో పాటు పూచీకత్తులు కలిపి తెలంగాణ జీడీపీ, అప్పుల నిష్పత్తి 30 శాతం దాటుతోంది. రానున్న కాలంలో బడ్జెట్లో 20 శాతం అప్పులు, వడ్డీల చెల్లింపులకే కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మేరకు పెట్టుబడుల కల్పన జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకం. అలాగే అవినీతిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతుంది. భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి దేశంలోని వివిధ రాష్ట్రాల అనుభవం మన ముందుంది. గుజరాత్ స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, హరియాణలలో 85 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. పేద రాష్ట్రమైనా కేరళ మానవ వనరుల అభివృద్ధి ద్వారా పురోగమనంలో పయనిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల అనుభవాలకు మన స్థానికతను జోడించుకొని అభివృద్ధి చెందాలి. పరిశ్రమలను ఆకర్షించడంలో తమిళనాడు, మహారాష్ట్రలు కూడా విజయవంతమయ్యాయి. ఈ దిశగా పాలకులు ఆలోచించి భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి. ’అని ఆయన వెల్లడించారు. -
ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి కాంక్షించే సుస్థిర అభివృద్ధికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని, సుస్థిర అభివృద్ధిని అంగీకరించని వారు నిజమైన అభివృద్ధికి వ్యతిరేకులేనని ఆర్థిక రంగ నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (కేంద్రీయ విశ్వవిద్యాలయం) సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజన్ పాలసీ మాజీ డైరెక్టర్ ఆచార్య కె. రాజమోహన్‌రావు అన్నారు.ఆర్థిక, సామాజిక రంగ విధానాల రూపకల్పన కోసం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రత్యేక సదస్సులో భారత దేశం నుంచి ప్రతినిధిగా హాజరవ్వడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలలో పర్యటించి అక్కడి ఆర్థిక అంశాలను అధ్యయనం చేసిన ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు సమాజాభివృద్ధికి ఏపీ విధానాలు దోహదం ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపూర్ణ సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమైతే అది నిజమైన అభివృద్ధి కాదనేది ఆర్థిక, సామాజిక రంగాలపై అవగాహన ఉన్న వారెవరైనా ఒప్పుకుంటారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల సంపూర్ణ సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. అందమైన భవనాలో, కొందరికో ఉపయోగపడే రెండు రంగాలకు ప్రాధాన్యమిచ్చి సంపదంతా అందులో పెట్టేయడమో, నున్నగా ఉండే రోడ్లో అభివృద్ధి కాదు.మానవ వనరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఈ ప్రపంచంలో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య వంటి 17 లక్ష్యాలను రూపొందించింది. ఆ లక్ష్యాల సాధన, అణగారిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో కూడిన సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజల్లో విద్య, వైద్యం మానసిక స్థైర్యాన్ని పెంపొదిస్తాయి సంక్షేమం, అభివృద్ధి రెండూ వేరు కాదనే విషయం గుర్తించాలి. ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మ ఒడి, ఆసరా, డ్వాక్రా మహిళలకు రుణాల వంటి పథకాలకు ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహం వారి సంక్షేమం, అభివృద్ధికి, వారిలో కొనుగోలు శక్తిని పెంపునకు దోహదం చేస్తున్నాయి. 2022–23 మధ్య ఏపీలో పెరిగిన అభివృద్ధి రేటు ఏపీలో 2018–19 సంవత్సరం నాటికి, 2022–23 సంవత్సరానికి మధ్య పలు రంగాల్లో ఎంతో వృద్ధి రేటు నమోదయింది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడెక్ట్) వృద్ధి రేటు 11 శాతం నుంచి 16.2 శాతానికి, వ్యవసాయాభివృద్ధి 5.4 శాతం నుంచి 14.9 శాతానికి, పారిశ్రామికాభివృద్ధి రేటు 10.4 శాతం నుంచి 16.3 శాతానికి, సేవారంగ వృద్ధి రేటు 12.7 శాతం నుంచి 20.5 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రూ.1,38,299 ఉండగా ఈ ప్రభుత్వ కాలంలో రూ.2,19,518కి పెరిగింది.ప్రజల అవసరాలు, పాలనా సంస్కరణల అమలు పేరుతో ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అప్పులు చేశాయి. అవి కొద్ది మందికే ప్రయోజనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలు, స్వయం ఉపాధి ప్రోత్సాహ పథకాలు వంటి వాటి ద్వారా మన రాష్ట్రంలో నిజమైన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతోంది. ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్న చాలా మంది ప్రజలు నేడు పలు పథకాల ద్వారా ఏపీలో లబ్ధి పొందుతున్నారు. -
బీజేపీ వైపే ప్రజలు
(కె.రాహుల్) : ‘కరీంగనగర్‌లోనే కాదు, రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ప్రజల మూడ్ బీజేపీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలని, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు..’ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో వివిధ వర్గాల ఓట్లు సాధించి లోక్‌సభ ఎన్నికల్లో తాను కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో 8న జరిగిన ప్రధాని మోదీ సభకు ఉదయం 9 గంటలకే వెల్లువలా వచ్చిన ప్రజలు సంజయ్‌దే విజయమని ప్రకటించేశారన్నారు. తనపై పోటీచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ నాన్ లోకల్ అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. ‘నేను ఈ గడ్డమీదే పుట్టిన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నా. ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నడైనా ఈ గడ్డ ప్రజల కోసం పోరాటాలు చేశారా? మళ్లీ గెలిపిస్తే నాకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఏర్పడ్డ సంబంధాలతో మరింత అభివృద్ధి చేస్తా..’ అని చెప్పారు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్ పాలన, అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.\నేనేం చేశానో గ్రామాల్లో కన్పిస్తోందిమా పోరాటాల వల్లే కేసీఆర్ సర్కార్ పీడ విరగడైంది. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చిన. కేసీఆర్ పాలనలో విసిగి, అన్యాయాలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేసిన. కేసీఆర్ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. జిల్లాకు సంబంధించిన అనేక రోడ్ల పనులకు కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి పనులు స్టార్ట్ చేయించిన. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కళ్లకు కన్పిస్తుంటే ఏమీ చేయలేదనే వాళ్లను ఏమనాలి ? మేం పక్కా హిందుత్వవాదులంహిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం. ఆ పార్టీతో పదేళ్ల పాటు సంసారం చేసింది బీఆర్ఎస్. మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్. హిందువుల ఆత్మ గౌరవం కోసం నేను కొట్లాడుతా. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా..దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపోళ్లని రేవంత్‌రెడ్డి హేళన చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ మాటలు జనం నమ్మడం లేదని ఆ దేవుడి మీదే ఒట్టేసే పరిస్థితికి వచ్చిండు. రాముడి అక్షింతలను, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారు. ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయం.నాకే బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుందిరాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 సీట్లలో బీజేపీ గెలవబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతకు మించి గెలిచినా ఆశ్చర్యపోవడానికి లేదు. నేను గెలిచిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారా? ఏ బాధ్యత అప్పగిస్తారనేది మోదీ నాయకత్వంలోని మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్ ప్రజల సేవకుడిని. పార్టీ అప్పగించిన పని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత.ఫోన్ ట్యాపింగ్ డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తున్నారుఫోన్ ట్యాపింగ్ డబ్బులు తీసుకొచ్చి కరీంనగర్లో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు వెయ్యి ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు, ఆ పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. ఈ రెండు పార్టీలు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పైకి డ్రామాలు ఆడుతున్నాయి.రిజర్వేషన్లకు కాంగ్రెస్ తూట్లుకాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. ముస్లిం రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేత. అలాంటి నాయకుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయకపోవడంతో మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయి. ఆ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎంకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం. ఈ పార్టీలన్నీ అవినీతి ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మోసం చెయ్యాలి.. తిరిగి ఎన్నికలొస్తే డబ్బులతో ఓట్లు ఎలా కొనాలి? అనే చూస్తాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్ పార్టీలు పీహెచ్డీ చేశాయి. కేసీఆర్ కుటుంబం అవినీతిలో గుడిని మింగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడిలో లింగాన్ని కూడా వదలిపెట్టనట్లుగా అవినీతికి తెరదీస్తూ... ఆ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతోంది. గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టింది. వంద రోజుల పేరుతో 6 గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామనడం పెద్ద అబద్ధం. -
అవన్నీ అపోహలే
మేకల కళ్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులకు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2023 ద్వారా మరింత రక్షణ లభిస్తుందని భూ చట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) స్పష్టం చేశారు. ఈ చట్టంపై ఉన్న అపోహలు, అనుమానాలు సత్యదూరమైనవన్నారు. ఈ చట్టం వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని భూములకు గ్యారంటీ లభిస్తుందన్నారు. ఈ గ్యారంటీకి ప్రభుత్వం సరి్టఫికెట్ ఇస్తుందని తెలిపారు.ఈ చట్టం భూముల రక్షణ కోసమే కానీ భక్షణ కోసం కాదని తేలి్చచెప్పారు. రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి హక్కుల గ్యారంటీ పత్రం వస్తే ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భూములు కొంటారన్నారు. దీంతో పెట్టుబడులు పెరుగుతాయని, నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదని, ఆ కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందన్నారు. నలభై ఏళ్లుగా ఎలాంటి చట్టం రావాలని ఆశించామో, భూహక్కులకు ఎలాంటి భద్రత కలగాలని అనుకున్నామో అలాంటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ చట్టమని తెలిపారు. ఇలాంటి చట్టంపై అపోహలను సృష్టించడం, వాటిని సమరి్థస్తూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు.ఎవరూ చేయలేకపోయిన ఈ చట్టం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం కారణంగానే అమల్లోకి వస్తోందన్నారు. ఇలాంటి చట్టాన్ని తేవాలని 1908లో రిజి్రస్టేషన్ల చట్టం, 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం రూపొందిస్తున్నప్పుడే అనుకున్నారన్నారు. ఈ మేరకు సునీల్ కుమార్ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి సంబంధించి అనేక అనుమానాలను నివృత్తి చేశారు. ప్రశ్న: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తెచ్చిందా? సునీల్: ఈ చట్టం లక్ష్యమే ఆస్తులు లేదా భూములకు రక్షణ కల్పించడం, ప్రభుత్వం తరఫున గ్యారంటీ సరి్టఫికెట్ ఇవ్వడం. ఏదైనా తేడా వస్తే సదరు ఆస్తి లేదా భూమికి పరిహారం చెల్లించడం. లాక్కోవడం, లాక్కోవాలనుకోవడం ఈ చట్టం ద్వారానే కష్టమవుతుంది. అలాంటి వాళ్ల ఆటలు ఈ చట్టంతో సాగవు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూముల యాజమాన్య పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయా? సునీల్: ఇప్పటివరకు రైతుల చేతుల్లో భూమికి సంబంధించిన పాస్ పుస్తకం మాత్రమే ఉంది. ప్రభుత్వం చేతిలో ఆ భూమి రికార్డులు, సాగు వివరాలతో కూడిన అడంగల్ ఉన్నాయి. ప్రస్తుతం భూములకు సంబంధించి మొత్తం 40 రకాల రిజిస్టర్లు ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇన్ని రిజిస్టర్లు ఉండవు.. ఒక్కటే రిజిస్టర్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ రికార్డులుండే రిజిస్టర్‌కు అదనంగా ప్రభుత్వం యజమానులకు గ్యారంటీ సరి్టఫికెట్, యాజమాన్య పత్రంఅందజేస్తుంది. భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలను యజమానులకే ఇస్తుంది. ప్రశ్న: ఇప్పటికే పాస్ çపుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నవారు కూడా ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలా? సునీల్: ఇది కూడా వాస్తవం కాదు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 1బీ రికార్డు ఉంది. భూముల సర్వే ద్వారా కొత్త రికార్డు తయారవుతుంది. ఈ రికార్డుల ఆధారంగా టైటిల్ రిజి్రస్టేషన్ అధికారి (టీఆర్వో) రిజిస్టర్ తయారు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యాకే శాశ్వత రిజిస్టర్ రూపొందిస్తారు. రైతులు లేదా యజమానులు వెళ్లి వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూతగాదాల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదా? సునీల్: ఇప్పుడున్న విధానం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను రెవెన్యూ అధికారులే సరిదిద్దుతారు. యాజమాన్య వివాదాల కోసం మాత్రమే సివిల్ కోర్టులకు వెళుతున్నారు. కొత్త చట్టం వచ్చాక కూడా రెవెన్యూ రికార్డుల్లో మార్పుల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫోరంకు వెళ్లొచ్చు. యాజమాన్య వివాదాలుంటే హైకోర్టుకెళ్లొచ్చు. ప్రశ్న: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌వోకు సమాచారమివ్వాలా? సునీల్: ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదు. అసలు కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తోంది. ఒకవేళ కోర్టులకు వెళ్లినా ఏళ్లతరబడి జాప్యం జరగదు. రికార్డులన్నీ పకడ్బందీగా ఉంటాయి. యాజమాన్య హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి కేసులు కూడా త్వరగా పరిష్కారమవుతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచి్చన గ్యారంటీ తప్పయితే సదరు రైతుకు పరిహారం లభిస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు? సునీల్: ఈ చట్టం ద్వారా ప్రతి గ్రామానికి టైటిల్ రిజిస్టర్ వస్తుంది. ఈ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏవైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ గ్యారంటీకి అనుగుణంగా రిజిస్టర్లో మార్పులు చేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులకు మాత్రమే ఉంటుంది. వారి అధికారాల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు. ప్రశ్న: కొత్త చట్టం ద్వారా వారసత్వ హక్కుల వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? సునీల్: వారసత్వ హక్కుల్లో ఎలాంటి వివాదాలూ లేకపోతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో) చేస్తారు. వివాదం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. సివిల్ కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును టీఆర్వో రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రశ్న: వందేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న భూముల సర్వే ప్రాధాన్యత ఏంటి? సునీల్: వాస్తవానికి భూముల సర్వేలు ప్రతి 30 ఏళ్లకోసారి జరగాలి. ఏపీలో 1910 తర్వాత సర్వే రికార్డులు రూపొందాయి. ఇప్పుడు 110 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేందుకు భూముల సర్వేలే పునాది. ఇప్పుడు ఏపీలోని నాలుగువేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. సమస్యలు పరిష్కారమయ్యాకే సర్వే రికార్డులు రూపొందిస్తారు. ప్రశ్న: ఇలాంటి చట్టం ఎక్కడైనా అమల్లో ఉందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆ్రస్టేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. భూముల హక్కులకు గ్యారంటీ ఉంటే జీడీపీ పెరుగుతుందనే శాస్త్రీయ లెక్కలున్నాయి. ప్రశ్న: ఇది కేంద్ర చట్టమా? రాష్ట్ర ప్రభుత్వ చట్టమా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1987లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను ప్రణాళికా సంఘం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచి్చంది. ఆ తర్వాత 2008లో కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. ఈ చట్టాన్నయినా లేదంటే మహారాష్ట్రలో అమల్లో ఉన్న చట్టాన్నయినా, లేదంటే ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు చేసుకుని కొత్త చట్టం చేసుకోవాలని సూచించింది. ప్రశ్న: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచి్చందా? సునీల్: ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. ఆ తర్వాతే చట్టం అమల్లోకి వస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూముల హక్కులపై స్పష్టత, భద్రత, భరోసా వస్తాయి. సమస్యల పరిష్కారం, లావాదేవీల బదలాయింపు సులభమవుతుంది. ఇప్పుడు ఉన్న రికార్డులు, చట్టాలు హక్కుల నిరూపణలకు అంతిమ సాక్ష్యాలు కావు. ఇవన్నీ తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొత్త చట్టం వచి్చంది. ఇది తప్పకుండా రైతులకు మేలు చేసే చట్టమే. ఈ చట్టం అమలులో ఇబ్బందులను అధిగమించగలిగితే ఏపీలోని ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ప్రతి భూమికి, ఆస్తికి రక్షణ లభిస్తుంది. ప్రశ్న: ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయా? సునీల్: చెల్లకుండా పోవడానికి ఇవేమీ రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు కాదు. జాతీయ స్థాయిలో చర్చించి ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ లాంటివి సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన చట్టం. ఒకేరోజు చెల్లకుండా పోవు. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలాను క్రమంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ ఇచ్చాక మాత్రమే పాత రికార్డులు చెల్లవు. ప్రశ్న: భూహక్కులకు సంబంధించి వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు? సునీల్: భూరికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 124 చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. ప్రశ్న: ఈ చట్టం వ్యవసాయ భూములకేనా? వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తిస్తుందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం అన్ని రకాల భూములు, ఆస్తులకు వర్తిస్తుంది. గతంలో వ్యవసాయ భూముల రికార్డులు రెవెన్యూ శాఖ దగ్గర ఉంటే.. ఆస్తుల వివరాలు స్థానిక సంస్థల వద్ద ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని భూములు, ఆస్తులకు ఒకటే రిజిస్టర్.. ఒకటే మ్యుటేషన్. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వచ్చాక రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? సునీల్: భూ రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఈ చట్టం ద్వారా ప్రధాన మార్పులు వస్తాయి. ఇప్పటివరకు స్టాంపు కాగితాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అత్యంత భద్రతతో ప్రభుత్వ గ్యారంటీతో కూడిన డాక్యుమెంట్లు వస్తాయి. హక్కులను కూడా టీఆర్‌వోనే బదలాయిస్తాడు కాబట్టి మ్యుటేషన్ అవసరముండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు డీడ్స్ రిజి్రస్టేషన్ జరగ్గా ఇక నుంచి టైటిల్ రిజి్రస్టేషన్ జరుగుతుంది. ప్రశ్న: ఈ చట్టం అమలు పట్ల న్యాయవాదులకున్న అభ్యంతరాలేంటి? సునీల్: ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల లిటిగేషన్లు తగ్గిపోతాయి. కోర్టుల్లోఉన్న కేసుల్లో 66 శాతం భూ వివాదాల కేసులే. చట్టం అమల్లోకి వస్తే అది 10 శాతానికి తగ్గిపోతుంది. భూవివాదాల పరిష్కారం వల్ల నేరాలు కూడా తగ్గిపోతాయి. దీంతో సివిల్ కేసుల కోసం ప్రజలు కోర్టులకు వెళ్లాల్సినఅవసరం ఉండదేమో. ప్రశ్న: ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకూడదా? సునీల్: కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు.. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లకు ఇదే పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వ్యాక్సినేషన్ సరి్టఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. ఈనాడు కథనం కల్పితం ఉమ్మడి కర్నూలు జిల్లాకుచెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్‌కే రాలేదు కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు వెల్లడి కర్నూలు(సెంట్రల్): ‘‘ఈనాడులో మీ భూమి మీదికాదు శీర్షికన ప్రచురితమైన కథనం పూర్తిగా ఊహాజనితం. కలి్పతం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్ కోసం వెళ్తే టైటిల్ రిజి్రస్టార్ ఆఫీసర్(టీఆర్ఓ) అనుమతి తీసుకొని వస్తేనే రిజి్రస్టేషన్ చేస్తామని చెప్పినట్లు ఆ కథనంలో ఉన్న విషయం అవాస్తవం’’అని కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు స్పష్టం చేశారు. తన పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచారణ చేయించామన్నారు. గోవిందరెడ్డి పేరుతో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్ జరగలేదన్నారు. కనీసం సదరు వ్యక్తి సందేహా నివృత్తి కోసం కూడా రాలేదన్నారు. ఇంతవరకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. పూర్వం నుంచి అమల్లో ఉన్న రిజి్రస్టేషన్ చట్టం ప్రకారం ఆన్లైన్ 1బీ, అడంగల్ చూసి మాత్రమే వ్యవసాయ భూములు రిజి్రస్టేషన్లు చేస్తున్నామన్నారు.అపోహలు వద్దు ‘ఈ భూమి మీది కాదు’రాతలు కలి్పతం మాత్రమే శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ స్పష్టీకరణ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం జిల్లాలోని 13 సబ్–రిజి్రస్టార్ కార్యాలయాలకు సాంబశివుడు అనే పేరుతో ఏ వ్యక్తీ రిజి్రస్టేషన్ కోసం గానీ, తన భూమి రిజి్రస్టేషన్ విషయమై సందేహ నివృత్తి కోసం గానీ రాలేదని జిల్లా రిజి్రస్టార్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఈనాడు దిన పత్రికలో ‘ఈ భూమి మీది కాదు’ శీర్షికతో వచ్చిన కథనం కేవలం ఊహాజనితం, కల్పితం మాత్రమేనని ఖండించారు.భూ యాజమాన్య హక్కు చట్టం అనేది రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదిత, సంప్రదింపుల దశలోనే ఉందన్నారు. ఈ చట్టం ప్రతిపాదిత వివరాల్లో రిజి్రస్టేషన్ కార్యాలయాల పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. రిజి్రస్టేషన్ కార్యాలయాల్లో ఇంతకు ముందు ఏ పద్ధతిలో రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఎవరా సుబ్బారావు? ఈనాడులో తప్పుడు కథనం అటువంటిదేమీ లేదన్న అమలాçపురం జిల్లా రిజిస్ట్రార్ సాక్షి, అమలాపురం: జగన్ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వస్తోందని, దీని వల్ల అమలాపురానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని ఊరూ పేరూ లేని మరో వ్యక్తి పేరిట రాసేశారని ఈనాడు ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జిల్లా రిజి్రస్టేషన్, స్టాంపుల శాఖ రిజి్రస్టార్ బి.శ్రీనివాస్ రాత పూర్వకంగా ఖండించారు. సుబ్బారావు అనే పేరుతో ఏ వ్యక్తీ జిల్లాలోని 15 సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కోసం రాలేదని, కనీసం సందేహ నివృత్తికి కూడా సుబ్బారావు తమ కార్యాలయాలను సంప్రదించలేదని నిర్ధారించారు. అసలు భూ యాజమాన్య హక్కు రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి నిబంధనలు ఇంకా రూపొందించకపోతే కొత్త రిజిస్ట్రేషన్ ఎక్కడుందని ప్రశి్నంచారు. ఈనాడులో వచి్చన కథనంపై శాఖాపరమైన చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా, ఎవరా సుబ్బారావు అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. -
పేదల పక్షపాతి జగన్
‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచి్చన తరువాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూశా. చాలా కాలంగా రాజకీయాలను గమనిస్తున్నాను. ఇప్పటివరకూ ఏనాడూ చూడని అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగింది. చెప్పింది చేయడం... చేసేదే చెప్పడం ఆయన అభిమతం. మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఖురాన్‌లా, బైబిల్లా భావించి తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయనే.’ అని ప్రముఖ సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది నేను పుట్టి పెరిగింది చెన్నైలో. మా అమ్మా నాన్నలది కర్ణాటకలోని మంగళూరు. చెన్నైలో అన్నాదురై కాలం నుంచీ ఎంజీఆర్, కామరాజ్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి కాంగ్రెస్... ఆ తర్వాత ప్రభుత్వాల వరకూ గమనిస్తున్నాను. పూర్వాశ్రమంలో మాది కాంగ్రెస్ పారీ్టకి చెందిన కుటుంబం. దివంగత ప్రధాని ఇందిరాగాం«ధీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా చేసిన జనార్దన్ పూజారి మాకు దూరపు బంధువు. నా పూర్తి పేరు సుమన్ పూజారి(అయితే స్కూల్ రికార్డ్స్‌లో సుమన్ తల్వార్ అని ఉంటుంది) పూజారి అంటే గుడి పూజారి కాదు. ఆయుర్వేద వైద్యం చేసే బిల్లవ కమ్యూనిటీ అది. జగన్‌ని బీసీలు ఎన్నటికీ మరచిపోరు నేను కూడా బిసీ కమ్యూనిటీకి చెందిన వాడ్ని కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేత జగనే. అది నేను చెప్పడం కాదు స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఆయన బీసీలకు 48 సీట్ల వరకూ ఇచ్చారు. అలాగే 11 ఎంపీ టికెట్లు ఇచ్చారు. గతంలో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఇచ్చారు. బీసీలు ఎవ్వరూ జగన్‌ను మర్చిపోయే అవకాశం లేదు. అంత ప్రాధాన్యత మరెవ్వరూ ఇప్పటిదాకా బీసీలకు ఇవ్వలేదనేది వాస్తవం. ఏపీలో విద్య, వైద్యం అద్భుతం డబ్బున్నవారు.. ఆ స్థాయిలో ఉన్నవారు ఎలాగైనా బతికేస్తారు. కానీ పేదల బతుకులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. వాళ్లకు సరైన తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. ఎదగడానికి చదువు లేదు. సరైన వైద్యం అందడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ జగన్ అద్భుతమైన పరిష్కారాలు చూపించారు. పేదల విద్య, వైద్యం విషయంలో ఆయన చేసిన సంస్కరణలు ప్రశంసనీయం. నేను చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లకు స్వయంగా వెళ్లి చూశా. ఒకప్పుడు స్కూలా శ్మశానమా అన్నట్టు ఉండేది. ఇప్పుడు నీట్‌గా క్లాస్‌రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేదల పిల్లలు స్వచ్ఛమైన ఇంగ్లి‹Ùలో గుడ్‌మారి్నంగ్, థాంక్యూ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా అనిపిస్తోంది. వైద్యం విషయంలోనూ చాలా మంచి మార్పు కనబడుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్స్ వంటివి పేదలకు బాగా ఉపయోగపడేవే. పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. రేపటి వైద్యుల కోసం దాదాపుగా జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తోందంటే గొప్ప విషయమనే చెప్పాలి. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే ఊహించని ఉత్పాతంలా వచి్చపడిన కరోనాని ఆయన అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగారు. ఆ సమయంలో నేను ప్రత్యక్షంగా గమనించాను. అత్యధిక వైద్య పరీక్షలు చేయడం... ప్రభుత్వం తరపున ప్రజలకు అందించిన మెడికల్ సరీ్వసెస్, జనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వృద్ధుల విషయంలో ఆయన తీరే వేరు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటిదాకా వృద్ధుల గురించి ఏ సీఎం కూడా ఇంతగా ఆలోచించలేదు. నెలకోసారి ఇచ్చే పింఛన్ల కోసం వృద్ధులు చాలా కష్టపడేవారు. ఎండల్లో, వర్షాల్లో... గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అలాంటి వారు ప్రస్తుతం ఇంటి దగ్గరే కూర్చుని దర్జాగా పింఛన్ తీసుకునేలా చేసింది తొలుత జగనే. ఇప్పటిదాకా దేశంలో ఎవరూ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎవరు అమలు చేసినా అది కచి్చతంగా కాపీ కొట్టినట్టే. చెప్పిందే చేశారు చేసిందే చెబుతున్నారు నిరుపేదల కోసం జగన్ సీఎం అయ్యాక చాలా వరకూ మంచి పనులు చేశారు. తాను పదవిలోకి రాక ముందు ఏదైతే చెప్పారో అందుకు తగ్గట్టు కమిట్ అయిన ప్రతీదీ చేశారు. ఇప్పుడు తాను చేసిందే చెపుతున్నారు. నిజం చెప్పాలంటే కొందరైతే ఆయన చెప్పిందానికన్నా ఎక్కువే చేశారంటున్నారు కూడా. అభివృద్ధి అంటే ఒక వ్యక్తికో, ఒక కులానికో కాదు ఇప్పుడు చాలా మంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఒక వ్యక్తికా... ఒక కులానిదా... లేక రాష్ట్ర అభివృద్ధా... అనేది ప్రజలు ఆలోచించాలి. అంతకు ముందు పాలించిన వారు ఏ మేరకు అభివృద్ధి చేశారు. ఇంకా ఏం చేయలేదు... అన్నది విశ్లేíÙంచుకోవాలి. ఎంత గొప్ప పాలన అయినా చిన్న చిన్న లోపాలు తప్పవు. అన్నీ అద్భుతాలే చేయాలంటే అసాధ్యం. ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా గ్యాప్ రాకుంటే ఇంకా గొప్పగా అభివృద్ధి జరిగి ఉండేదని నా అభిప్రాయం. మేనిఫెస్టో... బాగుంటే చాలదు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ మేనిఫెస్టో కన్నా హామీలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెప్పారు. అయితే అందులోని హామీలు ఏ మేరకు అమలవుతాయి? ఎంత వరకూ అమలు కావు? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రస్తుత పాలనను కూడా ఒక్కసారి పోల్చుకోవాలి. –సత్యార్ధ్ -
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ, సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు. ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సత్యార్థ్ బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్ సెట్‌తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్ క్లినిక్‌లో ల్యాబ్ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్ క్లినిక్స్‌ని డిజైన్ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్‌లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్‌లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్‌సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం. -
ప్రజల మనిషి జగన్
‘రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే జగన్మోహన్రెడ్డి లక్ష్యం. నిరంతరం ప్రజల మనిషిగా నిలిచిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష. గత ఎన్నికల సమయంలోనే ఆయనలో ఉన్న గొప్ప ప్రజాసేవకుడిని గుర్తించాను. ఆయన తన ఆకాంక్షలు అంచనాలకు మించి జగన్ పనిచేస్తున్నారు’ అని ప్రముఖ చలన చిత్ర నటుడు భానుచందర్ అన్నారు. జగన్ పాలనా దక్షతపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నిస్సందేహంగా జగన్ ఒక బ్రిలియంట్ గై. ఆయన ఏది చేసినా ప్రజల గురించి చేస్తున్నారు. ఆయనో అసలు సిసలు యువ నేత. ఆయనది నవ యువ భావజాలం. ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతీ నిమిషం ఆలోచన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎలాగైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో... అలాగే జగన్ బాబు కూడా అదే ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మేలు కోరి చేసే ఆయన ఆలోచనలు, ప్రణాళికలు... అన్నీ సాకారం కావాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్సార్‌లాగా కాదు... అంతకు మించి ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కారు. బతికినంత కాలం మనం నలుగురికి ఏం మంచి చేశామనేదే ముఖ్యం. కొన్ని తరాల పాటు మన పేరు ప్రజలకు గుర్తుండిపోవాలి. దివంగత వైఎస్సార్ విషయంలో అదే జరిగింది కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక్క పథకం వల్ల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా బతికున్నారు. అలాగే జగన్‌బాబు కూడా అంతకు మించి అనేక మంచి పనుల ద్వారా ప్రజలకు గుర్తుండిపోవాలి అని ఆశపడుతున్నారు. నిజంగా యుక్త వయసులోనే ఇలాంటి ఆలోచనా ధోరణి రావడం చాలా గొప్ప విషయం. అది సాధించే శక్తి కూడా ఆయనకు ఉంది. –సాక్షి, అమరావతి మంచికే మద్దతు పలకాలి మోదీ నుంచి జగన్ బాబు దాకా ప్రజలకు మంచి చేసే వారికి మద్దతివ్వాలి అనేది నా మనస్తత్వం. విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మన దేశంలో గాం«దీజీ మీద కూడా విమర్శలు చేస్తారు. ఎవరి విమర్శల వెనక ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అయితే అవన్నీ పక్కనబెట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? మన వల్ల ప్రజలకు కలుగుతున్న లాభమేమిటి? అనేది జగన్ బాబుకు ముఖ్యం. తను నమ్ముకున్న అదే పంథాలో ఆయన వెళుతున్నారు.కచ్చితంగా ఆయనకు అంతా శుభమే జరగాలి. జరుగుతుంది కూడా. నేను గత ఎన్నికల ముందు కూడా జగన్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన గొప్ప పాలన అందిస్తారని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా జగన్‌ను నేను కలవలేదు. అయితే అది ముఖ్యం కాదు. ఆయన ప్రజలకు మంచి చేయడం నాకు ముఖ్యం. అలాంటి ముఖ్యమంత్రికి నాలా ప్రజల మంచి కోరుకునే ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలి. ఇస్తారనే నేను నమ్ముతున్నాను. తమకెవరు మంచి చేశారనేది ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తమ గురించి నిరంతరం ఆలోచించే మంచి చేసిన వారినే జనం గెలిపిస్తారు. జనం గురించి ఎప్పుడూ ఆలోచించే నాయకుడు జగన్. నా ఉద్దేశం ప్రకారం మళ్లీ జగన్ గెలవడం... ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం. -
జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
జగన్ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను వైఎస్సార్సీపీ సపోర్టర్ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా! - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది. మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్సీపీ బంపర్ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్సీపీ సపోర్ట్ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. –సత్యార్థి -
మట్టిలో మాణిక్యాలకు జగన్ వల్లే వెలుగు
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక ఎందరో క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర మంతా భారీఎత్తున నిర్వహించారు. ఎందరో క్రీడాకారులు ముందుకెళ్లడానికి ఇది దారిచూపింది. అలా వెలుగులోకి వచి్చన వారిలో ఆనంద్‌పాల్ అలియాస్ పవన్ ఒకరు. విజయనగరం జిల్లా జామి మండలంలోని మారుమూల గ్రామం అలమండకు చెందిన ఈ కుర్రాడు ధోనీ సారధ్యంలోని ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని వచ్చిన అనంతరం పవన్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. – సత్యార్థ్ సెమీ ఫైనల్స్‌లో ఓడినా.. అన్ని చోట్లా మా టీమ్ గెలుపొందింది. చివరకు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లు వీక్షించడానికి వచి్చన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ నన్ను దత్తత తీసుకుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక అద్భుతం అనుకుంటే.. ఏకంగా సీఎస్కే టీమ్ ట్రైనింగ్‌కు ఎంపికవడం.. శిక్షణ అనంతరం నాకెంతో ఇష్టమైన క్రికెటర్ ధోని ఆధ్వర్యంలోని టీమ్‌లో సభ్యుడిగా ఆడే అవకాశం నాకు దక్కవచ్చని తెలిసి పొంగిపోయాను. ఈ అవకాశం సది్వనియోగం చేసుకుని క్రికెటర్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేనులో ఆట నుంచి ‘చెన్నై’ దాకా... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. పొలాలమ్మట, గల్లీల్లో ఆడుతూ ఉండేవాడిని. ‘చదువుకుని ఉద్యోగం చేసుకోక క్రికెట్ అంటూ తిరుగుతున్నావ్ ఏంట్రా’.. అంటూ అమ్మ కోప్పడుతూ ఉండేది. ఫ్రెండ్స్ మాత్రం క్రికెట్ బాగా ఆడతానని పొగుడుతుండేవారు. అడపాదడపా గ్రామాల్లో జరిగే మ్యాచ్‌లలో ఆడి స్వల్ప పారితోషకాలు అందుకోవడం తప్ప ఆటకు ఎలా సానబెట్టుకోవాలో నాకు తెలియలేదు. అదే సమయంలో దేవుడిచి్చన వరంలా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మా గ్రామ సచివాలయం ద్వారా ఆ కార్యక్రమానికి ఎంపికయ్యాను. థాంక్స్ టూ జగన్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాను. థాంక్స్ టూ జగన్ సార్.. ఆయనెప్పుడూ పేదల పక్షానే ఉంటూ.. ఎన్నో మంచి పథకాలు అమలుచేస్తున్నారు. క్రీడల విషయంలోనూ పేదలకు మేలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారు. గల్లీల్లో ఆడుకునే నాలాంటి వాడు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. మరోసారి ఆయనే సీఎం కావాలని.. ఆడుదాం ఆంధ్రాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. -
ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి
ఓ నాయకుడి గురించి రాసేటప్పుడు కలం కదలాలంటే ఆ నాయకుడి వ్యక్తిత్వంలో బలం ఉండాలి. అక్షరాలు పరుగులు తీయాలంటే లక్షణాలు ప్రేరణ కావాలి అంటున్నారు జానపద గేయ రచయిత లక్ష్మణ్.‘నీ బుల్లెట్టు బండెక్కి..’ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన ఈ యువ రచయిత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుణగణాల్ని వర్మిస్తూ రాసిన ‘జెండాలు జత గట్టడమేమీ అజెండా.. జనం గుండెలో గుడికట్టడమే జగన్ అజెండా’ అనే పాట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షితో తన అనుభూతిని పంచుకున్నారిలా... – సత్యార్థ్ పేదల ముంగిట్లో పథకాలు పాట రాయడానికి ముందు వలంటీర్లతో స్వయంగా మాట్లాడి ఆయన అమలు చేసిన పథకాల గురించి తెలుసుకున్నా. కడుపు నిండినోడ్ని కాదు ఆకలితో కడుపు మండేవాడ్ని మాత్రమే పట్టించుకోవాలనీ, చాచిన ప్రతీ చేయికీ సాయం అందాలి అనే ఆలోచనలతోనే ఆయన ఆ పథకాలన్నీ తీర్చిదిద్దారని అర్థమైంది. ఆ అవగాహనే ‘‘మా ఇంటికే తెచ్చిండు ప్రభు త్వం మా చేతికే ఇచ్చిండు రా పథకం’’ అంటూ కీర్తించేలా చేసింది. ప్రభుత్వ పథకాలు ఇంటికి రావడం దేశంలోనే జగన్ సార్ వల్ల వచ్చిన గొప్ప మార్పు. నిరుపేదలు ఆస్పత్రి ఖర్చులతో అన్యాయం అయిపోవద్దు. రోగంతో కోలుకున్నాక కూడా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు పూర్తిగా నయమైంది అని కచ్చితంగా తెలుసుకోవాలి... అని ఆయన మాట విన్నప్పుడు నిజంగా నాకు కళ్లలో నీళ్లొచ్చాయి. కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా.. జగన్ పుట్టుకలో వెనుకడుగేయని తత్వం ఉంది. ఆయన్ను నమ్ముకున్న కార్యకర్త ఆత్మగౌరవంతో ఉండాలి. ధైర్యంగా కొట్లాడాలి. ఏదోవిధంగా గెలవాలని, తాను పొత్తులకు దిగజారిపోకూడదు అని ఆయన అనుకుంటారు. తన కోసం వారు మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు అనేది ఆయన ఆలోచన అని నాకు అర్థమైంది. పైన ఉన్న దేవుడ్ని కింద ఉన్న జనాన్నే నేను నమ్ముకున్నా అంటూ తరచుగా ఆయన చెప్పడం నాకెంత స్ఫూర్తినిచ్చిందో... పరిచయమైన కొద్దీ... పదునెక్కిన పదం జగన్ మీద అప్పటికే ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి. ఆయన కోసం పాట రాయాలంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ పాట రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు... కొంచెం సందేహించిన మాట నిజం.పైగా నాది తెలంగాణ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంతగా తెలియదు. దాంతో పాటకు ముందు ఆయన ఇంటర్వ్యూ లు వరుసపెట్టి చూశా.. రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటుంటే....అర్ధమవుతూ వచ్చింది జగన్ ఏంటో... నిఖార్సైన గ్రేట్ లీడర్... ఆయన పాట రాసి అది అందరి మెప్పూ పొందడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో...ఆయన పాలన విశేషాలు, ప్రజాసేవ గురించి తెలుసుకోవడం వల్ల అంతకు మించిన ఆనందం పొందుతున్నాను. ఇలాంటి పేదల పక్షపాతి లాంటి నాయకుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఇంత చేసినా.. రకరకాలుగా ఆయనకు చెడు చేయాలనే ఆలోచనలు కొంతమంది చేస్తున్నారని బాధ అనిపిస్తుంది. సారిచ్చిన పథకాలు పేదింటికి ఏ స్థాయిలో అందుతున్నాయి? పేదలు ఎంత తృప్తిగా ఉన్నారు? అనేది కనపడుతున్నా.. వ్యతిరేక మీడియా దు్రష్పచారం చేస్తోంది. అందుకే నా వంతుగా ఆయన వ్యక్తిత్వాన్ని పాట ద్వారా బలంగా చెప్పాలని అను కున్నా. నేను రైటర్‌గా గతంలోనూ కొందరు నేతల గుణగణాల్ని వర్మిస్తూ రాశాను. అయితే వ్యక్తిగతంగా ఇంతగా ప్రభావితం అయింది ఇదే తొలిసారి. జగన్ గారి గురించి రాసేటప్పుడు తెలియని శక్తి ఏదో ఆవహిస్తుందేమో అనిపించింది. -
ఏపీలో పాలన ఎక్స్ట్రార్డినరీ... అంతే!
తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... అనూహ్యమైన పాలన ఇది.. నిజంగా జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను. మా సొంత ఊళ్లో... ఎంత మార్పో ! మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు. మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను. –సత్యార్థ్ -
ప్రజారోగ్యానికి పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వచ్చాయని వైద్యవిద్య పూర్వపు అదనపు సంచాలకులు (ఏడీఎంఈ) డాక్టర్ నత్తా శ్రీనివాస విఠల్‌రావు చెప్పారు. 2019కు ముందు ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు ఎంతో అధ్వానంగా ఉండేవని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నుంచి ఏడీఎంఈ వరకూ వివిధ హోదాల్లో 35 ఏళ్ల పాటు వైద్య శాఖలో పనిచేసిన తాను ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూడలేదన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేకుండా పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రంగంలో వచి్చన మార్పులు, వాటి ఫలితంగా మెరుగుపడిన వైద్య సేవలు తదితర అంశాలపై విఠల్‌రావు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అప్పట్లో ప్రసవాలకు ఆయాలే దిక్కు.. 2019కు ముందు వరకూ ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతో దారుణమైన పరిస్థితులను మేం చూశాం. తీవ్రమైన మానవ వనరుల కొరత ఉండేది. పిల్లల వైద్య విభాగంతో పాటు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండేది. విజయవాడ జీజీహెచ్‌లో పిల్లల వైద్య విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ (విభాగాధిపతి)గా పనిచేశాను. వైద్య పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పంపినా అప్పట్లో పట్టించుకునే వారు కాదు. ఉన్నతాధికారులను ఎప్పుడు అడిగినా ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందనే సమాధానాలే మాకు ఎదురయ్యేవి. అప్పట్లో ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులకు ఒక ఉదాహరణ చెబుతా.. విజయవాడ జీజీహెచ్ గైనిక్ విభాగంలో పేషెంట్ లోడ్ విపరీతంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన విభాగంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు సరిపడా ఉండేవారు కాదు. ఒక్కోసారి లేబర్ రూమ్‌లో ఒక స్టాఫ్ నర్సు, మిగిలిన నాలుగైదు వార్డులకు ఒక స్టాఫ్ నర్సు ఉండాల్సి వచ్చేది. వైద్యులు సరిపడా లేకపోవడంతో ఏఎన్ఎంలు, ఆయాలే ప్రసవాలు చేసేవారు. ప్రజలకు తప్పిన వ్యయ ప్రయాసలు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను మన రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలందిస్తున్నారు. ఇది ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవం అనే చెప్పొచ్చు. పల్లెల్లో రైతులు, కూలిపనులు చేసుకునే నిరుపేదలు తమకేదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఒక రోజంతా ఉపాధిని వదులుకుని వ్యయ ప్రయాసలతో ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. వైద్యులే గ్రామాలకు వెళ్తుండడంతో చాలావరకు జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు సకాలంలో వైద్య సేవలందుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు చాలావరకూ ఆస్పత్రులకు వెళ్లే అవసరాలు తప్పాయి. అంతేకాక.. ఈ ప్రభుత్వంలోనే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఈవెనింగ్ క్లినిక్‌లు కూడా ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ప్రజలకు చాలా మేలు చేకూరుతోంది. ఎందుకంటే సాధారణంగా పెద్దాస్పత్రులకు దూర ప్రాంతాల నుంచి బాధితులు వస్తుంటారు. వారికి ఉదయం ఓపీ చూసిన వైద్యుడు ఏవైనా పరీక్షలకు సిఫారసు చేస్తే ఆ ఫలితాలు సాయంత్రానికి వస్తాయి. ఈవెనింగ్ క్లినిక్‌కు హాజరయ్యే వైద్యులు ఫలితాలను విశ్లేíÙంచి మందులు ఇవ్వడం లేదా వార్డులో అడ్మిట్ చేయడం వంటివి చేస్తున్నారు. అడిగిన పోస్టు లేదనకుండా భర్తీ.. 2019 తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు సమూలంగా మారడానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత సమస్య పరిష్కారం కావడం. ప్రభుత్వాస్పత్రిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ పాలసీని తెచ్చి 2019కి ముందు వరకూ ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు, పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త విభాగాల ఏర్పాటు, పెద్ద ఎత్తున పోస్టులు మంజూరు చేసి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యుల నుంచి క్లాస్‌ఫోర్ ఉద్యోగుల వరకూ ఏ విభాగంలో అయినాసరే అడిగిన పోస్టు కాదనకుండా భర్తీ చేశారు. ఇప్పుడు వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో ఎక్కడికక్కడ సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. రోగులకు వైద్యసేవల కల్పన మెరుగుపడింది. అంతేకాదు.. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు పుష్కలంగా ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకప్పుడు పీజీ సీట్ల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తే వసతులలేమి కారణంగా మంజూరయ్యేది కాదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ, అన్ని రకాల వసతుల కల్పన వల్ల గణనీయంగా పీజీ సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగాయి. -
వైఎస్ జగన్ పులిబిడ్డ: నైనా జైస్వాల్
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు.అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆరి్థకంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం... పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అద్భుతమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు. నవరత్నాలు.. మెరుపులు అమ్మ ఒడి పథకం వచి్చన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మ ర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభి మానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. – సాక్షి, అమరావతి -
సంక్షేమంపై ఖర్చు.. భవిష్యత్తు నిర్మాణమే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : పరిచయం అక్కర్లేని విఖ్యాత జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్! గ్రామీణ అంశాలపై ఎన్నో విస్తృత కథనాలు రాసిన అనుభవం ఆయనది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం నిర్మాణం, పేదలకు మెరుగైన ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ, మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేశారు. ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇక ఆయనకు లభించిన గౌరవ డాక్టరేట్లకు కొదవే లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన పాలగుమ్మి సాయినాథ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సంక్షేమాన్ని అపహాస్యం చేసే వాళ్లు చరిత్రంతా కనపడతారు.. సంక్షేమంపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి నేను అనుకూలం. సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన రాగానే ఒక వర్గం ఎగతాళిగా చూడటం, మాట్లాడటాన్ని చరిత్రలో చాలాసార్లు చూశాం. మీకొక ఉదాహరణ చెబుతా.. ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీడియా కూడా అపహాస్యం చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇంకా చాలా పత్రికలు ఎంతో అపహాస్యం చేస్తూ వార్తలు ప్రచురించడం నాకు గుర్తుంది. టీచర్లను వంట మనుషులుగా చిత్రీకరించి కార్టూన్లు వేశాయి. తర్వాత ఏమైంది? నాలుగేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి తమిళనాడు గ్లోబల్ రోల్ మోడల్ అని యూనిసెఫ్ ప్రశంసించింది. దశాబ్దం తిరగక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే మేం మెరుగ్గా అమలు చేస్తున్నామని చాలా రాష్ట్రాలు ప్రకటించుకోవటాన్ని చూశాం. మన పిల్లలే అనే భావన పాలకులకు ఉండాలి.. సమాజంలో అసమానతలను కోవిడ్ సంక్షోభం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ద్రవ్యోల్బణం నమ్మశక్యం కాని రీతిలో పెరిగిపోతోంది. దేశంలో పేదల ఆకలిని మరింత పెంచే ప్రమాద కారకాలు ఇవి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవసరం. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయత్నం జరగడం సంతోషం. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. భోజనం చేసే పిల్లలంతా మన పిల్లలనే భావన పాలకులకు ఉండాలి. రోజుకొక గుడ్డు ఇస్తే పిల్లలకు పోషకాహారం అందడంతో పాటు పౌల్ట్రీ రంగం కూడా బాగుపడుతుంది. స్కూళ్లలో ఉదయాన్నే రాగి జావ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు.. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంలో ఎలా అపహాస్యానికి గురైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వాపోతున్న వారికి కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రం.. ‘హ్యూమన్ డెవలప్మెంట్’లో రోల్ మోడల్‌గా నిలిచాక అర్థమవుతుంది. ‘అభివృద్ధి’ని ఎలా అర్థం చేసుకున్నారనే అంశం మీద మనం చేస్తున్న ఖర్చును నిర్వచించాల్సి ఉంటుంది. జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన సమయంలో ప్రజలు ఆకలి బాధతో అల్లాడిపోతే దాన్ని అభివృద్ధి అందామా? అది సంపన్నుల అభివృద్ధి మాత్రమే అవుతుంది. మన దృష్టి అంతా ప్రజలకు ఏది మంచి అనే విషయం మీదే ఉండాలి. అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు అభివృద్ధికి అర్థం ఉండదు. వర్క్‌ఫోర్స్ ఆరోగ్యంగా, గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలిగినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం. ఆకలిని రూపుమాపి.. ఆరోగ్యకరమైన జనాభా ఆకలిని రూపుమాపి ఆరోగ్యకరమైన జనాభాను నిర్మించడమే అభివృద్ధి. అది మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్మెంట్). ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనతో ఉండాలని భావించలేం. అభివృద్ధిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దృష్టి కోణం ఉంటుంది. నేను మానవాభివృద్ధినే చూస్తా. హ్యూమన్ క్యాపిటల్ మీద దృష్టి లేకుండా ఏ సమాజమూ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రగతి కనపరుస్తుందో 5 సంవత్సరాల తర్వాత చూడాలి. ఏపీ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం స్పందించాలి.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నదాతలకు అనుకూలమైన చాలా కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పుల దుష్ప్రభావం. మనం తక్షణం స్పందించి వినూత్న విధానాలను రూపొందించి అమలు చేయడం అత్యావశ్యకం. ఆంధ్రప్రదేశ్ సహా కోస్టల్ రాష్ట్రాలన్నీ తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే అంశంపై అధ్యయన బాధ్యతను యూనివర్సిటీలకు అప్పజెప్పాలి. ఆయా ఆగ్రో ఎకోలాజికల్ జోన్స్‌లో పరిశోధనలు చేయాలని స్థానిక యూనివర్సిటీలను ప్రభుత్వం అడగాలి. శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకొని ‘క్లైమేట్ యాక్షన్ ప్లాన్’కు ప్రభుత్వం రూపకల్పన చేయాలి. బ్యూరోక్రసీ కంటే యూనివర్సిటీలే అధ్యయనం చేయగలవని నా నమ్మకం. విద్య, వైద్యం, సాగు.. బాగున్నాయి ♦ ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది. గ్రామాల్లో అవసరం ఉన్న ప్రతి కుంటుంబాన్ని వైద్యుడు సందర్శించడం బేసిక్ హ్యూమన్ రైట్ (మానవ హక్కుల) పరిరక్షణ కిందకే వస్తుంది. ప్రతి మనిషికి వైద్యం అందించడం మానవ హక్కుల పరిరక్షణే. ఈ కార్యక్రమం అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ♦ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేదలకు నేరుగా ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయడం సాధ్యమవుతుంది. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడినట్లే. ♦ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రైతులకు ఉపయోగపడతాయి. వాటి నిర్వహణను బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) కాకుండా రైతులకు అప్పగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ♦ సామాన్యులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ కార్యక్రమాలు వినూత్నం.. ముందడుగు వేసిన సీఎం జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జయతి ఘోష్ కమిటీని నియమించారు. రైతన్నలను ఆదుకునేందుకు వినూత్న, విభిన్న కార్యాచరణకు డాక్టర్ వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ వారసత్వాన్ని అందుకొని ముందడుగు వేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయట పడేయటానికి చాలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయని ఎన్నో కార్యక్రమాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఆర్బీకేల ఏర్పాటు మొదలు రైతు భరోసా వరకు అన్ని కార్యక్రమాలు, çపథకాలు రైతులకు అనుకూలమైనవే. వాటిని మరింత కన్సాలిడేట్ చేయడం ప్రభుత్వం ముందున్న సవాల్. -
సిగ్నల్స్‌ను పట్టించుకోవాలి.. క్యాన్సర్ నియంత్రణకు 6 సూత్రాల ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రంలోనూ ప్రాథమిక దశలో గుర్తించి, నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు సూత్రాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక ఇచ్చినట్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నియంత్రిద్దామిలా.. ఈ సంవత్సరం దేశంలో 1.3 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో 1.92 మిలియన్లకి పెరుగుతాయి. ఇలా పెరుగుతుంటే ఎప్పటికీ నియంత్రించలేం. కొన్ని చర్యలతో అమెరికాలో క్యాన్సర్‌ను అదుపులోకి తెచ్చారు. అవే పద్ధతులతో ఇక్కడా నియంత్రించవచ్చు. నివారణ (ప్రివెన్షన్), స్క్రీనింగ్, ముందే గుర్తించడం (ఎర్లీ డిటెక్షన్)కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ చేపట్టాలి. పెద్ద వ్యాన్లలో మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి సౌకర్యాలతో ప్రజల దగ్గరకు వెళ్లి, పరీక్షలు చేయాలి. దీనిద్వారా క్యాన్సర్ కారకాలను గుర్తించి తొలి దశలోనే నివారించొచ్చు. చికిత్స అక్కడే సులభంగా జరుగుతుంది. నేను నిజామాబాద్, గుంటూరులో శిబిరాలు నిర్వహించాను. జనం విపరీతంగా వచ్చారు. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, మామోగ్రపీ, వ్యాక్సినేషన్ పెట్టాం. ఇలాంటివి ఒక యుద్ధంలా జరగాలి. ప్రభుత్వమే కాదు ఎన్జీవోలు, ఎన్నారైలు ఎవరైనా వీటిని నిర్వహించవచ్చు. శరీరం ముందే చెబుతుంది క్యాన్సర్ ఒక్కసారిగా రాదు. శరీరం ముందే చెబుతుంది. అది పంపే సిగ్నల్స్‌ని పట్టించుకోకపోవడం వల్ల ముదిరిపోతుంది. నొప్పి, దగ్గు వచ్చి వెంటనే తగ్గకపోయినా, శరీరంలో ఎక్కడైనా ఏదైనా తగులుతున్నా, అసాధారణ మార్పులు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన ఆహారం తినాలి. కొవ్వు పదార్ధాలు ఎక్కువ తింటే బ్రెస్ట్, యుటెరస్, ఓవరీ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వస్తాయి. నిల్వ పచ్చళ్లు తినకూడదు. నూనె నిల్వ చేస్తే విషంగా మారుతుంది. నిల్వ నూనెల నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. దేశంలో 60 శాతం కేసులు పొగాకు వల్ల వస్తున్నాయి. మరో 20 శాతం గర్భాశయ, ఇతర క్యాన్సర్లు. వీటిని ముందే గుర్తిస్తే కచ్చితమైన చికిత్స చేయవచ్చు. పిల్లలకు క్యాన్సర్ ఎందుకు వస్తుందో అధ్యయనం చేయాలి. పెస్టిసైడ్స్ కారణం కావచ్చు. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జీవన శైలి మార్పు, సరైన ఆహారం, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువ తినడం, వ్యాయామం ద్వారా నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గతంలో క్యాన్సర్ ఉంటే 40 ఏళ్లకే మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ ముదిరిందంటే నివారించడం కష్టం. అది సమాజానికి, ప్రభుత్వానికి భారం. కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ను నివారించవచ్చు. చికిత్స కూడా చేయవచ్చు. అయినా మరణాలు సంభవిస్తున్నాయంటే ముందే గుర్తించకపోవడమే కారణం. అమెరికాలో దీనిని దాదాపు నిర్మూలించారు. దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక.. ► క్యాన్సర్ కేసులను నమోదు చేయాలి. పెద్ద, చిన్నా ఏ ఆస్పత్రిలో క్యాన్సర్ నిర్థారణ అయినా ప్రభుత్వ లెక్కల్లోకి రావాలి. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలి. కొన్ని ఆస్పత్రుల్లో అన్నీ ఉన్నా, ఒక చిన్న మిషన్ ఉండదు. గుంటూరు జీజీహెచ్‌లో అన్నీ ఉన్నాయి. ఒక చిన్న మెషిన్ పెడితే మెగా క్యాన్సర్ సెంటర్ అవుతుంది. ఇదే విషయం సీఎంకు చెప్పాను. పనిచేయని మెషీన్లు, లోపాలు, ఇతర అంశాలపై ఒక టాస్క్‌ఫోర్స్ వేయాలి. ► రాష్ట్రం మొత్తానికి ఒక రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఆర్సీసీ), అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు (సీసీసీ)లు ఏర్పాటు చేయాలి. వీటిపై ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ ఇచ్చాను. ► 90 శాతం పిల్లల క్యాన్సర్లను అడ్వాన్స్ స్టేజ్‌లో నియంత్రించవచ్చు. సీఎం జగన్‌కు ఇదే విషయం చెప్పాను. తిరుపతిలోని పిల్లల కార్డియాక్ ఆస్పత్రికి అనుబంధంగా అక్కడే క్యాన్సర్ ఆస్పత్రి పెట్టవచ్చని చెప్పా. సీఎం అంగీకరించారు. ► క్యాన్సర్ ముదిరిన వాళ్లకి నొప్పి తగ్గించేందుకు ఆర్‌సీసీలో ప్రత్యేక చికిత్స కేంద్రాలు పెట్టాలి. దానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. సాధారణ డాక్టర్లకి ఆ నొప్పిని తగ్గించడం తెలియదు. ► అన్ని క్యాన్సర్లకీ ఒకటే వైద్యం ఉండకూడదు. మహిళల, పురుషుల క్యాన్సర్లకు వేర్వేరు విధానాలు ఉన్నాయి. హైరిస్క్ క్యాన్సర్లను గుర్తించాలి. ఏ క్యాన్సర్ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో ఎలా వస్తుంది, ఎన్ని కేసులు వస్తున్నాయో చూడాలి. దానికి ప్రత్యేక విభాగాలు పెట్టి అధ్యయనం చేయించాలి. క్యాన్సర్‌పై మూడు విభాగాల్లో టాస్క్‌ఫోర్స్: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై హైదరాబాద్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో నిపుణులైన వైద్యులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరు పురుషులు, మహిళలు, పిల్లల్లో క్యాన్సర్ చికిత్స, ప్రారంభ దశలో గుర్తించడం, నివారణ చర్యలపై పర్యవేక్షించడంతో పాటు, సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. డీఎంఈ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన, స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ నవీన్‌కుమార్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ సంజయ్ సిన్హా, మనీశ్ శర్మ పాల్గొన్నారు. -
ఆర్కేకు మహిళలంటే భయం!
టంగుటూరు: నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమమే ఊపిరిగా బతికిన విప్లవ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అక్కిరాజు హరగోపాల్ (65) అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి సమర్థవంతంగా చర్చించాడు. చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ ధృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశాడు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుని తుది వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డాడు. ‘ప్రజల కోసమే జీవిస్తాం.. ప్రజల కోసమే చస్తాం’ అన్న మాటను నిలుపుకుంటూ విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆర్కే వైవాహిక జీవితం ఎలా సాగింది? ఏ విధంగా పెళ్లి జరిగింది? ఆర్కేకు మహిళలంటే భయమా? పిల్లల విషయంలో ఈ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కుమారుడిని కూడా ఉద్యమంలోకి ఎందుకు ఆహ్వానించాడు? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఆర్కే భార్య శిరీష ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యమ పరంగా ఆర్కే గొప్పలీడర్. అలాంటి లీడర్ భావజాలానికి మీరు ఎలా దగ్గరయ్యారు? శిరీష : పెళ్లికి ముందే 1977 నుంచి 1987 వరకు ఉద్యమంలో పని చేశాను. 1987లో ఆయన (ఆర్కే)తో పరిచయం ఏర్పడింది. ఈ జిల్లాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగేవి. దాంతో ఉద్యమాలు, పెద్ద ఎత్తున మీటింగ్‌లు జరిగేవి. ఆ మీటింగ్‌లకు నేను వెలుతుండేదాన్ని. ఈ మీటింగ్‌లకు ఆయన కూడా వచ్చేవారు. జననాట్య మండలి ప్రోగ్రాములు జరుగుతుండేవి. నాకు మహిళా సంఘాల్లో పని చేయాలని ఆసక్తి ఉండేది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుతున్నారు. అప్పట్లో తక్కువ. ఆయన దళితుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ.. వారితో తినడం నాకు నచ్చింది. మీరు ఏమి చదువుకున్నారు. శిరీష : ఇంటర్ వరకు చదువుకున్నా. కారంచేడు ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? శిరీష: అగ్రనాయకులు ఇక్కడికి వచ్చి దళితుల కోసం పోరాడుతుంటే మనం వారికి మద్దతు ఇవ్వకపోతే ఎలా? మనం కూడా పోరాటం చేయాలని అనిపించింది. ప్రశ్నించే వారు ఉండాలి. అడిగితే కానీ ప్రభుత్వాలు ఇవ్వవు. అది భూమి కావచ్చు.. మరేదైనా కావచ్చు. ప్రశ్నించే విధానం అలవర్చు కోవాలి. ఆర్కేను పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది? శిరీష : తొలుత తోటి ఉద్యమదారుల వద్ద ఆర్కే గురించి విన్నాను. ఆ తర్వాత ఆయన పోరాట పంథా నాకు బాగా నచ్చింది. నేను కొంచెం మౌనంగా ఉండే రకం. ఆ విషయం ఆయనకు నచ్చింది. కొందరు ఉద్యమకారులు ఆర్కే గురించి మా పెద్దవాళ్లకు చెప్పారు. ఇద్దరం ఇష్టపడ్డాకే పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి ఆయనకు మహిళలు అంటే కొంచెం బెరుకు. దూరంగా ఉంటారు. ఇద్దరం అలాంటి వాళ్లమే కాబట్టి త్వరగా కలిసిపోయాం. పెళ్లప్పుడు నా వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆర్కేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనిపించిందా? శిరీష : అలా ఎప్పుడూ అనిపించలేదు. అందరిలాగా తిరగాలని అనిపించేది. బయటకు వెళ్లాలని అనిపించేది. అయితే మా పరిస్థితి దృష్ట్యా ఎక్స్పోజ్ కాకూడదు. బయట తిరగకూడదు. వస్తు వ్యామోహం ఉండకూడదు. మొదట్లో నాకు మాత్రం అన్నీ కావాలని కోరిక ఉండేది. బట్టలు, వస్తువులన్నా వ్యామోహం ఉండేది. అయితే అవన్నీ సరికాదని ఆయన చెప్పే వారు. ఆయన చెప్పేవన్నీ విన్నాక సబబే అనిపించింది. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేదాన్ని. ఎప్పుడైనా తగవులు.. గొడవలు పడే వారా? శిరీష: పిల్లలు పుడితే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందనే వారు. ‘ఒక్కోసారి పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది.. వారి ప్రేమకు దూరం అవుతాం.. మన ప్రేమకు వారు దూరమవుతారు.. తల్లిదండ్రులకు దూరమై ఇంటి వద్ద ఉన్న పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది. ఆలోచించు’ అన్నారు. ఎంత కష్టమొచ్చిన సరే ఒకరినైనా కనాలని గొడవ పెట్టుకున్నా. ఆ విషయంలో నన్ను కన్విన్స్ చేయలేకపోయారు. 1992లో బాబు (మున్నా) పుట్టాడు. బాబు పుట్టాక పెంపకం ఎలా? శిరీష : అప్పుడు ఆయన నాతోపాటు సంవత్సరం ఉన్నారు. నేను బాబును తీసుకుని అమ్మవాళ్ల వద్దకు వచ్చి ఐదేళ్ల వరకు ఉన్నాను. ఆ సమయంలో నేను మాత్రమే ఆయన్ను అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఆరు సంవత్సరాల తర్వాత బాబును ఆయన చూశాడు. బిడ్డ వల్ల ఇబ్బందులొచ్చాయా? శిరీష : అలాంటి పరిస్థితి రాలేదు. కాకపోతే తల్లిదండ్రులిద్దరి మధ్య బాబు పెరగడం లేదన్న బాధ నాకుండేది. అమ్మ వాళ్ల వద్ద కానీ, అక్క వాళ్ల వద్ద కానీ బిడ్డను పెట్టమని చెప్పారు. లేదా పిల్లలు లేని వారికి ఇచ్చేద్దాం అన్నారు. మున్నాను ఎంత వరకు చదివించారు? శిరీష : ఇంటర్ వరకు మున్నా ఉద్యమం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? శిరీష: అబ్బాయిని రౌడీలా, గూండాలా పెంచకూడదనుకున్నాను. అనుకున్నట్లే మంచి విలువలతో పెంచాను. చిన్నప్పుడు నాన్న ఎక్కడ? అని అడిగినప్పుడు దూరంగా జాబ్ చేస్తున్నాడని చెప్పేదాన్ని. ఎందుకు అంత దూరం ఉంటాడు అనేవాడు. ఎప్పుడొస్తారని అడిగేవాడు. వస్తారులే అని చెప్పేదాన్ని. ఆర్కే గురించి ఎలా తెలుసుకున్నాడు? శిరీష: పెద్దగయ్యే కొద్దీ వాస్తవాలు తెలుసుకున్నాడు. నాన్నను చూడాల్సిందేనని పట్టు పట్టాడు. అడవిబాట పడితే తప్ప అది సాధ్యం కాదని తెలుసుకుని వెళ్లి కలుసుకున్నాడు. వాళ్ల నాన్న వద్దకు వెళ్లి రావడానికి పోలీసులతో ఇబ్బంది ఉండేది. ఇక్కట్లు వస్తాయని చెప్పాను. చదువు కొనసాగించడమో, లేక ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలనో చెప్పాను. అడవిలోకి వెళ్లాక ఆయన భావజాలాలకు కనెక్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాడు. తండ్రిన మించిన కుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ నాకైతే మరో అబ్బాయి ఉంటే బాగుండేదని అనిపించేది. ఇప్పుడిక వారిద్దరి జ్ఞాపకాలే నాకు మిగిలాయి. -
సూపర్ వ్యాక్సిన్.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట
►డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్డౌన్ సడలించారన్న ఉద్దేశంతో జనం గుమిగూడటం, కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితే అందరినీ ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ►ప్రజలు గుంపులుగా చేరకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వారిని, ఇతర ప్రైమరీ కాంటాక్టులను విడిగా ఉంచి పరీక్షలు చేయించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. మార్కెట్లు, ఆఫీసులు వంటి చోట్ల పూర్తిగా భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ పాటించేలా చూడాలి. ►ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్ అవుతాయి. అందువల్ల స్పైక్ ప్రోటీన్‌తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా.. భిన్నమైన వేరియెంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సూపర్ వ్యాక్సిన్‌కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్ మొదలయ్యాయి. దీనిపై తదుపరి దశల ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సూపర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక శాస్త్రవేత్త కేథరిన్ జె వూ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. మల్టీ యాంటీజెన్ వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు. స్పైక్ ప్రోట్రీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్ వైరల్ యాంటీజెన్లతో కూడిన ‘ఓఆర్ఎఫ్–3ఏ’లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ఇంటర్వ్యూ: డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని.. వైరస్ తాకిడి మాత్రమే తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదం పక్కనే పొంచి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని, లాక్డౌన్ సడలింపును ఆసరాగా తీసుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించ వద్దని సూచించారు. పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. అన్ని వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో మూడో వేవ్ వస్తుందన్న అంచనాలు, కొత్తగా డెల్టా ప్లస్ కేసుల నమోదు, వ్యాక్సినేషన్ తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని ముఖ్యాంశాలు.. సాక్షి: డెల్టా ప్లస్ వేరియంట్ ఏ మేరకు ప్రమాదకరం? కె.శ్రీనాథ్‌రెడ్డి: డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు. మనదేశంలోనే కాదు పలు ఇతర దేశాల్లోనూ డెల్టా ప్లస్ కేసులొచ్చాయి. కొత్త వేరియంట్‌తో పెద్ద ప్రమాదం వస్తుందనేందుకు ప్రస్తుతం ఆధారాలేమీ లేవు. వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మాత్రం ఉన్నాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది వ్యాక్సిన్ లేకపోయినా లాక్డౌన్లు, కఠినమైన నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలా వరకు ఆపగలిగాం. రెండో వేవ్‌లో కొత్త వేరియంట్లు రావడం, జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి మనమే ఆస్కారం ఇచ్చాం. నిజానికి వైరస్లలో మార్పులు సహజం. అయితే కొత్త వేరియంట్‌గా మారినపుడు తీవ్రత (విరులెన్స్) పెరిగిందా, తగ్గిందా అనేది ముఖ్యం. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్టివిటీ (వ్యాప్తి సామర్థ్యం)ని పెంచుకున్నప్పుడు విరులెన్స్ తగ్గు తుంది. ఎవల్యూషనరీ బయాలజీలో భాగంగానే ఇది జరుగుతుంది. అప్పటికే ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియెంట్లపై కాస్త తక్కువ ప్రభావం చూపొచ్చు తప్ప.. వ్యాధి తీవ్రంగా మారకుండా ఉంటుంది. దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరిస్థితి ఏమిటి? మన దేశంలో వైరస్ శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మరింతగా పెంచాలి. యూకే వేరియంట్ వ్యాప్తితో జనవరిలో భారత్‌లో ఈ సీక్వెన్సింగ్ ప్రారంభించారు. కానీ రెండో వేవ్ రాదనే భ్రమలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొత్తం శాంపిళ్లలో కనీసం 5 శాతమైనా సీక్వెన్సింగ్ చేయాలి. వైరస్ వేరియంట్లను గుర్తించి ఆయా చోట్ల నియంత్రణ చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలోపేతమెలా? కోవిడ్ నేపథ్యంలో దేశంలో వైద్య మౌలిక సదుపా యాలను పెంచుకోవాల్సి ఉంది. 2021–22 బడ్జెట్లో కేంద్రం, 15వ ఆర్థిక సంఘం నుంచి ప్రాథమిక వైద్య సదుపాయాల పెంపు, అత్యవసర సేవల కోసం నిధులు కేటాయించారు. ప్రభుత్వాలు పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేసి.. కొత్త వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల వ్యాప్తిపై నిఘా పెట్టాలి. కొత్త వైరస్లు, మైక్రోబ్‌లను గుర్తిస్తే.. వెంటనే పరిశోధన చేపట్టి, వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండో వేవ్ తగ్గుముఖం పట్టినందున.. వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి. పర్యవేక్షక వ్యవస్థను పటిష్టపరచడం, అన్నిచోట్లా క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటు మంచిది. వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనూ ఈ చర్యలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా మహమ్మారి నుంచి రక్షణకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. దానితోపాటు మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం అనివార్యం. మాస్కులు ధరించకపోతే తమకే కాదు, ఇతరులకూ నష్టం చేసిన వారవుతారన్న విషయాన్ని గ్రహించాలి. పశ్చిమ దేశాల్లో మాస్కులు కచ్చితంగా పెట్టుకోవడం వల్ల.. కరోనాను తప్పించుకోవడంతోపాటు అక్కడ సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధులు కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. వ్యాక్సిన్లు వేసుకుంటే బయటపడొచ్చా? దేశవ్యాప్తంగా కనీసం 50శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉండటమంటే పూర్తిగా తలుపులు మూసుకుని, ఇళ్లలోనే ఉండాలని కాదు. వారం వారం పోల్చి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా, సీరియస్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయా, ఆస్పత్రులకు తాకిడి ఎక్కువగా ఉందా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందా అన్న అంశాలను బట్టి కరోనా తీవ్రతను అంచనా వేయొచ్చు. కేసులు, సీరియస్ పేషెంట్ల సంఖ్య పెరిగితే మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేయాల్సి వస్తుంది. కొత్త వేరియంట్లకు సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? కొత్త వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం(ఇన్ఫెక్టివిటీ), తీవ్రత ఎలా ఉంటుందో గమనించాలి. అవి ఇన్ఫెక్టివిటీ పెంచుకుంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జనం గుమిగూడితేనే వైరస్ వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దక్షిణ కొరియాలో జనం గుమిగూడిన చోట్లనే మరో వేవ్ వచ్చింది. ఆస్ట్రేలియాలో కొత్తగా కేసులు నమోదైన సిడ్నీలోనూ ఎయిర్‌పోర్ట్‌కు టాక్సీ నడిపే డ్రైవర్లు వ్యాక్సిన్ తీసుకోకపోవడం, మాస్కులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల విమాన ప్రయాణికుల నుంచి వైరస్ సోకింది. కేసులు పెరిగాయి. దాంతో సిడ్నీ న్యూసౌత్‌వేల్స్‌లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. ఇలాంటి ఘటనలతో మనవాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కనీసం 50–60 శాతం దాకా వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాకా జాగ్రత్తలు పాటించాలి. ఉన్నవేకాదు.. కొత్తగా పుట్టుకొచ్చే వాటికీ సూపర్ చెక్ సాధారణంగానే వైరస్లు తరచూ మ్యుటేషన్ చెంది కొత్త వేరియంట్లు ఏర్పడుతుంటాయి. అదే తరహాలో కరోనా వైరస్ చాలా మ్యూటేషన్లు చెందింది. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కరోనా వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్‌ను.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన ‘గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్’శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలు, ఇతర జంతువులపై పరిశీలించగా.. మంచి ఫలితాలు ఇస్తున్నట్టు గుర్తించారు. హైబ్రిడ్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో.. నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొదట ఫైజర్, మొడెర్నా కంపెనీల తరహాలో ‘ఎంఆర్ఎన్ఏ’టెక్నాలజీతో వ్యాక్సిన్ రూపొందించాలని భావించారు. ఆ దిశగా ప్రయోగాలు మొదలుపెట్టారు. అయితే వైరస్ వేరియంట్లు మారినప్పుడు కూడా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఎక్కువ సంఖ్యలో కరోనా వేరియంట్ల ‘ఆర్ఎన్ఏ’లను తీసుకుని.. ‘హైబ్రిడ్ ఎంఆర్ఎన్ఏ’ఎన్కోడింగ్ను అభివృద్ధి చేశారు. దీనితో రూపొందించిన వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలపై పరీక్షించారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా మ్యూటేట్ అయిన దక్షిణాఫ్రికా బీటా రకం (బీ.1.351) కరోనాపైనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. వేరియంట్లు మారినా.. ఇప్పుడున్న వేరియంట్లే కాదు భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లను కూడా ఈ సూపర్ వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేవిడ్ ఆర్ మార్టినెజ్ చెప్పారు. కరోనా స్పైక్ ప్రొటీన్‌తోపాటు అంతర్గతంగా ఉండే న్యూక్లియోటైడ్, యాంటీ జెన్లనూ ఈ వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుందని వివరించారు. ఈ సూపర్ వ్యాక్సిన్‌పై త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ చేపడతామని తెలిపారు. తమ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో ‘సార్స్ కోవ్–3’వచ్చినా కూడా సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
అంతరంగం: వెన్నెలకంటి ఆఖరి ఇంటర్వ్యూ
‘సాక్షి’ టీవీ చానల్‌కి ఇటీవల ‘వెన్నెలకంటి’ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇదే ఆయన ఆఖరి ఇంటర్వూ్య. వెన్నెలకంటి ‘అంతరంగం’ ఆయన మాటల్లో... చిన్నప్పట్నించి నాకు పద్యాలు రాయటం అలవాటు. పదకొండు, పన్నెండేళ్లు వచ్చేటప్పటికే ఆటవెలది, కందపద్యాలు రాసేవాణ్ణి. భక్తి శతకాలు రాశాను. తర్వాత పద్యం నుండి గేయానికి వచ్చాను. గేయంలో అభ్యుదయ కవిత్వం వైపు వెళ్లాను. పద్యానికి పోలూరి హనుమా జానకి రామశర్మగారని నెల్లూరు సీఆర్ కాలేజీలో గురువుగారుండేవారు. గేయానికి నాగభైరవ కోటేశ్వరరావుగారు గురువుగా ఉండి నన్ను సొంత బిడ్డలా చూసుకునేవారు. ఇలా అన్ని ప్రక్రియలు దాటుకుని పాట దాకా వచ్చాను. సినిమా రంగానికి వచ్చిన తర్వాత సినిమా బాణీకి పాట రాయాల్సి వస్తుంది. నాకు గిరీశం అని చిన్ననాటి నుండి కలిసి పెరిగిన మిత్రుడున్నాడు. వాడు ట్యూన్ కడితే నేను పాట రాసేవాణ్ని. ఆ సమయంలో కొన్ని వందల పాటల్ని మేమిద్దరం తయారు చేశాం. అవన్నీ నాకు తర్వాత ఉపయోగపడ్డాయి. ఆ ఇద్దరికీ నేను భక్తుణ్ణి సముద్రాల గారి దగ్గరనుండి కొత్త కుర్రాళ్ల దాకా అందరి దగ్గరా నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. 1986లో నేను వచ్చేనాటికి చాలామంది రచయితలు ఉన్నారు. ఎవరు మంచి పాట రాసినా వారికి అభిమాని అయ్యేవాణ్ణి. ఆత్రేయగారికి, వేటూరిగారికి మాత్రం నేను అభిమానిని కాను. వారికి మాత్రం నేను భక్తుణ్ని. ఆత్రేయగారిలోని లోతైన ఆలోచన, వేటూరిగారిలో ఉన్న భావవ్యక్తీకరణ అంటే నాకు బాగా ఇష్టం. ఆ రెండూ కలిపే ప్రయత్నమే నా పాట. వాళ్లతో ప్రత్యక్షంగా పరిచయం కావడం, వాళ్ల ఆశీర్వాదం లభించడం నా అదృష్టం. ఆత్రేయగారు ‘నీరాజనం’ సినిమాలో ‘మనసున్న మధుకలపం..’ పాటకి పల్లవి మాత్రం రాశారు.. చరణాలు ఇవ్వలేదు. ఓ రికార్డింగ్‌లో ముంబయ్‌లో ఉన్నారు. నిర్మాతగారు ఫోన్ చేస్తే అక్కడ ఎవరున్నారంటే నేనున్నానని చెప్పారు.. వాడు నాలాగే రాస్తాడు.. చరణాలు రాయించుకోండని ఆత్రేయగారు చెప్పడంతో నేను రాశా. ఇద్దరి పేర్లు వేయమంటే వద్దండీ.. ఇది నా గురుదక్షిణ అన్నాను. నేనంటే ఆయనకు చాలా ప్రాణం. ఆ పాటకు ఎంతోమంది అభిమానులున్నారు ‘ఏప్రిల్ ఒకటి విడుదల’ సినిమాకి అన్నయ్య సీతారామశాస్త్రి పాటలన్నీ రాశారు. వంశీగారు నన్ను పిలిచి.. నాకు ఓ థీమ్ పాటలా కావాలన్నారు. రెండు చరణాలకు రెండు థీమ్స్ ఇచ్చి పాటగా రాయమన్నారు.. అలా రాశాను. ఇళయరాజాగారి ట్యూన్‌కి ‘మహర్షి’ సినిమాలో నేను రాసిన ‘మాటరాని మౌనమిది..’ పాట చాలా పెద్ద హిట్ అయింది.. ఆ పాటకి ఎంతో మంది అభిమానులున్నారు. సన్నివేశ ప్రాధాన్యం ఉన్న పాట అది. ఇళయరాజాగారికి చాలా పాటలు రాశాను. డబ్బింగ్ పాటలు కూడా ఎక్కువగా ఆయనవే రాశాను. ఈ మధ్య ప్రైవేట్ ఆల్బమ్స్ నాతోనే రాయించుకున్నారు తెలుగులో. ‘నాయకుడు’ సినిమా డబ్బింగ్ చిత్రం అని చెప్పలేం. అందులో నేను పాట రాశా. నేపథ్యంలో వచ్చే దానికి డబ్బింగ్లో రాసినా, స్ట్రయిట్‌గా రాసినా ఒక్కటే.. ‘సుందరాంగుడు’ చిత్రానికి నాతో బలవంతంగా డబ్బింగ్ పాటలు రాయించింది ఎంవీ రావు అనే ఫ్రెండ్. ఆ తర్వాత ‘సంగ్రామం’ అనే సినిమాలోని మొత్తం పాటలు నన్నే రాయమన్నారు.. కొంచెం కష్టం అనిపించింది. దానికి రాజశ్రీగారు నన్ను బాగా గైడ్ చేశారు. డబ్బింగ్ కళాకారులను గుర్తించింది కమల్‌గారే డబ్బింగ్ కళాకారులను బాగా గుర్తించింది ఎవరంటే కమల్‌హాసన్‌గారు.. డబ్బింగ్ రాయడం, కామెడీ రాయడం చాలా కష్టం అంటారాయన. మాటల వరకూ అయితే ఓ లెంత్ చూసుకుంటే చాలు.. పాటలయితే లిప్ మూమెంట్‌కి దగ్గరగా ఉండాలి. మాటల్లో ఒక్కో భాషలో ఒక్కో జాతీయాలుంటాయి.. అవి మనకు ఉండవు. కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి. దానికి సమానమైన జాతీయాలు మనం వాడాలి. ఆరుద్రగారు చెప్పినట్టు లిప్ మూమెంట్ పాటిస్తూనే చెవికి తెలుగు వినపడేట్టు చేయడం అనువాద రచయిత లక్షణం. ఇన్ని భాషల్లో రాశాను.. ఇప్పుడు తమిళం కూడా నాకు కొద్ది కొద్దిగా వచ్చు. మిగతా ఏ భాష కూడా రాదు. హిందీ సినిమాల డబ్బింగ్ వెర్షన్ నేనే రాశాను. సూపర్ హిట్ అయ్యాయి. కానీ నాకు హిందీ అక్షరం ముక్క రాదు. మలయాళం, కన్నడ కూడా రాదు. తెలుగు వస్తే చాలు. సన్నివేశం చూసి రాసేవాణ్ణి. మొదట్లో స్క్రిప్ట్ చూసి ప్రిపేర్ అయ్యేవాణ్ణి.. స్క్రిప్ట్‌తో థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఇప్పుడు తమిళ్ వరకూ అది అక్కర్లేదు. తమిళ్లో కూడా ఒక్క కమల్‌హాసన్‌గారి సినిమాలకు మాత్రం, ముఖ్యంగా క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారు కలిస్తే ముందు హోమ్ వర్క్ చేసుకుని స్క్రిప్ట్ మొత్తం రాసుకునే థియేటర్‌కి వెళ్లాలి. ముళ్లపూడి రమణగారి స్క్రిప్ట్ ఇంకో భాషలోకి అనువదించడం ఎంత కష్టమో.. క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారి సినిమా అనువదించడం కూడా అంతే కష్టం. ‘భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం’ ఈ సినిమాలన్నీ కామెడీవే. వెంటవెంటనే పంచ్‌లుంటాయి. అది గొప్ప అదృష్టం ‘జురాసిక్ పార్క్’ అన్నది మామూలు సినిమా కాదు.. అందులో సైంటిఫిక్‌గా చాలా క్లిష్టమైన విషయాలున్నాయి.. చాలా ప్రమాదాలుంటాయి. వాటిని చాలా సింపుల్‌గా ఉండేలా లిప్ సింక్ అయ్యేలా తీసుకురావాలి. పైగా ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పేది ఎవరంటే జగ్గయ్యగారు. అంత గొప్పాయన నన్ను పిలిపించారు. మాటలు ఎవరు రాస్తున్నారంటే నేనే రాస్తున్నానని చెప్పడంతో నా ఆఖరు సినిమా నీకే చెబుతున్నాను.. అని డబ్బింగ్ చెప్పారాయన.. అది గొప్ప అదృష్టం. ఆ తర్వాత టైటానిక్, మమ్మీ సిరీస్, హ్యారీ పోటర్ సిరీస్, జేమ్స్‌బాండ్‌లో కొన్ని సిరీస్ చేశాను. హిందీలో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కహోనా ప్యార్హై, రాజా హిందుస్తాన్..’ ఇలా చాలా చేశాను. ఆయన నమ్మకమే నిజమైంది ‘ ప్రేమాలయం’ చిత్రానికి సూరజ్ బర్జాత్యగారు డైరెక్టర్. వాళ్ల నాన్న రాజ్‌కుమార్ బర్జాత్యగారు ‘మేం తెలుగులో ఆడియో విడుదల చేయడం లేదు.. సినిమా విడుదలైన వంద రోజుల వరకూ రిలీజ్ చేయం’ అనడంతో నా గుండె జారిపోయింది. పాటలు బాగా హిట్ అయితేనే కదా ప్రేక్షకులు సినిమాకి వస్తారు.. లేకుంటే రారు అని చెప్పాను. అప్పట్లో పైరసీలు ప్రస్తుత పరిస్థితుల్లోగా లేవు. అందుకే పాటలు వినాలంటే కచ్చితంగా థియేటర్‌కి వచ్చి చూస్తారు అని ఆయన అన్నారు.. ఆయన నమ్మకమే నిజమైంది. పాటలు రిలీజ్ చేయకపోయినా వంద రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సినిమా ఆడింది. ఆ తర్వాత ఆడియో విడుదలయ్యాక సిల్వర్ జూబ్లీ ఆడింది. ‘ప్రేమాలయం, ప్రేమించి పెళ్లాడతా’ సినిమాల్లో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అందుకే ఆ ముద్రపడింది చెన్నైలో ఉంటూ రాయడంవల్ల డబ్బింగ్ మాటల రచయితగా నా మీద ముద్రపడింది. అది సహజం. నేను అక్కడ బిజీగా ఉన్న సమయంలోనూ నన్ను పిలిచి స్ట్రయిట్ చిత్రాలకు పాటలు రాయించుకున్న దర్శక–నిర్మాతలకు, సంగీత దర్శకులకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.. ఆ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. అయితే డబ్బింగ్ రచయిత అనే ముద్ర నాకు మేలే చేసింది. కానీ దాని వల్ల స్ట్రయిట్ సినిమాల్లో పాటలు రాసే కొన్ని అవకాశాలు తగ్గి ఉండొచ్చు. అయితే అనువాదంలోకి వెళ్లడంతో కమల్‌హాసన్‌గారికి పర్మనెంట్ రైటర్ అయ్యాను. ఓ సారి కమల్‌గారి బర్త్ డేలో రజనీకాంత్‌గారికి నన్ను పరిచయం చేస్తూ, మీ ‘బాషా’ తెలుగు రచయిత, నా పర్మనెంట్ తెలుగు రచయిత’ అన్నారు. ‘‘కమల్‌గారి ‘మహానది’లో ‘శ్రీరంగ రంగ..’ అనే పాట సాహిత్యం చాలా బాగుంది, ఇంత మంచి సాహిత్యం తెలుగు అనువాదంలో వస్తుందా?’’ అంటూ దర్శకుడు కె. విశ్వనాథ్‌గారు నన్ను అభినందించారు. డబ్బింగ్ రైటర్ అంటే చిన్న చూపు డబ్బింగ్ రైటర్ అంటే ఓ చిన్న చూపు ఉంటుంది. బడ్జెట్, పారితోషికం... ఇలా ఏ రకంగా చూసుకున్నా స్ట్రయిట్ సినిమా రేంజ్ వేరు? డబ్బింగ్ సినిమా రేంజ్ వేరు. గతంతో పోలిస్తే ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు స్ట్రయిట్ సినిమాకి పోటీ పడే స్థాయిలో రావడం సంతోషం. ఒకానొక సమయంలో డబ్బింగ్ సినిమాలు బ్యాన్ చేయాలనే చర్చ తెలుగు సినిమా పెద్దల మధ్య జరిగింది. స్ట్రయిట్ సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా బాగుంటేనే ఆడతాయి. నా పిల్లలు నా శిష్యులు కాదు ప్రాక్టీస్ అన్నది చేసేకొద్దీ వస్తుంది. నా పిల్లలు ఎవరూ నా వద్ద శిష్యరికం చేయలేదు. డబ్బింగ్‌లు చెప్పే మా పెద్దబ్బాయి శశాంక్ వెన్నెలకంటిని డబ్బింగ్ రచయితని చేశారు. వాడి తొలి సినిమా ‘మన్మథ’ 100 రోజులు ఆడింది. రెండో సినిమా ‘గజనీ’ పెద్ద హిట్ అయింది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకి రెండో అబ్బాయి రాకేందు మౌళి రాశాడు. నాలుగోతరంలో నా మనవడు, మనవరాలు కూడా డబ్బింగ్ రంగంలోకి వచ్చారు. వారిద్దరికీ పదేళ్ల లోపే ఉంటాయి. ఓ కుటుంబం నుంచి నాలుగు తరాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారి ఆశీర్వాదాల వల్లే ఇదంతా జరిగింది. మా అబ్బాయిలకు సలహాలు చెప్పే అవసరం పెద్దగా రాలేదు. రాకేందు మౌళి ‘అందాల రాక్షసి’ సినిమాకి ఉత్తమ అప్‌కమింగ్ లిరిక్ రైటర్, బెస్ట్ అప్‌కమింగ్ సింగర్ అవార్డులు అందుకున్నాడు. ఆ స్టేజిపై మాట్లాడుతూ లిరిక్ రైటర్ అవార్డు నా వల్ల, సింగర్ అవార్డు నా భార్య వల్ల వచ్చిందని మాకు కృతజ్ఞతలు చెబుతూ, బాలుగారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పి ఆయనకు అంకితం చేశాడు. నిజానికి నేను ఆత్రేయగారికి భక్తుణ్ణి. ఆయనంత గొప్ప కవిని కాకపోయినా ఆయన బద్దకం మాత్రం నాకు బాగా వచ్చింది. ఇది చాలా రోజులుగా అనుకుంటున్నదే.. కార్యాచరణలో పెట్టాలి. ఓ కావ్యం రాశాను.. అది ప్రింట్ చేయాలి. ఇప్పుడు రాస్తున్న ‘రామాయణం’ కూడా ప్రింట్ చేయాలి. పాటలన్నీ కలిపి ఓ పుస్తకం తేవాలి.. ఇలా చాలా ఉన్నాయి. – రెంటాల జయదేవ -
మా సత్తా ఏంటో తెలిసింది!
కరోనా వ్యక్తులకే కాదు.. పలు సంస్థలకూ సవాలుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీని సవాల్‌గా స్వీకరిస్తే, మరికొన్ని శానిటైజర్లు మొదలుకొని పీపీఈ కిట్లు, చౌక వెంటిలేటర్ల తయారీని చేపట్టాయి. ఇదే సమయంలో భారత్‌లో రసాయన పరిశోధనలకు కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఈ సవాళ్లను ఎలా స్వీకరించింది? కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు ఏ ప్రయత్నాలు చేసింది?.. ఇవే ప్రశ్నలను ‘సాక్షి’ ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా.. ఆయనిచ్చిన సమాధానాలివిగో.. కరోనాను ఎదుర్కొనేందుకు ఐఐసీటీ ఎలాంటి ఆవిష్కరణలు చేసింది? వ్యాధి చికిత్సకు ఉపయోగపడగల మందులను ఐఐసీటీ మొదట గుర్తించింది. గతంలోనే తయారై పలు కారణాలతో వినియోగంలోకి రాని రెమిడెస్విర్, ఫావాపిరవిర్ వంటివి కోవిడ్‌ను అడ్డుకుంటాయని గుర్తించాం. అతితక్కువ వ్యవధిలో వీటిని వాణిజ్యస్థాయిలో తయారుచేయడమే కాక, సిప్లా వంటి ఫార్మా కంపెనీల సాయంతో మార్కెట్లోకి తెచ్చాం. సమర్థమైన శానిటైజర్ల తయారీ టెక్నాలజీని స్టార్టప్ కంపెనీలకు అందజేశాం. తద్వారా శానిటైజర్లు అన్నిచోట్లా చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని సీఎస్ఐఆర్ సోదర సంస్థ సాయంతో ‘సెరో సర్వే’ కూడా నిర్వహించాం. తాజాగా కోవిడ్ నుంచి రక్షణ కల్పించే మాస్క్ ‘సాన్స్’ అభివృద్ధితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం లక్ష మాస్కుల పంపిణీకి సిప్లాతో కలిసి పనిచేస్తున్నాం. కోవిడ్–19 చికిత్సకు సంబంధించిన పరిశోధనలు పూర్తయినట్లేనా? కానేకాదు. జపాన్‌లో జలుబు కోసం సిద్ధంచేసిన ఫావాపిరవిర్ను కోవిడ్‌కూ వాడవచ్చునని ఇప్పటికే గుర్తించిన ఐఐసీటీ ప్రస్తుతం దాని ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలినాళ్లలో ఫావాపిరవిర్ ఒక్కో మాత్ర రూ.100పైబడి ఖరీదుచేస్తే.. సిప్లా ఇటీవలే రూ.68కే అందిస్తామని ప్రకటించింది. సన్‌ఫార్మా మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తేనుంది. ఐఐసీటీ పరిశోధనల ఫలితంగా ధర మరింత దిగి రావచ్చు. వ్యవసాయ రంగానికి అవసరమైన రసాయనాల విషయంలోనూ ఐఐసీటీ విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ రంగంలో తాజా పరిణామాలు? ఐఐసీటీ చాలాకాలంగా వ్యవసాయానికి ఉపయోగపడే రసాయనాలను తయారుచేస్తోంది. ఫెర్మాన్ ట్రాప్‌లు వీటిల్లో ఒకటి. పొలాల్లో కీటకాలను ఆకర్షించేందుకు తద్వారా కీటకనాశినుల వాడకాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విస్తృతంగా వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. సీఎస్ఐఆర్ నిర్వహించే ‘హరిత్’ కార్యక్రమంలో భాగంగా స్వయంగా సుమారు 20 వేల హెక్టార్లకు సరిపడా ఫెర్మాన్ ట్రాప్స్ ఇవ్వనుంది. ప్రధాని మోదీ ఇటీవలే ‘ఆత్మ నిర్భర భారత్’ పిలుపునిచ్చారు. రసాయనాల విషయంలో ఇది ఎప్పటికి సాధ్యం? వ్యవసాయం, ఫార్మా రంగాల్లో కీలకమైన రసాయనాల విషయంలో భారత్ 30 ఏళ్లుగా ఇతర దేశాలపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడుతోంది. రానున్న ఆరేళ్లలో కనీసం 53 రసాయనాల దిగుమతులకు స్వస్తిచెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పెట్రోలియం, బొగ్గు, ఫార్మా రంగాల్లోని కొన్ని వ్యర్థాలు, వాయువుల ద్వారా ప్రాథమిక రసాయనాల తయారీకి ప్రయత్నిస్తున్నాం. ఫార్మా రంగానికి కీలకమైన 53 రసాయనాల్లో 26 రసాయన శాస్త్రం ద్వారా తయారుచేయవచ్చు. మరో 26 రసాయనాలకు ఫెర్మెంటేషన్ ప్రక్రియ అవసరం. రెండో రకం రసాయనాల తయారీకి ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసే వారికి సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎస్ఐఆర్ సోదర సంస్థలు కొన్ని ఇప్పటికే ‘మిషన్ అరోమా’ పేరుతో మొక్కల నుంచి కొన్ని రసాయనాల సేకరణకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా చైనా, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఐఐసీటీకి కరోనా నేర్పిన పాఠాలేమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే మా సత్తా ఏమిటో తెలియచెప్పింది. తక్కువ వనరులతో సంస్థ శాస్త్రవేత్తల సామర్థ్యాన్నంతా ఒక లక్ష్యంవైపు ఎలా మళ్లించగలమో అర్థ మైంది. కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైంది మొదలు ఐఐసీటీ, మాతృసంస్థ ‘ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్ఐఆర్)లోని ఇతర సంస్థలూ తమదైన రీతిలో స్పందించాయి. -
అందుకే సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను
‘‘ఈ పుట్టినరోజుకి ప్రత్యేకత ఏంటంటే కరోనా స్పెషల్ (నవ్వుతూ). కరోనా వల్ల బయట పరిస్థితులు బాగాలేవు. మా అన్నయ్య (ఆర్యన్ రాజేష్), వదిన, వారి పిల్లలు, నేను, నా శ్రీమతి విరూప, నా కూతురు అయానా ఇవికా అందరం కలిసి ఇంట్లోనే ఉన్నాం. ఈ లాక్డౌన్లో మా ప్రపంచమంతా పిల్లలతోనే గడచిపోతోంది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నరేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు. ► ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి? నేను నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాను ఏప్రిల్‌లో, ‘నాంది’ చిత్రాన్ని మేలో విడుదల చేద్దామనుకున్నాం. కానీ కరోనా వల్ల థియేటర్స్ మూతబడ్డాయి. కొత్తగా రెండు సినిమాలు కమిట్ అయ్యాను. షూటింగ్స్ విషయానికొస్తే.. హైదరాబాద్, చెన్నై, ముంబయ్‌లలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నటీనటులు ధైర్యంగా షూటింగ్‌లకు వచ్చే పరిస్థితి లేదు. కరోనా తగ్గేవరకూ పరిస్థితి ఇంతే. నిర్మాతలు కూడా ఎక్కువ రిస్క్ తీసుకోలేరు కదా. ► పుట్టినరోజుకి సేవా కార్యక్రమాలు చేస్తుంటారా? నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) జయంతికి, నా పాప పుట్టినరోజున అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలోనో లేకుంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఉండే రోగులు, వారి సహాయకులకు అన్నదానం చేయిస్తుంటాను. ► నాన్న లేని లోటు ఎలా అనిపిస్తోంది? జూన్ 10న నాన్నగారి జయంతి. 2011 జనవరి 21న నాన్న క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అన్నయ్య నిశ్చితార్థానికి నెల ముందు మాకు దూరమయ్యారాయన. 2012లో అన్నయ్య, 2015లో నా పెళ్లి జరిగింది. మా వివాహాలను ఆయన చూడలేదు.. మనవడు, మనవరాళ్లతో ఆడుకోలేదు. జీవితమంతా కష్టపడ్డారు.. సుఖపడాల్సిన వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా పిల్లల అల్లరి చూసినప్పుడల్లా ‘వాళ్లకి తాతయ్య ఉండుంటే బాగుండేది’ అనిపిస్తుంది. నాన్నగారుంటే ఓ ధైర్యం.. మంచీ చెడూ చెప్పేవారు. మా కుటుంబానికి మర్రిచెట్టులాంటివారు. చాలా మందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాన్నలేని లోటు మాత్రం ఎప్పుడూ తీరదు. నాన్న చనిపోయిన రెండేళ్లకు సరిగ్గా 2013 జనవరి 21న మా బాబాయ్ ఈవీవీ గిరిగారు కూడా చనిపోయారు. ఇద్దరి కొడుకుల్ని కోల్పోయిన మా నానమ్మ, తాతయ్యల బాధ వర్ణణాతీతం. నాన్న, బాబాయ్ చనిపోయిన రోజు జనవరి 21వ తేదీ అంటే భయపడుతుంటాం. ఆ రోజు ఎవరూ బయటికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాం. ► ఈ మధ్య ట్రాక్ మార్చినట్టున్నారు.. వరుసగా సీరియస్ పాత్రలు చేస్తున్నట్టున్నారే? నేను ఇండస్ట్రీకి వచ్చి 18ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లయినా కామెడీ రూట్ మార్చలేదని ప్రేక్షకులు అనుకుంటుంటారు. అందుకే ‘గమ్యం, ప్రాణం, నేను, శంభో శివ శంభో, మహర్షి’, ఇప్పుడు ‘నాంది’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశాను. నటుడిగా నేను నిరూపించుకోవాలి, బాగా పేరు రావాలంటే కథాబలం ఉన్న ఇలాంటి పాత్రలే చేయాలి. అయితే.. నాకు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కామెడీనే. అది చేస్తూనే మధ్యలో కథా బలం ఉన్న సినిమాలు చేస్తుంటాను. ‘నాంది’ చిత్రం నా కెరీర్‌కి బ్రేక్ అవుతుంది. ఇందులో నగ్నంగా నటించాను.. ఆ పోస్టర్స్ చూసి నా ధైర్యానికి చాలా మంది మెచ్చుకున్నారు. ► ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మీ అభిప్రాయం? ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నది కొత్త ప్రతిభావంతులకు వరం. సినిమాలను పెద్ద తెరపై చూసేందుకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఓటీటీ ఉంది కదా అని సెల్‌ఫోన్ లాంటి చిన్న స్క్రీన్‌లో ఎన్ని సినిమాలు చూస్తారు చెప్పండి? థియేటర్స్‌లో చూసే అనుభూతే వేరు. ► వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన ఉందా? సినిమాలతో బిజీగానే ఉన్నా. వెబ్ సిరీస్‌లపై ఆసక్తి లేదు. పైగా వెబ్ సిరీస్‌లు సిటీ జనాలకే పరిమితం. గ్రామాలకు ఇంకా విస్తరించలేదు. గ్రామాలకు విస్తరించేందుకు ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడే ఎక్కువ మంది చూస్తారు. ► ఈవీవీ సినిమా బ్యానర్లో కొత్త సినిమాలేవైనా ప్లాన్ చేస్తున్నారా? మా బ్యానర్లో సినిమా అంటే నాన్నగారి సినిమాలా ఉండాలనే అంచనాలుంటాయి. కథలు వింటున్నాం. నాన్న స్టైల్లో ఉండే కథ కోసం వెయిట్ చేస్తున్నాం. కుదిరితో నిర్మిస్తాం. – దేరంగుల జగన్ -
లుక్ బాగుందంటే ఆనందంగా ఉంది
రీల్ లైఫ్‌లో నటిగా నా లక్ష్యాన్ని చేరుకున్నాను. రియల్ లైఫ్‌లో నాకంటూ ఓ లక్ష్యం ఉంది.. అమ్మమ్మ పాత్ర వరకూ ఉండాలనుకుంటున్నా (నవ్వుతూ). నా కూతురి పిల్లలతో అమ్మమ్మ అనిపించుకుంటే నా లక్ష్యం తీరినట్టే. ‘‘ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒప్పుకున్నాను. తమిళ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నా. తమిళ్, తెలుగు భాషల్లో మా ఆయన దర్శకత్వం వహించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తాను. లాక్డౌన్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది’’ అని నటి రాశి అన్నారు. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ పలు విశేషాలు పంచుకున్నారు రాశి. ► ఈ పుట్టినరోజు అనే కాదు.. నేను ఏ పుట్టిన రోజునీ ప్రత్యేకంగా చూడను.. వేడుకలు జరుపుకోను. బర్త్ డేకి గుడికి వెళ్లి వచ్చి, ఇంట్లోనే కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాను. మా నాన్న చనిపోయారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ వల్ల మా అమ్మ నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ, నేను, నా భర్త శ్రీనివాస్, పాప కలిసి ఇంట్లోనే ఉంటున్నాం. లాక్డౌన్ సమయంలో కొందరు అక్కడక్కడ చిక్కుకుపోయారని విన్నాను. అదృష్టవశాత్తూ మేమంతా ఇంట్లోనే హాయిగా ఉన్నాం. ఈ లాక్డౌన్లో ‘రాశి విజన్స్’ అనే యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశాం. ► మా పాప రిధిమా మొదటి పుట్టినరోజు సమయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదు. జగన్‌గారిని కలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాననే పుకార్లు బాగా వచ్చాయి. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ► ఇన్నేళ్లు నటనలో గ్యాప్ రాలేదు.. నేనే ఇచ్చాను. రిధిమాని చూసుకునేందుకే సమయం సరిపోయేది.. ఇక నటించేందుకు తీరిక ఎక్కడిది? తను 1వ తరగతికి వెళ్లే వరకు సినిమాలు చేయొద్దని నిర్ణయించుకుని నటనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మా పాపకి ఐదేళ్లు వచ్చాయి. ఇప్పుడు నటించేందుకు వీలు కుదురుతోంది. ఇలాంటి పాత్రలే చేయాలనుకోవడం లేదు. నా మనసుకి నచ్చిన ఏ పాత్ర అయినా చేస్తాను. ► ఓ సీరియల్ షూటింగ్లో నేను పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న నా వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ‘బాగా సన్నబడ్డట్టున్నారే.. మీ లుక్ బాగుంది’ అని చాలామంది అంటుంటే సంతోషంగా ఉంది. నేను నటించిన మొదటి సీరియల్ ఇది. నాలుగు రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఈ చిత్రీకరణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నివారణ చర్యలు తీసుకున్నాం. వెండితెరకి, బుల్లితెరకి పెద్ద తేడా అనిపిం^è లేదు. ప్రస్తుతం సినిమాకి ఉపయోగించే టెక్నాలజీ బాగుంది. సీరియల్‌కి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. -
ఈ దశ అత్యంత కీలకం!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్డౌన్లో సడలిం పులు, దశలవారీగా ఎత్తివేత చేపడుతున్న నేప థ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిం దని, ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని కొందరిలో ఏర్పడుతున్న భావన సరికాదన్నారు. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికి పాజిటివ్ లక్షణాలున్నాయనేది బయటపడక పోతుండటం వల్ల వారిని కరోనా పాజిటివ్‌లుగానే పరిగణిస్తూ మన వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన వారిలో 79% మంది వైరస్ లక్షణాలు కనిపించని (అసిమ్టమ్యాటిక్ కేసులు) వారేనని, 21% మంది లోనే ఈ లక్షణాలు బయటపడు తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో రెండింతల జాగ్రత్త చర్యలు తీసు కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వారు వైరస్ వ్యాప్తికి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉండ టంతో, ఇది సోకకుండా కచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేశాక ఈ సమస్య మరింత తీవ్రం కానుందని, వైరస్ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, న్యూమోనియా, గొంతు సమస్యలు వంటి కరోనా లక్షణాలు లేని వారిలోనూ పాజిటివ్ కేసులు నమో దవుతున్నాయని, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, డయాబెటీస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలోనూ ఈ కేసులు బయట పడుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరి స్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశా లను ‘సాక్షి’ఇంటర్వూ్యలో శేషగిరిరావు వివరిం చారు. ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే.. సార్స్, ఎబోలాల కంటే.. సార్స్, ఎబోలాలతో పోల్చితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎబోలా సోకిన వంద మం దిలో 70–80 మంది, సార్స్ సోకిన వంద మందిలో 10–15 మంది చనిపోతున్నారు. కరోనా విషయంలో 3–4% మరణాలే నమోదవుతున్నా, ఎబోలా, సార్స్‌తో పోల్చితే కరోనాతో పెద్ద సంఖ్యలో ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండటంతో దీని వల్ల మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. మన చుట్టూ వైరస్ ఉన్నవారు.. మనతో పాటు సమాజంలో మన చుట్టూ వైరస్ సోకిన వారు మనకు తెలియకుండానే కొనసాగు తారు. కమ్యూనిటీ స్ప్రెడ్ పెరిగి 60% మంది వరకు ఇది వ్యాపించడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం ఏర్పడుతుంది. క్రమక్రమంగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగాక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఒక సాధారణ ఫ్లూ, జలుబు వంటి లక్షణా లతో మనకు తెలియకుండానే తగ్గిపోయే స్థాయికి ఇది చేరుకుంటుంది. అయితే వ్యాక్సిన్లు అందు బాటులోకి వచ్చాక లేక మెజారిటీ ప్రజలకు ఇది అలవాటయ్యే పరిస్థితి వచ్చేందుకు కొంతకాలం పడుతుంది. మరో 6, 7 నెలలు ఇన్ఫెక్షన్లుంటాయి.. వ్యాక్సిన్ రావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చునంటున్నారు. అందువల్ల కనీసం మరో 6, 7 నెలల పాటు కరోనా ఇన్ఫెక్షన్లు కొనసాగుతాయి. ఈ వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరిస్థితులతో ఇంకొంతకాలం సహజీవనం చేయాల్సిందే. ఇక్కడ 3 రకాల వైరస్ స్ట్రెయిన్లు.. ప్రపంచంలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కరోనా వైరస్ స్ట్రెయిన్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. భారత్‌లో మూడు రకాల స్ట్రెయిన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఏ 2 ఏ స్ట్రెయిన్ ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఇమ్యూనిటీతో.. చిన్న వయసు నుంచి బీసీజీ టీకాలు, మలేరియా, టైఫాయిడ్, అమ్మవారు వంటి వాటికి మందులు, వ్యాక్సిన్లు తీసుకోవడం వంటివి మనలో ఈ వైరస్ నుంచి రోగ నిరోధక శక్తిని కల్పించడానికి దోహద పడుతోంది. భారతీయుల్లో జన్యుపరమైన రక్షణ, టీకాలతో వచ్చిన రోగ నిరోధక శక్తి వల్ల అమెరికా, ఇటలీ, బ్రిటన్ దేశాలతో పోలిస్తే ఇక్కడ తీవ్రత తక్కువ కనిపిస్తోంది. గ్లౌజుల వాడకం తప్పనిసరయ్యే చాన్స్ మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడంతోపాటు రాబోయే రోజుల్లో వైరస్ సోకకుండా ఉండేందుకు గ్లౌజుల వాడకం కూడా తప్పనిసరయ్యే అవకాశాలున్నాయి. వృద్ధులు బయటకు రావొద్దు.. 65 ఏళ్లు దాటిన వారు, గుండె జబ్బులు, కిడ్నీ, కేన్స ర్, డయాలిసిస్ చేసుకుంటున్నవారు, శ్వాస సంబం ధ సమస్యలున్న వారు మరో కొన్ని నెలల దాకా బయటకు రాకుండా చూడాలి. హోం క్వారం టైన్లో నూ వారు మాస్క్‌లు ధరించడం, కుటుంబం లోని ఇతర సభ్యుల నుంచి భౌతిక దూరం పాటిం చడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. హార్ట్ పేషెంట్లపైనా ప్రభావం.. గుండె సంబంధిత సమస్యలున్న వారు రాబోయే చాన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. బైపాస్ ఆపరేషన్, స్టెంట్లు వేయించుకున్న వారు, గుండె జబ్బున్న వారు తప్పనిసరిగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూనే క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయాలు ఇతర విటమిన్లు వచ్చే వాటిని తీసుకోవాలి. భవిష్యత్ గురించి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో ఉండాలి. యోగా, సింపుల్ వాకింగ్, మెడిటేషన్‌తో పాటు ఇష్టమైన సంగీతం వింటూ ప్రశాంతంగా ఉండాలి. గుండెనొప్పి వంటిది వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. -
కరోనాతో ఐటీ’కి ముప్పేమీ లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ ఐటీ రంగం వాటా ప్రస్తుతం రూ.1.10 లక్షల కోట్లు. ఇతర నగరాలతో పోలిస్తే శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఐటీ రంగం వృద్ధిరేటు 7 శాతం కాగా, మన రాష్ట్రంలో మాత్రం రెండింతలు.. అంటే 15 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం.. రూ.65 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఉత్పత్తులను 2020 నాటికి రెండింతలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఈ లక్ష్యసాధనకు ఒకటి రెండేళ్లు పట్టొచ్చు. రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉన్న సానుకూల వాతావరణంతో బెంగళూరును ఒకటి రెండేళ్లలో అధిగమించే అవకాశం ఉంది. కరోనాతో ఈ రంగానికొచ్చిన ముప్పేమీ లేదు. ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడతామనే అంశంపైనే ఐటీ రంగం పురోగతి ఆధారపడి ఉంది’అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కొత్త అధ్యక్షుడు, ఇన్ఫోపీర్ సొల్యూషన్స్ సీఈఓ భరణికుమార్ ఆరోల్ వెల్లడించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ రంగం స్థితిగతులపై ‘సాక్షి’తో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఐటీపై కరోనా ప్రభావం అంతంతే.. కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని రంగాలపై ఉంది. ఐటీ రంగం కోణంలో చూస్తే ప్రస్తుత ప్రాజెక్టులపై అంత ప్రతికూల ప్రభావం లేకపోవచ్చు. కానీ కొత్త ప్రాజెక్టులు ఇప్పట్లో రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఐటీ వృద్ధిరేటు కొంత తగ్గొచ్చు. లాక్డౌన్ ముగిశాక.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3, 4 త్రైమాసికాల నాటికి పుంజుకునే అవకాశం ఉంది. అనూహ్యంగా తలెత్తిన సంక్షోభంతో ఆందోళన చెందకుండా తక్కువ సమయంలోనే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగులకు పని కల్పించాయి. రాష్ట్రంలో ఐటీ రంగంలో సుమారు 6 లక్షల మంది పనిచేస్తుండగా, వీరిలో 95 శాతం మంది ‘వర్క్ ఫ్రమ్ హోం’చేశారు. వీరికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఆయా సంస్థలు కేవలం నాలుగైదు రోజుల్లోనే సమకూర్చడం హైదరాబాద్ ఐటీ రంగానికి ఉన్న బలాన్ని తెలియచేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ మార్గదర్శకాలను సడలిస్తూ 33 శాతం మందితో పనిచేసేందుకు ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. నెమ్మదిగా ఆఫీసు వాతావరణాన్ని మెరుగుపరుస్తున్నాం. చైనాపై ప్రతికూల ధోరణి మనకు ‘ప్లస్’ ప్రస్తుతం చైనాపై ప్రతికూల ధోరణి పెరుగుతుండటంతో అక్కడి ఐటీ కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో దేశీయ ఐటీ రంగం సాధించిన పురోగతి మూలంగా భారత్ ప్రత్యామ్నాయంగా మారవచ్చు. పోలండ్‌తో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు పోటీ పడుతున్నా అక్కడ నైపుణ్య కలిగిన మానవ వనరులు పరిమితంగానే ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరం పెట్టుబడుల ఆకర్షణలో ముందువరుసలో నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక్కడి ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపడాలి. ఇప్పటికే నగర శివార్లలోని ఉప్పల్, ఆదిబట్ల ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు, ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. చిన్న కంపెనీలకు ప్యాకేజీ అవసరం కరోనా సంక్షోభంతో ఐటీ రంగంలోని చిన్న కంపెనీలు (ఎస్ఎంఈ రంగం) ఇబ్బందిపడుతున్నాయి. వీటిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. రుణ పరపతిని 20 నుంచి 30% మేర అదనంగా ఇవ్వడం, వడ్డీరేట్లు తగ్గించడం, నెలవారీ కిస్తీ చెల్లింపులపై మారటోరియం వంటి ప్రతిపాదనలు సమర్పించాం. అద్దెలు మాఫీ చేయడం, చిన్న కంపెనీలకు రాయితీలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్ ఐటీ రంగానికి చిన్న కంపెనీలు వెన్నెముకగా ఉన్నాయి. ఐటీ రంగంలో 70% కంపెనీలు ఎస్ఎంఈ రంగానికి చెందినవే. వీటిని ప్రభుత్వపరంగా ఆదుకోవడానికి కృషి చేస్తున్నాం. యూఎస్ తరహాలో ఇండియాలోనూ వేతనాల చెల్లింపునకు కేంద్రం ప్యాకేజీ ఇస్తే చిన్న కంపెనీలపై భారం తగ్గుతుంది. ఐటీలో లేఆఫ్‌లు సర్వసాధారణం ఐటీ కంపెనీలు ఎప్పుడూ 20 – 30% మానవ వనరులను అవసరానికి మించి నియమించుకుని వారికి శిక్షణనిస్తుంటాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చినపుడు, అవసరార్థం వారి సేవలను ఉపయోగించుకుంటాయి. పనితీరు ఆశించిన స్థాయిలో లేని వారిని తప్పించడం కూడా సాధారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించొద్దని (లేఆఫ్) ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగాలు కొందరికి జీవనోపాధి కావచ్చు కానీ పరిశ్రమ మనుగడకు ఉద్యోగులే కీలకం. లేఆఫ్‌పై ఫిర్యాదు అందితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో కలిసి హైసియా విచారణచేసి దిద్దుబాటు చేస్తోంది. ఎక్కడైనా ఒకటీ అరా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నా మరోచోట సర్దుబాటు చేసేలా ప్లేస్మెంట్ ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం. టాస్క్ ద్వారా వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ ఐటీ రంగంలోనే మనుగడ సాగించేలా చూస్తున్నాం. ఇక, ఇప్పటికే ఆఫర్ లెటర్లు ఇచ్చిన కంపెనీలు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయి. అయితే వారిని విధుల్లో చేర్చుకోవడం కొంత ఆలస్యం కావచ్చు. ఆవిష్కరణల దిశగా ‘టాస్క్’ ఇక్కడి ప్రభుత్వం ఐటీ రంగం వృద్ధికి అవసరమైన విధానాల తయారీలో ముందంజలో ఉంది. దేశంలో విద్యావ్యవస్థ, పని ప్రదేశాలకు నడుమ చాలా అంతరం ఉంది. కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగంలో చేరే వారికి బేసిక్ కోడింగ్ నేర్పాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం విద్యార్థుల్లో 10 – 12 శాతం మందికే ఎంప్లాయ్‌బిలిటీ (ఉద్యోగ సామర్థ్యం) ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ‘టాస్క్’వంటి సంస్థల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ఇన్నాళ్లూ ఐటీ సర్వీసులకే పరిమితమైన హైదరాబాద్ ప్రస్తుతం ఉత్పత్తులు, ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తోంది. మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, చాట్‌బోట్, ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ అంశాలు మన పాఠ్యాంశాల్లో లేవు. వీటిపై విద్యార్థులు, యువతకు ‘టాస్క్’శిక్షణనిస్తోంది. ట్రిపుల్ ఐటీ, జేఎన్టీయూ వంటి విద్యాసంస్థలతో కలిసి ‘హైసియా’కూడా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పనిచేస్తున్నాం. ప్రభుత్వ విధానాలతో స్టార్టప్‌లు, ప్రొడక్ట్ బ్రాండ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. భద్రత, రక్షణ, వ్యాపారవృద్ధికి ఇక్కడున్న అవకాశాలతో పాటు నైపుణ్యం గల మానవ వనరులు ఇక్కడుండటం వల్లే అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. -
ఉందిలే మంచికాలం ముందు.. ముందునా!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా సంక్షోభానికి ఆర్నెల్ల ముందే ఆర్థిక పరిస్థితి ప్రపంచంతో పాటు భారత్‌లో కూడా మందగమనంతో సాగుతూ వచ్చింది. దీంతో మనం కరోనాకు ముందు, ఆ తర్వాతి పరిస్థితులను శాస్త్రీయంగా సమీక్షించుకోవాలి. 2022 లేదా 2023 నాటికి ఉండే పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకెళ్లాలి. మనకు సహజ వనరులుండటం అనుకూలించే అంశం. గతంలో కరువు నుంచి వ్యవసాయ రంగం గట్టెక్కినట్టే ప్రస్తుత సంక్షోభం నుంచి ఉత్పత్తి, సేవా రంగాలు తిరిగి పుంజుకుంటాయి. రాబోయే రోజుల్లో ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరాస్తి, నిర్మాణ, ఆతిథ్య రంగాలు మరింత పురోగతి సాధిస్తాయి’అని సుచిర్ ఇండియా సీఈఓ లయన్ డాక్టర్ వై.కిరణ్ అంటున్నారు. కరోనా తర్వాత ఎదురయ్యే పరిణామాలపై ‘సాక్షి’తో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘సాగు’కు అండగా నిలవాలి... దేశంలో ఇప్పటికీ 50 శాతం వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది. గతంలో వరుసగా రెండు, మూడేళ్ల పాటు కరువొచ్చినా ఈ రంగం తిరిగి పుంజుకుంది. ఈ ఏడాది తెలంగాణ, ఏపీ సహా తమిళనాడు, పంజా బ్, ఉత్తరప్రదేశ్‌లో వ్యవ సాయ రంగం పురోగతి సాధిస్తోంది. ప్రభుత్వం ఈ రంగానికి అండగా నిలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. ఇదే తరహాలో ఉత్పత్తి, సేవా రంగాలూ పుంజుకుంటాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఆర్థికరంగం వాటానే ఎక్కువ. గతంలో నోట్ల రద్దు సందర్భంగా ప్లాస్టిక్‌మనీ, నగదు బదిలీ వంటి వాటితో గ్రామీణ, ఎంఎస్ఎంఈ రంగాలు ఇబ్బందులు పడతాయని లెక్కలు వేశా రు. కానీ అవేవీ అంతగా ప్రభావం చూపలేదని తేలింది. వీటికి సులభతర కార్యకలాపాల నిర్వహణకు మరింత వెసులుబాటునివ్వాలి. పెద్ద పరిశ్రమల మనుగడకు జీఎస్టీ నిబంధనల సడలింపు, రుణాల వసూలుపై మారటోరియం వంటివి అమలుచేయాలి. సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం సులభతర వాణిజ్య విధానాలు అమలయ్యేలా చూడాలి. హెలికాప్టర్ మనీ ఆలోచన మంచిదే కానీ సరైన పర్యవేక్షణ లేకుంటే వియత్నాం తరహా ప్రతికూల ఫలితాలు వస్తాయి. దేశానికి కొత్త జవసత్వాలు దేశ జనాభాలో 25 – 40 మధ్య వయస్కులు 50 శాతానికి పైగా ఉన్నారు. వీరికి భవిష్యత్తు ప్రణాళికలపై రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ వనరులతో పాటు ఇతర అవసరాలకు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కానీ మన వద్ద ఖనిజాలు, లోహాలు, చమురు, ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించాం. మరోవైపు జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటే మన ఆర్థిక వ్యవస్థ పురాతనమైనది కావడం ప్రస్తుత సంక్షోభంలో అనుకూలించే అంశం. దేశానికి కొత్త జవసత్వాలనిచ్చేందుకు ఇదే మంచి సమయం. రూపాయి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలపై కేంద్రం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అండగా నిలిస్తే ఉత్పత్తి, సేవా రంగాలు ఆరు నెలల్లో గాడినపడతాయి. వలసలు పదింతలు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం విషయానికొస్తే.. నిర్మాణ, ఇతర రంగాల్లో పనిచేసేందుకు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే కార్మికుల సంఖ్య వచ్చే పదేళ్లలో పదింతలు కావచ్చు. ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, ఎంఎస్ఎంఈ రంగాల్లో హైదరాబాద్ సాధిస్తున్న పురోగతే దీనికి కారణం. దీంతో నగరం ఏటా 3–4 కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశం ఉంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం భూమికి డిమాండ్ పెరుగుతుంది. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెడుతుంటాయి. బయ్యర్ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇదే అత్యంత అనుకూల సమయం. ‘వర్క్ ఫ్రం హోం’ నడవదు ఐటీ రంగం ఇప్పటికే నష్టపోగా, మరో రెండు నెలలు దానిపై కరోనా సంక్షోభ ప్రభావం ఉంటుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా 17 శాతం కాగా ఇందులో ఐటీ రంగం వాటా కొద్ది మాత్రమే. కాబట్టి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, పింక్ స్లిప్‌ల జారీ వంటివి పెద్దగా ప్రభావం చూపవని అంచనా. ఈ రంగంలో వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి కొనసాగకపోవచ్చు. డేటా సెక్యూరిటీ, పనిలో నాణ్యత వంటివి దృష్టిలో పెట్టుకుని ఆఫీసు నుంచే పనిచేయాలి. ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి వంద చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున ఆఫీస్ స్పేస్ ఉండగా, భౌతికదూరం నిబంధన నేపథ్యంలో 150 చదరపు అడుగులకు విస్తరించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు అమెరికా, యూరోప్‌లోని చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు ప్రస్తుత సంక్షోభం తర్వాత ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించొచ్చు. ఆతిథ్య రంగంలోనూ భౌతికదూరం నిబంధనతో నిర్మాణరంగానికి డిమాండ్ పెరగొచ్చు. -
మనో బలం మన సొంతం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తేసిన తరువాతే ఎందరిపై ఏయే రూపాల్లో మానసిక ఒత్తిళ్లు పనిచేశాయి?, ఏ మేరకు వారిపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం పడిందనే దానిపై స్పష్టత వస్తుందని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, ఆయా అంశాలపై వివిధ వర్గాల వారు స్పందిస్తున్న తీరు, చూపుతున్న ధైర్యం వంటివి పరిశీలిస్తే ప్రజలపై పెద్దగా మానసిక రుగ్మతల ప్రభావం లేనట్టేనని అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న మానసిక సమస్యలు ఎదురైనా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా లాక్డౌన్ సమయంలో తలెత్తే మానసిక, ఇతర సమస్యలపై ‘సాక్షి’తో డాక్టర్ ఎంఎస్‌రెడ్డి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... పేదలపైనే ఎక్కువ ప్రభావం లాక్డౌన్ సమయంలో మానసిక సమస్యల తీరు రకరకాలుగా ఉండొచ్చు. సైకోసిస్, స్కిజోఫోనియా, బైపోలార్ డిజార్డర్స్ వంటివి పెరగకపోవచ్చు. అడ్జస్ట్మెంట్, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సాధారణ జబ్బులు పెరగొచ్చు. స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారిపై కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితుల ప్రభావం పెద్దగా పడకున్నా, కిందివర్గాలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం ముందుకు సరికొత్త రూపంలో రావడంతో దానినెలా ఎదుర్కోవాలో తెలియక, కేవలం అంచనాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌తో ముందుకెళ్లాల్సిందే. మానసిక ప్రశాంతతే మందు సాధారణంగా ఆహారం, ఆశ్రయం, ఉపాధివంటి వాటితో ముడిపడిన అంశాలకు సంబంధించి సమస్యలు ఏర్పడితే అయోమయం, గందరగోళం వంటివి కలుగుతాయి. ఇప్పటివరకు వీటి విషయంలో ఎలాంటి సమస్యల్లేకుండా ఉండి, లాక్డౌన్ వేళ కొత్తగా తలెత్తిన పరిస్థితుల ప్రభావం పడితే ఆదుర్దా చెందడంతో పాటు భవిష్యత్‌పై అనుమానాలు, సందేహాలు నెలకొంటాయి. ఇటువంటి సంక్షోభ సమయంలోనే విచారం, ఒత్తిడి, భయం, కోపం వంటివి కలుగుతుంటాయి. అయితే మానసిక ప్రశాంతతను సాధిస్తూ ఒత్తిళ్లు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఆప్తులైన వారితో భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి. ‘జాగ్రత్త’మంచిదే! కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా, దగ్గు, జలుబు వచ్చినా.. అవి కరోనా లక్షణాలేమోనని సందేహించే పరిస్థితి.. కరోనాకు చికిత్సలేదని, మందులు, వ్యాక్సిన్లు లేవనే భయంతో పాటు తమకు పాజిటివ్ వచ్చి, 28రోజుల హాస్పిటల్ క్వారంటైన్‌కు పంపిస్తే ఎలా అనే ఆందోళన, ఆదుర్దా ఏర్పడటం సహజమే. అతి శుభ్రతతో పాటు అన్నింట్లో అతి జాగ్రత్తలు తీసుకునే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) లక్షణాలున్న వారు ఇటువంటి పరిస్థితుల్లో మరింత అతిగా స్పందించే అవకాశాలున్నాయి. అయితే వీరితో పాటు ఇతరులు కూడా పదేపదే చేతులు కడుక్కుంటూ శుభ్రత పాటించడం, ఆరోగ్యపరంగా, ఇతరత్రా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచి పరిణామమే. ఆర్థికంగా ప్రభావం ఎక్కువే.. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఆర్థికరంగంపై ఎక్కువగా ఉండొచ్చు. స్వస్థలాలకెళ్లిన వలస కార్మికులు తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ ప్రభావం నిర్మాణరంగం, దాని అనుబంధ రంగాలపై ఉంటుంది. ఆటోమొబైల్, ఎంటర్టైన్మెంట్ రంగాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. చైనా నుంచి వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులను, ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు రప్పించడంలో సఫలమైతే కరోనా అనంతర పరిణామాలను కొంతమేరకైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ సత్తా మనకుంది.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులతో సహా దేశమంతా ఒక్కటిగా నిలిచి లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించి ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థైర్యం, ధైర్యం, పట్టుదల భారత్‌కు, ప్రజలకు ఉన్నాయని ఇది చాటుతోంది. ఇంట్లో సర్దుబాటు సమస్యలు ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండటంతో సర్దుబాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల్లో కోపం, చికాకుతో పాటు నిర్లిప్తత వంటివి ఏర్పడడంతో ఇళ్లలో గొడవలకు ఆస్కారం కలుగుతోంది. పుస్తకాలు చదవడం, సంగీతం, నాట్యం వంటి ఇతర అభిరుచులు, వ్యాపకాలు లేని వారు, స్నేహితులు అంతగా లేని వారిలో ఈ సమస్యలు ఎక్కువ. అలాగే, లాక్డౌన్లో మద్యపాన సేవనం పెరిగింది. సిగరెట్లు, గుట్కాలు అలవాటున్న వారు వాటిని తీసుకోవడం మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఇటువంటి వారు ప్రయోజనకర వ్యాపకాలను కల్పించుకోవడం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చు. -
ఆస్తమా పేషెంట్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సోకే అవకాశాలున్న పది ప్రధానమైన రోగలక్షణాలు, కారణాల్లో ఆస్తమా వ్యాధి లేదని పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ నిపుణులు డా.విశ్వనాథ్ గెల్లా స్పష్టం చేశారు. ఆస్తమా కారణంగా ఈ వ్యాధి తమకు త్వరగా సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఆస్తమా పేషెంట్లు కూడా సాధారణ రోగుల మాదిరిగా ఈ వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇప్పటివరకు చైనా, అమెరికా, తదితర దేశాల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లోనూ ఆస్తమా ఉన్న వారు దాదాపుగా లేనట్టేనని తేలిందన్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, 2018 అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు 4కోట్ల మంది ఆస్తమా రోగులున్నారని, వారిలో 5 శాతం మందిలో ఇది తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. ఇలాంటి పేషెంట్లు మాత్రం కరోనాకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. హ్యాండ్ హైజీన్‌ను పాటించే విషయంలో సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని, ఎంత సమయంపాటు చేతులు కడుక్కోవాలి, దానికోసం అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవాలన్నారు. మంగళవారం (మే 5) ‘వరల్డ్ ఆస్తమా డే’, ‘వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే’ల సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ్యలో పల్మనాలజిస్ట్ డా. విశ్వనాథ్ గెల్లా వివిధ అంశాలపై ఏం చెప్పారంటే... ఆస్తమా ఆ జాబితాలో లేదు: కరోనా ప్రధానంగా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, శ్వాసకోశ సంబంధి త, సీవోపీడీ వంటి పది రకాల లక్షణాలు, ఇప్పటికే వివిధ రకాల ఆరోగ్య సమస్యలున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. ఆ జాబితాలో ఆస్తమా లేదు. ఇన్హేలర్స్ మానొద్దు... ఆస్తమా చికిత్సలో భాగంగా వాడుతున్న ఇన్హేలర్ల వినియోగాన్ని రోగులు ఆపొద్దు. వీటిని ఆపేసి ఆందోళనలతో ఆసుపత్రులకు వెళ్లి స్టెరాయిడ్స్ డోస్ పెంచడం వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు. జపాన్ పరిశోధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తమా ఉన్నవారు ఇన్హేలర్స్ను మానాల్సిన అవసరం లేదు. టెలి మెడిసిన్‌కు ప్రాధాన్యతనివ్వాలి... ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో, టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా మందులు తీసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం సంబంధిత డాక్టర్ని నేరుగా కలవాలి. తమకు తాము ఇన్హేలర్ డోస్ తగ్గించుకోవడం సరికాదు. ఆస్తమా రోగులు అక్యూట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడాలి. అలర్జీలతో జాగ్రత్త పడాలి... ప్రస్తుత సమయంలో ఆస్తమా రోగులు అలర్జీల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కార్పెట్‌తో వచ్చే అలర్జీలు, దుమ్ము, కొన్నిరకాల ఫాబ్రిక్స్, వాసనలు, వృత్తిరీత్యా వచ్చేసమస్యలతో అలర్జీలు వస్తాయి. అలర్జెక్ రునటిక్స్ ఉంటే తుమ్ములు, జలుబు వంటివి వస్తాయి. ప్రాణాయామం చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి. చేతులు శుభ్రపరుచుకునేందుకు... చేతులను శుభ్రం చేసుకునే విషయంలో కూడా పది స్టెప్స్‌ను పాటించాలి. రోజువారీ జీవనంలో శుభ్రతా చర్యలకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. బయట తిరిగొచ్చిన చెప్పులతో ఇంట్లో తిరగడం సరైంది కాదు. -
కరోనాపై భయం వద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల ఏదో జరిగిపోతోందన్న భయాలు, ఆందోళనల కంటే దాని గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత ముఖ్యమని శ్వాస, అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణుడు డాక్టర్ వి.విష్ణున్‌రావు సూచించారు. భయానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి లంకె ఉంటుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. మనం తీసుకొనే ఆహారం, రోగనిరోధకశక్తి, రోగాల మధ్య సంబంధం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సుగంధ ద్రవ్యాల్లో రోగనిరోధక లక్షణాలు అధికంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపుతోపాటు ఆకుకూరలు, పండ్ల వంటివి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించారు. పౌష్టికాహారంతోపాటు బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకొని ఆశావహ దృక్పథం, ప్రశాంత చిత్తంతో ఉంటే సమస్యలు ఉత్పన్నం కావన్నారు. స్వీట్లు, కూల్‌డ్రింక్స్, ఐస్క్రీంలను పూర్తిగా మానేయాలని, వాటి వల్ల గొంతు పట్టేసి వైరస్ త్వరగా లేదా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా మద్యపానం, సిగరెట్లు మానేయాలని, ప్రస్తుత కాలంలో వాటిని మానేయడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదని చెప్పారు. ‘సాక్షి’ ఇంటర్వూ్యలో డాక్టర్ విష్ణున్‌రావు చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దశలవారీగా... లాక్‌డౌన్‌ను ఎత్తేశాక ముందుగా ‘యంగ్ జనరేషన్’అంటే 12 నుంచి 50 ఏళ్లలోపు వారిని (ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు) దశలవారీగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్స్పోజ్ అయ్యేలా చేయగలిగితే మంచిది. ఆ తర్వాత మూడు వారాలకు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వారిని, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఇతరుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఏ వయసు వారనేది ముఖ్యం... కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన అది మరణంతో సమానం కాదు. ఇది సోకిన వారు ఏ వయసు (ఎలాంటి జబ్బులు లేని వారు) వారన్నది ముఖ్యం. 50 ఏళ్లలోపున్న వారిలో (ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే) మరణాలు చాలా తక్కువ. పరీక్షలు నిర్వహించాక వారికి బీపీ, షుగర్, కిడ్నీ, కేన్సర్ వంటివి ఉన్నాయా? వారు ఏ ఏజ్ గ్రూపుల్లో ఉన్నారన్న దానిపై ప్రత్యేక దృష్టి అవసరం. అలాంటి వారికి ప్రత్యేక చికిత్స అందించాలని ఐసీఎంఆర్ సూచించింది. లాక్‌డౌన్‌తో ఎంతో మేలు... లాక్డౌన్ వల్ల సానుకూల ఫలితాలొచ్చాయి. ఒక్కసారిగా కేసులు పెరిగిపోయి, పెద్దసంఖ్యలో మరణాలు సంభవించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో వైరస్ గ్రాఫ్ నిలకడగా సాగుతోంది. లాక్డౌన్ ఎత్తేశాక పరిస్థితులు మరింత మెరుగవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. పెద్దవారి విషయంలో జాగ్రత్తలు అవసరం... మన ఇళ్లలో పెద్ద వయసువారు, అనారోగ్య సమస్యలున్న వారిపట్ల ఇతర కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారికి వైరస్ సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. యువత, మధ్యవయస్కులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలి. వారికే పరీక్షలు చేయాలి... కరోనా లక్షణాలున్న వారికి, హైరిస్క్ పేషెంట్లకు, వివిధ అనారోగ్య సమస్యలున్న వారికి, 60 ఏళ్లకు పైబడిన వారికే టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిది. ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారం రిస్క్ గ్రూపులో జబ్బులున్న వారికి, అనారోగ్య సమస్యలు, 60 ఏళ్లు పైబడిన వారికే పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ఎవరికి జ్వరం ఉన్నా వారికి ప్రాధాన్యతనివ్వాలి. రెడ్‌జోన్‌లో ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ పట్టేసినట్టు ఉన్నా, పెదవులు నీలిరంగులో ఉన్నా, జ్వరంతో ఉండి అయోమయ లక్షణాలున్న వారికి టెస్ట్‌లు చేసి ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేసుకోవాలి. అనారోగ్య సమస్యలున్న వారు కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి... కరోనా వ్యాప్తి నేపథ్యంలో మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి. చనిపోయినవారి నుంచి, ఈగలు, దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనేది అపోహే. కేవలం మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నిరోధించొచ్చు. -
దశలవారీగా ఎత్తేయడమే మంచిది!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడమే మంచిది. లేకపోతే ఇప్పటివరకు లాక్డౌన్ అమలు ద్వారా సాధించిన ప్రయోజనాలు కొంతమేర దెబ్బతినే అవకాశముంది’అని కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవినాశ్ గాదె అభిప్రాయపడ్డారు. వచ్చే నెల 7 తర్వాత ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేయడం వల్ల ప్రజలంతా రోడ్ల మీదకు రావడం, పెద్దసంఖ్యలో గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయడంలో భాగంగా కొన్ని రంగాలకు పరిమితంగా అవకాశమిచ్చి, వచ్చే ఫలి తాలు, కొత్తగా వచ్చే కేసుల సంఖ్యను బట్టి మరి కొన్ని రంగాలకు మినహాయింపునివ్వాలని సూచిం చారు. మాల్స్, సినిమాహాల్స్‌తో పాటు మతపరమైన కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని, ఏమాత్రం వెసులుబాటునిచ్చినా సమస్య పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇంకా వివిధ అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడుతూ డాక్టర్ అవినాశ్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. పెద్దసంఖ్యలో పరీక్షలు అవసరం లేదు.. కరోనా విషయంలో రాష్ట్రంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలనిచ్చాయి. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. లక్షణాలు లేకుండా పెద్దసంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల పెద్దగా సాధించే ప్రయోజనం ఏమీ ఉండదు. హాట్‌స్పాట్స్, రెడ్జోన్స్లోని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి, తీవ్రత ఏ మేరకు, ఎంత ఉన్నాయనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాజిటివ్ కేసులు పెరిగిన పక్షంలో వాటిని దాచిపెట్టే అవకాశం ఉండదు. పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి రాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కైనా చికిత్స కోసం వెళ్లక తప్పదు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇలాంటి కేసులు వచ్చిన దాఖలాల్లేవు. ఇకపోతే మన దగ్గర లాక్డౌన్ అమలు బాగానే ఉంది. దీనిద్వారా మంచి ఫలితాలే సాధించాం. వైరస్ వ్యాప్తి ఎంతకాలమో చెప్పలేం.. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని చెప్పాలి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు బాగున్నాయి. వైరస్ వ్యాప్తి ఇంకెంత కాలం ఉంటుందో స్పష్టంగా చెప్పలేం. మరికొన్ని నెలల పాటు ఈ సమస్య కొనసాగుతుంది. వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు బయటపడడం వంటివి ఇప్పటికిప్పుడు తగ్గిపోయే అవకాశం లేదు. ఇన్నిరోజులకు అసలు కేసులే లేకుండా పోతాయని చెప్పడానికి లేదు. కాబట్టి మాస్క్‌లు, శానిటైజర్లు, మనుషుల మధ్య దూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి చర్యలను కొనసాగించాలి. మరికొన్ని రోజుల తర్వాత కూడా అప్పుడప్పుడు, అక్కడక్కడ పాజిటివ్ కేసులు బయటపడే అవకాశాలే ఎక్కువ. ఉష్ణోగ్రతలతో కొంత మేలే.. మన దేశంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందనేది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఎండలు పెరిగితే వైరస్ పూర్తిగా చనిపోతుందని చెప్పలేం. దగ్గితే, తుమ్మితే బయటకు వచ్చే తుంపర్లలోని వైరస్ కణాలు ఎండవేడిమికి కొంతమేర తగ్గే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సన్‌లైట్.. స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా 20–30 శాతం మేర వైరస్ తగ్గింపునకు దోహదపడొచ్చు. ఆ దేశాలతో పోలిస్తే మనం మెరుగే.. అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు కచ్చితంగా మెరుగ్గానే ఉన్నాయి. అక్కడ వెంటిలేటర్ కేసుల్లో పెరుగుదల, సీరియస్ అవుతున్న రోగుల సంఖ్య, పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయుల్లోని జన్యువులు, రోగనియంత్రణ శక్తి, శరీరతత్వం, ఇక్కడి వాతావరణం తదితరాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పొచ్చు. -
ఇదో కొత్త శత్రువు.. జాగ్రత్తే మందు!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ మానవాళి పాలిట కొత్త శత్రువు. ఇది మళ్లీ మళ్లీ దాడిచేసే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటూ అది సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. దీని నుంచి రక్షణకు ఎలాంటి వ్యాక్సిన్లు, మందులు సిద్ధంగా లేవు. అందరిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడిది కొంత తగ్గుముఖం పట్టినా, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుని విజృంభించే వైరస్ కాబట్టి మళ్లీ చలికాలంలో పెరిగే అవకాశాలున్నాయి. గతంలో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా కొంతమేర తగ్గి చలికాలంలో విజృంభించిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డైరెక్టర్ ఆఫ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ విశ్వనాథ్ గెల్లా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. జీవనశైలి మారాల్సిందే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎవరిలో ఎలా మారుతుంది? ఏ పరిస్థితుల్లో ఎలా పరివర్తనం చెందుతుంది? మళ్లీ ఏ రూపాన్ని సంతరించుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి కచ్చితమైన శుభ్రతా చర్యలు, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం ద్వారానే ›ప్రస్తుత స్థితిని ఎదుర్కోగలం. ప్రస్తుతం లాక్డౌన్ పటిష్టంగా అమలవుతూ మంచి ఫలితాలే వచ్చాయి. క్లస్టర్ కేసులు పెరగకపోవడం, కమ్యూనిటీ స్ప్రెడ్ లేకపోవడం వంటివి కలిసొచ్చే అంశాలు. మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలుచేస్తే కొత్త కేసుల నియంత్రణతో పాటు వైరస్ విస్తరించకుండా చూడొచ్చు. లాక్డౌన్ ఎత్తేశాక కూడా వ్యక్తిగత శుభ్రత, ముందు జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించాల్సిందే. ముఖ్య ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, ఆఫీసుల్లో సిక్రూమ్ల ఏర్పాటు వంటివి తప్పనిసరి. ప్రజారవాణా వ్యవస్థలో, ప్రజలు ఎక్కువగా తిరిగేచోట్ల ఆరోగ్య చర్యలు అమలు చేయాలి. దగ్గు, జలుబు ఇతర లక్షణాలున్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలి. ఆఫీసులు, స్కూళ్లు, మాల్స్ ఇతర చోట్ల శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలి. డిఫెన్సివ్‌గా ఉండటమే మార్గం శత్రువెవరో తెలిస్తే యుద్ధం చేయడం, ఎదుర్కోవడం సులువవుతుంది. కరోనా వైరస్ మన పాలిట కొత్త శత్రువు. ఎలా వ్యాపిస్తుందో? ఎలా విస్తరిస్తుందో? ఇంకా తెలియదు. కాబట్టి మన ఆరోగ్యానికిది శక్తివంతమైన ప్రత్యర్థి. జాగ్రత్తలు పాటించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటిస్తూ డిఫెన్సివ్‌గా వ్యవహరించడం ఒక్కటే మార్గం. ఆ దేశాల్లో ఎందుకంత ప్రభావం? అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, ఆధునిక సౌకర్యాలున్న చోటే ఎక్కువ పాజిటివ్ కేసులు, అధిక మరణాలు నమోదు అవుతున్నాయి. కొత్త రూపంలో వచ్చిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఎవరికీ లేకపోవడం ఒక కారణం. జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాక్‌డౌన్‌ను సరిగా అమలు చేయకపోవడం, ఏమీ కాదనే నిర్లక్ష్యంతో పార్టీయింగ్, హాలిడేయింగ్ చేయడం ఆ దేశాల్లో వ్యాప్తికి ముఖ్య కారణం. 1918లోనూ లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వందేళ్ల క్రితం ప్రపంచాన్ని స్పానిష్ మహమ్మారి కుదిపేసింది. ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్..ఇలా ఒక్కో రాష్ట్రంపై ఒక్కోలా ప్రభావం చూపింది. అప్పుడు కూడా 20 రోజుల ఆలస్యంగా లాక్డౌన్ ప్రకటించిన సెయింట్ లూయిస్‌లోని ప్రజలపై ఎక్కువ ప్రభావం పడి అధికసంఖ్యలో మరణించారు. ముందుగా లాక్డౌన్ ప్రకటించిన ఫిలడెల్ఫియాలో మంచి ఫలితాలొచ్చాయి. వైరస్‌కు చావు లేదు! కొన్ని కేసుల్లో వైరస్ పూర్తిగా నిర్మూలన అవుతున్న దాఖలాల్లేవు. 14 రోజుల తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నాక, ఆ పేషంట్లలో 30–35 రోజుల తర్వాత మోషన్లో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి శరీరంలో వైరస్ పూర్తిగా నిర్మూలన కాలేదని తేలుతోంది. అందువల్ల ఈ వైరస్ మళ్లీ మరోరూపంలో మ్యుటేట్ కావడం, జంతువుల ద్వారా ఇతరత్రా రూపాల్లో పరిభ్రమిస్తున్నందున మళ్లీ ఎప్పుడో అప్పుడు వెలుగుచూసే అవకాశాలే ఎక్కువ. వైరస్ అనేది వందేళ్లకోసారి కొత్తరూపం తీసుకోవడం, మ్యుటేట్ కావడం జరుగుతోంది. మనకేం కాదనుకోవద్దు! ⇒ కరోనా వైరస్ నుంచి రక్షణకు మందమైన బట్టతో కుట్టిన క్లాత్ మాస్క్‌లు ఉత్తమం. ఒక్కొక్కరు 3–4 కుట్టించుకుని, వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. కొన్నిరోజుల వరకే కాకుండా దీర్ఘకాలం పాటు వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. క్లాథ్ మాస్కులు అందుబాటులో లేకపోతే పెద్ద కర్చీఫ్‌ను 3–4 మడతలు చేసి నోటికి అడ్డంగా కట్టుకోవాలి. ⇒ మద్యపానం, పొగతాగే అలవాటున్న వారు వెంటనే మానేయడం మంచిది. అందుకిదే సరైన సమయం. వీరిపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ⇒ వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. తక్కువలో తక్కువ అరగంట చేయాలి. ఇంట్లోనే నడక, యోగా, ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ఏరోబిక్స్, రెస్పిరేటరీ ఇమ్యూనిటీ వచ్చేవి చేయాలి. వాకింగ్, స్లోజాగింగ్, ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం కావాలి. ⇒ ‘మనకేం కాదు. ఆరోగ్యంగా ఉన్నామ’నే భావన వీడాలి. యువత, మధ్యవయస్కులకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండి వైరస్‌ను తట్టుకున్నా.. వారిళ్లలోని పెద్దలు, ఇతరులకు దీనిని అంటిస్తే, హృద్రోగులు, డయాబెటిస్, ఇతర వ్యాధులున్న వారికి ప్రాణాంతకంగా మారుతుంది. ⇒ డాక్టర్లకే పరిమితం కాకుండా నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది మొదలు అందరికీ కరోనాపై జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి వరకు మరింత అవగాహన కలిగించాలి. -
గబ్బిలాలతో కరోనా.. అబద్ధమే!
సాక్షి, హైదరాబాద్: గబ్బిలాలతో కరోనా మనుషులకు సోకిందనడం అబద్ధమేనని, అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాట్ బయాలజిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) బ్యాట్ స్పెషలిస్ట్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ చెల్మల శ్రీనివాసులు పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు కరోనాకు సంబంధం లేదని తెలిపారు. కరోనా పులుసు పంది నుంచి (ప్యాంగోలిన్) నుంచి మనుషులకు సోకిన ట్లు పరిశోధనల్లో తేలిందని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) ప్రకటించిందన్నారు. అయినా గబ్బిలాలతో ఈ వైరస్ సోకుతుందని అపోహలు ప్రజల్లో పెరిగిపోయాయని, అందుకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులు గత 25 ఏళ్లుగా సౌత్ ఏషియాలో గబ్బిలాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. కొత్త వైరస్ అనగానే గబ్బిలాలపై ఎందుకు అనుమానం వస్తుందన్న దానిపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గబ్బిలాల్లో 40 శాతం వరకు.. కరోనా జాతికి చెందిన 100 రకాల వైరస్‌ల్లో 80 శాతం వైరస్లు అటవీ జంతువులు, పక్షుల్లోనే ఉంటాయి. వీటిలో 40 శాతం వైరస్లు ఒక్క గబ్బిలాల్లోనే ఉంటాయి. మిగిలిన 20 శాతం వైరస్లు పెంపుడు జంతువులు, పక్షుల్లో ఉండగా, అందులో ఒక్కోసారి ఒక్కో వైరస్ మనుషులకు సోకుతుంది. ఎక్కువ శాతం వాటిని తినడంతోనే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ కొత్త వైరస్‌తో వ్యాధి ప్రబలినా ముందుగా అనుమానం వచ్చేది గబ్బిలంపైనే. ఇతర జంతువులు, పక్షుల కంటే దానిపైనే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత 20 ఏళ్లలో వైరస్ల కారణంగా ఏ వ్యాధి ప్రబలినా ముందుగా గబ్బిలాలపై చేసిన పరిశోధనలే బయటకొచ్చాయి. కొంత మేర ఆ వ్యాధులకు కారణమైన వైరస్లు గబ్బిలాల్లో ఉండటం, ఆ పరిశోధనలు ముందుగా బయటకు రావడంతో ప్రజల్లో గబ్బిలాలపై అనుమానాలు పెరిగిపోయాయి. అన్ని వ్యాధుల్లోనూ గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు, మనిషికి సోకిన వైరస్‌కు వంద శాతం మ్యాచ్ కాకపోవడంతో తర్వాత లోతైన పరిశోధనల్లో ఇతర జంతువుల వల్ల ఆ వైరస్లు మనిషికి సోకినట్లు తేలింది. సార్స్ సమయం నుంచి మెుదలుకొని.. 2000 సంవత్సరంలో ప్రబలిన సార్స్.. కరోనా–1 వైరస్ కూడా గబ్బిలాల నుంచే వచ్చిందని చైనాలో శాస్త్రవేత్తలు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే సార్స్ సంబంధ వైరస్ గబ్బిలాల్లో ఉన్నా 100 శాతం మ్యాచ్ కాలేదు. దీంతో లోతుగా పరిశోధన చేస్తే పునుగు పిల్లి నుంచి కరోనా–1 వైరస్ మనుషులకు సోకిందని తేల్చింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. తర్వాత 2013–14లో మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) సోకినప్పుడు.. అదీ గబ్బిలాల వల్లే వచ్చిందని యూరోప్ దేశాలు పేర్కొన్నాయి. అప్పుడూ వైరస్ వంద శాతం మ్యాచ్ కాకపోవడంతో మళ్లీ పరిశోధన చేస్తే ఒంటె నుంచి సోకిందని తేలింది. ఎబోలా వచ్చినప్పుడు కూడా మెుదట గబ్బిలాలనే అనుమానించారు. తర్వాత గొరిల్లా నుంచి సోకినట్లు వెల్లడైంది. ఇప్పుడు చైనాలోని వూహాన్లో ప్రబలిన కరోనాకు కూడా మెుదట్లో చేపలు అని, తర్వాత పాములని, అనంతరం గబ్బిలాల కారణంగా సోకిందని చెబుతూ వచ్చారు. అయితే వూహాన్లో మనుషులకు సోకిన వైరస్‌కు గబ్బిలం నుంచి వచ్చిన వైరస్‌కు 90 శాతమే మ్యాచ్ అయింది. మిగతా 10 శాతం ఎందుకు మ్యాచ్ కాలేదని పరిశోధన చేస్తే కరోనా సోకింది గబ్బిలాల వల్ల కాదని తేలింది. పులుసు పంది (ప్యాంగోలిన్) నుంచి మనుషులకు సోకిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అనవసర భయాలతో చంపొద్దు.. గబ్బిలాలతో కరోనా వచ్చిందన్నది అబద్ధమే. సోషల్ మీడియా కారణంగా వాటిపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఎబోలా సోకినప్పుడు వందల సంఖ్యలో గబ్బిలాలనే చంపేశారు. ఇప్పుడు అలాంటివి చేయెుద్దు. పర్యావరణ పరిరక్షణకు, మానవ ఉనికికి గబ్బిలాలు ఎంతో ముఖ్యం. వీటిలో ప్రధానంగా ఫల బక్షి గబ్బిలాలు, కీటక బక్షి గబ్బిలాలు ఉంటాయి. ఫల బక్షి గబ్బిలాలు అరుదైన వృక్ష జాతుల ఫలాలను తిని వాటి విత్తనాలను ఇతర ప్రాంతాల్లో విసర్జించడం ద్వారా వృక్షాల విస్తరణకు తోడ్పడతాయి. కీటక బక్షి గబ్బిలాలు.. రాత్రి వేళల్లో పంట పొలాలను పాడు చేసే కీటకాలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఇక మన రాష్ట్రంలో 17 రకాల గబ్బిలాలు ఉండగా, అందులో 5 రకాల గబ్బిలాలు హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణాల్లో ఈ గబ్బిలాల కారణంగా దోమల బెడద తగ్గుతోంది. పట్టణాల్లో ఉంటున్న గబ్బిలాలు తమ ఆహారంగా దోమలనే 30 శాతం తింటున్నట్లు తేలింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడమే ప్రధానం. జూనోటిక్ వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. నిర్ధిష్ట మానవ కార్యకలాపాలను, అడవి జంతువులను తినడాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడం ద్వారా ఇలాంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. -
చోటా కె నాయుడి ‘లవ్ స్టోరీ’
చోటా కె నాయుడి పేరులో ‘చోటా’ అని ఉండొచ్చు. సినిమాటోగ్రాఫర్‌గా ఆయన కెరీర్లో ఉన్నవన్నీ పెద్దవే! పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద దర్శకులు. అతడి వెనుక కూడా ఓ పెద్ద శక్తి ఉంది. సీతాదేవి! ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముప్పై ఏళ్లయింది పెళ్లయి. లవ్లీగా, ప్రశాంతంగా ఉన్నారు. ‘క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’ అంటాడు. అందుకే అతడు.. చోటా కె కాదు.. సీతా కె నాయుడు. ఆమె.. వైఫ్ మాత్రమే కాదు.. అతడి లైఫ్ కూడా. ►30 ఏళ్లకు పైగా మ్యారీడ్ లైఫ్ మీది. ఇద్దరూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సీక్రెట్? చోటా: మగవాడి డామినేషన్ ఉన్న ఈ దేశంలో స్త్రీకి సమాన హక్కులు ఉన్నా ఓ ప్లేసులో పెట్టి ఆమెను ఆపేశారు. అయితే మగవాడి డామినేషన్ ఉన్నప్పటికీ భార్య సపోర్ట్ లేకుంటే ఫ్యామిలీ కరెక్ట్‌గా ఉండదు. అది మగవాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కువా నేను ఎక్కువా... లాంటివి ఉండకూడదు. అలాగే భార్యకి స్పోర్టివ్‌నెస్, ఓపిక, శక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ కంటిన్యూ కాదు. మా సంసారం సాఫీగా ఉందంటే ‘దట్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’. వైవాహిక జీవితం బాగుండాలంటే భార్యాభర్తలిద్దరూ కడదాకా ఒకేమాట మీద ఉండాలి. ►ఇంతకీ మీ ఇద్దరికీ ఎలా పరిచయం? చోటా: నేను చెన్నైలో మా గురువు దాసరిగారి సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఇక కెమెరామేన్ అయిపోదాం అనుకుని ఉన్న పని మానేశాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం వేరే కెమెరామేన్ దగ్గర ఓ సంవత్సరం పని చేస్తే కెమెరామేన్ అయిపోవచ్చు అనుకున్నాను. ఆ టైమ్‌లో చాలామంది దర్శకుల దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాను. ఎవరూ ఇవ్వలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా హైదరాబాద్ నుంచి ఓ టీవీ సీరియల్‌కి కెమెరామేన్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ అవకాశం నాకు రాలేదు, భరత్ పారేపల్లి (డైరెక్టర్) అని నా స్నేహితుడికి వచ్చింది. ఇద్దరం బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. నాకూ చాన్స్ వచ్చింది. ‘క్రీస్తు జననం’ అనే టెలీఫిల్మ్ చేశాం. దానికి ప్రొడ్యూసర్ సీతాదేవిగారు, సంగీత దర్శకుడు కీరవాణిగారు, సింగర్ మనో. అందరి నోట్లో నుండి ఈమె పేరు వినేవాణ్ని కానీ, ఈమెను చూడలేదు. షూటింగ్ టైమ్‌లో ఏ కారులో నుంచి ఏ అమ్మాయి దిగినా ఆమె సీతాదేవి అనుకునేవాణ్ని. షూటింగ్ అయిపోయింది. మేం చైన్నై వెళ్లిపోయాం. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సీరియల్ మొదలుపెట్టాలనుకున్నారామె. ఆ యూనిట్లో పని చేసే దుర్గా నాగేశ్వరరావు ఎవరో కెమెరామేన్ను సజెస్ట్ చేశారట. ‘లేదు.. నా టీమ్ నాకుంది’ అని నన్ను పిలిపించారామె. అప్పుడు నేను ఆమెను కలిశాను. అలా ట్రావెల్ చేస్తున్న టైమ్‌లో నేను ప్రపోజ్ చేశాను. ►ఆమె నిర్మాత కదా.. ప్రపోజ్ చేస్తే ఉన్న పని పోతుందేమో అని భయపడలేదా? చోటా: అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ప్రతిరోజూ మా షూటింగ్ ప్యాకప్ అవగానే యూనిట్ అంతా ఎస్.ఆర్. నగర్‌లోని సీతాదేవిగారి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎవరి రూమ్‌లకు వాళ్లు వెళ్లాలి. అలా మేం వెళ్లేటప్పుడు తలుపుకు తాళం వేసుకుని లోపలికి వెళ్లిపోయేది. రోజులానే ఆ రోజు కూడా వచ్చి, తాళమేసుకుంది. నేను బయట నిలబడి ‘ఓ సారి మీ చేయి ఇటివ్వండి’ అన్నాను. ‘ఎందుకు’ అని అడుగుతూనే ఇచ్చింది. ఆ చేతిని ముద్దుపెట్టుకుని ‘ఐ లవ్ యూ’ అని పరుగో పరుగు (నవ్వుతూ). తాళం వేసి ఉంది కాబట్టి ఆమె నన్ను కొడదామన్నా కుదరదు కదా,అందుకే అలా చేశా. తర్వాత ఆమె కలిసినప్పుడు ‘ఇదే విషయం ఓ సంవత్సరం తర్వాత కూడా అనిపిస్తే అప్పుడు చెప్పు’ అన్నారు. ఏడాది తర్వాత అదే చెప్పాను. అలా మా లవ్ ట్రావెల్ కంటిన్యూ అయ్యింది. ►మీది ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ కదా? చోటా: నా కూతురికి ఇంతవరకు దాని క్యాస్ట్ ఏంటో తెలియదు. సీతాదేవి: చిన్నప్పుడు ఓసారి ఏదో ఫామ్ నింపుతూ ‘ఎస్.సి’ అని ఉన్నచోట టిక్ పెట్టిందట. ఇంటికొచ్చి ఆ విషయం చెప్పింది. అలా ఎందుకు పెట్టావు అంటే ఎస్.సి అంటే మనం ‘సూపర్ క్యాస్ట్’ కదా అంది. సో... మా ఇంట్లో నో క్యాస్ట్. ►బాగుంది.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో ఓ సెక్యూరిటీ.. ఫైనాన్షియల్‌గా ఫుల్ హ్యాపీ. మరి పెళ్లయిన కొత్తలో ఏమైనా కష్టాలు ఫేస్ చేశారా? చోటా: మా పెళ్లయ్యేసరికి ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ, డబుల్ కాట్ బెడ్, ఓ డైనింగ్ టేబుల్, రెండు కేన్ కుర్చీలుండేవి. అప్పట్లో మూడువేల రూపాయల అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కూడా పనోళ్లు ఉండేవారు. సొంత కారు ఉండేది కాదు కానీ ట్రావెల్స్ నుండి ఎప్పుడూ ఓ కారు అద్దెకు తీసుకునేవాళ్లం. మా లైఫ్‌సై్టల్ అలా ఉండాలనుకునేవాళ్లం కాబట్టి వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవటానికి ఇద్దరం బాగా కష్టపడేవాళ్లం. సీతాదేవి: అప్పుడు మేం బిజీగా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవటంతో మా పాప ఐశ్వర్యను హాస్టల్లో పెట్టాం. హాలిడేస్ అప్పుడు ‘ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం’ అని లిస్ట్ తెచ్చేది. కానీ, ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హాలీడేకి రావడానికి కుదిరేది కాదు. నేను నా పని మానుకుని వెళ్లలేను. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లం. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా తిరుపతి, షిరిడీ, శ్రీశైలం... అంతే కుదిరేది. అప్పుడు నేను మా పాపతో ‘నీకు పెళ్లయిన తర్వాత 24 గంటలూ హాలిడేకి వెళ్లే ఫ్యామిలీ దొరుకుతుంది’ అనేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల అలాంటి ఫ్యామిలీయే వచ్చింది. వాళ్లెప్పుడూ టూర్స్లోనే ఉంటారు (నవ్వుతూ). ►సీతగారు... మీ కెరీర్ గురించి చెబుతారా? సీరియల్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు? సీతాదేవి: నా ఫ్రెండ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దూరదర్శన్‌లో ‘మర్యాదరామన్న’ అనే సీరియల్ చేశాను. సాయికుమార్, బాబుమోహన్, గౌతంరాజు, సీవీయల్ నరసింహారావు, ‘తెలంగాణ’ శకుంతల, శిల్ప, సుమ... ఇలా మంచి పేరు తెచ్చుకున్న చాలామంది అప్పుడు ఆ సీరియల్లో నటించారు. ఆ సీరియల్ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణగారు నటించిన ‘సింహాసనం’ సినిమా సెట్‌ని, కాçస్ట్యూమ్స్ని వాడుకున్నాం. అందుకే ఆ సీరియల్ చాలా రిచ్‌గా ఉంటుంది. అలా ఓ 20 ఏళ్లపాటు ఎన్నో సీరియల్స్ చేశాను. ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ►తర్వాత ఎందుకు మానేశారు? సీతాదేవి: ఓ డైలీ సీరియల్ చేస్తున్న సమయంలో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. కొంచెం జ్వరంతో మొదలై ఆ తర్వాత అది పెద్ద ప్రాబ్లమ్ అయింది. నాలుగైదు నెలల పాటు ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగాం. ఒక హాస్పిటల్ వాళ్లయితే సరిగ్గా నిర్ధారించకుండానే ఏదో ఆపరేషన్ కూడా చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఏంటీ అని అడిగితే, ‘మీకు ప్రాబ్లమ్ ఏం లేదు, సైకలాజికల్ ప్రాబ్లమ్’ అనేవాళ్లు. కొందరేమో ఎవరో చేతబడి చేసుంటారని అన్నారు. దాదాపు 20 కిలోలు బరువు తగ్గాను. నాకు మెల్లకన్నులా వచ్చేసింది. చూపు కూడా మందగించింది. నడక, మింగడం కూడా కష్టమయ్యాయి. చోటా: అప్పుడు ‘అంజి’ సినిమా విడుదలైంది. బాలకృష్ణగారి పెదపాప వచ్చి సినిమా బావుంది అంకుల్ అని చెబుతుంటే ఈమె దారిన ఈమె వెళ్లి కారులో కూర్చుంది. తర్వాత నేను కారెక్కగానే ముందెళ్లే కార్లన్నీ నాలుగు, నాలుగ్గా కనపడుతున్నాయి అంది. అప్పుడు నేను ఇదేదో సీరియస్ వ్యవహారమే అనుకున్నాను. సీతాదేవి: డాక్టర్లు ఇది న్యూరో ప్రాబ్లమ్ అని కనిపెట్టారు. ‘మల్టిపుల్ స్లె్కరోసిస్’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సినిమాలో మాధవన్‌ని మీ ఆవిడ (విద్యాబాలన్) ఎందుకు మంచంలో ఉంది అంటే మల్టిపుల్ స్లె్కరోసిస్ అని చెబుతాడు. ఆ సినిమా చూస్తూ మణిరత్నం ఎప్పుడూ ఎవరికీ తెలియని, నోరు తిరగని జబ్బులు పెడతారు అన్నా. ఆ జబ్బు నాకొచ్చింది. చోటా: ఆ టైమ్‌లో డాక్టర్లు ‘రోజుల మనిషే’ అన్నారు కానీ స్టెరాయిడ్స్ ఇచ్చిన రెండోరోజు నుంచే మార్పు కనబడింది. మొదట 20 కిలోలు తగ్గిన మనిషి ఆ స్టెరాయిడ్స్ వల్ల 25 కిలోలు పెరిగింది. అలా 3, 4 నెలల్లో 45 కిలోలు పెరిగారు. ►ఆ టైమ్‌లో చోటాగారు ఎలాంటి ట్రస్ట్ ఇచ్చారు? సీతాదేవి: నా లైఫ్‌లో నన్ను బాగా చూసుకున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మా అమ్మ అయితే మరొకరు నా భర్త చోటా. అన్నీ బాగున్నప్పుడు మనతోపాటు ఎవరైనా ఉంటారు. మన కళ్లు మూతబడుతున్నట్లు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. వాళ్లకు మెడిసిన్ అందిందా? లేదా? ఏమైనా తిన్నారా? లేదా ఇవన్నీ శ్రద్ధగా పట్టించుకుంటే అదే మంచి పార్ట్నర్షిప్. అలాంటి పార్ట్నర్షిప్నే ట్రస్ట్ అంటాను నేను. నా పార్ట్నర్ (భర్త) ఈజ్ బెస్ట్. ►మామూలు మనిషి అయ్యాక మళ్లీ సీరియల్స్ నిర్మాతగా కంటిన్యూ కాలేదా? సీతాదేవి: ఆరోగ్య సమస్య వచ్చాక ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. మనం అనుకుంటాం గానీ ఏది జరగాలో ఆ దేవుడు అదే జరిగేలా చేస్తాడు. మనం అహంకారంతో ఏదేదో అనుకుంటాం. కానీ జీవితం వేరేలా డిసైడ్ చేస్తుంది. ‘నేనొక రోల్ మోడల్’ అని నాకు నేను అనుకుని బలవంతంగా చేద్దామనుకున్న పనులు కూడా చేయలేకపోయాను. ఎక్కువ వేడి తగలకూడదని, స్ట్రెయిన్ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. షూటింగ్ అంటే లైట్స్.. ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇక సీరియల్స్ జోలికి వెళ్లలేకపోయాను. అలాగని ఖాళీగా ఉండలేను. నాకు చీరలు, డ్రెస్ డిజైన్స్ విషయంలో క్రియేటివిటీ ఉంది. చీరలంటే కలక్షన్ కోసం ఊళ్లు తిరిగి, తేవాలి. ఈ ఊర్లు పట్టుకుని తిరగడం మనవల్ల కాని పని అని బ్యూటీ పార్లర్ అనుకున్నాను. అయితే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ఫ్రాంచైజీ తీసుకోండని కొందరు సలహా ఇచ్చారు. ఓన్‌గా చేయాలన్నది నా ఐడియా. అది కూడా గేటెడ్ కమ్యూనిటీస్‌లో నా పార్లర్ ఉండాలనుకున్నాను. గేటెడ్ కమ్యూనిటీ అనే కొత్త కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ బ్యూటీపార్లర్ మా ‘పింక్స్ అండ్ బ్లూస్’దే. 2005 డిసెంబరులో స్టార్ట్ చేశాను. సంవత్సరం పాటు మామూలుగా సాగింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ►కెరీర్ పరంగా ఒకర్నొకరు సలహాలు..? చోటా: నాకెప్పుడూ చేతిలో నాలుగు సినిమాలు ఉండేవి. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్ అంటే మూడు, నాలుగు లక్షలు ఇచ్చేవారు. నాలుగు సినిమాలకు అవకాశం వచ్చింది.. వీటిలో ఏది చేస్తే బాగుంటుంది? అని నేనే సీతని అడిగేవాణ్ణి. సీతాదేవి: నేను డబ్బు గురించి ఆలోచించకుండా సలహా ఇచ్చేదాన్ని. అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది. అందుకే చోటా ఎప్పుడూ నా డెసిషన్ ఫైనల్ అంటారు. ఓ సినిమా వాళ్లు 5 లక్షలు ఇస్తారని తెలిసినా కూడా ‘మన పరిస్థితి బాగాలేని టైమ్‌లో వీళ్లు మనకు అండగా నిలిచారు. 2 లక్షలు ఇచ్చినవాళ్లకే మనం చేద్దాం’ అని చెప్పేదాన్ని. ఆ టైమ్‌లో నిజంగా డబ్బు అవసరం ఉన్నా కూడా నేను చెప్పిన సినిమానే చేసేవారు. కెరీర్‌వైజ్‌గా నేనెప్పుడూ తనని సపోర్ట్ చేయమని అడగను. కాకపోతే మెయిన్ సపోర్ట్ ఏంటంటే.. నేను చేసే పనుల్లో ఇంటర్ఫియర్ అయి ఇలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు అని అడగకుండా ఉండటమే (నవ్వుతూ). చోటా: నేను నాన్‌స్టాప్ షూటింగ్స్‌లో ఉంటాను. లేట్‌గా వస్తాను. బర్త్ డేలు, పెళ్లి రోజులు, ఫంక్షన్స్ అలాంటి సెలబ్రేషన్స్ ఏవీ ఉండవు. షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఇక అవేం ఉంటాయి. సీతాదేవి: సినిమా అంటే తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. ►మరి మీకు సెలబ్రేషన్ అంటే ఏంటి? సీతాదేవి: లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తుంటాం.. ఇప్పుడు కాదు కానీ పెళ్లైన కొన్నేళ్లు లాంగ్ డ్రైవ్‌లకి వెళ్లాం. చోటా: ఇంట్లో మేం ఇద్దరమే ఉంటాం. మాతో పాటు తొమ్మిదిమంది పనివాళ్లు ఉంటారు. ఇంట్లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ►మీవారికి పొగరని ప్రచారంలో ఉంది నిజమేనా? సీతాదేవి: (నవ్వుతూ) మొన్ననే మేం వైజాగ్‌లో ఒకాయన్ని కలవడానికి వెళ్లాం. చోటా అక్కడ ఎవర్నో తిట్టారు. నేను కలవడానికి వెళ్లిన మనిషి ఆ సీన్ చూశాడు. అతను ‘మేడమ్, చోటాగారిని తట్టుకోవటం ఎవరివల్లా కాదు. మీరే ఆయన బలం, బలహీనత’ అన్నాడు. నాకు నవ్వాగలేదు. చోటా: నాకు ఏదైనా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే ముఖానే మాట్లాడేస్తాను. అందరూ కడుపులో పెట్టుకుంటారు, నాకు అది రాదు. ►అలా మాట్లాడినప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయా? చోటా: రాకపోవటం ఏముంది? ప్లేటులు పగులుతూనే ఉంటాయి (నవ్వుతూ). సీతాదేవి: మొదట్లో అయితే నేను వాదన పెట్టుకునేదాన్ని, ఇప్పుడు కామ్‌గా ఉంటాను. చోటా: మాకు కోపం వస్తే మా ప్రాపర్టీ మీదే చూపించుకుంటాం తప్ప ఎవరికీ హాని చెయ్యం (నవ్వుతూ) ►ఇటీవల ఓ హీరోయిన్ని చోటాగారు స్టేజీ మీదే ముద్దు పెట్టుకున్నారు. అలాంటివి చూసినప్పుడు? సీతాదేవి: మీరు నమ్ముతారో లేదో కానీ, ఆయన ఇంటర్వూలు, ఫంక్షన్లు నేను చూడను. మా కజిన్స్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి, ‘చోటా ఇంటర్వూ్య వచ్చింది, నీ గురించి బాగా మాట్లాడారు’ అంటారు. ఓ అవునా అనుకుంటాను కానీ, నేను చూడను. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకుంది ఏంటంటే ఎవరూ ఎవరినీ మార్చలేరు. అయితే చోటా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దేవుడు నాకు సపోర్ట్ చేశాడేమో. చోటా: ప్రతిదానికీ దేవుణ్ణి నమ్ముతుంది. నమ్మనివాళ్లు కూడా తనని చూసి నమ్ముతారు. మా ఇంట్లో ఓ అమ్మవారి ఫోటో ఉంది. దానికో కథ ఉంది. ►ఏంటా కథ? సీతాదేవి: నేను ‘మర్యాదరామన్న’ సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారు నల్లగా ఉన్న అమ్మవారి బొమ్మను గోల్డ్ పెయింటింగ్ చేసి చాలా రిచ్‌గా తయారు చేశాడు. ఆ బొమ్మను నాతోపాటు ఇంటికి తెచ్చుకున్నాను. దాదాపుగా 36 ఏళ్లనుండి ఆ అమ్మవారి విగ్రహం నాతోనే ఉంది. అమ్మవారు నవ్వుతూ, నాతో మాట్లాడుతుంది అనే ఫీలింగ్‌తో నేను పూజ చేసుకుంటాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ►మీ కపుల్ పీస్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కాబట్టే ‘ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు’ అనే పాయింట్‌తో ఇంటర్వూ్య మొదలుపెట్టాం.. ఇద్దరూ: ‘యస్.. వియ్ ఆర్ పీస్ఫుల్’. ఇంటర్వ్యూని కూడా ప్రశాంతంగా ముగించాం (నవ్వుతూ). ►మీ ఇద్దరికీ నచ్చే కామన్ విషయాలు? చోటా: క్లియోపాట్రా. అది మా కుక్కపిల్ల. అదికాక ఇద్దరికీ నచ్చేవి కార్లు, బట్టలు, పర్ఫ్యూమ్లు. ఇంకా చాలా ఉన్నాయి. ►ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఓపెన్‌గా షేర్ చేసుకుంటారా? సీతాదేవి: ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఈయనతో చెప్పను, టెన్షన్ పడతారు. మా అమ్మ ఉన్నప్పుడు ఆవిడతో షేర్ చేసుకునేదాన్ని. ‘నీకు ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? నథింగ్ టు వర్రీ, నువ్వు చేయగలవు’ అని ధైర్యం చెప్పేది. ఇప్పుడు అలాంటిదేదైనా ఉంటే మా అమ్మాయి ఐశ్వర్యతో చెబుతాను. షీ ఈజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్. చోటా: నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ 100 పర్సెంట్ ఈవిడతోనే షేర్ చేసుకుంటాను. ►మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? చోటా: ఈవిడ నాకంటే చాలా బిజీ. ఉదయం పది గంటలకల్లా ఆఫీస్‌కి వెళ్లిపోతుంది. ‘పింక్స్ అండ్ బ్లూస్’ మొత్తం 50 బ్రాంచీలను ఇక్కడినుంచే ఆపరేట్ చేస్తుంది. పొద్దున్నే నేను జిమ్ చేసుకుంటాను. ప్రతిరోజూ నన్ను కలవటానికి ఓ సినిమా బ్యాచ్ వస్తారు. జిమ్ తర్వాత వాళ్లతో స్పెండ్ చేస్తా. 365 రోజులు ఇలానే ఉంటుంది. ఏదైనా సినిమా బాగుంది కానీ ఫ్లాప్ అయ్యింది అనే టాక్ వస్తే, ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో చూస్తా. మణిరత్నం సినిమా అయితే హిట్, ఫ్లాప్ అని ఉండదు. తప్పనిసరిగా చూస్తాను. సీతాదేవి: మొదట్లో ప్రివ్యూ షోలు వేసేవాళ్లు, వాటికి ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. ఇప్పుడు పెద్దగా చూడట్లేదు. నా ఆరోగ్యరీత్యా కంటిన్యూస్‌గా ఓ మూడుగంటల పాటు సినిమా చూడాలంటే చాలా స్ట్రెయిన్ అవుతాను. ఏదైనా సినిమా చూసినా కొంచెం కొంచెంగా చూస్తాను. – డి.జి. భవాని -
ఆయన అవినీతి పరులకు సింహస్వప్నం
అవినీతి పరులకు ఆయన సింహస్వప్నం. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చెప్పనవసరం లేదు. కానీ తన ముప్పై ఏళ్ల పోలీస్‌శాఖ ఉద్యోగ జీవితంలో ఏ మరక అంటని అధికారి ఆయన. దాదాపు పదిహేడు ఏళ్ల క్రితం తొలిసారిగా అందుకున్న రాష్ట్ర ఉత్తమ సేవా పతకం.. ఇప్పుడు రెండో సారి అందుకుంటున్నారు. గంజాయి వనంలో తులసీ మొక్కలా ఇలాంటి అధికారులు అక్కడక్కడ ఉంటారు. అటువంటి వారే అవినీతి నిరోధక శాఖలో కలికి తురాయిల్లా గుర్తింపు పొందుతుంటారు. వీరిలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్ శాంతో ఒకరు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన ఆయన తన పనితీరుకు కొలమానమే ఈ ఉత్తమ సేవా పతకమంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. – సాక్షి, నెల్లూరు ఒడిశాకు చెందిన మా కుటుంబం విజయనగరానికి వలస వచ్చింది. మా నాన్న పేరు సదానంద శాంత్రో, అమ్మ పేరు చంద్రప్రభదేవి. మాది జమీందార్ వారసత్వ కుటుంబం. మా నాన్న స్థానిక రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. నాకు సుస్మితతో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పెద్దబ్బాయి సుదేష్ శాంతో యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి సిద్ధార్ధ శాంత్రో బీటెక్ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. చదువు.. ఉద్యోగం నా బాల్యం అంతా విజయనగరంలోనే గడిచింది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీలో ఎకానివిుక్స్ సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. 1985లో చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాను. 1986లో ఎల్ఐసీలో డెవలప్మెంట్ అధికారిగా ఎంపికయి రెండేళ్ల పాటు ఉద్యోగం బాధ్యతలు నిర్వహించాను. 1989లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సైగా సెలక్ట్ అయ్యాను. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరుల్లో విధులు నిర్వహించాను. 2000లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ఏసీబీలో ఐదేళ్లు పని చేశాను. విజయవాడలో పనిచేసే సమయంలో 2003లో ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. ఆపై 2007లో డీఎస్పీగా పదోన్నతి పొంది పాలకొండ సబ్‌డివిజన్, విజయవాడలో లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా పనిచేశాను. నాలుగున్నర ఏళ్లగా మళ్లీ ఏసీబీ విభాగంలోకి వచ్చి డీఎస్పీగా పనిచేస్తున్నాను. గుంటూరులో మూడేళ్లు చేసి నెల్లూరుకు వచ్చాను. అవినీతి పరులపై కొరడా నెల్లూరుకు వచ్చి పదహారు నెలలు అయింది. ఈ కాలంలో దాదాపు 50 వరకు అవినీతి కేసులు నమోదు చేశాను. ఇటీవల తెలుగుగంగలో పనిచేస్తున్న ఆర్డీఓ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశాం. పేదలను పీడించే ఉద్యోగులకు, అధికారులకు ఏసీబీ ఉందన్న భయం కలిగించేలా చేస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తున్నట్లు మాకు ఫిర్యాదు వస్తే వదిలి పెట్టం. ప్రభుత్వం నుంచి నెల వారీగా జీతాలు తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన వారు లంచం తీసుకోవడం నేరం. అవినీతిలో రెవెన్యూ టాప్ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు చేసే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ పైనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 158 ఫిర్యాదులు వస్తే అందులో 120పైగా రెవెన్యూ శాఖవే ఉన్నాయి. రెండో ప్లేస్ పోలీస్ శాఖపై వస్తున్నాయి. ఇంజినీరింగ్, వైద్యశాఖల పైనా ఫిర్యాదులు వచ్చాయి. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరిగేలా చేస్తున్నాం. బాధితులు మా పని జరిగితే చాలనుకున్న వారికి పని జరిగేలా చేస్తున్నాం. ఒక వేళ లంచం డిమాండ్ చేస్తున్నాడని చెబితే మాత్రం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంటున్నాం. ఇటీవల కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు నెల్లూరులోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఓ చిన్న కాంట్రాక్టర్‌కు బిల్లు చేయాలంటే ఆ బిల్లులో రెండు శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేశాం. అల్లూరు మండలం తూర్పుగోగులపల్లె వీఆర్వో ఓ పేద రైతు భూమిని ఆన్లైన్ అడంగళ్‌లో నమోదుకు నెలల కాలంగా తిప్పుకుంటూ పనిచేయకుండా లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ రైతు వీఆర్వోకు æలంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేశాం. ఏసీబీ పెట్టిన కేసులు 80 శాతం వరకు శిక్షలు కూడా పడుతున్నాయి. నా పని తీరుకు కొలమానమే నా సర్వీసులో ఇప్పటికి రెండు సార్లు ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. రెండు సార్లు ఏసీబీలో పని చేసేటప్పుడు ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా కేరీర్లో అవినీతి మచ్చలేకుండా విధి నిర్వహణ చేశాను. సేవా పతకం ఎంపిక కావాలన్నా సర్వీసులో పనితీరును పరిశీలించి ఎంపిక చేస్తారు. ఎలాంటి మచ్చ ఉన్నా ఈ పతకానికి ఎంపిక చేయరు. నా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈ పతకాలు నా పని తీరుకు కొలమానంగా భావిస్తున్నాను. ఉగాది రోజున ఉత్తమ పురస్కారం ఉగాది పండగను పురస్కరించుకుని పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ మహోన్నత సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ ఉత్తమ సేవా పతాకం, ఏపీ పోలీసు కఠిన సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ సేవా పతాకాలు అందించనుంది. అందుకు సంబంధించిన జాబితాను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురుకు పతకాలు వరించాయి. వారందరికి ఉగాది రోజు పతాకాలను బహూకరించనున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో ఏపీ స్టేట్ పోలీసు ఉత్తమ సేవాపతకం అందుకోనున్నారు. -
ఎన్ఆర్సీపై ఆందోళన వద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఆర్సీపై ఆందోళన అక్కర్లేదని, ప్రజల అభిప్రాయాలు స్వీకరించాకే సంబంధిత చట్టం తెస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఉందని, న్యాయ పరీక్షలో సైతం నెగ్గుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు రాజకీయ పార్టీల కుట్రల్లో ఇరుక్కోవద్దని, హింసకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. శుక్రవారం ఆయన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, దేశవ్యాప్తంగా ఆందోళనలకు సంబంధించిన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు.. ముఖ్యాంశాలు ఇవీ.. ►పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీ అంశాలపై దేశవ్యాప్తంగా ఆందోళన విస్తృతమవుతుండటానికి కారణాలేంటి? ⇒ పౌరసత్వ సవరణ చట్టంలో ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి, ఒక భారతీయుడికి గానీ వ్యతిరేకమైన అంశం ఒక్కటీ లేదు. గతంలో మన దేశానికి, పాకిస్తాన్‌కు జరిగిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. అక్కడ మైనారిటీలకు పాకిస్తాన్ రక్షణ కల్పించలేదు. సామూహిక మతమార్పిళ్లు, సామూహిక అత్యాచారాలు, మత హింస, మత వివక్ష మరణాలపై పాకిస్తాన్ స్పందించలేదు. వారంతా మన దేశానికి శరణార్థులుగా వచ్చి ఇక్కడ 30, 40 ఏళ్లుగా మురికివాడల్లో ఉంటున్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంది. కొన్ని పార్టీలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, మతపరంగా ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతాల ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇబ్బంది ఉంటుందనే అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలో పొందుపరిచాం. కానీ యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? ►ఈ చట్టం రాజ్యాంగ లౌకిక భావనలకు విరుద్ధంగా ఉందని, ముస్లింలు అభద్రతకు లోనవుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలా స్పందిస్తారు? ⇒ మన దేశం లౌకిక దేశం. ముస్లింలు ఎవరూ ఈ బిల్లు తమకు వ్యతిరేకమని అనుకోలేదు. పార్టీలే వారిని ప్రేరేపిస్తున్నాయి. చట్టంలో పొందుపరిచిన మూడు ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలపై వివక్ష ఉండదు. మైనారిటీలే వివక్షకు గురయ్యారు. మన దేశంలో మైనారిటీలైనా, మెజారిటీలైనా గౌరవంగా చూస్తాం. భారత రాజ్యాంగమే మా మతం. రాజ్యాంగ పరిధిలోనే ఈ చట్టాన్ని తెచ్చాం. చొరబాటుదారులకు, శరణార్థులకు మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ►శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్నారు కదా? ⇒ పాకిస్తాన్ నుంచి 40 ఏళ్ల క్రితమే వచ్చి వాళ్లు మురికివాడల్లో ఉంటున్నారు. రక్షిత మంచినీరుకు కూడా వారు నోచుకోలేదు. అక్కడ కనీస మౌలిక వసతుల స్థాపనకు కూడా ఖర్చు పెట్టలేని స్థితి. వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. శ్రీలంక వంటి దేశాల నుంచి వచ్చిన కొన్ని లక్షల మందికి పౌరసత్వం ఇచ్చాం. ఉగాండా నుంచి వచ్చిన హిందువులకు ఇచ్చాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వారికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మూడు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీలుగా ఉండి మత వివక్షకు గురైన వారికి ఇస్తున్నాం తప్ప ఇక్కడ మత వివక్ష లేదు. ►ఈ చట్టాన్ని ఎన్ఆర్సీతో కలిపి చూడాలని, హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారని, ఆధారాలు చూపలేని ముస్లింలను వెళ్లగొట్టే పరిస్థితి వస్తుందని వెల్లువెత్తుతున్న ఆందోళనపై మీ స్పందన? ⇒ కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవో సంస్థలు ఈ దిశగా రెచ్చగొడుతున్నాయి. ఎన్ఆర్సీ బిల్లు ముసాయిదా కూడా రూపొందలేదు. లేనిది ఊహించుకుని మాట్లాడటం అర్థరహితం. ►శరణార్థులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైతే వారు నష్టపోయే పరిస్థితి ఉండదా? ⇒ గుర్తించడం కష్టమేమీ కాదు. మతం ఆధారంగా, భాష ఆధారంగా గుర్తించొచ్చు. వారి వద్ద ఉన్న ఆధారాలతో గుర్తించొచ్చు. పోలీస్ స్టేషన్లలో ఉన్న రికార్డుల ఆధారంగా గుర్తించొచ్చు. ►హిందువులు సహా ఏ ఒక్కరికీ పౌరసత్వం ఇవ్వొద్దని ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ⇒ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రోజులుగా ఈ ఆందోళన జరుగుతోంది. వారి హక్కుల రక్షణకు వీలుగా కొన్ని నిబంధనలు పొందుపరిచాం. వారి సెంటిమెంటును గౌరవించాలన్న ఆలోచనతో ఉన్నాం. అస్సాం ఒప్పందం అమలు కాలేదు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంఘాలతో కమిటీ ఏర్పాటు చేశాం. ►సుప్రీం కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయ పరీక్షలో ఈ చట్టం నెగ్గుతుందా? ⇒ న్యాయ సమీక్ష మీద నమ్మకం ఉన్నప్పుడు వీధి పోరాటం ఎందుకు? మోదీ ప్రభుత్వం ఎవరి హక్కును కాదనట్లేదు. మా చట్టం న్యాయ పరీక్షలో నెగ్గుతుంది. ►ఈ చట్టం ఒక మతంపై వివక్ష చూపుతోందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ⇒ మన నాయకులే దుష్ప్రచారానికి దిగితే బయటివాళ్లు ఎందుకు అనరు? ►ఈ ఉద్యమాలకు, ఆందోళనలకు ముగింపు పలికేందుకు కేంద్ర హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ⇒ ఆందోళనకారులు, బిల్లుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నవారు మీరు నరేంద్ర మోదీపై ఉన్న కక్షతో ఈ చట్టాన్ని వ్యతిరేకించకండి. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకారులకు ఒకటే విజ్ఞప్తి. ముందు ఒకసారి చట్టాన్ని చదవండి. ప్రశ్నించండి. అంతేగానీ మోదీపై కక్షతో దేశాన్ని ప్రపంచంలో పలుచన చేయొద్దు. పార్టీల కుట్రలో భాగస్వాములు కావొద్దు. బస్సులు తగలబెట్టినా, హింసకు దిగినా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు. ►విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారిని ఎలా శాంతింపజేస్తారు? ⇒ విద్యార్థులు ఆలోచించాలి. వారి ఉద్యమం ఎందుకోసమో? ఎవరికోసమో పునరాలోచించాలి. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. రాజకీయ పార్టీలు చెప్పాయని గుడ్డిగా ఆందోళనకు దిగొద్దు. మా నుంచి అణచివేత ఎంతమాత్రం లేదు. ఉంటే ఈస్థాయిలో నిరసనలు జరిగేవి కావు. ప్రజాస్వామ్యపద్ధతిలో నిరసనలు చేయండి. -
ఈ విజయం గిరిజనులదే..
సాక్షి, విశాఖపట్నం: గిరిజన ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. ఈ నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకూ మావోయిస్టులు నిర్వహించిన ప్రజా విముక్తి గెరిల్లా దళాల (పీఎల్జీఏ) వారోత్సవాల్లో గిరిజనులెవరూ పాల్గొనకుండా యువత అడ్డుకుందని.. ఈ విజయం గిరిజనులుదేనన్నారు. ఎస్పీ మీడియాతో ఆదివారం మాట్లాడారు. వారోత్సవాల సందర్భంలో గిరిజనులను మావోయిస్టులు బెదిరించి, భయపెట్టి సభలు, సమావేశాలు, స్థూపాల ఆవిష్కరణ అంటూ జనసమీకరణ చేస్తుంటారన్నారు. అలాగే ప్రశ్నించే గిరిజన యువకులను పట్టుకుని ఇన్ఫార్మర్ల ముద్రవేసి చంపుతారని.. కానీ ఈసారి మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల నుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదురయ్యావన్నారు. సభలు, సమావేశాలు అంటూ తమను ఇబ్బంది పెట్టవద్దని, ప్రశాంతంగా తాము బతుకుతామని గిరిజనులు ఎదురించినట్టు పేర్కొన్నారు. వారోత్సవాలతో తమకు ఒరి గేదేమీలేదని చాలా గ్రామాల్లో మావోయిస్టు అగ్రనాయకులను గిరిజనులు ప్రశ్నించినట్లు సమాచారం ఉందని ఎస్పీ చెప్పారు. తమకు అభివృద్ధి కావాలని, అడ్డుకోవద్దంటూ గిరిజన యువత మావోయిస్టులను అడిగినట్లు తెలిసిందన్నారు. ఈ పరిణామాలకు మావోయిస్టులు ఏమి చెప్పాలో పాలుపోక వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసిందని చెప్పారు. వారోత్సవాల పేరుతో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండేవారని, ఈమధ్య ఇన్ఫార్మర్లంటూ గిరిజనులను చంపడంతో కోపొద్రిక్తులైన గిరిజన యువత పెద్దఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేశారన్నారు. వారోత్సవాల రోజుల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా మద్దిగురవు, బొయితిలి, బొంగరం, పాడేరు, చింతపల్లి, గూడెం, డుంబ్రిగుడ, కొయ్యూరు ప్రాంతాల్లో గిరిజన యువత పెద్దఎత్తున నిరసనలకు దిగడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఇంత పెద్దఎత్తున గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం చూస్తుంటే మావోయిస్టులు చెప్పే బూటకపు మాటలు గిరిజనులు నమ్మడం లేదని అర్థమవుతుందన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, ఆచరణకు సాధ్యంకాని మాటలు, పాటలతో జీవితాలు నాశనమవుతున్నాయని గ్రహించడం వల్లే ఈ వారోత్సవాల్లో గిరిజనలెవ్వరూ పాల్గొనడంలేదని యువత ద్వారా తెలియవచ్చిందన్నారు. వారోత్సవాల్లో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా గిరిజన యువత ముందుకొచ్చి సహకరించినందుకు ధన్యవాదాలని, ఈ విజయం గిరిజనులదేనని ఎస్పీ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మావోయిస్టులు గిరిజనుల మనసు తెలుసుకొని జనజీవన స్రవంతిలో కలిసి గిరిజనాభివృది్ధకి సహకరించాలన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
త్వరలో పట్టాలపైకి మెట్రో రైలు ప్రాజెక్టు
విశాఖ జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక దృష్టి ఉంది. జిల్లా, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ క్రమంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధమవుతోంది. రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నగరంలో మంచినీటి ఎద్దడి శాశ్వత నివారణకు పక్కా ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో నర్సింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. ఇలా కొత్త కొత్త ప్రాజెక్టులతో త్వరలోనే జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ అందాలి.. అన్ని వర్గాలకూ న్యాయం జరగాలి.. వెరసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విశాఖ అగ్రస్థానంలో నిలవాలి. అదే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా ఫిర్యాదుల వేదిక అయిన స్పందనలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. 11 బృహత్తర పథకాలకు అర్హులను గుర్తించే నవశకం సర్వే కార్యక్రమాన్ని పక్కాగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకు జిల్లాలో జరిగిన యత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. నిల్వలు పెంచి వినియోగదారులకు కావలసినంత ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. శనివారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మహరాణిపేట (విశాఖ దక్షిణ): ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల అమలులో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ అన్నారు. స్పందన అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టామన్నారు. ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడానికి ఉద్దేశించిన నవశకం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చురుగ్గా జరుగుతోందని తెలిపారు. విశాఖ సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా పలు అంశాలపై శనివారం ఆయన సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.. మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్ధం.. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రూపొందించిన ప్రణాళిక తెరపైకి వచ్చింది. సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి 99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేయగా..ఈ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసి మెట్రో రైలుని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఏజెన్సీలో మెడికల్ నర్సింగ్ కళాశాలలు.. పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనే 25 ఎకరాల అనువైన స్థలాన్ని గుర్తించాం. ఇటీవలే వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. అరకులో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ యత్నాలు జరుగుతున్నాయి. నగరంలో శాశ్వత మంచినీటి పథకం.. విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. భవిష్యత్తులో తలెత్తే నీటిఎద్దడి నుంచి నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం జలాశయం నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో భారీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఏలేశ్వరం జలాశయం నుంచి 156 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్ సెట్స్, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రోజుకు 10 నుంచి 15 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ వాటర్ గ్రిడ్ ద్వారా విశాఖ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్ వచ్చాక నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట.. విశాఖలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పెద్ద పీట వేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రైతు భరోసా, అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేయడం వంటి పనులు విజయవంతంగా చేపట్టాం. ఇప్పడు వైఎస్సార్ మత్స్యకార భరోసా అర్హులైన అందరికీ అందేలా పలు చర్యలు చేపట్టాం. అగ్రిగోల్డ్ బాధితులకు పదివేల రూపాయలలోపు అందడానికి కృషి చేశాం. బాధితులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇసుక కృత్రిమ కొరతపై ఉక్కుపాదం.. జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. వాటిని ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఇసుక అందేలా చర్యలు చేపట్టాం. ఎవరైనా ఇసుక కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా, అక్రమ నిల్వలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక సమస్య విశాఖలో లేకుండా చర్యలు తీసుకున్నాం. స్పందనలో వచ్చే ప్రతి ఆర్జీదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్జీదారుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ఓపికతో వింటున్నారు. సీఎం స్ఫూర్తితో విశాఖలో పనిచేస్తున్నాం. ఇదే తరహాలో పనిచేయడం వల్ల విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. చురుగ్గా ఇంటింటి సర్వే కార్యక్రమం.. వైఎస్సార్ నవశకం అమలు కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేని వారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశ్యం. పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది.అలాకాకుండా నవశకం పథకంలో ఉండే ప్రతి పథకానికో కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు..ఇలా నాలుగు రకాల కార్డులను ప్రత్యేకంగా అందజేయనున్నాం. ఉగాదికి పట్టాల పంపిణీ.. ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తాం. ఇప్పటికే స్థలాలు సేకరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులైన పేదలందరికీ పట్టాలు, ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయం మేరకు పనిచేస్తున్నాం. జనవరి నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ.. గతంలో ప్రజలు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చేవారు. కానీ ఇప్పడు గ్రామ సచివాలయం ప్రజల వద్దకు వస్తోంది. ఈ వ్యవస్థ ఎంతో గొప్పది. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అక్కడే అనేక సమస్యలకు పరిష్కారానికి వేదిక అవుతుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు. దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సీఎం ఆశయం మేరకు అధికారులు పనిచేస్తున్నారు. పటిష్టంగా పర్యవేక్షణ.. వైఎస్సార్ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20న లబ్ధిదారులకు కార్డులు అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్తు సీఈవో, జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు. -
పూలే వెలుగులో..అంబేడ్కర్ అడుగుజాడల్లో..
సామాజిక న్యాయం దిశగా.. ‘మాటలు కంటే ఆచరించి చూపడం ముఖ్యం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విషయంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి బాటలు వేస్తున్నారని నేను విశ్వసిస్తున్నా. జ్యోతిరావ్ పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన దారిలో పయనిస్తున్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం కచ్చితంగా లబ్ధిచేకూర్చుతుందనడంలో సందేహంలేదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పవచ్చు’. కమిషన్లకు ఉండే అధికారాలు ఏమిటంటే.. ►పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షక సంఘాలన్నీ సహజంగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేస్తుంటాయి. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, అధ్యాపకుల అర్హత ప్రమాణాలు పెంపొందిస్తాయి. ►పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఈ సంఘాలకు అధికారాలు ఉంటాయి. ►ఉపాధ్యాయ సర్వీస్ కమిషన్లను నియంత్రించే అధికారం ఉంటుంది. ►విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరిస్తుంటాయి. ఈ కమిషన్లు ఇచ్చే ఆదేశాలను అమలుచేయించడంతో పాటు జరిమానాలు విధించే అధికారాలు కూడా వీటికి ఉంటాయి. ►ఒక మాటలో చెప్పాలంటే సివిల్‌కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. సమన్లు జారీ చేయడం మొదలు సాక్ష్యాధారాలను రాబట్టే వరకు కమిషన్ల పరిధి ఉంటుంది. ఉన్నత ప్రమాణాలే లక్ష్యం.. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తా. ఆయన నాపై ఉంచిన విశ్వాసాన్ని నెరవేరుస్తా. ఏపీ లోకాయుక్త చట్టానికి సవరణ తీసుకువచ్చి లోకాయుక్తను సమర్ధంగా అమలుచేసి అవినీతి రహిత ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటుచేసేలా ఆ వ్యవస్థకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించడం హర్షణీయం’. జగన్ బడుగుల పక్షపాతి.. ‘సీఎంగా వైఎస్ జగన్ తీసుకున్న పలు చర్యలు ఆయన బీసీల పక్షపాతి అని నిరూపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అభ్యున్నతికి నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం, ఆలయాలలో ట్రస్టీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, వర్క్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు వంటివి అనేకం ప్రస్తావించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయం’. ‘బడుగుల కల నెరవేరబోతోంది.సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి రానుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల అమలు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం. వీటితోపాటు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల సమస్యలపైనా దృష్టిసారించారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం’.. అని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వంగల ఈశ్వరయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆయనతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి.. – సాక్షి ప్రతినిధి, అమరావతి -
వందో సినిమా ఆదర్శంగా ఉండేలా తీస్తాం..
యాదగిరిగుట్ట(ఆలేరు) : నేను తెలుగులో వందవ సినిమా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండేలా తీస్తానని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో హీరోనే ఉన్నాడు ఈతరంలో.. వారిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా వందో సినిమా తీసే నిర్మాత కోసం వేచి చూస్తున్నా.. వచ్చే ఏడాదిలో కచ్చితంగా వందవ సినిమా విడుదలయ్యే విధంగా ముందుకు వెళ్తున్నా.. ఇప్పటికే ఎనిమిది భాషల్లో 500 సినిమా తీశాను.. సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా.. అభిమానులు ఇంకా నాతోనే ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. 40 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు, ఓటములు అందుకున్నానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన సినీ హీరో సుమన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో సినిమాలు తీశారు..? తమిళం, కన్నడం, తెలుగు, మళయాలం, హిందీ తదితర భాషల్లో ఇప్పటి వరకు సినిమాలు తీశాను. అన్ని భాషలు కలిపి ఎనిమిది వందల సినిమాలను తీశాను. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడి ఉన్నాను. తెలుగు సినిమాలో ఇప్పటికి 99 సినిమాలు తీశాను. ఎనిమిది భాషల్లో ఎక్కువగా ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు..? మా తల్లిదండ్రుల ఊరు కర్ణాటక.. నేను పుట్టింది కర్ణాటకలో.. నేను ఫేమస్ అయింది తెలుగులో.. చేసింది ఎనిమిది భాషలు. ఇవ్వన్ని ఎలా ఉన్నా దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణాలోనే ఉన్నాను. అనుకోకుండా ఒక్కో భాష నుంచి క్లిక్ అయ్యాను. కానీ ఎక్కువగా నేను తెలంగాణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. దాని తరువాత ఇండియాకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది..? రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వస్తాను. ఏ పార్టీ అని తెలియదు. నాకున్న ఎజెండా నాకు ఉంటుంది. నన్ను సినిమా ఫీల్డ్‌కు ప్రజలు తీసుకువచ్చారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానుల అండదండలతో ఈ స్థాయికి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో ఉండి కూడా చేయవచ్చు. తెలంగాణ ఉద్యమంలో హీరో సుమన్ పాత్ర ఉందా..? తెలంగాణ వచ్చే ముందే జైతెలంగాణ అని నినదించి చెప్పాను. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాను. ఎంతో మంది త్యాగాలు చేశారు. వారందరినీ చూసి చలించిపోయాను. దీంతో ఉద్యమంలో పలు చోట్లా పాల్గొన్నాను. కానీ ఇంత త్వరగా తెలంగాణ వస్తుందని అనుకోలేదు. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాజకీయాల్లో చాలామందికి పదవులు వచ్చాయి. ఇవ్వన్నీ కేసీఆర్‌తోనే సాధ్యమైంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు..? రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు, పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నా ఉద్దేశ్యం. త్వరలోనే ఫైర్ ఫైటర్ గూర్చి సినిమా తీయాలనుకుంటున్నాను. హత్య జరిగిందంటే పోలీసులు వస్తున్నారు.. అదే అగ్నిప్రమాదం జరిగితే ఆ సందర్భంలో ఫైర్ ఫైటర్ రావాలి. దీంతో పైర్ఫైటర్కు గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంతో యువతకు ఆదర్శంగా నిలవాలనే ధ్యేయం. సుమన్‌కు ఎక్కువగా విలన్ పాత్రలే వస్తున్నాయని అభిమానుల టాక్..? నేను విలన్‌గా ఏ సినిమాలో చేయలేదు. శివాజీ సినిమాలో చేసిన క్యారెక్టర్ టైపు వస్తే చేస్తాను. శివాజీ సినిమాలో ఉన్న హీరోటైపు ఉన్న వ్యక్తి, అలాంటి డైరెక్టర్, సినిమాలో ఉంటేనే క్యారెక్టర్ చేస్తా. హీరోకు ఎంత పేరు వస్తుందో అలాంటి పేరు విలన్‌కు వస్తేనే చేస్తాను. శివాజీ సినిమాలో రజినీ కాంత్‌కు ఎంత పేరు వచ్చిందో అంత పేరు నా పాత్రకు, నాకు వచ్చింది. ప్రస్తుతం ఏఏ భాషల్లో సినిమాలు తీస్తు బిజీగా ఉన్నారు..? తెలుగులో 6 నుంచి 7 సినిమాలు తీస్తున్నాను. నెగిటివ్ రోల్స్ కాకుండా పాజిటివ్ రోల్స్, మంచి కథతో తీస్తున్నాం. ప్రస్తుతం వృత్తిపరంగా సంతోషంగా ఉన్నాను. -
అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!
‘‘దెబ్బలు ఎక్కడ పడ్డాయో తెలుసు, బెటర్ చేసుకుంటా. ఓ పది రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా, అది ఎవరో పెట్టిన రచ్చకు మనం ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. ఫ్రెష్‌గా మొదలుపెడతాను’’ అన్నారు సుజీత్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ‘సాహో’ సినిమాకు వస్తున్న స్పందన ఎలా ఉంది? ప్రస్తుతం బెటర్‌గా ఉంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్లు బావున్నందుకు హ్యాపీ. రివ్యూలు కఠినంగా ఉన్నాయనిపించింది. మరీ అంత సెన్సిబులిటీస్ లేకుండా తీయను కదా? షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. నా జర్నీ వేరే వాళ్లకు ఆశ కలిగించాలి. నా టీమ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. ప్రభాస్ అన్న, నిర్మాతలు రివ్యూలకు కంగారు పడొద్దని ధైర్యం ఇచ్చారు. రివ్యూ రాసేవాళ్లు సినిమాను సినిమాలా చూడకుండా కొంచెం పర్సనల్ అయినట్టు అనిపించింది. బహుశా వాళ్లు ‘బాహుబలి 3’లా ఉంటుందని ఊహించుకొని ఉండొచ్చు. వాళ్లు ఊహించినట్టు సినిమా లేకుండా ఉండి ఉండొచ్చు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్ష్ బాలేదు అన్నట్టు రాశారు. రెండు రోజుల తర్వాత ‘ఎక్కువగా ఊహించుకొని వెళ్లడం వల్ల ఎంజాయ్ చేయలేదేమో’ అన్నారు. అయితే నాకు కోపం ఏమీ లేదు. హిందీ వాళ్లు ఏ ఉద్దేశంతో తక్కువ రేటింగ్ ఇచ్చారో? మన వాళ్లు కూడా అలానే రాశారు కదా (నవ్వుతూ). అది ఆడియన్స్‌ను సినిమాకు వెళ్లకుండా ఆపేస్తుంది. రివ్యూలను ఒకటీ రెండు రోజులు ఆపితే బావుండు అనిపిస్తుంది. రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది. ► ‘బాహుబలి’తో ప్రభాస్‌కి వచ్చిన స్టార్డమ్ వల్ల స్క్రిప్ట్‌లో ఏదైనా మార్పులు చేశారా? ఏ మార్పులూ చేయలేదు. అయితే యాక్షన్‌లో చేశాం. దాని వల్ల యాక్షన్ పెద్దగా అనిపించి కథ లేదనిపించిందేమో? సినిమాలో కథ ఉంది. కథ లేదంటే నేను ఒప్పుకోను. ఒకటి ఎక్కువ డామినేట్ చేస్తే మిగతావి చిన్నగా అనిపిస్తాయి. ఉదాహరణకు సినిమాలో పాటల్లాగా. ఒక పాట బావుంటే మిగతావి కిల్ అయిపోతుంటాయి. ► 300 కోట్ల సినిమాను డీల్ చేయడం ఎలా అనిపిం చింది? 350 కోట్లతో సినిమా చేయాలనే లక్ష్యంతో చేయలేదు. అలానే అనుకుంటే ఆ రోజే చేసేవాళ్లం కాదేమో? రాజమౌళి గారు ‘బాహుబలి’ని ఒక్క సినిమాలా చేయాలనుకున్నారు. మొదలుపెట్టాక రెండు భాగాలు అయింది. ఎవ్వరైనా సరే పనిలో దిగిన తర్వాతే పెరిగే చాన్స్ ఉంటుంది. సినిమా సినిమాకు విధానం మారిపోతుంది. కథకు ఏం కావాలో అది చేస్తుంటాం. బడ్జెట్ ఎంతైనా సరే అది స్క్రీన్ మీద కనబడాలనుకున్నాం. ► ‘అనుభవం లేని కుర్రాడితో’ సినిమా ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి... అవి నా వరకూ రాలేదు. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు. పనైపోగానే ఇంటికి వెళ్లిపోతాను. మళ్లీ ఆఫీస్‌కి వచ్చి పని చేసుకోవడమే. ఆ మధ్య ఫిల్మ్ చాంబర్‌కు వెళ్ళినప్పుడు ‘సాహో చాలా పెద్ద సినిమా’ అని మాట్లాడుతుంటే కొంచెం భయమేసింది. రియాలిటీ నిజంగా భయపెడుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నది సాధించాలంటే వాస్తవికతకు దూరంగా ఉండి ప్యాషన్‌తో పని చేస్తుండాలి. ఫీల్డ్‌లో దిగిన తర్వాత ఆలోచనలు ఉండకూడదు. ► బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? భయం కంటే బాధ్యత ఎక్కువ. బడ్జెట్ ఇలా పెరిగింది.. అలా పెరిగింది అని చెబితే వేరేవాళ్లను నిందించినట్టు ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. సినిమా చేయడం కూడా పెళ్లి లాంటిదే. అక్కడ ఆ పూలు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఖర్చయినా తెప్పిస్తాం. చూసే వాళ్లందరికీ నచ్చాలి అన్నట్టు చేస్తాం. పెళ్లి వల్ల ఏం వస్తుంది? అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ మన బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్యాషన్‌తో చేశాం. డబ్బులు వృథాగా ఖర్చు చేశారనేవాళ్లు అంటూనే ఉంటారు. ► ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అయ్యారు. ఆయన స్టార్డమ్ కోసం అయినా ‘సాహో’ హిట్ అవాల్సిన పరిస్థతి. అదేమైనా ఒత్తిడిగా? కచ్చితంగా అనిపించింది. ప్రభాస్‌గారి పేరు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ తగ్గించకూడదు అనుకున్నాం. ఈ రివ్యూలతోనూ నార్త్‌లో కలెక్షన్స్ చూస్తుంటే ప్రభాస్‌ని నార్త్‌లో ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అవుతోంది. ► ‘మళ్లీ ఒక్కసారి చూడండి. నచ్చుతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు..? ఎమోషనల్‌గా కాకుండా ఫైర్ అయిపోదాం అన్నట్టు పోస్ట్ చేయాలనుకున్నాను. మళ్లీ ఆగిపోయాను. ‘రెండోసారి చూశాక బాగా నచ్చింది’ అంటూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. రెండో సారి చూస్తే అర్థం చేసుకుంటున్నారు అనిపించింది. రెండోసారి చూసి కలెక్షన్లు పెంచేయండి అనే ఉద్దేశంతో అనలేదు. అర్థం కాలేదు అనడం వేరు. అర్థం లేదు అనడం వేరు. అర్థం లేకుండా సన్నివేశాలు రాయలేదు.. తీయలేదు. దేశం మొత్తంగా అందర్నీ మెప్పించే సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద స్టార్స్‌తో తీస్తున్నప్పుడు ప్రతీ విషయాన్ని ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా. ఇంటెలిజెన్స్‌ని కొంచెం తగ్గించుకొని సినిమాలు చేయాలి. ► మీ కెరీర్‌కు ‘సాహో’ ప్లస్సా? మైనస్ అంటారా? దర్శకుడిగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఒక్క సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త టెక్నాలజీలు తెలుసుకున్నాను. నేను ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉన్నాను. ఆడియన్స్ చెప్పిన దాన్ని కచ్చితంగా గౌరవిస్తాను. ► ఒక అవకాశం వస్తే ‘సాహో’లో ఏదైనా మారుస్తారా? లేదు. రిలీజ్ అయిన తర్వాత సినిమా మన చేతుల్లో నుంచి ప్రేక్షకులకు వెళ్లిపోయినట్టే. కట్ చేసినా, ట్రిమ్ చేసినా మనం సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. ► ‘సాహో’ కథ హాలీవుడ్ సినిమా ‘లార్గో వించ్’ పాయింట్ నుంచి తీసుకున్నారనే కామెంట్స్ గురించి? ఇలా కామెంట్ చేసే వాళ్లలో సగం మంది ‘లార్గో వించ్’ సినిమా చూసి ఉండరు. చూసే సినిమా కూడా కాదది. ‘ప్రపంచానికి తెలియకుండా కొడుకుని ఓ తండ్రి దాచిపెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి’. ఆ సినిమా స్క్రీన్‌ప్లే వేరు. నా సినిమా స్క్రీన్‌ప్లే వేరు. వాళ్లకు నెక్ట్స్ సినిమా రిలీజ్ వరకూ ఫీడింగ్ కావాలి. ప్రస్తుతానికి మేమే ఉన్నాం. ఈ కాంట్రవర్శీ ఇంకా జనాల్లో ఉండాలి. అందుకే రాస్తుంటారు. ఓ పెద్ద హిట్ సినిమా నుంచి ప్రేరణ పొందాం అని చెప్పినా సంతోషపడొచ్చు. ► ఇదంతా మీ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? ఇది రియాలిటీ. ఈ వారం నేను, నెక్ట్స్ వారం మరొకరు. జనం మారుతుంటారు. కథ మాత్రం ఇలానే జరుగుతుంటుంది. ఆ కాంట్రవర్శీలు ఇక్కడితో ఆగిపోవాలా, ఇంకా నడుస్తుండాలా అన్నది నా చేతుల్లో ఉంది. దాని గురించి మాట్లాడి ఇంకో నాలుగు రోజులు ఫీడింగ్ ఇవ్వదలచుకోలేదు. -
పాలకులకు ఇవ్వాలి సమయం
గీతంతో రాళ్లను కరిగించవచ్చనేది నానుడి.. రాళ్లను కరిగించడం ఏమో గానీ.. సంగీతంతో రోగాలు నయం చేయవచ్చని నిరూపించారు అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. నాదచికిత్సతో ఎన్నో రుగ్మతలను రూపమాపవచ్చని స్వామీజీ బోధిస్తుంటారు. స్వయంగా స్వరపరిచిన కీర్తనలను స్వామీజీ రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే.. తన్మయత్వంలో మునిగితేలి శారీరక ఆరోగ్యం, మానసిక సాంత్వన పొందామని భక్తులు చెబుతుంటారు. పూజాదికాల్లో దత్త సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ పలు దేశాల్లో భారీ ఆంజనేయ, కుమారస్వామి విగ్రహాలు స్థాపించి హిందూమత పటిష్టానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ విశాఖ జిల్లాకు విచ్చేశారు. అనకాపల్లి సమీపంలోని సిరనపల్లి చింతామణి గణపతి దత్త క్షేత్రంలో మూడురోజుల పాటు వేంచేసి ఉన్న స్వామీజీ శ్రీ గణపతి మహాయాగం, శ్రీ గణేష పురాణ ప్రవచనంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై తనదైన భాష్యంతో పాటు ఆధ్యాత్మికత పేరిట ఆడంబరాలు ఎక్కువయ్యాయని స్వామీజీ వ్యాఖ్యానించారు. ఆ ధర్మ సూక్ష్మాలు, సూచనలు స్వామీజీ మాటల్లోనే... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాలకులకు సమయమివ్వాలి. అధికారం చేపట్టిన వెంటనే రామరాజ్యం ఎలా వచ్చేస్తుంది.. మూడునెలలకే అద్భుతాలు ఎలా సాధిస్తారు. గతంలో జరిగిన కుళ్లు అంతా పోగొట్టాలి.. ఆ తర్వాత పాలనపై దృష్టి సారించాలి. ఇందుకు పాలకులకు కచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఇదేమీ మంత్రం, తంత్రం కాదు కదా.. మంత్రం ఫలించేందుకు, సిద్ధించేందుకే కాదు.. పఠించేందుకే సమయం పడుతుంది కదా.. మరి సుపరిపాలనకూ సమయమివ్వాలి కదా.. అప్పుడే అశాంతి. అసహనం వద్దు.. రాష్ట్రాలకు మంచిరోజులు వస్తున్నాయి.. అందరూ అనను గానీ ప్రజల్లో కొందరు తొందరపడుతున్నారు. ప్రజలు కూడా బాధ్యతగా ఆలోచించాలి. అన్నీ ప్రభుత్వమే చేయాలని చూడడం మంచి పరిణామం కాదు. ముందుగా ప్రజలు తామిచ్చిన తీర్పును గౌరవించాలి. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించాలి. వారిని అగౌరవపరచడం సరికాదు. స్వార్ధచింతనలను, తొందరపాటును విడనాడాలి. ఒక్క చెట్టు తొలగించాల్సి వస్తే ముందు పది మొక్కలు నాటాలి.. వృక్షాలను తప్పనిసరి పరిస్థితుల్లోనే తొలగించాలి. అనివార్య పరిస్థితుల్లో ఒక్క చెట్టు తొలగించాల్సి వస్తే ముందుగా పది మొక్కలు నాటాలి. ఆ తర్వాతే చెట్టు తొలగించాలి.. మొక్కలు నాటడం అనేది ఓ ఉద్యమంగా చేపట్టాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.. గో హత్య సమాజానికి అశుభమే.. ఇందులో మరో మాటకు అవకాశం లేదు. గోవులను రక్షించండి... గో సంపదతోనే దేశానికి సుభిక్షం సిద్ధిస్తుంది. నిద్రపోయే ముందు సంగీతం వినండి.. సంగీతం వలన పాడిపంటలు బాగుపడతాయని, రోగాలు నయం అవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. నాద చికిత్సతో ఎన్నో రుగ్మతలు రూపుమాపాం. నామ సంకీర్తనతో దేవుడినే ప్రసన్నం చేసుకోవచ్చు. అటువంటి సంగీతంతో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అంతెం దుకు.. నిద్రలేమి సమస్యతో ఎంతోమంది బాధపడుతుంటారు. అటువంటి వారే కాదు.. ఎవరైనా సరే నిద్రపోయే ముందు మంచి సంగీతం, భక్తిభావం కలిగిన సంగీతం వినండి.. ప్రశాంత చిత్తంతో నిద్రపోయి ఉదయం తేజోమయమమైన ఆలోచనలతో మేల్కొనండి.. వ్యక్తి వృద్ధి నుంచే సమాజ వృద్ధి మొదలవుతుంది. దీర్ఘాయిష్షు కావాలంటే మితంగా తినండి.. మితంగా మాట్లాడండి.. ఇప్పుడు ప్రజలకు అంతా తొందర ఎక్కువైంది. అంతా వేగం.. వేగం అని పరిగెడుతున్నారు.. అల్పాయుష్కులై పోతున్నారు. దీర్ఘాయిష్షు కావాలంటే ముందు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతతకు డబ్బుతో సంబంధం లేదు. అధికారంతో సంబంధం లేదు. హోదా తోనూ సంబంధం లేదు. డబ్బు, అధికారం, హోదా ఉన్న వాళ్లలో చాలామంది కూడా ప్రశాంతంగా లేరు.. ప్రశాంతత, సంతోషం కావాలంటే మంచి ఆలోచనలు చేయండి.. దీర్ఘాయిష్షు కావాలంటే మితంగా తినాలి.. మితంగా మాట్లాడాలి.. మిత విహారమే చేయా లి... ఇలా అన్నింటా మితంగా ఉండి.. అన్నీ అదుపులో ఉన్న వారు కచ్చితంగా పరిపూర్ణ ఆయుష్షు పొందుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు.. ఇతర రోగులు కూడా ప్రశాంతతతో ఆధ్యాత్మిక్మతను అనుసరిస్తే వందేళ్లకు పైగా జీవిస్తారు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం తప్పు.. ఇటీవల ఆధ్యాత్మికత ముసుగులో ఆడంబ రాలు ఎక్కువయ్యాయి..పెద్ద పెద్ద హోమాలు చేయించడం.. వేలు, లక్షలు తీసుకోవడం నా కు ఇష్టం లేదు. ఈ యజ్ఞం చేయి..మూడు లక్షలు ఖర్చవుతుంది.. నాలుగు లక్షలు ఖర్చవుతుంది అని చెప్పడం మొదటి నుంచి నా నైజం కాదు. అలానే శని బాలేదు..రాహువు బాలేదు అని వేలకు వేలు కట్టాలని డిమాండ్ చేయడం తప్పు. భక్తులు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారి మాటలను తొందరగా వింటారు.. వారిని సన్మార్గంలో పెట్టాలే కానీ దోచుకోకూడదు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం సరికాదు. నా దృష్టిలో ఆధ్మాత్మికత వ్యాపారం కాకూడదు. దైవనింద మహాపాపం.. దైవ నింద చేయడం మహాపాపం. ఇటీవల చాలామంది ఫ్యాషన్ కోసమో.. ప్రచారం కోసమో నాస్తికతపై మాట్లాడుతున్నారు. దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వారికి మర్యా ద ఇవ్వకపోయినా ఫరవాలేదు. వారిని లెక్క చేయకపోయినా ఫరవాలేదు.. దేవుడి పట్ల మాత్రం గౌరవం, భక్తి ఉండాల్సిందే.. ఆ భక్తే వ్యక్తికీ, వ్యవస్థకీ.. దేశానికీ మొత్తంగా విశ్వానికే హితం.. శుభం. చిన్నప్పటి నుంచి పిల్లల్లో భక్తిభావం పెంపొందింపజేయాలి.. మన కుటుంబాలు బాగుంటేనే ఊరు బా గుంటుంది. ఊరు బాగుంటేనే దేశం బాగుం టుంది. మన దేశం బాగుంటేనే భారతీయత వెల్లివిరిస్తుంది. ఇందుకు పిల్లలే పునాది. వారిలో చిన్నప్పటి నుంచే భక్తిభావం పెంపొందింపజేయాలి. సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చాలి. విలువలు నేర్పాలి. భగవద్గీత పఠనం చేయించాలి. మాతృభాషపై గౌరవం పెంపొందించాలి. పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం నేర్పాలి. పిల్లలను తరచూ దేవాలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తీసుకువెళ్లాలి. నేను ఆధ్యాత్మికత వ్యాపారిని కాదు.. నన్ను సిద్ధుడనీ, వైద్యుడనీ, స్వామీజీ అని భక్తులు పరివిధాలుగా భావిస్తుంటారు. అది వారిష్టం.. నేను మాత్రం ఆధ్యాత్మిక వ్యాపారినైతే కాదు.. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువుగా ప్రయాణిస్తున్నాను.. ఇప్పటివరకు 80దేశాల్లో పర్యటించాను. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలతో పా టు విదేశాల్లో ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు నెలకొల్పాను. వచ్చే వారం కూడా అమెరికా వెళ్తున్నాను. అక్కడ చికాగోలో జరిగే గణపతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాను.ప్రజల్లో ఆధ్మాత్మిక భావం తగ్గుతున్న క్రమంలో నా బాధ్యతగా ప్రజలకు ఆధ్యాత్మికతపై అవగాహన కలిగిస్తున్నాను. -
ప్రతిభే కొలమానం
సాక్షి, విశాఖపట్నం: పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఇవి. అభ్యర్థి ప్రతిభ ఆధారంగానే ర్యాంకు నిర్ణయమవుతుంది. ఆ ర్యాంకు బట్టే ఉద్యోగం భర్తీ జరుగుతుంది. అంతేతప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఇది పూర్తిగా పోటీ పరీక్ష. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. బయట అనవసర ప్రచారాలు నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు.. ప్రతీ ప్రశ్నాపత్రం నాలుగు సెట్లుగా ఉంటుంది. ఎక్కడా కాపీయింగ్‌కు అవకాశం ఉండదు. ఇవి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇవి పోటీపరీక్షలు కాబట్టి అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైనదే. మాల్‌ప్రాక్టీస్ వంటి అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. అది నేరమవుతుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకోవద్దు. చక్కగా చదువుకొని పరీక్షల్లో ప్రతిభ చూపించండి. అడిగిన ప్రశ్నకు జవాబు రాయండి. మైనస్ మార్కులు ఉన్నాయి గమనించండి. కేంద్రానికి ముందుగానే చేరుకోండి.. ఇది పోటీ పరీక్ష కాబట్టి అభ్యర్థులంతా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 7.30 నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మంచిది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 8 గంటల నుంచి పరీక్ష కేంద్రం గేటు తెరుస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు లోపలికి వెళ్లవచ్చు. ఏ హాల్లో ఏయే రోల్ నంబర్లు కేటాయించారో అక్కడ నోటీసు బోర్డులో వివరాలు ఉంటాయి. ముందుగానే చూసుకుంటే తనకు సంబంధించిన హాల్ ఎక్కడుందీ తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లోపలకు అనుమతించరు. అందుకే సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి అభ్యర్థులంతా ప్రయత్నించాలి. అందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే అర్బన్ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల జాబితాను ఆటోడ్రైవర్ల అసోసియేషన్లకు ఇచ్చాం. అభ్యర్థులకు సహకరించాలని ఆటోడ్రైవర్లను కోరాం. బస్సు లేదా ఆటో ఏదైనా ఏదైనా సరే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరండి. కొంతమంది ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం పరీక్ష రాసిన కేంద్రాన్నే రెండో పూట పరీక్షకూ కేటాయించాం. కానీ ఉదయం పూట కన్నా మధ్యాహ్నం అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పరీక్ష హాల్, సీటింగ్ మారుతుంది. 12.30 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. 2 గంటలకల్లా తమకు కేటాయించిన హాల్ ఎక్కడుందో చూసుకొని వెళ్లండి. -ఇతర జిల్లాల నుంచి కూడా పరీక్ష రాయడానికి వస్తున్నారు కాబట్టి పరీక్ష తేదీకి ముందురోజే ఒకసారి పరీక్ష కేంద్రానికి వెళ్లి సరిచూసుకుంటే ఇంకా మంచిది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు.. ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగేవన్నీ వోఎంఆర్ ఆధారిత పరీక్షలే. ప్రశ్నాపత్రంతో పాటు వోఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చదివి జవాబులను వోఎంఆర్ షీట్లో నింపాలి. ఆప్షన్లు నాలుగింటిలో సరైనదాన్ని బాల్‌పాయింట్ పెన్ (బ్లాక్/బ్లూ)తో మాత్రమే నింపాలి. జెల్ పెన్, ఇంక్ పెన్, పెన్సిల్ ఎట్టి పరిస్థితిలోనూ వాడవద్దు. పరీక్ష ప్రారంభించడానికి ముందు అందరూ కచ్చితంగా ప్రశ్నాపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్‌పై ఉన్న సూచనలను తప్పకుండా క్షుణ్నంగా చదవాలి. సాయంత్రానికల్లా ‘కీ’... పరీక్ష పూర్తయిన తర్వాత ఒరిజినల్ ఓఎంఆర్ ఇన్విజిలేటర్‌కు అప్పగించి నకలు (రెండో కాపీ) అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ప్రశ్నాపత్రం తెచ్చుకోవచ్చు. ఏరోజు పరీక్షది ఆ రోజు సాయంత్రమే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేస్తుం ది. అభ్యర్థులు దాన్ని గమనించి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం. మొబైల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వద్దు.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోను తేవద్దు. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులేవీ పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఎవరైనా ఫోన్, మెటీరియల్, ఇతరత్రా పుస్తకాలు తెస్తే ఒక బ్యాగ్‌లో పెట్టి భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రంలో ఒక గది ఉంటుంది. అయితే తమ వస్తువుల బాధ్యత అభ్యర్థులదే. అందుబాటులో వైద్యం శిబిరం.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం (మెడికల్ క్యాంప్) పెడుతున్నాం. ఇద్దరు ఏఎన్ఎంలు, ప్ర థమ చికిత్స కిట్, మందులు ఉంటాయి. 108 అంబులెన్స్‌లను అలెర్ట్ చేసి ఉంచాం. పరీక్ష కేం ద్రంలో మంచినీరు ఏర్పాటు చేశాం. టాయిలె ట్స్ సౌకర్యం ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచేం దుకు పారిశుద్ధ్య కార్మికులను ఉంచుతున్నాం. గట్టి పోలీసు భద్రత.. పరీక్షలన్నీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బంది, అధికారులందరికీ ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే పూర్తి అయ్యింది. శనివారం జిల్లాలో కేటా యించిన పోలీసుస్టేషన్లకు మెటీరియల్ చేరుతుంది. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు గట్టిపోలీసు భద్రతతో పంపిస్తాం. ఎక్కడా ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. పరీక్షా నిర్వాహకుల జాబితాలు బయటకు వచ్చాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయనే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్లకు కూడా తమను ఏ సెంటర్లకు కేటాయించిందీ ముందు రోజు మధ్యాహ్నం అదీ రహస్యంగా తెలియజేస్తారు. ఏ హాల్ కేటాయిస్తున్నదీ పరీక్ష రోజు ఉదయం 7.30 గంటలకు మాత్రమే సమాచారం ఇస్తారు. అందుకు సంబంధించిన జాబితాలన్నీ సీల్డ్ కవర్లో భద్రంగా ఉన్నాయి. బయటకు ఎలాంటి లీకేజీ జరగలేదు. గుర్తింపు కార్డు ఉంటే మంచిది... హాల్‌టికెట్‌లో కొంతమంది పేరు తప్పుగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఆ హాల్‌టికెట్‌పై ఫొటో ఆధారంగానే పరీక్షాహాల్లోకి అనుమతి ఇస్తారు. ఎందుకైనా మంచిది అభ్యర్థులు తమ వెంట ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులు ఏవైనా వెంట తెచ్చుకుంటే మంచిది. హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరిచూసుకోవడానికి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయి. ఏదేమైనా హాల్‌టికెట్ మాత్రం వెంటతెచ్చుకోవడం మరచిపోవద్దు. అది లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరు. -
రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు
‘‘15ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 50 నుంచి 60 సినిమాలకు రచయితగా పనిచేశా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ’ చాలా సంతృప్తినిచ్చింది’’ అన్నారు రచయిత లక్ష్మీభూపాల్. ‘చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే’ వంటి సినిమాలకు మాటలు రాశారాయన. రచయితగా తన జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నేను యాక్సిడెంటల్ రైటర్ని. 1994 నుంచి టీవీ, మీడియా రంగంలో ఉన్నాను. 2004లో నటుడు లక్ష్మీపతిగారి ద్వారా మాటల రచయితగా మారాను. కష్టాలన్నీ ముందే పడ్డాను.. అందుకే సినిమా ప్రయాణం సాఫీగా సాగినట్టుంది(నవ్వుతూ). ఫస్ట్ ‘సోగ్గాడు’ సినిమాకు మాటలు రాశాను. అప్పటినుంచి వరుసగా సినిమాలు రాస్తూనే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాయలేదు. కానీ, పెద్ద బ్యానర్లలో సినిమాలకు రాశాను. నేను అందరికీ ఓపెన్‌గానే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. బహుశా పంచ్‌లు, ప్రాసలు రాయనని పిలవట్లేదేమో? ‘ఓ బేబీ’ సినిమా కోసం నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు. అన్నీ దేవుడు రాయించారనుకుంటాను. మా అమ్మమ్మ, అమ్మ మాట్లాడే మాటల్ని సినిమాలో పెట్టాను. ‘మగాడికి మొగుడులా బతికాను’ అనే మాట మా అమ్మమ్మ నోట్లో నుంచి చాలాసార్లు వచ్చింది. ఈ సినిమాని మా అమ్మమ్మ, అమ్మకు అంకితం చేస్తున్నాను. సమంత, నందినీగార్లు ప్రతి ఫంక్షన్లో నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి ‘మొలతాడుకి మోకాలుకి మధ్య కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు’ అనే డైలాగ్ రాశాను. నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే ఉన్నాయి. కానీ, రైటర్‌గా నేనెప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అలా అయ్యుంటే రెండో సినిమా దగ్గరే వెళ్లిపోయేవాణ్ణి. సినిమా నాకు నచ్చితేనే చేస్తాను. నాకే నచ్చకపోతే ప్రేక్షకుడికి నచ్చేలా ఏం రాస్తాను? త్రివిక్రమ్‌గారి వల్ల రచయితలకు డబ్బు విలువ తెలిసింది. రచయిత దర్శకుడిగా మారడానికి ఫ్రస్ట్రేషనో, రెమ్యూనరేషనో కారణం అవుతున్నాయి. దర్శకుడిగా మారే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా వద్ద ఓ 24 కథలు ఉన్నాయి. దర్శకుడిగా మారితే తీద్దాం అని ఆరు కథలు పక్కన పెట్టాను. నా తర్వాతి ప్రాజెక్టులు తేజ, నందినీ రెడ్డిగారు చేయబోయే సినిమాలే’’ అన్నారు. -
నిర్మలమైన మనసులు
కృష్ణగారు భర్తగా దొరకడం ఓ వరం నిర్మల ముక్కుసూటి మనిషి. అందుకే ఇష్టం... కృష్ణగారిది నిర్మలమైన మనసు... నిర్మలది మంచి మనసు... ‘సాక్షి’కి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూస్’లో ఇలా కృష్ణ, విజయ నిర్మల పలు విశేషాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. ► కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు? విజయనిర్మల: మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో చూశా. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలోంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నా. మా సినిమాలో ఆయనే హీరో అని తెలిసి సంతోషమేసింది. అదే ‘సాక్షి’ సినిమా. ► ఆ సినిమా అప్పుడే ప్రేమలో పడ్డారు కదా? అవును. ‘సాక్షి’లో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో మీసాల కృష్ణుడు టెంపుల్ సీన్ ఉంది. ఆ గుడిలో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త కడుపు చల్లగా, కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను. ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. ► కృష్ణగారు బిడియస్తులు అనిపిస్తుంటుంది. అసలాయన మీకు ఎలా ప్రపోజ్ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది. విజయ నిర్మల: ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని చంద్రమోహన్ అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అన్నాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అన్నారు. ► మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. మరి మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు? విజయ నిర్మల: (నవ్వుతూ). డేట్ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది (2018) 50వ సంవత్సరం. కృష్ణ: 1969 మార్చి 24 మా పెళ్లి రోజు. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్ చేసి విషెస్ చెబుతారు. మ్యారేజ్ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్ చేసి, చెబుతారు (నవ్వుతూ). విజయనిర్మల: ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుకే డేట్ చెప్పేశారు. ► ఇంతకీ కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం? విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో అన్నట్లు ఉంటారు. అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపోనివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది. ఇక ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను.. లేకపోతే రానని కండీషన్ పెట్టిందట. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్ ఉండేది ఆయనకు. ► కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా. మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు? విజయనిర్మల: దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్లో గ్యాప్ దొరికితే, నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది. ► మీరెందుకు నచ్చారో ఆయన్ను అడిగారా? విజయనిర్మల: ‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు. ► మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి? విజయ నిర్మల: అన్నీ ఇష్టమే. ఆయన కోసం తందూరీ చేయడం నేర్చుకున్నా. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. ► మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా? విజయనిర్మల: ఒకప్పుడు! కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది. ► కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం? విజయనిర్మల: మేమిద్దరం బాగానే ఉంటాం. ఓరకంగా క్లోజ్‌ఫ్రెండ్స్ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. ► డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా? విజయనిర్మల: లేదు. ‘నీకు సౌకర్యంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్ ఉండాలంటారు. హెయిర్ స్టయిల్ విషయంలో మాత్రం కామెంట్ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు (నవ్వుతూ). ► కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు? విజయ నిర్మల: మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజుకి గడియారం కొనిపెట్టారు. ప్యాక్ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్ క్లాక్. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని చాలా ఏళ్లు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు. ► సూపర్‌స్టార్ డ్రెస్‌లన్నీ మీ సెలక్షన్ అన్నమాట? విజయనిర్మల: అవును. సినిమాల కోసం కాస్ట్యూమర్స్ సెలక్ట్ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే కొంటాను. ► మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..? విజయ నిర్మల: సంసారమన్నాక అలకలు కామన్. అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం. ► మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు? విజయ నిర్మల: రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తాం. క్రికెట్ మ్యాచ్ అప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లోనూ టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్. ► ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా? విజయ నిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్ అయ్యాం. బాధ అనిపించలేదు. ► కృష్ణగారు మీ భర్త కావడం వరం అనుకుంటారా? విజయ నిర్మల: కచ్చితంగా. ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం. ► అప్పట్లో కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్ అంటే క్రేజ్. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా? కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు. ► ఎక్కువ సినిమాలు చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆమె కెరీర్ విషయంలో మీ ప్రోత్సాహం గురించి? కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తన నరేషన్ కూడా బావుంటుంది. షాట్స్ కూడా బావుంటాయి. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు మీకెలా అనిపించేది? కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో చేసిన సినిమాల విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైందా? కృష్ణ: ‘దేవదాసు’ సినిమా అప్పుడు కొంచెం డైలమాలో పడ్డాం. ఆ పిక్చర్ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్ చేయండని డిస్ట్రిబ్యూటర్స్ అడిగితే మాకు ఎక్కడ కట్ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీప్రసాద్ వంటి దర్శకులకు షో వేసి చూపించాం. సినిమా చూసి ఎల్వీ ప్రసాద్‌గారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్ చేయమంది? అన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. నేను సినిమా చూసి ఏడవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్ అయిపోయాను’ అని విజయకు కాల్ చేశారు. ► దర్శకురాలిగా చాలా త్వరగా సినిమాలు పూర్తి చేస్తారనే పేరు ఆమెకి ఉంది? కృష్ణ: అవును. ఓ సినిమాకి శివాజీ గణేశన్గారివి 30 రోజులు డేట్స్ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు. ► విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? కృష్ణ: తను చాలా కామ్ పర్సన్. దానికి తగ్గట్టు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్ మీద చాలా కమాండ్ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ముక్కుసూటితనం ఇష్టం. ► కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్ చేస్తారా? విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు. ► కృష్ణగారి బయోపిక్ తీస్తే ఒప్పుకుంటారా? విజయ నిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్ చేయాలి. మహేశ్ కూడా చాలా ఫాస్ట్. సెట్లో చాలా జోక్స్ వేస్తుంటాడు. కృష్ణగారికి జోక్ వేయడం కూడా రాదు. అలా దూరంగా ఉండిపోతారు. -
నాన్న కల నెరవేర్చా
మాది వ్యవసాయ, చిన్నపాటి వ్యాపార కుటుంబం. మా తాత వెంకటస్వామి కాలం నుంచి మాకు 30 ఎకరాల భూమి ఉంది. మా తల్లిదండ్రులు సరోజిని, కామరాజు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. చదువుకుంటూనే రోజూ ఉదయం సాయంత్రం వేళ.. సెలవుల్లో సేద్యం చేసేందుకు పొలానికి వెళ్లేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడే నాన్న మరణించారు. మా పెద్దనాన్న అప్పలరాజు నాన్నలేని లోటును తీర్చారు. అప్పటి నుంచి నా బాగోగులు ఆయనే చూశారు. మా అన్న చదవాలని తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. వారు ఇప్పుడు వ్యవసాయం, కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. 1989లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మేనకోడలు రాజేశ్వరితో 1992లో వివాహమైంది. నా బలమంతా మా ఆవిడే. పిల్లల బాగోలు చూసుకుంటోంది. ఉద్యోగ విధుల్లో ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. ఏ అర్ధరాత్రి పనిపై బయటికి వెళ్లినా ఎంతో సంతోషంతో నన్ను పంపిస్తుందని అని అన్నారు. తన జీవిత విషయాలను నారాయణపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో ‘సాక్షి’ పర్సనల్ టైం. సాక్షి, నారాయణపేట: నా బాల్యం అంత మా స్వగ్రామైన సాలూరులోనే కొనసాగింది. అప్పటికే అది నారాయణపేటలాగా మున్సిపాలిటియే. పట్టణమైనా గ్రామీణప్రాంతాన్ని తలపించేది. ఒకటి నుంచి పదో తరగతి వరకు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ఎంపీసీని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి డిగ్రీ (బీకాం) ని బొబ్బిలిలోని ఆర్ఎ స్ఆర్కే కళాశాలలో చదివా. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజమ్‌ంట్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశా.నాన్న కలను నెరవేర్చాలనే తపనతో గ్రూప్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టా. ఉద్యోగ ప్రస్థానం 1985 గ్రూప్–2 రాస్తే ఫలితాలు 1989లో వచ్చాయి. డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటిసారిగా సొంత జిల్లాలోని మక్కావ మండలం డీటీగా విధులో చేరి పదోన్నతిలో అక్కడే తహసీల్దార్‌గా విధులు నిర్వహించా. 2002లో డిప్యూటీ కలెక్టర్‌గా విశాఖపట్నం, 2003లో టెక్కలి ఆర్డీఓగా, 2004లో నూజివీడు ఆర్డీఓగా, 2007లో గూంటూరు ఆర్డీఓగా పనిచేస్తూ 2009లో అప్పటి విద్యశాఖ మంత్రి పార్థసారథికి పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహించా. ఆ తర్వాత 2010లో కాకినాడ డీఆర్వోగా, 2010–11లో విజయవాడలో సబ్ కలెక్టర్‌గా, 2013లో గూంటూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా, 2014లో నల్లగొండ జిల్లా జెడ్పీ సీఈఓ, 2016లో అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా, 2016–17లో యదాద్రి డీఆర్డీఓగా, 2018లో మహబూబ్‌నగర్ జేసీగా, 2019 మార్చి 1న నారాయణపేట జిల్లా తొలి కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టా. అభి‘రుచులు’ చిన్నప్పటి నుంచి స్వీట్లు తినడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ తిపి వంటలు బాగా చేసేది. మా సతీమణి నారుచులకు అనుగుణంగా వంటలను చేసిపెడుతుంది. తీరిక ఉంటే వారంలో ఒకసారి సెకండ్ షో సినిమాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్తా. నాటి సినిమాల్లో దానవీరశూరకర్ణ, నేటి సినిమాల్లో శ్రీమంతుడు చాలా నచ్చాయి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకున్నాను. అల్లూరి సీతారామరాజు వేషధారణతో పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రదర్శనలు, నాటకాలు చేశా. పుస్తకాలు, పత్రికలు చదవడంతో ఎంతో విజ్ఞానాన్ని పొందగలిగా. అవే నా సర్వీసులో ఎంతో ఉపయోగపడ్డాయి. నాన్న మృతే చీకటి రోజు మా నాన్న కామరాజు గుండెపోటుతో నా కళ్ల ముందే ఒల్లో పడుకుని కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం మాకు తెలియదు. ఊర్లో ఉన్న దవాఖానాకు తీసుకెళ్లాం. అక్కడ చూసిన జూనియర్ డాక్టర్ గుండెపోటు వచ్చిందని తెలిసి ట్రీట్మెంట్ కోసం పుస్తకం తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ మించుకుపోతుంది సారూ అంటున్న క్షణంలోనే వైద్యం అందక మరణించారు. నాన్న మృతి కళ్లారా చూసి గుండె పగిలిపోయినట్లయింది. నా జీవితంలో విషాద సంఘటన ఇదే. ఉద్యోగం వచ్చిన రోజున ఆనందపడ్డా 1989లో గ్రూప్–2 ఫలితాలు వెలువడ్డాయి. ఉదయాన్నే పది గంటలకు అమ్మ పాదాలకు నమస్కరించి ఇలా బయటికి వచ్చా. అప్పుడే పోస్ట్‌మెన్ లెటర్ తెచ్చారు. ఆ లెటర్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ ఉంది. అదే ఏడాది జూలైలో డీటీగా ఉద్యోగం రావడంతో ఎంతో ఆనందపడ్డా. మా అమ్మ చాలా సంతోషిస్తూ మీ నాన్న ఉండి ఉంటే చాలా సంబరపడేవారు అంటూ అక్కున చేర్చుకుంది. స్ఫూర్తి ప్రదాత రొనాల్డ్‌రోస్ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నాకు స్ఫూర్తి ప్రధాత. ఆయన కాకినాడలో ఐఏఎస్ క్యాడర్లో ఉన్న సమయంలో నేను డీఆర్ఓగా ఉన్నాను. అప్పటి నుంచి నా ఉద్యోగ నిర్వహణలో చూపిస్తున్న సేవలను గుర్తిస్తూ ముందుకు తట్టి వస్తున్నారు. యాదాద్రిలో డీఆర్డీఓగా పనిచేస్తుంటే అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జేసీగా తీసుకొచ్చారు. ఆ తర్వాత నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా కావడం ఎంతో సంతోషంగా ఉంది. రొనాల్డ్‌రోస్ తీసుకొస్తున్న నూతన విధానాల మార్పులతో పాలన సౌలభ్యంగా సాగుతుంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ నేడు కలెక్టర్ హోదాలో నారాయణపేట జిల్లాలో పరిపాలనను ఎంతో సులభంగా ప్రశాంతంగా నిర్వహిస్తున్నా. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో.. నేను పుట్టింది మొదలు.. నా ఉద్యోగ జీవితం దాదాపు ఆంధ్రప్రదేశ్ అక్కడే కొనసాగింది. అక్కడ సాగునీటికి పెద్ద కొరత లేదు. తొలిసారిగా తెలంగాణలోని నల్ల గొండ జిల్లాలో 2014లో జెడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టా. ఆ ప్రాంతంలో సాగునీరు, తాగునీటికి చాలా ఇబ్బందులు.. ఆ తర్వాత పాలమూరు జిల్లాకు 2018లో జేసీగా వచ్చా. ఎక్కడ చూసినా బీడు భూములు కనిపించడంతో కన్నీళ్లు వచ్చాయి. అందులో నారాయణపేట ప్రాంతమైతే మరి సాగునీరు లేక రైతాంగం కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. త్వరలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి జిల్లా అంతా పచ్చబడితే చూడాలని ఉంది. ‘పేట’ జిల్లా అభివృద్ధే ధ్యేయం వెనుకబడిన నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేరువేస్తూ ఉత్తమ పాలనను అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు సాగునీరు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. వారికి నా వంతు తోడ్పాటునందిస్తా. నా గురువు సత్యం మాస్టారు.. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. ఆ గురువే మా సత్యం మాస్టారు. సాలూరు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. అక్కడ నన్ను చాలా ప్రోత్సహించేవారు. తప్పుచేస్తే కోప్పడేవారు. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీలు ఉన్నా నన్ను ఎంపిక చేసి పంపేవారు. ‘చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరానికి ఎదిగే గొప్ప లక్ష్యం ఉన్న వాడివి నువ్వు..’ అంటూ ఆశీర్వదించేవారు. ఆయన చెప్పిన చదువుతో నేడు కలెక్టర్‌నయ్యాను. మాతాత పేరే నాకు పెట్టారు మా తాత పేరు వెంకటస్వామి. ఆయనపేరే మానాన్న నాకు పెట్టారు. మొదట్లో ఐదో తరగతి వరకు నా పేరు వెంకటస్వామిగానే పిలిచేవారు. వెంకటస్వామి ఈజ్ ఓల్డ్ నేమ్ మ్యాన్.. వెంకట్రావు ఈజ్ న్యూ నేమ్ దిస్ టైమ్ట్రెండ్.. అంటూ అప్పట్లో చదువు చేప్పే గురువులు వెంకటస్వామిని కాస్తా వెంకట్రావుగా పేరు మారుస్తూ పాఠశాలలో పేరు మార్చేశారు. ఇక మా నాన్న డిగ్రీలో ఉన్నప్పుడే గుండెపోటుతో మృతిచెందారు. అప్పటి నుంచి పెద్దనాన్న అప్పలరాజు నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. నేను కలెక్టర్ కావాలనేది నాన్న కల. మాపెద్దనాన్న సైతం ఉన్నత స్థాయిలో ఉంటావంటూ ఆశీర్వదించేవారు. వారి కల నేరవేరింది. ఇంట్లో నేనే పెద్దోడిని. అప్పటికే నేను డిగ్రీ చదువుతున్నా. మధ్యలో ఆపెయ్యొద్దంటూ మా తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. నాన్న చేసే వ్యవసాయం.. చిన్నపాటి వ్యాపారాలను వారే చూసుకుంటున్నారు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌తో టచ్ చిన్ననాటి బాలస్నేహితులు లక్ష్మణ్‌రావు, రమేశ్, వాసు, వెంకటరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ ఉన్నారు. ప్రస్తుతం వారు వివిధ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వారితోపాటు బాల్యదశ నుంచి ఎంబీఏ వరకు చదివిన తోటి ఫ్రెండ్స్ అంతా ఫేస్బుక్లో టచ్‌లో ఉన్నారు. నేను కలెక్టర్‌ను అయ్యానని తెలిసి ఫ్రెండ్స్ నా ఫొటోను అందులో పెడుతూ అభినందించారు. ప్రజాసేవకు జీవితం అంకితం ఉద్యోగంలో ఉన్నా...పదవీ విరమణ పొందిన నా జీవితమంతా ప్రజాసేవకే అంకితం. 1989లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి.. నేడు కలెక్టర్‌గా కొనసాగుతూ భవిష్యతులో మరో అడుగువేస్తే అడిషనల్ సెక్రటరీ వరకు వెళ్లొచ్చు. 2025లో పదవీ విరమణ ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండాలంటే నాకెంతో ఇష్టం. ఐఏఎస్‌ను అయ్యాననే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను. నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ. వారికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం ఆయా సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే సంతృప్తినిస్తుంది. జీవితంలో ఆత్మతృప్తిని మించింది మరొకటి ఏముంటుంది. ‘ఆయన’ మా మేనమామ మా ఆయన నాకు వరుసకు మేనమామ. చిన్నప్పు డు ఆయన చదివిన స్కూళ్లోనే నేను చదివా. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. మా చిన్న తాత పెద్దకొడుకు. వ్యక్తిగత జీవితం కంటే ఉద్యోగ నిర్వహణలో ప్రజాజీవితమే ముఖ్యం. చిన్నప్పటి నుంచి మామ మనస్సు నాకు తెలుసు. డీటీ నుంచి కలెక్టర్‌గా అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. 30ఏళ్లుగా ఉద్యోగిగా ఆయన గృహిణిగా నేను పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. కాస్తా సమయం దొరికిందంటే చాలు మాతో చాలా ఆనందంగా కాలన్ని గడుపుతారు. ఎంత పని ఉన్నా తమను సినిమాలకు తీసుకెళ్లి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం. ఇంటి ఆవరణలో సైతం మొక్కలు నాటి పెంచుతుంటాను. పూల మొక్కలనే ఎక్కువగా పెంచాను. – రాజేశ్వరి, కలెక్టర్ సతీమణి -
పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి
‘‘పిల్లలు పుట్టినప్పుడే తల్లీదండ్రీ పుడతారు. పిల్లలతో పాటు పేరెంట్ప్ కూడా ఎదగాలి’’ అంటున్నారు ప్రకాశ్‌రాజ్. ఒక తండ్రి ఎలా ఉండాలి? పిల్లలు సరైన దారిలో నడవాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? వంటి విషయాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ► సినిమాల్లో అనేక తండ్రి పాత్రలు పోషించారు. ఓ తండ్రి పిల్లలతో ఎలా ఉండాలి? సినిమాలు వేరు. జీవితం వేరు. సినిమాల్లో కథ చెప్పడానికి సృష్టించిన పాత్రలవి. వాళ్లు నిజంగా తండ్రులు కారు. వాళ్లు అమ్మలూ కాదు. సరదాగా చెప్పాలంటే మహాత్మాగాంధీ గారి తర్వాత నేనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాను. అన్ని రకాల తండ్రి పాత్రలు చేశా. పాజిటివ్, నెగటివ్, కేరింగ్ ఇలా అన్నీ చేశా. అవి వేరు. కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ పాత్ర ద్వారా కొన్ని భావాలు చెబుతుంటారు. జీవితం విషయానికొస్తే... తండ్రి అనేది ఒక వ్యక్తిత్వం. నాకు మొత్తం నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. దురదృష్టవశాత్తు ఒక కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిపి నేను. మనం అనుకుంటాం.. మనం పిల్లల్ని పెంచుతున్నాం అని. మనం మాత్రమే కాదు, మనతోపాటు మన సమాజం, మన చుట్టూ ఉండే మనుషులు, స్కూలు, నేర్చుకోవాలనే వాళ్ల ఆకలి... ఇవన్నీ కూడా వాళ్లను పెంచుతుంటాయి. పొద్దున్నే స్కూల్లో వదిలేస్తాం. సాయంత్రం 4 వరకూ రారు. ఎప్పుడూ వాళ్ల పక్కనే ఉండలేం. బయటి ప్రపంచం కూడా వాళ్లకు నేర్పిస్తుంది. భోజనం సమకూర్చడం, చదివించడం.. కేవలం ఇవే కాదు తండ్రి అంటే? పిల్లలు మానసికంగా వికాసం చెందడంలో తోడ్పడే వాడే అసలు సిసలు తండ్రి. ► పిల్లల్లో మానసిక వికాసం కోసం ఏం చేయాలి? ఇప్పుడు నాకు 54 ఏళ్లు. నా కూతురికి 23. నా యవ్వనంలో నా ఆకలి, ఆలోచనలు వేరు. నాకు, నా కూతురికి దాదాపు 30 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. ప్రతి పదేళ్లకు జన రేషన్ మారుతుంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు మన మూలంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన జీవులు. వాళ్లు ఎగరడానికి రెక్కలు, శక్తి ఇవ్వాలి కానీ వాళ్లు ఎటు ఎగరాలో ఎటు ప్రయాణం చేయాలో మనం నిర్దేశించలేం. నిర్దేశించకూడదు కూడా. నిర్దేశిస్తే వాళ్లు మన చేయి పట్టుకుని నడుస్తారు. సొంత అభిప్రాయాలు ఉండవు. సొంతంగా ఆలోచించలేరు. అప్పుడు మానసిక వికాసం ఎలా వస్తుంది? అందుకే పిల్లలను ఎదగనివ్వాలి. ► మనం చేయి వదిలిస్తే సమాజం నుంచి పిల్లలు ఏదైనా చెడు నేర్చుకునే అవకాశం ఉంది కదా.. అందుకే స్వేచ్ఛ ఇవ్వకూడదనే భయం చాలా మందిలో ఉంటుంది.. భయం ఎప్పుడు ఉంటుందంటే.. మన పెంపకంలో నమ్మకం లేనప్పుడు. మా అమ్మ మాతోనే నా ఇంట్లో ఉంటుంది. ఆమెకు 78 ఏళ్లు. ‘మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మకు కోపం వస్తుంది కదా’ అనే పెంపకంలో నేను పెరిగాను. ఇప్పటికీ ఆ భయం ఉంటుంది. మన ఆబ్సెన్స్లో కూడా పిల్లలతో మన ప్రెజెన్స్ ఉండాలి. మనం ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒక ఫ్లూట్ నుంచి మ్యూజిక్ బయటకు వచ్చాక ఆ సంగీతం మీద ఆ ఫ్లూట్కి ఎంత హక్కుంది? పిల్లల విషయంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే మన పిల్లల్ని బాధ్యతగా పెంచుతూ, వాళ్ల ఆశల్ని, ఆశయాల్ని గౌరవిస్తామో అప్పుడు ఎలాంటి భయాలూ ఉండవు. ► మన పిల్లలు చెడు దారి పట్టరనే నమ్మకం తల్లిదండ్రులకు ఎలా కలుగుతుంది? ఇప్పుడు నా పెద్ద కూతురిని తీసుకుందాం. 17 ఏళ్లకే తనంతట తానే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగేంత సామర్థ్యం ఉన్న అమ్మాయిలా పెరిగింది. 12 ఏళ్ల వయసులో తనకు పెయింటింగ్‌లో ఆసక్తి ఉందని చెప్పింది. హాస్టల్లో పెట్టాను. మ్యూజిక్ నేర్చుకుంది. యూకే వెళ్తాను అంది. పంపించాను. మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, స్నేహం అలాంటిది. అది ఎలా కుదిరిందీ అంటే.. కూర్చుని మాట్లాడటం వల్ల. మన పిల్లల ఆలోచనలను గౌరవించకపోతే వాళ్లతో కూర్చుని ఓపెన్‌గా మాట్లాడలేం. అసలు వినం కూడా. అది తప్పు. మనం పెద్దవాళ్లయినంత మాత్రాన మనదే కరెక్ట్ అనుకోకూడదు. పిల్లలు కిందపడితే ‘నాకు మా అమ్మానాన్నలు ఉన్నారు’ అనే భరోసా ఇవ్వాలి. అప్పుడు చెడు దారి పట్టరు. ► ఒక భర్తకు భార్య విలువ కూతురు పుట్టాక తెలుస్తుంది అంటారు. నిజమేనా? అవును. చాలామంది భర్తలు భార్యని దేవతగా చూసి మావగారిని విలన్‌గా చూస్తారు. అయితే వాళ్లకు కూతురు పుట్టినప్పుడే ‘నా భార్య కూడా ఇంకొకడి కూతురే కదా. నా కూతురి విషయంలో నేనెంత ప్రొటెక్టివ్‌గా ఉన్నానో తన కూతురి విషయంలో ఆ తండ్రి కూడా అలానే ఉంటాడు కదా’ అని అర్థం అవుతుంది. మామగారు పెళ్లి చేసి భర్తతో పంపించేశాక, ‘ఇది నా సొమ్ము. తను వాళ్ల నాన్నగారి మాట ఎందుకు వినాలి ? వింటే ఇక్కడ ఉంటావు.. లేదంటే పుట్టింటికి వెళ్లిపోతావు’ అంటాం. అదే కూతురు అత్తింటికి వెళ్లిపోతున్నప్పుడు వేరే ఫీలింగ్ ఉంటుంది. అందుకే అంటున్నా... పిల్లలు పుట్టినప్పుడే తండ్రి కూడా పుడతాడు. అప్పటివరకూ ఉన్న మగవాడు వేరు. ఆ తర్వాత వేరు. కొత్త మనిషి అన్నమాట. ఆ కొత్త మనిషి పిల్లలతో పాటు ఎదుగుతాడు. ► తాగుబోతు తండ్రి, బాధ్యత లేని తండ్రుల వల్ల పిల్లలు కూడా అలానే తయారవుతారా? లేదు. ఒక ఇంట్లో తండ్రి తాగుబోతు, పిల్లలను పట్టించుకోలేదు అనుకుందాం. తల్లి పెంచింది అనుకుందాం. అలాంటి తండ్రి కూడా ఓ తండ్రి ఎలా ఉండకూడదో పిల్లలకు నేర్పినట్లే. పెద్దయ్యాక తన పిల్లల విషయంలో ఇలా ఉండకూడదని ఆ పిల్లలు నేర్చుకుంటారు. మంచి తండ్రిని చూసి మంచిని, చెడ్డ తండ్రిని చూసి మంచిని నేర్చుకుంటారు. ఏదైనా పాఠమే. వాళ్ల గాయాలు, వాళ్ల తపనలు, వాళ్ల పడిపోవడాలను వాళ్లనే అనుభవించనివ్వాలి. పడిపోతే పట్టుకోవడానికి ‘నేనున్నాను’ అనే నమ్మకాన్ని పిల్లలకు కలిగించగలగాలి. ► ఇలాంటి నమ్మకాన్ని కలిగించగలిగితే వాళ్లు సరైన మార్గంలో వెళ్తారంటారా? వెళ్తారు. నువ్వు తరచూ వాళ్లతో మాట్లాడుతుండాలి. పొద్దున్నే స్కూల్ యూనిఫామ్ వేసి, స్కూల్‌కి పంపుతున్నాం.. అది చేశాం.. ఇది చేశాం అని త్యాగాలు చేస్తున్నట్టు మాట్లాడతాం. ముందు దాన్ని తీసేయాలి. నిన్ను ఎవడు అడిగాడు త్యాగం చేయమని? పిల్లల్ని పెంచడం నీ బాధ్యత. పిల్లల కోసం నువ్వు కష్టపడుతున్నావు. దాన్ని చెప్పి చూపిస్తూ పెంచకూడదు. నీ ఫిలాసఫీ ఏంటి? నీ నమ్మకాలేంటి? అనేవి మాట్లాడుతుండాలి.. అంతే. పిల్లలు మనల్ని ఒక పుస్తకం చదివినట్టు చదువుతుండాలి. మన పిల్లల దగ్గరే మనం సీక్రెట్స్ పెట్టుకున్నాం కదా? పిల్లలు తల్లినో తండ్రినో చూసే పెరుగుతారు. వాళ్లకు పుస్తకంగా ఉండగలిగితేనే ఏది తప్పో ఏది రైటో డిసైడ్ చేసుకోగలుగుతారు. మనం అది చేయం. మన సీక్రెట్స్ మనం పెట్టుకుంటాం. మన ప్లస్ పాయింట్స్,. మన శక్తిని మాత్రమే చూపిస్తాం. పిల్లలకన్నా మనం స్ట్రాంగ్ అని చూపిస్తూ ఉంటాం. ► ఇవన్నీ మీరెలా తెలుసుకోగలిగారు? మనిషి అంటేనే అద్భుతం. తన బతుకుని తన కళ్ల ముందు చూసుకుంటూ.. కొన్ని వాస్తవాల మీద దృష్టి పెడితే వాళ్లకే అర్థం అవుతుంది. కొంతమంది పిల్లల్ని కొడతారు. వాళ్లను కొట్టడానికి అసలు చేయి ఎలా వస్తుంది? పెరుగుతున్న ఓ చిన్న మొక్కను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు. మనం పిల్లలతో అటాచ్డ్గా ఉంటూనే డిటాచ్డ్గా ఉండాలి. వాళ్ల గ్రోత్‌ని ఎంజాయ్ చేయాలి. వాళ్లతోనే ఎదగాలి. ► మరి మన కోపాన్ని పిల్లల మీద ఎలా చూపించాలంటారు? మన అనుభవంతో ఆలోచించి కొన్ని చేయొద్దు అంటాం కదా? ఆ విషయాన్ని ముక్కుసూటిగా మీ పిల్లలతోనే చెప్పండి. అయితే మనకు బేసిక్‌గా సహనం ఉండదు కదా. ‘నీకేం తెలుసు’ అంటాం. ఆ మాట ఎలా వస్తుంది అసలు? వాళ్లు పిల్లలు. వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు సహనంగా కూర్చుని వివరించి చెప్పొచ్చు కదా. నా మూడేళ్ల కొడుకుతో నేను మాట్లాడుతుంటాను. వాడితో ఏం మాటలు అంటుంది నా భార్య. లేదు.. వాడికి చెప్పాలి, మాట్లాడాలి అంటాను నేను. అది నా బాధ్యత. ఒక్కసారి కాకపోతే 10 సార్లు చెబుతాను. ‘ఐయామ్ హర్ట్’ అంటాను వాడితో. వాడికి అర్థం అయ్యేలా చెప్పడానికి. చేయెత్తను. వాళ్లకు తెలియదని మనకు తెలుసు కదా. అర్థం అయ్యేట్టు చెబితే వాడికి బుర్రలోకి ఎక్కుతుంది. ► మీరు చెప్పినవాటిలో మీ మూడేళ్ల కొడుకు అర్థం చేసుకుని, ఆచరిస్తున్నవాటి గురించి? వాడికి మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. ఆ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. ఓపికగా చెప్పాను. దాంతో ఎవరైనా మిల్క్ చాక్లెట్ ఇస్తే ‘నో.. అది నాకు అలర్జీ’ అని అంటాడు వాడు. నేనే ఇచ్చినా ‘డాడీ యాక్’ అంటాడు. నా పిల్లలు పెద్ద పెద్ద పదాలు, వాక్యాలతో మాట్లాడతారు. నా చిన్నోడు కూడా. ఎందుకంటే నేను పెద్దవాళ్లతో మాట్లాడినట్టే వాళ్లతోనూ మాట్లాడతాను. అలానే వాళ్లు నేర్చుకుంటారు. వాళ్లను వాళ్లు ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్చుకుంటారు. నా కొడుకు మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. వాడి సంగతి ఎలా ఉన్నా 50 ఏళ్ల వయసులో నాకు కొడుకు పుట్టాడు. దాంతో నాకు మళ్లీ 10, 15 సంవత్సరాల యవ్వనం వచ్చినట్టుంది. ‘జనరేషన్‌కు ఒకర్ని కన్నావు కదా డాడీ’ అని నా కూతురు సరదాగా అంటుంది. ► మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మీ ఇద్దరు కూతుళ్లు మిమ్మల్ని అర్థం చేసుకున్నారా? నేను పెళ్లి చేసుకునే సమయానికి మా పెద్దమ్మాయికి 14 ఏళ్లు. నా తల్లి, చెల్లి, కూతురు.. ముగ్గుర్నీ కూర్చోబెట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి (పోనీవర్మ)ను తీసుకొచ్చి ‘ఈమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? అని అడిగాను. మా అమ్మాయి ‘డాడీ.. గో ఎహెడ్’ అంది. మా అమ్మ ఏడ్చేసింది. నా ఫ్యామిలీలోనే చాలామంది స్త్రీలు ఉన్నారు. అమ్మ, భార్య, పిల్లలు, చెల్లి.. ఇలా వీళ్లందరికీ ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనం ఒక సొసైటీలో బతుకుతున్నాం. నన్ను చూస్తూనే నా కూతుళ్లు ఇద్దరూ పెరిగారు కదా. వాళ్ల అమ్మతో అనుచితంగా ప్రవర్తిస్తే నా కూతుళ్లు కూడా ఆడవాళ్లే కాబట్టి నా మీద కోపం పెరుగుతుంది. అప్పుడు ఒక మగాడిగా వాళ్లకు నేను మంచి ఎగ్జాంపుల్ ఎలా కాగలను? పిల్లల విషయంలో లత (మొదటి భార్య), పోనీ (రెండో భార్య) ఫ్రెండ్స్ అయిపోయారు. లతకు ఇప్పుడు నేను భర్తని కాదు. పోనీకు మాత్రమే భర్తను. లతకు నేను మాత్రమే డివోర్స్ ఇచ్చాను. నా పిల్లలు, మా అమ్మ డివోర్స్ ఇవ్వలేదు. లతకు, నాకూ మధ్య సమస్య ఉండి, అబద్ధాలతో కలిసి బతకొద్దని విడిపోయాం. ఒక తల్లిదండ్రులుగా పిల్లల మీద చూపించే ప్రేమ ఒకటే కానీ, భార్య, భర్తగా విడిపోదాం అనుకున్నాం. దానికి లత, పోనీ ఒకర్ని ఒకరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీకి అన్యాయం చేస్తూ ఇంకో స్త్రీతో ఎలా ఉండగలుగుతాను. ఈ స్త్రీ విషయంలో నేను చేసినది కరెక్ట్ అనిపిస్తేనే ఇంకో స్త్రీతో జీవితాన్ని పంచుకోగలుగుతాను. అందుకే హానెస్ట్‌గా ఉన్నాను. లత, నేను ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తూనే పిల్లలు పెరుగుతారు. అప్పుడే వాళ్ల నిర్ణయాలను వాళ్లు ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఎవరైనా సమాజానికి కాదు మనస్సాక్షికి భయపడాలి. ► రెండో పెళ్లి ద్వారా కలిగిన మీ కుమారుడితో మీ పెద్ద కూతుళ్ల బాండింగ్? పెద్దమ్మాయికి 23, చిన్నదానికి 13, వాడికి 3. నా భార్య నా మరో కూతురులాంటిది. తనకి 42. నాకు 54. అందరికీ దాదాపు పదేళ్లు గ్యాప్ ఉంది గమనించారా? మొన్నే అందరం కాశ్మీర్ వెళ్లాం. వీలు కుదిరినప్పుడల్లా ఏదో ప్లేస్‌కి వెళతాం. ఎంజాయ్ చేస్తాం. మా బాండింగ్ బావుంటుంది. ► కూతుర్ని కొడుకులా పెంచాను అంటారు కొందరు.. అలా అనడం ద్వారా కొడుకే గొప్ప అని చెప్పినట్లు అవుతుంది కదా? అవును. ఎవరో నాతో మా పెద్దమ్మాయిని చూపిస్తూ ‘నీ పెద్దకొడుకు’ అన్నారు. ‘కొడుకు కాదయ్యా.. తను నా కూతురు. కొడుకు కన్నా ఎక్కువ’ అని చెప్పా. ఆ సెన్సిటివిటీ చాలా ముఖ్యం. జెండర్ ఈక్వాలిటీ అనేది మన ఇంట్లోనే మొదలవ్వాలి. ఇంట్లో కొడుకు అయితే ఒకలా చూడటం కూతురైతే మరోలా చూడటం చేయకూడదు. అలా చేస్తే సమాజం ఎప్పటికీ మారదు. ► అలాగే కూతుళ్లను చదివించడం వేస్ట్ అని కొందరు అనుకుంటారు... నేను దత్తత తీసుకున్న ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లే బస్ నిండా అబ్బాయిలే. ఆ తేడా ఎందుకో? కూతుళ్లైతే ఏంటి? కొడుకులైతే ఏంటి? ఇద్దరూ మన పిల్లలే కదా. నా లైఫ్‌లో మెన్ కంటే విమెన్ చాలా స్పెషల్ అని గర్వంగా చెప్పగలను. ఉమెన్ ఈజ్ వెరీ స్పెషల్. వెరీ క్రియేటివ్, డౌన్ టు ఎర్త్. యాక్చువల్లీ వాళ్లే ఎర్త్. నేచర్. మగాళ్ల కంటే కూడా స్త్రీలు కచ్చితంగా కొంచెం విలువైన వాళ్లే. ► ఫైనల్లీ మీ పిల్లలతో మీరు మాట్లాడేవాటిలో ఎక్కువగా వచ్చే టాపిక్స్ గురించి? ఫిలాసఫీ, పాలిటిక్స్, సాహిత్యం, మొక్కలు, జీవితం... ఇలా అన్నింటి గురించీ మాట్లాడతాను. నేను చదివిన పుస్తకాల గురించి, విన్న కవిత గురించి చెబుతాను. వాళ్లు ఏదో చెబుతారు. అలా సంభాషించుకుంటాం. పిల్లలకు మనం ఓపెన్ బుక్ అవ్వాలంటే ఇలాంటివన్నీ ఉండాలి. అవన్నీ మాటల వల్లే అవుతుంది. అందుకే పిల్లలతో మాట్లాడదాం. ఆ మాటలే మనల్ని వాళ్లకు దగ్గరగా ఉంచుతాయి. ► పిల్లలకు టైమ్ స్పెండ్ చేసే తీరిక లేనంత బిజీగా తల్లిదండ్రులు ఉండవచ్చా? అస్సలు ఉండకూడదు. మనం చెప్పకముందే తల్లిదండ్రులతో తమ బంధాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఎప్పుడు ఏర్పడుతుంది? అంటే.. పిల్లలతో మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినప్పుడే. తండ్రి అనేవాడు పిల్లలకు మరిచిపోలేని మంచి అనుభూతి అవ్వాలి. మరిచిపోలేని క్షణాలు అవ్వాలి. ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా అవన్నీ మర్చిపోయి పిల్లలతో గడపాలి. వాళ్లతో ఎక్కువ సమయం గడిపేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పిల్లలు, తల్లిదండ్రులూ కలిపి పెరుగుతారు. మనం ఆల్రెడీ ఎదిగిపోయాం, వాళ్లు ఎదగాలి అన్నట్టు ఉండకూడదు. ఓ రిలేషన్‌షిప్‌ని నేను అలానే చూస్తాను. మా పిల్లలతో అలానే ఉండే ప్రయత్నం చేస్తున్నాను. – డి.జి. భవాని కుమారుడు వేదాంత్‌తో.. భార్యాపిల్లలతో ప్రకాశ్‌రాజ్ -
సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు
‘మీరెలాంటి ఫాదర్’ అంటే ‘మా నాన్నంత బెస్ట్ నేను కాదు’ అంటారు అర్జున్. ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తన తండ్రిని చూసి నేర్చుకున్నాను అంటున్నారు. ఇంకా అర్జున్ చెప్పిన విశేషాలు. ► ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి? ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే మా నాన్నలా ఉండాలి. ఏ తండ్రి అయినా పిల్లలకు కొంచెం సంస్కారం ఇవ్వాలి. అది నా తండ్రి నాకు ఇచ్చారు. పిల్లలకు ఆస్తులు కూడబెట్టి ఇస్తారు కొందరు. లేనివాళ్లు ఇవ్వలేరు. అయితే సంస్కారం అనేదానికి డబ్బు అక్కర్లేదు. ఆ తండ్రి సంస్కారవంతుడు అయితే బిడ్డలకు కూడా అదే నేర్పిస్తాడు. నా తండ్రి (అర్జున్ తండ్రి జేసీ రామస్వామి నటుడు – ఆయన స్క్రీన్ నేమ్ శక్తిప్రసాద్) మాకు సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు. ► సంస్కారం ఉన్నవాళ్లు తమ సంసారం విషయంలో చాలా బాధ్యతగా కూడా ఉంటారు. కుటుంబం విషయంలో మీ తండ్రి తీసుకున్న కేర్ గురించి? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తండ్రి అయిపోడు. పెళ్లంటే పెద్ద బాధ్యత. భార్యని తన తల్లిలా చూసుకునేవాడే నిజమైన తండ్రి.. బిడ్డల్ని కూడా తల్లిలా చూసుకోవాలి. భార్యని, పిల్లలను సరిగ్గా చూసుకోలేనివాళ్లు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి మగవాళ్లకు పెళ్లి చేసుకునే అర్హత లేదని నా అభిప్రాయం. ఎఫెక్షన్, కేరింగ్ అనేవి చాలా ముఖ్యం. మా నాన్న చనిపోయి దాదాపు 30 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆయన తాలూకు జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉన్నాయి. అంతలా మీ నాన్నగారు మీకోసం ఏం చేశారంటే ఒకటి, రెండు, మూడు... అని లెక్కేసి ఇన్సిడెంట్స్ చెప్పలేను. అదొక ఫీలింగ్. నేను స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అరగంట లేటైతే చాలు కంగారుపడేవారు. 5:30 గంటలకు రావాల్సింది 6 గంటలకు వస్తే నేను వచ్చేవరకూ బయట నిలబడి వెయిట్ చేస్తుండేవారు. అంత కేరింగ్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అయితే చెప్పాను కదా.. నాన్న అంటే ఓ ఫీలింగ్ అని. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో తెలియడంలేదు. ► జనరల్‌గా అమ్మ దగ్గర చనువు ఉంటుంది. నాన్నకు భయపడతాం. మరి మీరు? మా నాన్న అంటే నాకు భయం. అయితే నేను తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడేవాడిని. లేకుంటే ఆయన మెడపై కూర్చునేటంత చనువు ఉంది. ఎప్పుడూ నన్ను భయపెట్టాలని ఓ టీచర్‌లాగా ‘ఏయ్’ అంటూ అరిచేవారు కాదు. నాతో మామూలుగా మాట్లాడేవారు. అయితే తప్పు చేస్తే నాన్నకు కోపం వస్తుంది అనే ఫీల్‌ని పిల్లలకు కలిగేలా చేయగలిగారు. ► మీ నాన్నగారు మీకు నేర్పించిన విషయాల్లో ముఖ్యమైనవి ఏమైనా? దేశభక్తి, దైవభక్తి... రెండూ నేర్పించారు. ఈరోజు ఆధ్యాత్మికంగా ఓ గుడి (ఆంజనేయ స్వామి) కడుతున్నానంటే భక్తి అనే విత్తనాన్ని నా మైండ్‌లో చిన్నప్పుడే నాటారు నాన్న. దేశం పట్ల ప్రేమ, భక్తి ఉండాలని నా గుండెల్లో పెట్టుకునేలా చేసింది కూడా ఆయనే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి చెప్పారు. వారి త్యాగాల గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడు తెలియకుండానే ‘ఓహో... దేశం అంటే ఇది. మన స్వాతంత్య్రం వెనక ఇంతమంది త్యాగం ఉంది’ అనేది మనసులో నాటుకుపోయింది. దేశభక్తి భావం పెంపొందింది. దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమించాలని చెప్పేది కూడా నాన్నే అయ్యుండాలి. ఇలాంటి అర్హతలన్నీ ఉంటేనే ఫాదర్.. లేకుంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లనేది ఓ బాధ్యత.. ఓ కర్తవ్యం. ► అర్జున్ వాళ్ల తండ్రి గొప్పా? లేక ఐశ్వర్య (అర్జున్ కూతురు) తండ్రి గొప్పా? ప్రపంచంలో నా తండ్రే గొప్ప అని ప్రతి పిల్లలు చెప్పుకుంటారు. నిజంగా నేను కూడా అలాగే ఫీలవుతాను.. అలాగే నేను గొప్ప తండ్రిని అనుకుంటున్నాను. మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా, చాలా సెక్యూర్డ్ ఫాదర్‌ని.. నా కూతురు పక్కన నేనుంటే తనని చూడటానికి కూడా భయపడతారు. ఇవన్నీ ఓకే.. కానీ మనం ప్రేమ ఇవ్వాలి. ప్రతి తండ్రీ ‘ఐ యామ్ ది బెస్ట్’ అంటుంటారు. మా అమ్మాయి ‘మా నాన్న బెస్ట్’ అంటుంది. అప్పుడు నేనేమన్నానంటే.. ‘నీకు నేను బెస్ట్ అయితే.. మా నాన్న నీ బెస్ట్ ఇంటూ వెయ్యి రెట్లు’ అన్నాను. మా నాన్న అంత గుడ్ ఫాదర్‌లా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ► మీ నాన్నగారు సంస్కారం ఇచ్చారు. మీ పిల్లలకు మీరు అది ఇవ్వడంతోపాటు బాగా ఆస్తులు కూడా ఇచ్చారు కదా? యస్. నా వద్ద డబ్బు ఉంది.. స్టేటస్ ఉంది. బాగా ఖర్చు పెట్టగలుగుతాను.. మా అమ్మాయి ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలను. ఫారిన్ పంపించగలను. అప్పట్లో మా నాన్నకి అంత స్తోమత లేదు.. అయినా మా నాన్నగారు బెస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఎబౌట్ మనీ, నాట్ స్టేటస్.. ఇట్స్ ఎ ఫీలింగ్. మనం పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. సమాజంలో వాళ్లు ఓ మంచి వ్యక్తిగా బతికేలా తీర్చిదిద్దుతున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. ► ఇంతకీ మీ నాన్నగారు మీకు జీవితం గురించి పదే పదే చెప్పేవారా? జస్ట్ ఆయన్ని చూసి నేర్చుకోమనేవారా? లైఫ్ అంటే ఒక ‘ఫ్లేవర్’. ఆ సువాససను మనం ఆస్వాదించగలుగుతాం తప్ప చూడలేం. వేరేవాళ్లు అడిగేటప్పుడే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. మీ ఫాదర్‌తో ఎప్పుడెప్పుడు మీకు అలా అనిపించింది? అని అడిగితే.. ఉదాహరణకి.. చిన్నప్పుడు హెయిర్ కటింగ్ షాప్‌కి నాన్న తీసుకెళ్లారు. అక్కడ కుర్చీలో ఎత్తు కోసం మరొక స్పాంజ్ సీట్ వేశారు. కటింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతూ తల కిందికి ఓ వైపు వాల్చేసేవాడిని. అప్పుడు కటింగ్ చేసే ఆయన తలని సరిగ్గా పెడతాడు. అయితే అతని చర్య సున్నితంగా ఉండదు. తలను అలా లాగి పక్కకి పెట్టినట్లు పెడతాడు. అది మా నాన్నకు నచ్చేది కాదు. అందుకని నా పక్కనే కూర్చుని నేను నిద్రపోకుండా కథలు చెబుతూ కటింగ్ చేయించేవారు.. ఇదొక సంఘటన. ఈ విషయంలో మీకు ఏం తెలుస్తుంది.. కేరింగ్, అఫెక్షన్ తెలుస్తున్నాయి కదా. ఇంకొక్కటి చెబుతా.. ఇవన్నీ నిజాలు.. ఒకరోజు నాన్న నన్ను ఎత్తుకుని రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద ఎద్దు మీదకు వచ్చేసింది.. మా నాన్న పహిల్వాన్.. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారు. కొంచెం అయ్యుంటే అది పొడిచేసేది. దాని ముక్కుతాడుని పట్టుకుని కంట్రోల్ చేశారు.. దాని యజమాని వచ్చేవరకూ అలాగే పట్టుకుని ఉన్నారు. ఇదంతా ఒక సినిమాటిక్‌గా ఉంటుంది. ► అప్పుడు మీ నాన్నని హీరో అనుకున్నారా? అంతేకదా! ఆయన కాకుంటే ఇంకెవరుంటారు? మా నాన్నది పల్లెటూరు. నాకూ చాలా ఇష్టం. అక్కడికి వెళ్లాలనిపిస్తుంటుంది? చెట్లు పెంచాలనిపిస్తుంది.. ఆవులు ఉండాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అది నా రక్తంలోనే ఉంది. పనసపండు ఉంటుంది కదా.. దాన్ని మా నాన్నే కోసి మా అందరికీ ఇచ్చేవారు. పిల్లలందరం కావాల్సినవి తీసుకునేవాళ్లు. మా నాన్నకి ఒక్కటే మిగిలేది. ఏమీ అనేవారు కాదు. అదే తినేవారు. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే.. ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశారాయన. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై హీరో’. ► హీరోగా మీ విజయాన్ని మీ నాన్నగారూ చూశారా? చూశారు. పిల్లల సక్సెస్‌ని తల్లిదండ్రులు తమ విజయంగా భావిస్తారు. నేను హీరోగా నటించిన సినిమాల వంద రోజుల వేడుకలకు నాన్న వచ్చారు. వాటిలో తెలుగు సినిమా ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా ఫంక్షన్ ఒకటి. మరణం మన చేతుల్లో లేదు. నాన్న చనిపోయినప్పుడు నాకు పాతికేళ్లు కూడా ఉండవనుకుంటా. ఆయన జ్ఞాపకాలు పదిలంగా మనసులో దాచుకున్నాను. కుమార్తె ఐశ్వర్య, భార్య నివేదితాతో అర్జున్ -
అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన..
‘మా అమ్మ నాతో అన్ని వేళలా ఫ్రెండ్‌లా ఉంటుంది. నాకు ఎల్లప్పుడూ కొండంత ధైర్యం ఆమే’ అని అంటున్నారు మెదక్ ఎస్పీ చందనా దీప్తి. ప్రజలే ఫ్యామిలీ.. వారికి సేవలందించడంలోనే నాకు సంతృప్తి అని చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతం, కవిత్వంతోపాటు పెయింటింగ్స్ వేయడం చాలా ఇష్టమని.. లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్‌లో ఎన్నో మెడల్స్ వచ్చాయని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి జీవితంలో రాణించిన ప్రతి ఒక్కరూ తనకు స్ఫూర్తి అంటూ ఐపీఎస్ ఆఫీసర్లలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చందనా దీప్తితో పర్సనల్ టైం ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మల్కాపూర్‌కు వచ్చిన సందర్భంలో మహిళలు, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ అమ్మాయిని చూడండి.. యంగ్ డైనమిక్ ఎస్పీ.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రాణించాలి.’ అని పిలుపునిచ్చారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో పలువురు మా దగ్గరకు వస్తుంటారు. పిల్లల మిస్సింగ్, ఇతరత్రా ఫిర్యాదులు అంటూ మా గడప తొక్కుతారు. వారి బాధలు విన్నా.. చూసినా.. మా కడుపు తరుక్కుపోతుంటుంది. వారి సమస్యలు పరిష్కారానికి నోచుకున్నప్పుడు బాధితుల కంటే మాకే ఎక్కువ సంతోషం ఉంటుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. మా అమ్మానాన్నది లవ్ మ్యారేజీ. అమ్మ విజయలక్ష్మి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. నాన్న జకర్యా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజిస్ట్. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో చిత్తూరు, కాకినాడ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అమ్మానాన్నది కష్టపడే మనస్తత్వం. తమ్ముడు ధీరజ్ ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. నేను వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిలో జన్మించా. తమ్ముడు ధీరజ్ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటాడు. విద్యాభ్యాసం రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, ఢిల్లీలో విద్యనభ్యసించా. రాజమండ్రిలో ఎల్కేజీ నుంచి రెండో తరగతి, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి.. ఆ తర్వాత చిత్తూరులోని గుడ్ షెపర్డ్ హైస్కూల్లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్ఈ) వరకు చదివాను. నెల్లూరులో ఇంటర్ విద్యనభ్యసించా. ఢిల్లీ ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదివా. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. రెండో పర్యాయంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. యాసిడ్ దాడి ఘటన ప్రభావం చూపించింది నేను చదువుకునే రోజుల్లో వరంగల్‌లో యాసిడ్ దాడి ఘటన జరిగింది. అప్పుడు నేను సివిల్స్‌కు ప్రిపేర్ కావాలనే ఆలోచనలో ఉన్నా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రభావం చూపించింది కూడా. నన్నే కాదు ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సంఘటన మొదట్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే కుటుంబ సభ్యులు బెంబేలెత్తారు. ఆనాటి పోలీసుల చర్య రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో కొండంత విశ్వాసం నింపింది. మెల్లమెల్లగా ఈ ఘటన నుంచి కోలుకున్నా. ఐఐటీ నా కల ఎలాగైనా ఐఐటీ సాధించాలనే పట్టుదల నాలో ఉండేది. హైదరాబాద్‌లోని రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్లో చేరాలనుకున్నా. అప్పటికే సీట్లు అయిపోవడంతో కుదరలేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నాం. పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలోని పేరున్న ఓ కోచింగ్ సెంటర్లో చేరేందుకు వెళ్లా. అక్కడ ఓ ఫ్యాకల్టీ నన్ను నిరుత్సాహానికి గురి చేశారు. ‘అబ్బాయిలకు మాత్రమే ఐఐటీలు సూటవుతాయి.. ఇంజినీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో.’ అని ఆ లెక్చరర్ అనడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయం తప్పని నిరూపించాలనే కసితో కోచింగ్ తీసుకున్నా. కుటుంబ సభ్యులు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పట్టుదలతో ఐఐటీ సీటు సాధించా. ఆ తర్వాత ఆ లెక్చరర్ ఒకసారి కలిస్తే బాగుండేదనిపించింది. నాన్న సూచనలతో సివిల్స్ వైపు.. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరా. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. నాన్న సూచనలతో సివిల్స్ వైపు మళ్లా. ఐఐటీ పూర్తి కాగానే హైదరాబాద్‌లోని ఆర్సీరెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ సాధించలేకపోయా. వెరవకుండా పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. ఓ జ్ఞాపకం నేను చిత్తూరులో ఐదో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా.. అప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకంగా మిగిలింది. మా టీచర్ హోంవర్క్ ఇచ్చారు. నాతోపాటు చాలామంది విద్యార్థులు చేయలేదు. టీచర్ నాకు తప్ప అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. ఓ విద్యార్థి లేచి ఆమెకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించాడు. అప్పుడు టీచర్ ఆమెలా ఒకసారి నువ్వు క్లాస్ ఫస్ట్ రా.. ఇంక నీకెప్పుడు పనిష్మెంట్ ఇవ్వను అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. లాంగ్ టెన్నిస్.. స్విమ్మింగ్ నాకు లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. విద్యార్థి రోజులతోపాటు ఐపీఎస్ ట్రైనింగ్‌లో చాలా మెడల్స్ సాధించా. వాటితోపాటు కవితలు, కర్ణాటక సంగీతమంటే ప్రాణం. వీణ కూడా నేర్చుకున్నా. ఐఐటీ చదివే రోజుల్లో కల్చరల్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొనేదాణ్ని. చిన్నప్పుడే మ్యాథ్స్ఒలింపియాడ్ వంటి ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించా. వెజ్‌కే ప్రాధాన్యం నాకు వెజిటబుల్ ఆహారమంటేనే ఇష్టం. రైస్ ఇష్టముండదు.. కూరగాయలే తింటా. మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు రోడ్డ పక్కన కాలుçస్తుంటే.. ఆగి మరి కొంటా. సీజనల్‌గా వచ్చే పండ్లు తింటా. సహజ పద్ధతుల్లో పండించే పండ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తా. హిల్ స్టేషన్లు సరదా నాకు కాలుష్యం లేని యూకే, లండన్, స్కాట్లాండ్ అంటే ఇష్టం. దేశంలో హిల్ స్టేషన్లంటే కూడా. డార్జిలింగ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, గుర్గావ్ వంటి పలు ప్రాంతాల్లో తరచూ పర్యటించా. ప్రతి వేసవిలో ఎటైనా టూర్ వేసేవాళ్లం. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈసారి కుదరలేదు. ‘ఫ్రెండ్లీ’ చాట్.. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో నిత్యం చాట్ చేస్తారు. ఐఐటీ ఫ్రెండ్స్ అందరూ స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఒక చోట కలవడం కుదరని పరిస్థితి. త్వరలో యూకేలో గెట్ టుగెదర్ పెట్టాలనే యోచనలో ఉన్నాం. సెట్ అవుతుందో చూడాలి మరి. ఓ ప్రాణాన్ని బతికించడం సంతృప్తినిచ్చింది అప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా ఉన్నా. సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడని అక్కడున్న వారు భావించి 108 వాహనానికి కాల్ చేస్తున్నారు. నేను పోలీస్ వాహనం దిగి అక్కడికి వెళ్లా. ఆ వ్యక్తి ఛాతి పైకి, కిందికి వస్తున్నట్లు గమనించా. నా వాహనంలోనే వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. అతడు బతకడంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. జాబ్ డిటెయిల్స్ ఐపీఎస్ అయ్యాక మొదటగా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండలో పనిచేశా. ఆ తర్వాత తాండూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించా. అనంతరం నిజామాబాద్ ఓఎస్డీగా నియామకమయ్యా. ప్రస్తుతం మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. -
రాజకీయాల్లో అరుదైన నేత వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం:‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింమైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న నేత అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. జగనన్నలో ఓ అంబేడ్కర్, జ్యోతిరావ్‌పూలే, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి తదితర మహానుభావుల్లో ఉండే వ్యక్తిత్వాన్ని చూశానన్నారు. ఆయన చేసే ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకొని వైఎస్సార్సీపీని రాజకీయ వేదికగా ఎంచుకున్నానన్నారు. తనకు ఎంపీగా అవకాశమిస్తే పార్లమెంట్లో అట్టడుగు వర్గాల సమస్యలపై గళం విప్పుతానని అంటున్న గోరంట్ల మాధవ్ .. ‘సాక్షి’తో మరిన్ని విశేషాలు పం చుకున్నాడు. ఆయన మాటాల్లోనే... తాను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ పెరిగా.. ఆ కసితోనే చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించా.. ఎస్ఐ, సీఐగా పనిచేసినంత కాలం బాధితుల పక్షాన నిలిచానని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్లో చేసిన సేవే ఇప్పుడు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు అక్కున చేర్చుకుంటున్నారు. మరింత సేవ చేయాలనే... ఉద్యోగిగా ప్రజాసేవ చేసేందుకు పరిధి చాలా తక్కువ ఉంటుంది. అదే రాజకీయంలోకొస్తే సేవలు విస్త్రతం చేయొచ్చు. ఎంపీగా అవకాశం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ఆలోచన విధానాన్ని రేపు పార్లమెంటులో ఆవిష్కరిస్తా. ఈ అవకాశం పోలీసుశాఖలో ఉంటే వస్తుందా?. యావత్తు దేశంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీల ప్రతినిధిగా మాట్లాడొచ్చు. అందుకోసమే పోలీసు నుంచి రాజకీయాల్లోకొచ్చా. పూర్తిగా ప్రజల్లో మమేకమై ఉంటా. వందశాతం బాధితుల పక్షాన నిలబడే వ్యక్తిని. పక్కా నిజాయతీగా నిలిచే తత్వం. ఎన్నికలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా బరిలో నిలబడ్డా. కష్టంగాని, నష్టంగాని నమ్మిన వ్యక్తికి అండగా నిలిచే వ్యక్తిని. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిని. బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నామినేటెట్ పోస్టులు, పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టబద్ధత చేస్తామని జగనన్న చెప్పడం చూస్తే దేశంలోనే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో ఆ విధంగా ఆలోచించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తిత్వముంది. జిల్లాలో జగన్మోహన్రెడ్డి సైని కుడిగా పని చేస్తానని చేరినరోజే చెప్పా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదరించి అక్కున చేర్చుకుని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ఎం పీగా పోటీ చేసే అవకాశం కల్పించడం నిజంగా అదృçష్టమే. జిల్లాలో బీసీలంతా జగన్‌కు రుణపడి ఉంటాం. రెండు సీట్లు గెలిచి అధినేతకు కానుకగా ఇస్తాం. -
జిల్లాకు మహానేత వైఎస్ హయాంలోనే న్యాయం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘‘జిల్లా గతిని మార్చేందుకు శాయశక్తులా శ్రమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నరంటే అది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే. సొంత జిల్లా కడప కంటే ‘అనంత’ అభివృద్ధికే పరితపించారాయన. ఫలానా పని కావాలని మేం ఫైలు తీసుకెళితే ఒక్కటి కూడా ‘కాదు.. కూడదు’ అన్న మనిషేకాదు. ‘మీ జిల్లాకు ఎంత చేసినా తక్కువే..’ అంటూ చిరునవ్వుతో సంతకం చేసి పంపేవారు. అలాంటి మహామనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. చంద్రబాబు ఐదేళ్లపాలన చూస్తే వంచన, అబద్దాలు, మోసం మినహా మరొకటి లేదు. టీడీపీని ఆదరించిన పాపానికి జిల్లాను వంచించిన తీరు దుర్మార్గం. ఈ జిల్లాకు మళ్లీ న్యాయం జరగాలన్నా.. కష్టాలు తీరాలన్నా.. అభివృద్ధి పట్టాలెక్కి అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలన్నా వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. చంద్రబాబు పాలనను ఇన్నేళ్లు చూసిన ప్రజలంతా జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. సంక్షేమపాలన చూస్తారు.’’ అని సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన జిల్లా స్థితిగతులు పంచుకున్నారు. సాక్షి: ఇన్నేళ్లు ఎంపీగా పోటీ చేశారు? తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు? ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారని భావిస్తున్నారు? ‘అనంత’: నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేశా. నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చింది వైఎస్ ప్రభుత్వం. నేను రైతునే. నీళ్ల విలువ తెలిసినవాడిని. మా నాన్న పేరుతో ‘అనంత’ వెంకటరెడ్డి హంద్రీ–నీవా పథకాన్ని వైఎస్ ప్రారంభించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. హెచ్చెల్సీ ఆధునికీరణ, ఛాగళ్లు, పెండేకల్లు, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా సగం జిల్లా మంచినీటి సమస్య తీర్చాం. అనంతపురం సిటీ కోసం పీఏబీఆర్ నుంచి పైపులైన్‌తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రామలు చేశాం. టీడీపీ నేతలు గత ఐదేళ్లలో ఫలాన అభివృద్ధి చేశామని చెప్పగలరా? వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. సాక్షి: చెరువులకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు? ‘అనంత’: హంద్రీ–నీవా ద్వారా 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, అన్ని చెరువులకు నీళ్లివ్వాలని జీఓ ఉంది. 7 ఏళ్లుగా నీళ్లు వస్తున్నాయి. 30 ఎకరాలకు నీరివ్వలేదు. ఏడాదిలోపు సాగునీరు ఇస్తామన్నారు. 25సార్లు సీఎం వచ్చారు. నీరివ్వలేదు. పాదయాత్ర ద్వారా కృష్ణాజలాలను 2012 నవంబర్ 29న జీడిపల్లికి తీసుకొచ్చాం. సాగునీరు ఉంటే వలసలు ఆగేవి. కేంద్ర ప్రభుత్వ సర్వేలో ‘అనంత’లో కనీవినీ ఎరుగని రీతిలో వలసలు ఉన్నాయని తేలింది. 280మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కేరళకు ఓ బృందం వెళ్లింది. అయినా చీమకుట్టినట్లయినా లేని ప్రభుత్వం ఇది. సాక్షి: పారిశ్రామిక అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పాటుపడలేదా? ‘అనంత’: ప్రత్యేకహోదా వచ్చి ఉంటే జిల్లా బాగుపడేది. చంద్రబాబు అడ్డుకున్నారు. బెల్, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీలకు పసుపు, కాషాయ కండువాలు కలిపి వేసుకుని చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ రాళ్లు కూడా ఉన్నాయో లేదో తెలీదు. కియా వచ్చిందని చెబుతున్నారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఏపీఐఐసీ సేకరించిన భూములు ఇప్పటి వరకూ కియాకు బదిలీ చేయలేదు. ముడుపులు ఇవ్వలేదని ఆ ప్రక్రియ నిలిపేశారు. కియాలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అధికారపార్టీ నేతలంతా కియా పేరుతో చేయని అవినీతి లేదు. అయినా సీఎం మాట్లాడలేదంటే ఆయనకు వాటాలు ఉండటమే. సాక్షి: అనంతపురం రైల్వేబ్రిడ్జి తానే తెచ్చానని ఎంపీ జేసీ చెబుతున్నారు? ‘అనంత’: సిగ్గుపడాలి.రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ వైఎస్ హయాంలో తెస్తే 90శాతం పనులు పూర్తి చేశాం. తక్కిన 10శాతం ఇప్పటికీ ఈయన చేయించలేదు. గుంతకల్లు–బెంగళూరు లైన్‌కు ఎలక్ట్రిఫికేషన్ మంజూరు చేస్తే ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇదీ ఆయన పరిస్థితి. రాంనగర్ రైల్వేబ్రిడ్జికి నేను నిధులు మంజూరు చేయించా. అంతేకాదు.. నగరంలో మంచినీటిపైపులైన్ పనులకు నా హయాంలో టెండర్లు కూడా వేశారు. అవి ఇప్పడు వీరు చేస్తున్నారంతే. కొత్తగా వీళ్లు పూచిక పుల్ల తీసుకురాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ మూడు కుంపట్లలా కొట్టుకుని అభివృద్ధిని విస్మరించారు. ఆధిపత్యపోరు కోసం కార్పొరేటర్లు, టీడీపీ కేడర్‌ను విభజించి నిత్యం తగవులాడుతున్నారు. కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని ఎంపీ, ఎంపీ కళ్లజోడు తీస్తే తెలుస్తుందని మేయర్, జేసీ చిట్టా మొత్తం నా వద్ద ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ గుట్టు ఎంటో ముగ్గురూ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. సాక్షి: మీరు గెలిచి, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ‘అనంత’: వైఎస్ హయాంలో కేంద్రం నుంచి జేఎన్యూఆర్ గ్రాంటు ద్వారా రూ.72కోట్లతో అనంతపురానికి మంచినీళ్లు తెచ్చాం. ఈరోజు 90శాతం ఇళ్లలో ఆటోల ద్వారా మినరల్ వాటర్ కొంటున్నారు. నేను గెలిస్తే ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీళ్లు ఇస్తాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేసి డంప్‌యార్డు తరలిస్తాం. వైఎస్ హయాంలో కురుగుంట, ఉప్పరపల్లెలో వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మళ్లీ ఇళ్లు లేనివారికి ఇళ్లు ఇస్తాం. ఇళ్లకోసం ప్రభాకర్‌చౌదరి ప్రజల సొమ్ముతో డీడీలు తీయించారు. ఇవేవీ లేకుండా ఇళ్లు ఇస్తాం. సాక్షి: చివరగా మీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుంది? ‘అనంత’: ఎమ్మెల్యేల ఇళ్లే తహసీల్దార్, పోలీసు కార్యాలయాలు అయ్యాయి. మేం అధికారంలోకి వస్తే ప్రతీ ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాని అంతఃకరణ శుద్ధితో చేయగలిగే స్వేచ్ఛ ఇస్తాం. నా అనుభవాన్ని నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తా. 2 ఎంపీ, 14మంది ఎమ్మెల్యేలను గెలిపించండి. జగన్‌కు అవకాశం ఇవ్వండి, సుభిక్షపాలన అందిస్తారు. సాక్షి: మీ ప్రత్యర్థి ప్రభాకర్ చౌదరిపై రెండు మాటల్లో చెప్పమంటే..? ‘అనంత’: కబ్జాకోరు. మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ట్రస్టులు పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. సంఘమిత్రకు 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధం. తీసుకున్నారు. ఇంటివద్దే మునిసిపల్ స్కూలుకు నాటకరంగం పేరుతో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. 5ఎకరాలకుపైగా కార్పొరేషన్ స్థలాలు అమ్మేశాడు. సాక్షి: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మించక పోతే నామినేషన్ వేయనని గత ఎన్నిల్లో ప్రభాకర్ చౌదరి చెప్పారు? ఇప్పుడు మళ్లీ బరిలో ఉన్నారు? ఏమంటారు? ‘అనంత’: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేస్తేనే నామినేషన్ వేస్తా. లేదంటే పోటీ చేయనని 2014లో చెప్పారు. ఇప్పుడు ఇంకో అవకాశం ఇవ్వండని సిగ్గులేకుండా అడుగుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వారి జెండా కింద నిలబడలేని వ్యక్తులు. వీరు సమన్వయంతో జిల్లా, నగరం అభివృద్ధికి పాటుపడతారా? ఆలోచించాలి. ఎంపీగా రంగయ్య, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇ వ్వండి. మూన్నెల్లలోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరు చేస్తాం. ట్రాఫిక్ నిర్మూలన కోసం రింగ్‌రోడ్డు పూర్తి చేసి, మరో టౌన్షిప్ నిర్మిస్తాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఒప్పించి రోడ్ల విస్తరణ చేస్తాం. కేంద్ర నిధులతో తిలక్‌రోడ్డులో సిమెంట్‌రోడ్లు వేయించా. రూ.40కోట్లతో శివారు ప్రాంతాల్లో రోడ్లు వేశాం. రోడ్ల వెడల్పును ఓ సమస్యగా చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సమస్యను సీఎం కూడా పరిష్కరించలేకపోయారు. ఇతను ఒక ముఖ్యమంత్రా? సర్పంచ్ కంటే అధ్వానంగా వ్యవహరించారు. -
రాయలసీమకు నీరిచ్చామనడటం చరిత్ర వక్రీకరణ
రాయలసీమకు నీళ్లందించామని చెబుతున్న టీడీపీ నాయకులు వాస్తవాలను మరుగున పెడుతున్నారు. అసలు విషయాలను వక్రీకరిస్తున్నారు. గాలేరు–నగరి, హంద్రీ– నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించామని అసత్యాలు చెబుతున్నారు. ఈ కరువునేలకు నీళ్లొచ్చాయంటే ఆ ఘనత నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు..వైఎస్ రాజశేఖరరెడ్డిల వల్లేనని మరిచిపోతున్నారు వీరు. తాజాగా తమ నాయకుడు చంద్రబాబు ఘనత వల్ల నీరొచ్చిందని ప్రచారం చేసుకోడానికి వీరికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావడం లేదు. సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అనడానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. బాబు జమానాలో ప్రాజెక్టులను నాన్ ప్రియారిటీ కింద చేర్చడం వల్ల మిగులు జలాలపై హక్కు కోల్పొవాల్సి వచ్చిందన్న విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా? నేడు కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లొచ్చాయంటే అది ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ఘనతేనని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత 36 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధే తన శ్వాసగా, ధ్యాసగా జీవిస్తున్న ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. సాక్షి: సీమకు నీళ్లిచ్చిన ఘనత బాబుదేనంటున్నారు? సీహెచ్ : ఈ మాట అనడానికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులకు నోరెలా వస్తుందో అర్థం కావడం లేదు. చాలా ప్రమాదకరమైన చరిత్ర వక్రీకరణ. ఇది క్షమార్హం కాదు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు 36 సంవత్సరాలు గడిచాయి. ఇంతలోనే టీడీపీ నేతలు చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం దారుణం. సాక్షి: ప్రాజెక్టులు ఎలా వచ్చాయి? సీహెచ్ : 1983లో తెలుగుగంగ ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారు. ఆ ప్రాజెక్టు వల్ల తమకు నీరు రాదని తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ (ఏసీఆర్ఎస్వై), ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులు కృష్ణా జలాల కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమం పట్ల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చాలా పాజిటివ్‌గా స్పందించి తెలుగుగంగతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించారు. అందుకే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి చెందినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇలా వైఎస్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సాక్షి: బాబు హయాంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటీ? సీహెచ్ : చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన రాయలసీమ ప్రాజెక్టులను నాన్ ప్రయారిటీ జాబితా కింద చేర్చడం ద్వారా సీమకు తీవ్ర ద్రోహం చేశారు. 2000 సంవత్సరం నాటికి బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుందని తెలిసినప్పటికీ ఆయన ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కృష్ణా జలాల పునః సమీక్ష నాటికి చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా మిగులు జలాలను కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించేందుకు అవకాశం ఉండేది. సాక్షి: ప్రాజెక్టుల పట్ల వైఎస్ ముందుచూపు ఎలాంటిది? సీహెచ్ : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అప్పట్లో 11500 క్యూసెక్కులు ఉండేది. హెడ్ రెగ్యులేటర్‌తోపాటు పోతిరెడ్డిపాడు–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు గల మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని వైఎస్ 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అలా పెంచకపోతే భవిష్యత్తులో రాయలసీమకు సాగునీరు అందే అవకాశం ఉండదనే ముందుచూపుతోనే ఆయన అలా చేశారు. కాగా అప్పట్లో సీపీఐ మినహా అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వైఎస్ ఎవరని లెక్క చేయలేదు. సాక్షి: దుమ్ముగూడెం–సాగర్ టెయిల్‌పాండ్ పరిస్థితి ఏమిటీ? సీహెచ్ : వైఎస్ చాలా దూరదృష్టితో ఆలోచించారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు సరిపోవని, గోదావరి జలాలను మళ్లించాల్సిన అవసరం ఉందని భావించారు. పోలవరం కూడా మన అవసరాలను తీర్చలేదని ఆయన గుర్తించారు. దుమ్ముగూడెం పాయింట్లో 80 రోజులపాటు వరద ఉంటుంది. ఆ నీటిని నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు మళ్లించాలని వైఎస్ నిర్ణయించారు. సాక్షి: దీనిపై అభ్యంతరాలు రాలేదా? సీహెచ్ : కొందరు నిపుణులు అభ్యంతరాలు చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టులో కొంత, సింగరేణి గనుల భూములు, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కొంత ఆయకట్టు ముంపునకు గురవుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై నాటి వైఎస్ ప్రభుత్వం అధ్యయనం చేయించింది. మునక లేకుండా రీ డిజైన్ చేసి 19521 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించేందుకు పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ 2009 ఫిబ్రవరి 6న జీఓ 22 జారీ చేశారు. ఈ స్కీములు పది ప్యాకేజీల కింద విభజించి ఈపీసీ స్కీమ్ కింద ఏజెన్సీలకు అప్పగించారు. రాష్ట్ర విభజనకు ఆరు సంవత్సరాల ముందే ఇదంతా జరిగింది. సాక్షి : వైఎస్ ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? సీహెచ్: ‘సీమ’ ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గాలేరు–నగరి ప్రాజెక్టు డిజైన్‌లో తొలుత పైడిపాలెం రిజర్వాయర్ లేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకనే పైడిపాలెం రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. జీఎన్ఎస్ఎస్, పైడిపాలెం, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులు అత్యంత వేగంగా ముందుకు సాగాయి. ఆయన హయాంలో 80 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి. -
అవగాహన ఉంది... ఆచరణలో పెడతా..
పంచాయతీ సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు... జెడ్పీటీసీగా గెలిచారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని అధిరోహించారు. అటు తరువాత ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన యువనాయకుడతను. ఎవరు అధికారంలో ఉన్నా... లౌక్యంతో మెలిగారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. నాడు రాజన్న పాలన చూశారు. ఆయనలోని సంక్షేమ గుణాన్ని గుర్తించారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు జగనన్నను అనుసరిస్తున్నారు. ఆయనే బడ్డుకొండ అప్పలనాయు డు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అలా మొదలైంది... 1989 నుంచి గ్రామ స్థాయి రాజకీయాల్లో మా అన్నయ్య జనార్దన్‌నాయుడు సర్పంచ్‌గా ఉండే వారు. అప్పటినుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొన్నాను. 1991లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా ను. గ్రామాల్లో మద్యపానం, పేకాట వంటివి కంట్రోల్ చేశాను. అక్కడినుంచి తిరిగి చూసుకోలే దు. వరుసగా మా కుటుంబంలోనివారే విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత జెడ్పీటీసీగా గెలిచా ను. 2006, ఫిబ్రవరి 5న జిల్లాపరిషత్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశాను. 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. చివరి నిమిషంలో మహానేత రాజశేఖరరెడ్డి నన్ను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. ఆ పోటీలోనూ గెలిచాను. బొత్స సత్యనారాయణ నా వెనుక ఉండి నడిపించారు. దివంగత నేతను కోల్పోయాం. 2014లో నన్ను రమ్మని టీడీపీ వాళ్లు ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ తరఫునే పోటీచేశా... అయినా 23,500 ఓట్లు పడ్డాయి. జగనన్న బాటలో... వైఎస్సార్సీపీలో చేరిన తరువాత మా నాయకుడు జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన ప్రతీ కార్యక్రమాన్నీ విజయవంతం చేశాను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింట ప్రచారం చేశాను. మాకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్లున్నారు. పెద్దలు బొత్స సత్యనారాయణ, సాంబశివరాజుల సహాయంతో ముందుకు నడుస్తున్నాను. నియోజకవర్గంలో ఏం చేయాలో అవగాహన ఉంది. గెలిపిస్తే అవన్నింటినీ ఆచరించి చూపిస్తా. బాబు పథకాలన్నీ పచ్చనేతలకే... చంద్రబాబు చెపుబుతున్న పసుపు, కుంకుమ పచ్చ నేతలకే అందుతున్నాయి. రైతు రథాలు నిజమైన రైతుకు ఇవ్వలేదు. వారి పార్టీలో ఉండి... ఎవరైతే కమీషన్లు ఇచ్చారో వారికే అందించారు. జన్మభూమి కమిటీ అనేది ఒక బ్రోకరు కమిటీ. ఒక దళారీ కమిటీ. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలతో మహిళల పసుపు–కుంకుమలు చల్లగా ఉండవు. బెల్ట్ షాపులన్నీ తీసేస్తామని చెప్పారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 మద్యం బెల్ట్‌షాపులున్నాయి. ఈ ప్రభుత్వంలో నాలుగు మాసాల నుంచి ఉపాధి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బునే బహుశా పసుపు కుంకుమగా అందిస్తున్నారేమో. వైఎస్ హయాంలో 108కి ఫోన్ చేసిన వెంటనే వచ్చేది. ఇప్పుడలా లేదు. ఇవన్నీ వారి వైఫల్యాలకు నిదర్శనాలే. నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు, మనవడు కలిసి మూడు తహసీల్దార్ కార్యాలయాలను పంచుకున్నారు. ప్రతీ దానికి ఒక రేటు పెట్టారు. ముఖ్యంగా పాత రోజుల్లో వేసిన లే అవుట్ల యాజమానులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దోచుకో దాచుకో అన్న చందంగా వ్యవహరించారు. ఆ ఎమ్మెల్యే హయాంలో ఇటు పూసపాటిరేగకు, అటు భోగాపురానికి, ఇటు డెంకాడకు చెందకుండా ప్రభుత్వాస్పత్రిని నిర్మించారు. అది ఎవరికీ ఉపయోగం లేదు. నా హయాంలో ఏ గ్రామానికి ఏం చేశానో చెప్పగలను. వీళ్లు చెప్పలేరు. ఇళ్లు కూడా ముఖాలు చూసి ఇచ్చారు. ఇక్కడి మత్స్యకార ప్రాంతాలున్నాయి. వారికి జెట్టీలు కావాలని అడుగుతున్నారు. నేను వచ్చిన తరువాత అవన్నీ పూర్తి చేస్తాను. పరిశ్రమల వ్యర్థాలతో పడుతున్న అవస్థలను సైతం గట్టెక్కిస్తా. ఇక్కడివారు వలసలు వెళ్లకుండా నిరోధిస్తాను. ఇటీవలే జిల్లా మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి వెళ్లిపోయి అక్కడి వారి చెరలో చిక్కుతున్నారు. ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణకు చెప్పడంతో విజయసాయిరెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. మాటతప్పని నేత జగన్ జగన్మోహన్రెడ్డిలో చక్కనైన వ్యూహం ఉంది. ఏం చేస్తే ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తారు. దానినే ఆచరిస్తారు. ఏ నాయకుడైనా పది మందికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టేది చేయకూడదు. జగన్ ఆలోచనలతో ఈ రాష్ట్రం పురోగమిస్తుందన్న నమ్మకం ఉంది. ఆయన మా ట తప్పరు.. మడమ తిప్పరు. ఏ సమస్య అయినా ఆయన వింటారు. ఎన్నో సర్వేలు చేసి నాకు సీటు ఇచ్చారు. ఆయన సూచనలతోనే కార్యక్రమాలు చేస్తాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను. జగన్‌లో పట్టుదల ఉంది జగన్మోహన్రెడ్డి చాలా పట్టుదలగల వ్యక్తి. ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. తల్లిని, భార్యను కుటుంబాన్ని వదిలి 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరికీ సాధ్యం కాదు. రాజశేఖరరెడ్డిని నేను దగ్గరగా చూశాను. ఆయన లక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయి. ఏదీ ఆషామాషీగా చెప్పరు. అవగాహనతోనే ప్రకటిస్తా రు. ఎక్కడ పరిశ్రమలున్నాయో స్థానికంగా ఉన్న వారికి 75 శాతం మందికి ఉద్యోగాలు కల్పించాలని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతానికి అశోక్చేసిందేమీ లేదు అశోక్‌గజపతిరాజు ఎంపీ అయితే జిల్లాకు పరిశ్రమలు తీసుకు వచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తాడనుకున్నాం. కానీ ఆయన ఆ మునిసిపాలిటీకి కూడా న్యాయం చేయలేదు. తన కోటకు మాత్రం కొత్త హంగులు సమకూర్చుకున్నారు. ఎంపీ ల్యాండ్స్ ఏం చేశారో తెలియదు. ఎయిర్ పోర్ట్ భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు నగదు అందలేదు. అడిగితే కేసులు బనాయిస్తున్నారు. రైతులకు రావాల్సిన డబ్బుల్లో కూడా కమీషన్లు లాక్కున్నారు. టీడీపీ ఏది చేసినా అవినీతే. నారాయణస్వామినాయుడుకు పదవీ వ్యామోహం ఉంది కాబట్టి వయో భారం వచ్చినా ఇంకా పోటీకి దిగారు. -
బాబోయ్.. కొంపకొల్లేరు
సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి మంతెన వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లేరుపై పలు అధ్యయన కమిటీలు వేసినా.. నివేదికలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంటూర్ కుదింపు సాధ్యం కాదని, ఇలాంటి హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని, కొల్లేరు సమస్యకు ఇది పరిష్కారం కాదని స్పష్టం చేశారు. 5వ కాంటూర్ వరకూ కొల్లేరును అభివృద్ధి చేయాల్సిందేనని, కొల్లేరు జాతీయ సరస్సుగా గుర్తింపు పొందినప్పుడే దీనికి ప్రాముఖ్యం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని స్పష్టం చేశారు. సాక్షి : కొల్లేరు సరస్సుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతంలో చేపల చెరువులు భారీగా తవ్వడం వల్ల సరస్సు కుచించుకుపోయింది. 1971లో ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం సంతకం చేసింది. దానిలో కొల్లేరు సరస్సు పరిరక్షణ కూడా ఉంది. సాక్షి : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రాలేమా? సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రావడం సాధ్యం కాదు. వస్తే ప్రపంచ దేశాలు వెలివేస్తాయి. మంచినీటి సరస్సును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులను పరిరక్షించేందుకు రామ్సర్ ఒప్పందం జరిగింది. సాక్షి : కొల్లేరుపై జీఓ 120 ఎందుకు విడుదల చేశారు. సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందాన్ని అమలు జరిపేందుకే కొల్లేరును అభయారణ్యం చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు 120 జీఓను విడుదల చేశారు. జీఓను అప్పటి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జీఓను అమలు జరిపితే కొల్లేరు సరస్సు పరిరక్షణ సాధ్యమవుతుంది. సాక్షి : అభయారణ్యం పరిధిలో కొల్లేరు సమస్య ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సును 5వ కాంటూర్ వరకూ గుర్తించి ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణించారు. అభయారణ్యం పరిధిలో 72 వేల ఎకరాల భూమి ఉంది. దీనిలో ప్రైవేటు వ్యక్తుల భూమి(జిరాయితీ) 14 వేల ఎకరాలు ఉంది. ప్రైవేటు వ్యక్తుల భూమి ఉన్నప్పుడు అభయారణ్యంగా గుర్తించకూడదు. సాక్షి : కొల్లేరు జిరాయితీ రైతుల పరిస్థితి ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరులోని జిరాయితీ రైతులకు నష్టపరిహారం కేంద్రమే ఇవ్వాల్సి ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ భూములకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. పోలవరం నిర్వాసితులకు చెల్లించినట్టే జిరాయితీ రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది. సుమారు రూ.4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా రూ.1,000 కోట్లు చెల్లించినా సరిపోయేది. కానీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కొల్లేరు భూస్వాములు అయినా.. తినడానికి తిండిలేక, పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని దుస్థితిలో ఉన్నారు. జిరాయితీని ఎటూ తేల్చలేకపోవడం దారుణం. సాక్షి : కొల్లేరుపై వేసిన కమిటీల నివేదికలపై చర్యలు తీసుకున్నారా? సూర్యనారాయణరాజు : కొల్లేరుపై పదికిపైగా కమిటీలు వేశారు. కొల్లేరు పరిరక్షణకు చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై నిపుణుల కమిటీని కూడా వేశారు. కమిటీల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. అజీజ్ కమిటీ నివేదిక అమలుచేస్తే కొల్లేరు సరస్సుకు, జిరాయితీ రైతులకు మేలు జరుగుతుంది. సాక్షి : కొల్లేరును రక్షించాలంటే ఇంకేమి చేయాలి? సూర్యనారాయణరాజు : కొల్లేరును రక్షించాలంటే ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. రెండు మూడు రెగ్యులేటర్ల నిర్మాణం వల్ల ఉపయోగం లేదు. సముద్రపు ఆటుపోట్లు ఉప్పుటేరు ద్వారా ప్రవహించాల్సి ఉంది. ఆ విధంగా జరిగినప్పుడే ఉప్పుటేరు, కొల్లేరు సంరక్షణ సాధ్యం సాక్షి : సరస్సు కాలుష్యాన్ని అరికట్టలేమా? సూర్యనారాయణరాజు : సరస్సు కలుషితం కాకుండా ఉండేందుకు ఇంజినీర్ రామకృష్ణంరాజు సూచనలు పాటిస్తే బాగుంటుంది. కొల్లేరు చుట్టూ డ్రెయిన్లు తవ్వి, ఆ నీరు ఉప్పుటేరులోకి చొచ్చుకుపోయేలా తప్పక చర్యలు తీసుకోవాలి. సాక్షి : ఇంకిపోతున్న కొల్లేరుకు పరిష్కారం? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి నదుల నీరు వివిధ కాలువల ద్వారా చొచ్చుకువస్తుంది. పట్టిసం ఎత్తిపోతల పథకంతో కొల్లేరులోకి నీటిప్రవేశం తగ్గిపోయింది. కొల్లేరులోకి చొచ్చుకువచ్చే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు తదితర పంట కాలువల ఇన్‌ఫ్లోలను అభివృద్ధిచేయాలి. సాక్షి : రెగ్యులేటర్ల నిర్మాణ ఆవశ్యకత ఎంత? సూర్యనారాయణరాజు : కొల్లేరులో 5వ కాంటూర్ వరకూ నీరు నిలబడినప్పుడే సరస్సు ఉనికి ఉంటుంది. అందుకోసం ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. దీనిద్వారా కొల్లేరులో నీటి మట్టం పెరిగి సరస్సులోకి పక్షుల రాకపోకలు పెరుగుతాయి. సాక్షి : కొల్లేరు పరిరక్షణకు శాశ్వత మార్గం? సూర్యనారాయణరాజు : కాంటూర్ కుదింపు కొల్లేరు పరిరక్షణకు సరైన పరిష్కారం కానేకాదు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని ఆసియా ఖండంలోనే విశిష్టమైన మంచినీటి సరస్సును కాపాడుకోవాలి. -
‘చంద్రబాబు టెన్షన్లో ఉన్నారు’
సాక్షి, నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ గ్రామంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించనున్న వైఖరిపై, ప్రస్తుత రాజకీయా పరిణామాలపై ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసిందని.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేసారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్‌పై పెద్దగా ఆశలు లేవని.. తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గిపోతుందని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగడం లేదని వ్యాఖ్యానించారు. అందువల్ల జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించనున్నాయని.. అందుకోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. కేసీఆర్ ఫ్రంట్‌పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దు అని చంద్రబాబు అన్న మాటను గుర్తుచేశారు. నాలుగేళ్లుగా దేశానికి బీజేపీనే అవసరమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు స్వార్ధం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆదరణ కోల్పోయిన చంద్రబాబు టెన్షన్లో ఉన్నారని తెలిపారు. తెలంగాణ క్యాబినేట్‌పై ఎదురైన ప్రశ్నపై స్పందించిన ఆమె.. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : సాక్షి : పాదయాత్ర మీ కుటుంబానికి కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేశారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వారందరూ అధికారంలోకి వచ్చారు. మీరూ వస్తారని ఆశిస్తున్నా. గత 14 నెలలుగా చేస్తున్న పాదయాత్రలో మీరు చాలా విషయాలపై మాట్లాడారు. స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రాలేదని బయట అనుకుంటున్నారు. కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా.. రాజకీయాలు వదిలేసి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాటం నుంచి దూరమయ్యారన్న విమర్శ ఉంది. మీరు ఏమంటారు? జగన్ : పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. పోరాటం అసెంబ్లీలో 2014 నుంచి చేస్తూనే ఉన్నాం. చివరకు 2017 దాకా కూడా చేశాం. అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించగలిగాం. కానీ, ఆ అసెంబ్లీ పనితీరులో ప్రజాస్వామ్యం అసలు ఉందా? లేదా? అన్నట్టుగా తయారైంది. ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా అధికార పార్టీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించలేదు. వారి రాజీనామా కోసం అసెంబ్లీలో ఒత్తిడి చేశాం. దాదాపు రెండేళ్ల పాటు వేచి చూశాం. 2014లో శాసనసభ మొదలైతే ఆ ఏడాది చివరి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పశ్చాత్తాపం గానీ చేసింది తప్పనే భావన గానీ ఎక్కడా లేకుండా పోయింది. అదే తప్పును నిస్సిగ్గుగా వరుసగా చేయడం మొదలు పెట్టారు. చివరకు ఆ సిగ్గు లేని తనం ఏ స్థాయికి చేరిందంటే వాళ్లల్లో నలుగుర్ని ఏకంగా మంత్రులను కూడా చేశారు. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది. చట్టసభలకు మనం ఎవరమైనా వెళ్లేది ఎందుకంటే చట్టాలను చేస్తామని. ప్రజలు మనవైపు చూసేది అందుకే. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సాక్షి : ప్రతిపక్షం లేని శాసనసభలో ప్రత్యేక హోదా మొదలు పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మీరు మీ పాదయాత్ర ద్వారా సమాధానం ఇచ్చామనుకుంటున్నారా? జగన్ : తప్పకుండా.. అసెంబ్లీలో ఉన్నా అంతకన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. అసెంబ్లీలో అయితే అది కూడా ఇవ్వనివ్వరేమో... ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎలాగూ ఖూనీ అయిపోయింది. 2014 నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక వ్యవస్థను ఆ స్పీకర్ అనే వ్యక్తే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించరు. ఏదైనా మాట్లాడబోతే మైకులు కట్ చేస్తారు. అడుగడుగునా అవాంతరాలు కల్పిస్తారు. అటువంటి పరిస్థితుల్లో జనం మధ్యనైనా మేము చెప్పదలచుకున్నది ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పగలుగుతాం. బాధితులు ప్రజలు. ప్రజల దగ్గరకే మేము పోతున్నాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అక్కడ జరిగిన అన్యాయాలు.. రాజధాని దగ్గర్నుంచి మొదలుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వరకు, చివరకు ఆయన ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ.. దాన్నే ధర్మపోరాట దీక్షలుగా మళ్లీ అభివర్ణిస్తూ ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారో, మోసం చేస్తున్నారో అవన్నీ ప్రజలకు అసెంబ్లీలో కన్నా మంచిగా వివరించగలిగాం. ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు మాదిరి బుక్కులు బుక్కులు తయారు చేయను. కులానికో పేజీ పెట్టి, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలన్న ఆరాటంతో మేనిఫెస్టో చెయ్యను. నా మెనిఫెస్టో ఒకటి.. మహా అయితే రెండు పేజీలుంటాయి. ఆ మేనిఫెస్టోలో అంశాలు ఇవీ అని ప్రజలకు చూపించి, ఓట్లు వేయించుకున్న తర్వాత నేను అది అమలు చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు మనస్తత్వం నాకు లేదు. నాకు అపారమైన విశ్వసనీయత ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే, చెయ్యగలిగితే ప్రజలకు మంచి చేస్తాను. సాక్షి : శాసనసభలో మీ సభ్యుల్ని కొనుగోలు చేసినట్టే లోక్‌సభలోనూ మీ సభ్యుల్ని టీడీపీ కొనుగోలు చేసింది. అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి చేసినట్టుగా లోక్‌సభ స్పీకర్‌పై అంత ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదన్న విమర్శ ఉంది? జగన్ : అక్కడా, ఇక్కడా తీవ్రంగానే ఆక్షేపించాం. తప్పుబట్టాం. అక్కడా ఇక్కడా అదే పరిస్థితి. టీడీపీ, బీజేపీలు ఇద్దరూ కలిసి నాలుగేళ్లు సంసారం చేశారు. అక్కడ వాళ్లు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని తొక్కిపెట్టారు. సాక్షి : ఇప్పుడు విడిపోయామంటున్నారు, ఇప్పుడైనా చర్య తీసుకుని ఉండాల్సింది కదా? జగన్ : ఆ మేరకు వ్యవస్థలు దిగజారిపోయాయి. బహుశా బీజేపీకి, చంద్రబాబుకు మధ్య లోపాయికారిగా సంబంధాలు కొనసాగుతున్నాయేమో.. సాక్షి : చంద్రబాబు నాయుడు తాజాగా మీ మీద చేసిన ఆరోపణ.. సీనియర్ మోదీ కేసీఆర్ అయితే జూనియర్ మోదీ మీర (జగన్)ని. అసలు మోదీ, సీనియర్, జూనియర్ మోదీలు ముగ్గురూ ముసుగులు తీసి కలిసి పోటీ చేయండంటున్నారు. మీరేమంటారు? జగన్ : మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఒకటుంది. అసలు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారు? చేశారు? 2014 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మా మీద యుద్ధం చేశారు. అప్పుడు వారన్న మాటలు కూడా చూడండి. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు వేసినట్టే అని చంద్రబాబు అన్నాడు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు. తనకున్న ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం కూడా చేయించారు. ఆ తర్వాత ఏమి జరిగింది? 2014 ఎన్నికలు అయిపోయాయి. 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదేళ్లలో మేము ఎక్కడా కాంగ్రెస్ పార్టీతో కలవలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశాడు. ఆ సమయంలో బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ పరస్పరం విపరీతంగా పొగుడుకున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడం, చంద్రబాబు కోరిక మేరకు ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చెప్పడం.. దానికి ఏకంగా అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడు తీర్మానాలే చేసి బీజేపీని పొగడడం, చివరకు 2017 జనవరి 27న ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిందనడం, చేసి ఉంటే చెప్పండని ప్రతిపక్షాలను సవాల్ చేయడం జరిగింది. ఆ దశ వరకు ఆ ఇద్దరూ చిలకా గోరింకల్లా సంసారం చేశారు. కేవలం ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయనగా చంద్రబాబు నాయుడు తాను చేసిన మోసాలకు, అన్యాయాలకు, అవినీతి, అబద్ధాలకు ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలని బలిపశువు కింద కేంద్రంపై ఆరోపణలు నెట్టేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీని ఆవేళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అన్యాయంగా విభజించిందని చెప్పిన వ్యక్తి, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అన్న వ్యక్తి, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి మళ్లా వస్తుందన్న ఇదే పెద్దమనిషి తానే కంకణం కట్టుకుని అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి అబద్ధాలు చెప్పారో ఈవేళ కూడా.. అదే ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయుడు గొప్పగా పాలిస్తాడు, గొప్పగా మేలు చేస్తాడనే పాత హామీలనే మళ్లీ తెరపై చూపిస్తున్నాడు. ఏదైనా ఆరోపణ చేయాలంటే దానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. కానీ చంద్రబాబు చేసే వాటికి అటువంటివేమీ ఉండవు. ఆ మనిషి ఏది చెప్పాలనుకుంటే అది చెబుతాడు, తాను ఏది చేస్తే అది కరెక్టు, అలా కాదన్నవాళ్లపై బురద జల్లుతారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన అనైతిక పొత్తుల్లోనే కాదు.. నాలుగున్నరేళ్ల పాలనలోనూ అదే కనిపిస్తుంది. ఆయన నైజమే అంత. ఎన్నికలప్పుడు రైతులకు 87,612 కోట్ల రూపాయల పంట రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈవేళ ఏమైంది? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణ మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబూ ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటీ? ఆయన చేసిన మోసంతో రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాకపోగా సున్నా, పావలా వడ్డీలకు రుణాలు రాకుండా పోయాయి. సున్నా, పావలా వడ్డీల కోసం గత ప్రభుత్వాలు వీళ్ల తరఫున వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ఆ డబ్బుల్ని కట్టకుండా అన్యాయం చేశాడు. ఆయన చేసిన మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఏ చదువు లేకపోయినా పర్వాలేదమ్మ.., ఇంటింటికీ ఉద్యోగమో, ఉపాధో చూపిస్తా. లేకుంటే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ రెండు వేలూ పోయే, ఉద్యోగాలూ రాలేదు, చివరకు ఉద్యోగాలు వచ్చేందుకు అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రత్యేక హోదానూ ఖూనీ చేశారు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, మోసాలే. దారుణమైన పరిపాలన. ఎదుటి వాళ్ల మీద బురద జల్లడం, మీడియా మేనేజ్మెంట్ వంటి అన్యాయమైన పాలన చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు దాన్ని ఖూనీ చేశాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని, అదేమన్నా సంజీవినా అన్నాడు. హోదా అంటే జైల్లో పెడతాను. పీడీ యాక్ట్ తెరుస్తాను అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాట్లాడితే ఇక ప్రత్యేక హోదా సాధన ఎలా జరుగుతుంది? కాబట్టి వీళ్ళందరూ మోసం చేశారు. అలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. హోదాకు మద్దతుగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని కూడా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా కోసం మన 25 మంది ఎంపీలు వినిపిస్తున్న వాణికి మరో 15 మంది తోడవుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చిన ప్రత్యేక హోదా కావాలని అడిగే స్వరం 25 నుంచి 42 మందికి పెరిగింది. ఆ అడుగు వేసేందుకు కేసీఆర్ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. సాక్షి : తెలంగాణ ఫలితం చూశారు కదా.. మీకు ఏమనిపించింది? జగన్ : ప్రజలు చంద్రబాబు అనుకున్నంత పిచ్చోళ్లు కాదు. అది చంద్రబాబుకు అర్థం అయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పారు. బయటి నుంచి ఎవరైనా మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే ఏమిటీ వ్యవస్థ అనిపిస్తుంది. రాజకీయ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఈ రాజకీయ నాయకుల్ని ఎలా క్షమించగలం అనేలా వ్యవస్థను దిగజార్చారు. అటువంటి అన్యాయమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థను దిగజార్చి మళ్లీ అవే అబద్ధాలతో తెలంగాణకు వెళ్లి అవే మాటల్ని చెబితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నిజంగా చైతన్యవంతులు కాబట్టి.. జరుగుతున్నది చూస్తున్నారు కాబట్టి.. అనైతిక పొత్తులకు, అనైతిక వ్యవహారాలకు తెర దింపే విధంగా తీర్పు ఇచ్చారు. అత్యధికంగా ఆంధ్రా సెటిలర్లు ఉన్న ఏరియా హైదరాబాద్. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు 40, 50, 60 వేల తేడాతో గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లోనే ఓడిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లే ఓటేయలేదంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు చంద్రబాబుపై ఏ స్థాయిలో కోపం పెంచుకుని ఉన్నారో అనేదానికి అదే నిదర్శనం. సెటిలర్లే ఓటేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు వేస్తారు? సాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చంద్రబాబును ఉద్దేశించి ఒకమాట అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో నేను ఇక మొదలు పెడతానన్నారు? జగన్ : కేసీఆర్ గారు ఏమన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు గానీ వాస్తవం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ గారు ఏదయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడిన మాటల్ని స్వాగతించాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను ప్రధాన మంత్రికి లెటర్ కూడా రాస్తానని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తానన్న మాటలు హర్షించదగినవి. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని చట్టంలో చేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆవేళ రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉన్నా బాగుండేది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ కలిసి ఏమి చెప్పారో ఈవేళ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కలిసి అవే హామీలు ఇస్తున్నారు. సినిమా ఒక్కటే.. యాక్టర్లే వేరు. ఇందులో విరుద్ధ (ఐరానిక్) విషయం ఏమిటంటే ఇద్దరితోనూ కాపురం చేసింది చంద్రబాబే. బీజేపీతో కాపురం చేసి విడాకులు ఇచ్చారు, మళ్లీ కాంగ్రెస్‌తో సంసారం చేస్తున్నాడు. ఇద్దరితోను కాపురం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెసే. మరి ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. తలాతోకా ఉండదు. సాక్షి : మీరు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో ఇలా చెబుతున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నదేమిటి? తాను తెలంగాణకు వెళ్లి పోటీ చేస్తే టీఆర్ఎస్ దాన్ని సెంటిమెంట్‌కు ఎలా వాడుకుందో, ఇక్కడా అదే రీతిలో తెలంగాణ సీఎం వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలవబోతున్నాడని, జగన్, మోదీ, కేసీఆర్ కలవబోతున్నారని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. దానివల్ల ఇక్కడ ఎలాంటి పరిణామాలుంటాయి? జగన్ : అక్కడా కేసీఆర్.. కాంగ్రెస్, మోదీతో విభేదించి పోటీ చేశాడు. మోదీ హైదరాబాద్‌కొచ్చి తిట్టిపోయాడు. కేసీఆర్ కూడా మోదీని తిట్టాడు. కాంగ్రెస్, బీజేపీతో పోటీపడి ఆయన గెలిచాడు. ఎక్కడా కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిందీ లేదు. కలిసి సపోర్ట్ చేసిందీ లేదు. పోనీ ఐదేళ్లలో ఆయన చేశాడా అంటే అదీ లేదు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు బీజేపీతో సంసారం చేశాడు తప్ప, ఆయనేం చేయలేదు. అదే వ్యక్తితో పొత్తు పెట్టుకునేందుకు ఇదే చంద్రబాబు నాయుడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో ప్రతిపాదన చేశానని నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. ‘తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, కలిసి పోటీ చేద్దామని నేను ప్రతిపాదించాను. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. అందుకే నేను కాంగ్రెస్‌తో జత కట్టాన’ని తనంతట తానే చెప్పాడు. ఇది చెప్పి రెండు నెలలు కాలేదు. అక్టోబర్‌లో హరికృష్ణ చనిపోయాడు. ఇది జరిగి నాలుగు నెలలు కాలేదు. అంటే నాలుగు నెలల క్రితం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆయనే సంసిద్ధత వ్యక్తం చేశాడు. అంటే దానర్థమేంటి? కేసీఆర్ మోదీతో లేనట్టే కదా? అలాంటి చంద్రబాబు నాలుగు నెలల తర్వాత చెప్పిందేంటి? ఆయన తప్ప కేసీఆర్, నేను మోదీతో ఉన్నామట. సాక్షి : 2014 ప్రస్తావన తెచ్చారు మీరు. పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి టీడీపీ అధికారంలోకొచ్చింది. అదీ ఒకటి ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో. అప్పట్లో మీరు అలాంటిదేదన్నా చేసుంటే అధికారంలోకి వచ్చుండే వారు. ఇప్పటికైనా పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకు అధికారం చాలా సులభంగా వస్తుందని చెబుతున్నారు. జగన్ : రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు. ఈ పరిస్థితికి ఎవరు కారణమని ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్. ఆ రోజు ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడి, ప్రతీ హామీని మేం నెరవేరుస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇదే పవన్‌కళ్యాణ్ ఊరూరా తిరిగి చంద్రబాబుకు ఓటేయమన్నాడు. ఆయనకు అనుభవం ఎక్కువగా ఉందని, ఆయనిచ్చిన హామీలకు తాను పూచీ అంటూ చెప్పాడు. చంద్రబాబు గురించి చెప్పాడు. మోదీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాడు. ఎన్నికలయిపోయిన తర్వాత జరిగిందేమిటి? ప్రత్యేక హోదా విషయమే కాకుండా, రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, చదువుకున్న పిల్లలను.. అందరినీ చంద్రబాబు ఎలా మోసం చేశాడు? ఆయన మేనిఫెస్టో చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా చేస్తానని ప్రతీ కులాన్ని నమ్మించాడు. తన చేతుల్లో లేనిది కూడా చెప్పి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించాడు. ఎంత నేర్పుగా మోసం చేయగలమన్న దానిపై పీహెచ్డీ చేసి మరీ మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం నోటీసులు రైతుల ఇళ్లకు వస్తున్నాయి. చివరకు ఆయన చేసిన రుణమాఫీ అన్నది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతుల రుణాలు ఆవేళ 87,612 కోట్ల రూపాయలు ఉంటే 2018 వచ్చే సరికి రైతుల రుణాలు 1,26,000 కోట్లకు చేరాయి. వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడయి ఈయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. సాక్షి : మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా ఇస్తానన్న పార్టీకే మద్దతిస్తామంటున్నారు. రాçహుల్ గాంధీ హోదా ఇస్తానంటున్నాడు. కాంగ్రెస్‌తో కలిసిపోతారా? జగన్ : నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇప్పటి వరకూ మేం చాలా మోసపోయాం. హోదా ఇస్తామని అంతా మోసం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ హోదాను చట్టంలో చేర్చకుండా మోసం చేసింది. బీజేపీ చేస్తానని ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. వాళ్లూ మోసం చేశారు. ఎవరో ఏదో చేస్తామని చెబితే నమ్మే పరిస్థితుల్లో మేం లేం. ఏపీ ప్రజలను కోరేది ఒకటే. 25కు 25 ఎంపీ స్థానాలను మనం సొంతం చేసుకుందాం. ఎవరికీ మద్దతునివ్వాల్సిన పనిలేదు. గెలిచిన తర్వాత సంతకం పెట్టు మద్దతిస్తామందాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి హోదాకు సంతకం పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ మద్దతిస్తే.. ఇప్పుడు జరిగినట్టే మళ్లీ వాళ్లు చేతులెత్తేస్తే హోదా ఇవ్వకపోతే ఎవరిని అనగలుగుతాం? సాక్షి : సంతకం పెట్టాలంటే వాళ్లు అధికారంలోకి రావాలిగా? జగన్ : ఆ పరిస్థితి ఉంటేనే. ప్రధాని అయిన ఒకటో రోజో.. రెండో రోజో హోదా ఇస్తానని చెప్పు. అప్పుడు నేనొస్తా. చంద్రబాబునాయుడు మాదిరి నాలుగేళ్లు నిరీక్షించే అవకాశమే ఉండదు. వారమో... రెండు రోజులో ఎప్పుడో చెబితే నేను మద్దతిస్తా. సాక్షి : పోలవరం, అమరావతితో పాటు తాను చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మేం రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ ఆపేస్తాడని చెబుతున్నారు.. జగన్ : అసలు అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? పోలవరం ప్రాజెక్టు పునాది దాటి ముందుకెళ్లలేదు. గట్టుదాటి ముందుకు కదల్లేదు. ఒక బొట్టు నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. డీపీఆర్ ఇంకా అవ్వలేదు. 48 గేట్లకు ఒకే ఒకటి పెట్టారు. ఒకటి పెట్టడానికి రెండు నెలలు పడుతుందట. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇక రాజధాని వ్యవహారం ఓ పెద్ద స్కాం. ఇంతకన్నా పెద్ద స్కాం ప్రపంచంలో ఎక్కడా కన్పించదేమో. రాజధాని ప్రాంతం ఎందుకు ముందుకు కదలడం లేదంటే అది స్కాం కాబట్టే. పర్మినెంట్ అనే పేరుతో రాజధానిలో ఒక్క ఇటుకా పడలేదు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం ఏదీ లేదు. హైకోర్టు భవనం కూడా తాత్కాలికమే. ఆ తాత్కాలిక భవనాల నిర్మాణానికి అడుక్కు రూ.10 వేలు. మళ్లీ భూమి ఉచితంగా వచ్చిందే. ఇక దాని నాణ్యత ఎలాంటిదంటే, బయట మూడు సెంటీమీటర్లు వర్షం పడితే, లోపల ఆరు సెంటీమీటర్లు నీళ్లొస్తాయి. అభివృద్ధి పేపర్ మీదే తప్ప ఎక్కడన్నా కన్పిస్తోందా? తనకున్న ఎల్లో మీడియా సామ్రాజ్యంతో, తనకున్న ఛానళ్లు, పేపర్లతో మభ్యపెట్టేందుకు చేస్తున్న గోబెల్స్ ప్రచారమే తప్ప అభివృద్ధి ఉందా? సాక్షి : అభివృద్ధి గురించి శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా? జగన్ : శ్వేతపత్రాల్లో ఉన్నదంతా పూర్తిగా అవాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో ఏం జరుగుతోందనేది ఏ సామాన్యుడిని అడిగినా చెబుతారు. ఎంత అన్యాయమైన, దౌర్భాగ్యమైన పాలన సాగుతుందనేది అందరూ చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అనే పదానికి అర్థమేంటి? పేదవాడి ఇంట్లో మంచి జరిగితే, పేదవాళ్లకు మంచి జరిగితే, పేదవాడి పొలంలో మంచి జరిగితే, పేదవాడు వెళ్లే స్కూల్లో మంచి జరిగితే, హాస్పిటల్లో మంచి జరిగితే అదీ అభివృద్ధి. ఇలా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అంతా దిగజారిపోయింది. చివరకు పంట పడించే సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనిపిస్తోంది. పంట దిగుబడి తగ్గిన పరిస్థితి ఉంది. దీన్ని అభివృద్ధి అంటారా? ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో పెట్టి ఉంటే కనీసం సుప్రీంకోర్టుకన్నా వెళ్లి దాన్ని అమలు చేయమని అడిగే పరిస్థితన్నా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆ రెండూ చేయకుండా ఆ విధంగా అన్యాయం, మోసం చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా. వాళ్లు అధికారంలో ఉన్నారు.. చేసే హోదాలో ఉన్నారు, చేస్తామని పార్టీ ప్రణాళికలో పెట్టారు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని మాట్లాడారు. మోదీ అయితే ఏకంగా తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. చేసే పొజిషన్లో ఉండి చేయకుండా వాళ్లు రాష్ట్రానికి అన్యాయం చేశారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం సాక్షి : విడిపోయిన రాష్ట్రానికి రాజధాని అవసరం కదా? జగన్: అక్కడ జరిగిన స్కాంలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు. ఫలానా చోట రాజధాని వస్తుందని తనకు తెలిసి ఉన్నా, నూజివీడు ప్రాంతంలో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందంటూ తప్పుదారి పట్టించారు. మేలో తాను అధికారంలో కొస్తే, డిసెంబర్ చివరి దాకా రాజధాని ఎక్కడొస్తుందనేది చెప్పలేదు. కానీ రాజధాని ఎక్కడొస్తుందనేది మాత్రం ఆయనకు, ఆయన బినామీలకు మాత్రం తెలుసు. అందరినీ పక్కదారి పట్టించి, ఆయన, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ ఏకంగా 14 ఎకరాలు కొనుగోలు చేసింది. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అనౌన్స్మెంట్ చేసే మధ్య కాలంలో కొనుగోలు చేశారు. ఎక్కడ రాజధాని వస్తుందనేది తెలిసి రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు ముఖ్యమంత్రి, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ మొదలు పెట్టారు. అదెంత అన్యాయమంటే, తను, తన బినామీల భూములను మినహాయించారు. లింగమనేని అనే వ్యక్తి విషయాన్ని చూస్తే, ఆయన భూముల దాకా వచ్చి ల్యాండ్ పూలింగ్ ఆగిపోతుంది. ఇక్కడేమో లింగమనేని తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. కొంతమంది బినామీలను ల్యాండ్ పూలింగ్‌లో తక్కువ శాతం భూములిచ్చేట్టు వాడుకున్నాడు. ఎక్కువ శాతం బినామీల భూములు పూలింగ్‌కు ఇవ్వకుండా ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ, గుంటూరు జిల్లాలు జోనింగ్ అన్నాడు. తన బినామీలకు చెందిన భూములను రియల్ ఎస్టేట్ జోన్లలో పెట్టాడు. మిగతా రైతులు పోటీకి రాకూడదని వాళ్లను వ్యవసాయ జోన్లో పెట్టాడు. ఆ తర్వాత మరో స్కాం. ఇంకో అడుగు ముందుకేశాడు. తను రైతుల దగ్గర్నుంచి బలవంతంగా సేకరించిన భూమిని తన ఇష్టమొచ్చిన రేట్లకు, ఇష్టమొచ్చినన్ని ఎకరాలు, ఇష్టమొచ్చిన వ్యక్తులకు శనక్కాయలు, బెల్లాలకు కట్టబెట్టాడు. రాజధాని భూముల్లో ఈ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు జరుగుతుంటే ఇవి విచారణకు పోవా? రాజ్యాంగ అవసరాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోనని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. దీన్ని ఓత్ ఆఫ్ సీక్రసీ అంటారు. స్టాక్ మార్కెట్లో ఇలాగే చేస్తే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలా చేస్తే సాధారణంగా బొక్కలో పెడ్తారు. అలాంటి నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తి, ఇంత అవినీతి చేసిన పరిస్థితుల్లో వాటిపై విచారణ కచ్చితంగా జరుగుతుంది. అసలు రాజధాని అంటే ఏమిటనేది ఓ స్పష్టత ఉండాలి. రాజధాని అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు. ఈ మూడు ఎక్కడుంటే అది రాజధాని. మిగిలిందంతా రైతులను ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రిగా ఆయన చేసే పనేంటి? ఎలా సంపాయించుకుని బాగుపడాలని ఆలోచించడం కాదు. రైతులు ఎలా బాగుపడాలని ఆలోచించాలి కదా? రియల్ ఎస్టేట్ చేయాలంటే రైతులకు అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మనమేంటి తక్కువకు తీసుకుని, ఇష్టమొచ్చినవాళ్లకివ్వడం? ఎంటైర్ ల్యాండ్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్. రైతుల దగ్గర్నుంచి అటువంటి పరిస్థితులు లేని భూమి ఉంటే చూడాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా చేస్తే ఫర్వాలేదు గానీ, రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అన్యాయం చేయాలన్న రీతిలో అవినీతి చేయడం నిజంగా దుర్మార్గం. చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే కోడి కత్తి పొరపాటున భుజంపైన తగిలింది. అదే గొంతు మీద తగిలి.. మూడు సెంటీమీటర్ల లోతు తెగితే మనిషి బతికుండే వాడా? ప్రమాదకరమైన పథకం వేశారనేందుకు ఇదే నిదర్శనం. సాక్షి : 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మీ విశ్వసనీయత పెరగడానికి అలవికాని హామీలు నేను ఇవ్వనన్నారు. రైతు రుణమాఫీని సమర్థించనన్నారు. అందువల్ల విశ్వసనీయత పెరిగింది. ఇప్పుడు మీరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు కాకుండా పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాలకు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే వీటన్నింటినీ పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? జగన్ : రైతు రుణమాఫీని నేను సమర్థించను అని నేను ఏనాడూ అనలేదు. అది చెయ్యలేనిది, సాధ్యం కానిదనే ఆ రోజు చెప్పాను. నిజంగా కేంద్రం ముందుకొచ్చి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానంటే నా కన్నా సంతోష పడేవాళ్లు ఎవరూ ఉండరు. బంగారంగా చెయ్యమనే చెబుతాను. కానీ సాధ్యమవుతుందా? కాదా? అనేది తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకూ తెలుసు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఏమిటి? నంబర్ ఏమిటి? ఏమేర చెయ్యగలుగుతాం? చెయ్యలేము అనేది ప్రతిపక్ష నాయకుడిగా నాకూ అవగాహన ఉంది. నాకూ సలహాదారులున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై సరైన అవగాహనతో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగల వ్యక్తులుగా మనం మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా కాగల వ్యక్తులమని చెప్పి ప్రజల దగ్గర ఓట్లడుగుతున్నాం. అలాంటి మనకు విశ్వసనీయత ఉండాలి. మనం ఏదైనా మాట చెప్పి, అది చెయ్యలేకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. చరిత్ర హీనులమవుతామనేది అర్థం కావాలి. దేవుడు ఆశీర్వదించి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మాదిరి ఈ రోజు ఎంత సంపాదించాను, రేపు ఎంత సంపాదిస్తాననే అలోచన కోసం రావడం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం అంతకన్నా లేదు. నాకు ఒక్కదాని మీదే వ్యామోహం ఉంది ఒక్కటే... చరిత్ర సృష్టించాలి. ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్తే ప్రజలకు ఎంత మంచి చేయాలంటే... ఆ మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలనేది నా కల. దాని కోసం తాపత్రయపడుతున్నాను. దేవుడు ఆశీర్వదించి నాతో చేయించగలిగితే అది చేస్తాను. నాతో కుదరదు అంటే నేను తప్పుకుంటాను. ఇంకొకటి లేదు. సాక్షి : రైతులకు తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇలాంటిది ఏమైనా చేస్తారా? జగన్: వీరందరికంటే ముందు రైతు భరోసా అని చెప్పింది మనం. ఈ స్కీమ్ గురించి ఎవరూ చెప్పకముందే నా పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన మా పార్టీ ప్లీనరీలో నవరత్నాల సందర్భంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించాం. తర్వాత కొన్ని నెలల తర్వాత పాదయాత్ర ప్రారంభించా. ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు మే మాసంలోనే ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు ఇస్తామని నవరత్నాల్లో భాగంగా ప్లీనరీలో ప్రకటించాం. వీళ్లెవరూ ఆలోచించకముందే నేను చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర హెక్టారు (1.25 ఎకరాల లోపు భూమి) భూమి ఉన్న కుటుంబాలు అక్షరాలా 42 లక్షలు ఉన్నాయి. అనగా రైతు కుటుంబాల్లో సగమన్నమాట. హెక్టారు వరకూ ఉన్న వారిని తీసుకుంటే ఈ 42 లక్షలకు మరో 19 లక్షల కుటుంబాలు కలుస్తాయి. అనగా సుమారు 60 లక్షల కుటుంబాలు. అనగా మొత్తం రైతుల్లో 70 శాతం మంది హెక్టారు (2.5 ఎకరాల లోపు భూమి ఉన్న)లోపు ఉన్న వారే. అందువల్ల ఎకరాకు ఇంత అని ఇస్తే వీరు ఎప్పటికీ బాగుపడరు. ఆ రోజుల్లో వీళ్లెవరూ చెప్పకముందే రైతుల కోసం మేం రూ.4 వేలు ఇవ్వాలా? రూ.5 వేలు ఇవ్వాలా? రూ.8 వేలు ఇవ్వాలా? అని ఆలోచన చేశాం. అయితే రూ.8 వేలు లేదా రూ.9 వేలు ఇచ్చినా ఇలాంటి చిన్న రైతులకు నేను మేలు చేయలేను. అందువల్లే రైతు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని చెప్పాం. పెద్ద రైతులకు బహుశా మనం ఇచ్చేది పెద్ద ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ చిన్న రైతులకు మనం ఇచ్చే మొత్తం వల్ల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గనుంది. బహుశా చాలా పంటలకు ఉత్పత్తి వ్యయాన్ని మనం ఇచ్చినట్లవుతుంది. అప్పు పుట్టని పరిస్థితిలో ఉన్న పేద రైతులకు రూ.12,500 చేతిలోకి వస్తుంది. రెండోది ఏమంటే ఒకవేళ రుణమాఫీ లాంటి పథకాలకు పోయామంటే అవి రైతులకు చేతికి రావు. బ్యాంకుల్లోకి వెళ్లిపోతాయి. దానివల్ల రైతులకు మానసికంగా అప్పులు తీరిపోయినట్లు అనిపిస్తుందే గానీ రైతు జీవితం బాగుపడదు. ఆ రోజు నవరత్నాల గురించి మాట్లాడిన సందర్భంగా ధరల స్థిరీకరణ నిధి గురించి కూడా చెప్పా. ఈ రోజు చంద్రబాబు అనే వ్యక్తి దళారీలకు కెప్టెన్ అయ్యారు. నువ్వే (చంద్రబాబు) వ్యాపారిగా, దళారీలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు రైతులు ఎన్నడూ బాగుపడలేరు. మేమైతే రూ.3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కరువు లేదా వరదలు వస్తున్నాయి. అందువల్లే రూ.4,000 కోట్లతో విపత్తు సహాయక నిధి తీసుకొస్తామని చెప్పాం. నవరత్నాల్లో ఇవన్నీ ఉన్నాయి. రూ.2,000 కోట్లు రాష్ట్రం పెడితే రూ.2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. సాక్షి : ఆంధ్రప్రదేశ్‌కు మేం రూ.20 వేల కోట్లు ఇస్తే ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు కదా? దీనిని బట్టి ఏమనిపిస్తోంది? జగన్ : 2017 జనవరి 27న చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసినంత మేలు ఏరాష్ట్రానికైనా చేసిందా? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే దాని అర్థం 2014 – 15, 2015 – 16, 2016 – 17 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన సహాయం ఓకే అన్నట్లే. ఎందుకంటే వీళ్లే (టీడీపీవారే) కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో వీరి మంత్రులు ర్యాటిఫై చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు మైక్ పట్టుకుని బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని, మోదీ బాగా చేస్తున్నారని పొగిడారు. 2017 – 18 బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నెల ముందు అంతా బాగుందని మోదీని పొగిడారు. మరి.. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి డబ్బు రాలేదనడం ఏమిటి? నన్ను ప్రేమించే వారెవరైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధపు ఫ్లెక్సీని సృష్టించారు. ఆ ఫ్లెక్సీ మీద గరుడ పక్షి ఫొటో పెట్టారు. ఎవరైనా ఫ్లెక్సీ వేసేవారు గరుడ పక్షిని పెడతారా? మా అమ్మ ఫొటోనో, మా నాన్న ఫొటోనో పెడతారు. సాక్షి : బహుశా సమకాలీన భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల్లో మీరు నష్టపోయినంతగా ఎవరూ నష్టపోయి ఉండరు. వాటిని అడ్డుకోవడానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? జగన్ : రాజకీయ నాయకుడికి తనమీద తనకు నమ్మకముండాలి. ప్రజలమీద నమ్మకముండాలి. దేవుడి మీద నమ్మకముండాలి. ఫలానా ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకో. యూ షుడ్ హావ్ ద కరేజ్.. రాజీనామా చేసి రమ్మను. వచ్చిన తర్వాత బై ఎలక్షన్ కు వెళ్లు. మీ పార్టీ గుర్తుతో గెలిపించుకో. సాక్షి : అది మీరు చేస్తున్నారు.. అన్ని రాజకీయ పార్టీలు అలా చేయడం లేదు కదా.. ఇటీవల మాకు గాంధీభవన్‌లో జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. అందుకే మా శాసనసభ్యులు అమ్ముడు పోతున్నారని ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నారు. ఓ జాతీయ పత్రికలో వార్త వచ్చింది. జగన్ : వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధే అమ్ముడు పోయినప్పుడు కింది వాళ్లను అని ఏం లాభం. ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబునాయుడు మీద 2018లో జూన్ 8, జూన్2న పుస్తకాలు రిలీజ్ చేశారు. నాలుగేళ్ల బాబు అవినీతి పాలన మీద రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి అన్యాయపు పరిపాలనపై చార్జిషీట్ అనే పేరుతో పుస్తకం రిలీజ్ చేశారు. ఇది జరిగి మూడు నెలలు తిరక్క ముందే బాబు అవినీతి సొమ్ములో వాటా ఇవ్వగానే, ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకుని అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. పై వాళ్లకే లేనప్పుడు చిన్న చిన్న ఎమ్మెల్యేలు, చిన్నా చితక లీడర్లకు విలువలుండాలని ఎక్స్పెక్ట్ చెయ్యడం కూడా తప్పే. సాక్షి : మీరు అవకాశం ఇవ్వనందునే రాహుల్ గాంధీ చంద్రబాబుతో వెళుతున్నారని అంటున్నారు? జగన్ :అవకాశం ఇవ్వాలి అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చెయ్యాలి. నీ బలం మీద నువ్వు పోటీ చెయ్యి. ప్రజలను నమ్ముకో. నువ్వు కష్టపడు. ఎవడో సపోర్ట్ చెయ్యాలి, ఎవడి భుజాలమీదో పరుగెత్తాలని అనుకుంటున్నావ్. నువ్వే విలువలను అమ్మేసుకుని, నువ్వే దిగజారిపోయి, రాంగ్ మెసేజ్ ఇచ్చావ్. నీకే విలువలు లేనప్పుడు వాళ్లు అమ్ముడు పోతే తప్పేముంది? సాక్షి : జనవరిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ తరహాలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాడని చెబుతున్నారు. మీరు కూడా ఇచ్చాపురం బహిరంగ సభలో అలాంటి సంచలన ప్రకటన ఏమైనా చెయ్యబోతున్నారా? జగన్ :అలాంటిదేమీ లేదు. అనౌన్స్ చెయ్యడమే ఒక సంచలనం అని ఎందుకనుకోవాలి? ఈ రోజుకు కూడా పాదయాత్ర జరుగుతూండగానే పార్లమెంటరీ వ్యూస్ తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌ను పిలిపించుకుని మాట్లాడుతున్నాం. మేము చేయించుకుంటున్న సర్వేలను బట్టి.. వాటిపై ఒకరికొకరం డిస్కస్ చేసుకుంటున్నాం. సాక్షి : ఎలక్షన్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మీరు తట్టుకోలేరని కదా? జగన్ :బేసికల్లీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే.. ‘సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్’ అని సామెత ఉంది. శ్రీశ్రీ గారు తెలుగులో ఇలాంటివే చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నేను నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరు. నెత్తురు కక్కుతూ నేను నేలకు ఒరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. క్లిక్ అయితే నువ్వు అపర మేధావివి. కాలేదనకో నీకు తొందరెక్కువ.. నీకు దుడుకెక్కువ అంటూ.. ఇవన్నీ సర్వ సహజంగా జరిగేవే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏది చేసినా విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ప్రజలు మన జడ్జిలు, దేవుడు మన జడ్జి అనేది ఎప్పుడూ మరచిపోకూడదు. అదే నేను నమ్ముతా. సాక్షి : ఎప్పుడైనా ఏ మూలనైనా ఎందుకీ రాజకీయాలు అని విరక్తి కలిగిందా? జగన్ : ఒక్కోసారి అనిపిస్తుంది.. కానీ ఇన్ని కోట్ల మంది.. లాస్ట్ ఎలక్షన్స్‌లో 1.30 కోట్ల మంది నన్ను నమ్మి నాకు ఓట్లేశారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా ఆయనకు 1.35 కోట్ల మంది మాత్రమే ఓట్లేశారు. నాకంటే కేవలం 5 లక్షల మందే ఎక్కువ. కోటి ముప్పయి లక్షల మంది నామీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసినప్పుడు కష్టాలు వచ్చినాయి కదా అని వదిలేసి పోతే.. వీళ్లందరికీ అన్యాయం చేసినవాడినవుతానేమోనన్నది ఆల్వేస్ బిహైండ్ మై హెడ్. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రావాలి. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు కూడా వస్తుంది కదా.. బాబు ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. తెలంగాణకు పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యపు పని లేదంటాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తాడు. ఆంధ్రాలోనేమో ఎమ్మెల్యేలను నిర్లజ్జగా కొనుగోలు చేసి నలుగుర్ని మంత్రుల్ని చేస్తాడు. మళ్లీ అదే వ్యక్తి తెలంగాణకు పోయి మరోమాట మాట్లాడతాడు. ఆంధ్ర రాష్ట్రం ఒక మనిషి అనుకుంటే దాన్ని పొడిచెందెవరు? ఒకరు కత్తిచ్చారు. ఇంకొకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మూడో వ్యక్తి పొడిచాడు. ఇందులో ముగ్గురూ నేరస్తులు. అలాంటి వ్యక్తులు కూటమిగా వచ్చినా, విడివిడిగా వచ్చినా ఢీకొంటాం. ఇంతకు ముందు కూడా మేం కాంగ్రెస్, బీజేపీ.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోం. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకమెక్కువ. కాబట్టి ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. హైకోర్టును విభజించండని అఫిడవిట్ ఇచ్చింది బాబే సాక్షి : జగన్‌పై ఉన్న కేసుల విచారణను జాప్యం చేయడం కోసమే హైకోర్టును విభజించారు. హడావుడిగా విజయవాడకు తీసుకొచ్చారనే ఆరోపణపై మీరేమంటారు? జగన్ :అసలు నాకు అర్థం కానిదేమంటే, హైకోర్టుకు, నాకు సంబంధం ఏముంది? హైకోర్టును విభజించాలని, వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని నేను ఎన్నడూ కోరలేదు. నేను ఏనాడూ డిమాండు చేయలేదు. నేను ఏనాడూ లేఖ రాయలేదు. పది సంవత్సరాలు మనకు హైదరాబాద్‌లోనే ఉండటానికి హక్కుంది. నువ్వు అక్కడింత వరకూ పర్మినెంట్ అనే పేరుతో ఒక్క భవనం కట్టలేదు. పర్మినెంట్ అనే పేరుతో హైకోర్టే కట్టకుండా హైకోర్టును షిఫ్ట్ చేయాలని ఏ బుద్ధి ఉన్న వాడూ అడగరు. ప్రతిపక్ష నాయకుని బాధ్యతలో నేనున్నప్పుడు అసలు అడగనే అడగను. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలిసి ఉండి కూడా హైకోర్టును ఎట్టిపరిస్థితుల్లోనూ విభజించండని విజ్ఞప్తి చేస్తూ.. దానికి సంబంధించిన భవనాలన్నీ తయారైపోయాయి.. మీరు షిఫ్ట్ చేయండి.. అని తానంతట తానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదు, అవసరమైతే ఒక భవనం కూడా ఇస్తామని రివర్స్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కారు భవనాలు ఇస్తామని అంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి హైకోర్టు షిఫ్ట్ కావడం ధర్మం కదా? ఎందుకు మీరు షిఫ్ట్ చేయడం లేదు? అంటూ పలానా తేదీ నుంచి షిఫ్ట్ చేయండని కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. ఆ నేపథ్యంలో హైకోర్టు షిఫ్ట్ అయింది. చంద్రబాబు నాయుడి కోరిక మేరకు హైకోర్టు బదిలీ అయితే దాన్ని తిరిగి రాజకీయం చేసి వేరే వాళ్లపై బురద చల్లేందుకు ఉపయోగించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది. ఇంతటి దారుణమైన వ్యక్తి మరొకరు ఉండరు. నేను విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాలు ఆగిపోయాయి సాక్షి : మీపై హత్యాయత్నానికి సంబంధించిన కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. దీనిపై చంద్రబాబు కామెంట్ చేశారు. దీనిని మీరేమంటారు? జగన్: అసలు దాడి ఎక్కడ జరిగింది.. ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వీఐపీ లాంజి అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అలాంటి ప్రదేశంలోకి ఒక కత్తి.. అన్ని సెక్యూరిటీ ప్రమాణాలను దాటి ఎలా రాగలిగింది? అక్కడ పనిచేసిన ఆ మనిషి ఆ కత్తిని ఎలా తేగలిగాడు? ఆ మనిషి తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరుడు హర్షవర్దన్ చౌదరికి చెందిన రెస్టారెంట్లో పని చేయగలిగాడు కాబట్టే ఆ కత్తిని తీసుకుని రాగలిగాడు. ఆ హర్షవర్దన్ చౌదరి 2014లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఆశించారు. ఆయనకు చంద్రబాబునాయుడి దగ్గర నుంచి లోకేశ్ వరకూ చివరకు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ చౌదరి దాకా అందరితో సంబంధాలు ఉన్నాయి. హత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి గతంలోనే హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్నారట. అలాంటి వ్యక్తికి పోలీసులు ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? ఇంకో అడుగు ముందుకెళ్లి చూస్తే మొన్న కోర్టు అడుగుతున్న ప్రశ్నల్లో మరొకటి ముందుకొచ్చింది. నా పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే నాటికే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై హత్యాయత్నం జరిగేంత వరకూ ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు పని చేయలేదట. అంటే దాదాపుగా మూడు నెలల పాటు విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. అదీ కరెక్టుగా ఎప్పుడు పనిచేయడం మానేశాయంటే విశాఖపట్నం జిల్లాలోకి జగన్ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాతే. ఇంత దారుణమైన కుట్ర జరుగుతున్నప్పుడు సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు దారుణం. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నాపై హత్యాయత్నాన్ని వెటకారం చేస్తూ దాడి చేసిన వ్యక్తి జగన్ అనుచరుడని తేల్చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైతే అదీ బ్లూకలర్‌లో ప్లెక్సీ వేస్తాడు. కానీ ఆ ఫ్లెక్సీ ఎల్లో కలర్లో ఉంది. దానిపైన గరుడ పక్షి బొమ్మ పెట్టి మార్ప్డ్ ప్లెక్సీ ఎవడైనా పెట్టగలుగుతాడా? ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పాత ఫ్లెక్సీ మీద తయారు చేయించారు. ఎయిర్ పోర్టులో నాపై హత్యాయత్నం జరిగాక నేను చాలా హుందాగా చంద్రబాబు మీదగానీ, మరొకరి మీదగానీ అనవసరమైన ఆరోపణలు చేయలేదు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం ధర్మం కాదని అన్ని విషయాలు తెలిసిన తర్వాతే మాట్లాడాలని సంయమనం పాటించి మౌనంగా ఉన్నాను. ప్రథమ చికిత్స చేసిన తర్వాత అందరి ముందే చొక్కా మార్చుకుని ఒక్క మాట మాట్లాడకుండా హైదరాబాద్‌కు వచ్చి నేరుగా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నా. దాన్ని కూడా ఏ రకంగా చిత్రీకరించారంటే అన్యాయంగా మాట్లాడారు. అసలు దీని వెనుక ఎవరున్నారు? కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా రాగలిగింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోలీసుల చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? బాబు, పవన్‌లు ముసుగు తీసి కలిసి రండి.. సాక్షి : మరి ఆయన (మోదీ) నిస్సహాయతను ఏమనుకోవాలి? జగన్ : ఇక్కడ ఎన్ని స్కామ్‌లు చేసినా, కుంభకోణాలు చేసినా మోదీ మాత్రం మన చంద్రబాబే కదా? పోనీలే అనుకుంటూ వదిలేసిన పరిస్థితులూ కనిపిస్తున్నాయి. సాక్షి : తాను, పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్‌కు ఎందుకు బాధ అని చంద్రబాబు అంటున్నారు.. జగన్ : నాకెక్కడ బాధండీ. నాకసలు బాధ లేదు. నేను వాళ్లను కలవమనే చెబుతున్నాను. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? ఇంతకు ముందు కలిసి మీరు పోటీ చేశారు. ఇప్పుడు విడిపోయినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ముసుగు తీసేసి కలిసికట్టుగా రండయ్యా.. నాకు భయం లేదు. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఇవ్వాళ కూడా నేను ఒక్కడినే పోటీ చేస్తానని చెబుతున్నా. మీరందరూ మళ్లీ కలిసి రండయ్యా అని చెబుతున్నా. పొత్తులు ఏమీ ఉండవని చెబుతున్నా. అసెంబ్లీలో రాజ్యాంగానికి ఏకంగా తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రులను చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము మళ్లీ శాసనసభలోకి ప్రవేశిస్తే దాన్ని కూడా అంగీకరించినట్టే అవుతుంది. అధికార పార్టీ ఈ మాదిరిగా చేసినా కూడా ఆమోదయోగ్యనీయమే అనే స్థాయికి ప్రజాస్వామ్యం వెళ్లిపోతుంది. అందువల్ల దీనికి ఎక్కడో చోట పుల్‌స్టాప్ పెట్టాలి. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. అప్పుడే ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు వస్తాయి. అందుకే ఏకంగా ప్రజల వద్దకే వెళ్లి ఈ విషయం చెబుదాం అని పాదయాత్రకు శ్రీకారం చుట్టాం. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా నేషనల్ మీడియా కూడా దీనిపై దృష్టి సారించేలా చేశాం. – వైఎస్ జగన్ -
అభివృద్ధి అంటే.. ఏంటో చూపిస్తా
సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో నాయకులు విఫలమవుతున్నారు. వారికి భిన్నంగా పాలన సాగిస్తా. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దమే నా లక్ష్యం’ అని ప్రజాకూటమి అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అంటున్నారు. ఎన్నికల ప్రచారం.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.. ఎలా ఉంది? రాజకీయాలు నాకు కొత్తేమి కాదు. పరోక్షంగా 30ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అందువల్ల పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజల నుంచి స్పందన చూసి అశ్చర్యపోయాను. మేయర్ నరేందర్ పాలనపై వారికి ఉన్న అసంతృప్తితోనే నేను గెలుస్తానన్న ధీమా వచ్చింది. అభ్యర్థి ఎవరు అన్న విషయం కాకుండా ఎలాంటి వాడు అన్న అంశాన్నే చూస్తారు. మీరు గెలిచిన తర్వాత కలవాలంటే ఖమ్మం వెళ్లాలనే ప్రచారం జరుగుతోంది కదా? ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కావాలనే ఈఅసత్యపు ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టింది వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో.. చదువు సైతం వరంగల్ నగరంలోనే సాగింది. దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో చదువుతుండగా చదువును మధ్యలో ఆపివేశాను. నేను వ్యాపారపరంగా ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటాను. వ్యాపార సౌలభ్యం కోసం ఖమ్మంలో స్థిరపడ్డాను. వరంగల్, హన్మకొండలో ముగ్గురు సోదరులు, కుటుంబ సభ్యులంతా ఉంటున్నారు. రాజకీయాల్లోకి ఎందుకు రావాలకున్నారు.. ఏం చేస్తారు? గ్రానైట్ వ్యాపారంలో ఉంటూనే సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. లాభాపేక్షతో కాకుండా వచ్చి న దానిలో కొంత సామాజిక, దైవ కార్యాలకు వినియోగించాలని అనుకున్నా. అందువల్లే ఆదివాసీ ల ఆరాధ్యదైవమైన సమ్మక్క–సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణంలో గ్రానైట్‌ను వేయించాను. ఢిల్లీ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న స్మారక స్థూపం కోసం అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు 230 టన్నుల గ్రానైట్ ఏకరాయిని సరఫరా చేశా. అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టంగా ఉందా..? అదేం లేదు. గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దీంతో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట పెద్దగా స్పందన వస్తోంది. అధికార పార్టీ కావడంతో కొంత మంది భయపడి ప్రత్యక్షంగా ప్రచారంలోకి రావడం లేదు. అంతర్గతంగా ప్రచారంభారీగా సాగుతోం ది. టికెట్ ఖరారు కావడంలో జరిగిన జాప్యం వల్ల ప్రచారం ఎక్కువ రోజులు చేయలేక పోయా ను. కొండా దంపతుల అండదండలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాబలం తనకు ఉంటే చాలు. అయినప్పటికీ ప్రభుత్వంతో పాటు మేయర్‌పై ఉన్న అసంతృప్తితో తప్పక గెలుస్తానన్న నమ్మకం ఉంది. నగర అభివృద్ధిపై మీ కామెంట్? గ్రేటర్ వరంగల్ మేయర్‌గా నరేందర్ పూర్తిగా వైఫల్యం చెందినట్లు భావిస్తున్నా. గెలిచి మూడేళ్లు కావొస్తున్నా అనుకున్న విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడలో ఆయన ఫెయిలయ్యారు. కేంద్రం నుంచి అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీల కింద, రాష్ట్రం నుంచి బడ్జెట్లో కేటాయించిన రూ.900కోట్లకు పైగా నిధులు వచ్చినా అందులో 10శాతం ఖర్చు చేయలేకపోవడమే ఆయన పనితనానికి నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో పదేళ్లు నియోజకవర్గ అభివద్ధి వెనక్కి పోయినట్లే. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద నేతలున్నారు. మేయర్ పదవి ఉండగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం ఆయన అత్యాశకు నిదర్శనం. -
దయగల వాడే మా " దయన్నా"
సాక్షి, పాలకుర్తి: తన ఇంటికి సమస్యలతో సహాయం కోసం వచ్చిన వారికి చేయలేనని చేప్పకుండా సహాయం చేసే మహానాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆందుకే అక్కడి ప్రజలందరూ ఆయనను దయగల వాడే మా " దయన్నా" అంటారు. పాలకుర్తి నియోజకవర్గం సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, దశాబ్దాలుగా బీళ్లు మారిన భూములకు సాగునీరందించి సస్యశ్యామలం చేస్తానని టీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడిగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ సారి 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తానని ధీమాతో ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్ వేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నబహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. సాక్షి: నామినేషన్ కార్యక్రమానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రావడం ఎలా ఫీలవుతున్నారు ? దయాకర్‌రావు: సీఎం కేసీఆర్ నామినేషన్ వేసుకున్న తర్వాత రాష్ట్రంలో కేవలం పాలకుర్తిలో నా నామినేషన్ కార్యక్రమానికి మాత్రమే హాజరు కావడం ఆనందంగా ఉంది. సాక్షి: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి వరాలు కోరబోతున్నారు..? దయాకర్‌రావు: గతంలో సీఎం కేసీఆర్ పాలకుర్తికి వచ్చిన సందర్భంగా పాలకుర్తి, వల్మిడి, బమ్మెర పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.22 కోట్లు, పాలకుర్తిని సిద్ధిపేట, ఖమ్మం తరహాలో తీర్చిదిద్దడానికి రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేశారు. టెండర్లు పూర్తయ్యాయి. పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథలో తాగునీరు, 4,500 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరందించేందుకు నిధులు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ. 700 కోట్ల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేశారు. మండల కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కోర్సు కళాశాలలు మంజూరు చేయాలని కోరుతా. సాక్షి: సీఎం బహిరంగ సభ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. దయాకర్‌రావు: సీఎం కేసీఆర్ సభకు రావాలని కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఊహించని విధంగా స్పందన వస్తుంది. గ్రామానికి సగటున 500 మందిని తరలించాలని కోరితే 1000 మందిని తీసుకొస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంచనాకు మించి ప్రజలు సభకు తరలివస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించే నియోజకవర్గాల్లో పాలకుర్తి ఉండబోతుంది. సాక్షి: మళ్లీ గెలిస్తే చేయబోయే పనులేమిటి ? దయాకర్‌రావు: నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 80 శాతం మంది ప్రజలకు ఉపాధి కల్పించే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి గ్రామంలోని బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా. వ్యవసాయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. తనకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటా. -
ఏడుగురు యువకుల కధే మధురవాడ
నిన్న కేరాఫ్ కంచరపాలెం..నేడు మధురవాడ... వెండితెరపై విశాఖ ఖ్యాతి పెంచేవిధంగా యువ దర్శకులు తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ..కొత్తకొత్త కథలు రాసుకుంటున్నారు. మన మధ్య జరిగే సంఘటనలు..మనతో ఉండే వారినే నటులుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న సినిమాలుగా రూపుదిద్దుకుని బడా నిర్మాతలను ఆకర్షించి సూపర్ హిట్లు కొడుతున్నారు. ఈ కోవకు చెందిన దర్శకుడే మన మధురవాడకు శ్రీనివాసరావు..ఉరఫ్ అజిత్ వాసన్. తనకు బతుకునిచ్చిన మధురవాడే తన సినిమాకు టైటిల్‌గా పెట్టి మూడు భాషల్లో తీసేందుకు సిద్ధమవుతున్నాడు. లొకేషన్లు చూసేందుకు వచ్చిన అజిత్ ‘సాక్షి’ తన భావాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే... పుట్టింది సబ్బవరం మండలం ఎల్లుప్పి. చదువుకున్నది మల్లునాయుడు పాలెం. బతుకుదారి చూపింది మాత్రం మధురవాడ. అందుకే మధురవాడ అంటే ఎనలేని అభిమానం. మధురవాడ పేరుతో సినిమా తీయాలని..అది కూడా మంచి సబ్జెక్ట్ అయి ఉండాలని కలలు కన్నా. అనుకున్నట్టు అద్భుతమైన కథ సిద్ధమైంది. డిసెంబర్లో షూటింగ్‌కు వెళుతున్నాం. ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ అనే కన్నడ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించా. అక్కడ సూపర్‌హిట్ కొట్టా. రెండో చిత్రంగా తెలుగులో ‘మధురవాడ’కు శ్రీకారం చుట్టా. మధురమైనది మధురవాడ మధురవాడపై నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. క్రైం, భూ కబ్జాలు వంటి నేరపూరిత ప్రాంతమని చాలా మంది భావన. అసలు మధురవాడ అంటే మధురమైనది. ఇక్కడ యువత చాలా రంగాల్లో తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. మధురవాడ యూత్ మంచితనమే నా చిత్రానికి మూల కథ. బతుకుదారిని చూపిన వ్యక్తులను, ప్రాంతాన్ని మర్చిపోకూడదనే కథకు యాప్ట్ అయ్యే టైటిల్ పెట్టా. పాటలు, మ్యూజిక్ లేని సినిమా ఇది.. ఇక్క పాట ఉండదు. మ్యూజిక్‌తో పనేలేదు. ప్రేమ ఉండదు. లిప్‌కిస్‌లు అసలే ఉండవు. ఇది ఏడుగురి యువకుల కథ. అనుకోకుండా జైలుకు వెళతారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన సంఘటనలే ‘మధురవాడ’. చాలా అద్భుతంగా..అత్యంత పకడ్బందీగా స్క్రిప్ట్ తీర్చిదిద్దా. రెండు గంటల సినిమాల్లో ఎంతో ఉత్కంఠ క్రియేట్ చేశా..రేపు సినిమా చూసివాళ్లంతా కచ్చితంగా మెచ్చుకుంటారు. మధురవాడ యువకులు కాలర్ ఎగరేసి తిరిగే సినిమా ఇది. ఆయనే ప్రేరణ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ హీరో, నిర్మాత అనిష్ తేజేశ్వర్ ఆదుకున్నారు. నన్ను పిలిచి ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. హీరో అనీష్, సినీ నటి, ఎమ్మెల్యే రోజా నన్ను ఎంతో ప్రోత్సహించారు. మూడు ప్రాంతాల్లో షూటింగ్ సినిమా షూటింగ్ అంతా వైజాగ్, బెంగళూరు, చైన్నైలలో సాగుతోంది. తెలుగు సినిమా షూటింగ్ మొతకతం ఇక్కడే. మధురవాడలోనే డిసెంబర్ నెలాఖరుకు ప్రారంభించి ఏప్రిల్‌లో విడుదల చేస్తా. అంతా కొత్తవాళ్లే... మధురవాడ సినిమాలో అంతా కొత్తవాళ్లే ఉంటారు. అది కూడా స్థానికులే. వారిని ప్రోత్సహించడం ఒక కారణమైతే..నా బడ్జెట్లో సినిమా పూర్తవుతుంది. కొత్తవాళ్లతో అయితే నేననుకున్నట్టు తీయగలను. ఏడుగురు యువకులు ఇందులో హీరోలు. టెక్నీషియన్స్, కెమేరామన్లు మాత్రం సీనియర్స్నే తీసుకుంటున్నా. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నా...తెలుగులో బీవీ కృష్ణారెడ్డి, ఎం. వెంకటేష్ నిర్మాతలు. తమిళంలో ‘కన్ ఇమ్యుకాం నేరతిల్ అనే టైటిల్‌తో తెరకెక్కనుంది. దీనికి నా పేరు శివ ఫేం డైరెక్టర్ సుశీంద్రన్ ఈ కథ విని తాను రిజర్వ్ చేసుకున్న టైటిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తమిళ, కన్నడ రెండు సినిమాలకూ నరేన్ నిర్మాత. ఆగస్టులో బాలీవుడ్ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు, సెప్టెంబర్‌లో హిందీ సినిమా చేయబోతున్నా. సోలో సినిమా. భారీ బడ్డెట్‌తో రాబోతోంది. త్వరలో మధురవాడ టీజర్, ట్రైలర్ విడుదల చేస్తా. -
కమ్యూనిస్టు పార్టీలోనూ ప్రజాస్వామ్యం లేదు
సాక్షి,మధిర: చిన్నతనంనుంచి ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, బోడపూడి వెంకటేశ్వరరావు అడుగు జాడల్లో పయనించారు. మధిర నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. ప్రతీ గ్రామానికి రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్న శాసన సభ ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ప్రస్తుతం రాజకీ యాల్లో కొనసాగుతున్నారా? కట్టా: పదేళ్ల క్రితం సీపీఎంకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నాను. జరగబోయే ఎన్నికల్లో నేను ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. నేను మొదటినుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకున్నా. నా ప్రాణం ఉన్నంతవరకు కమ్యూనిస్టుగానే కొనసాగుతా. కొంతమంది మద్దతు తెలిపినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. మద్దతు ఇస్తే నేనే స్వయంగా ప్రకటిస్తా. కానీ అటువంటి ఆలోచనే లేదు. సాక్షి: రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏమిటీ? కట్టా: రానురాను పాలకవర్గాలు ఓటర్లలో ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాలను దిగజార్చాయి. స్థిరమైన రాజకీయ అభిప్రాయాలు నాడు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలోకానీ, బూర్జువా పార్టీల్లోకానీ ప్రజాస్వామ్యం కోల్పోయింది. సైద్ధాంతిక, సామాజిక పరిస్థితులను ప్రజలకు వివరించి ప్రజలు వాటిమీద ప్రభావితం చేసేవిధంగా రాజకీయ పరిస్థితులు ఉండేవి. కానీ నేడు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు. ఇప్పుడు డబ్బు ప్రభావం పీక్ స్టేజ్‌లోకి వచ్చింది. సాక్షి: అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? కట్టా: సంక్షేమ పథకాల పేరుతో డబ్బు బాగా ఖర్చవుతోంది. కొంత వృథా చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా అమలు జరగడంలేదు. పాత మధిర నియోజకవర్గంలో 162 గ్రామాలు ఉండేవి. నా హయాంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. -
ఎన్నికలకు సిద్ధం
సాక్షి, మెదక్: ‘ఎన్నికల నిర్వహణ ప్రతి అధికారికి సవాలే. తహసీల్దార్‌గా మొదలు వివిధ హోదాల్లో పలు ఎన్నికల నిర్వహణలో పనిచేశాను. 1998లో మచిలీపట్నంలో మొదటి సారిగా తహసీల్దార్ హోదాలో ఎన్నికల అధికారిగా పనిచేయడం ఎన్నటికీ మరువలేను. మచిలీపట్నం చాలా పెద్ద మండలం. పోలింగ్‌కు ఒకరోజు ముందు భారీ వర్షం కురిసింది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించటం ఎంతో సంతృప్తినిచ్చింది. అప్పటి కలెక్టర్ ప్రార్థసారథి నన్ను ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత ఆర్డీఓ, జేసీ హోదాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించాను. ప్రస్తుతం కలెక్టర్ హోదాలో ఎన్నికల విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని కలెక్టర్ ధర్మారెడి అన్నారు. ‘సాక్షి’తో ఆయన జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేకంగా మాట్లాడారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేక దృష్టి ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా కీలకమైంది. ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మంగళవారంతో ఓటరు జాబితా సవరణ సమయం పూర్తి కానుంది. ఇప్పటికే ఓటరు నమోదు కోసం జిల్లాలో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. కొత్తగా ఓటర్ల నమోదు కోసం సోమవారం వరకు 24,067 దరఖాస్తులు అందాయి. వీటిలో 18 ఏళ్లు నిండిన వారి దరఖాస్తులు 4 వేలకుపైగా ఉన్నాయి. ఈ సోమవారం వచ్చిన దరఖాస్తులతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 8వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. ఓట్లు గల్లంతు అనేది వాసత్వం కాదు. బోగస్ ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నాం. రెండు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు ఉన్న పక్షంలో ఒకచోట జాబితాలో నుంచి పేర్లును తొలగిస్తున్నాం. జిల్లాలో 4వేల మంది ఓటర్ల పేర్లను తొలగించనున్నాం. మృతి చెందిన 5,464 మంది పేర్లను సైతం జాబితాలో నుంచి తొలగిస్తున్నాం. ట్యాపర్ చేస్తే ఫ్యాక్టరీ మోడ్‌లోకి .. ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. బ్యాలెట్ యూనిట్లు 860, కంట్రోల్ యూనిట్లు 670 , వీవీపాట్లు 670 జిల్లాకు వచ్చాయి. రెండు మూడు రోజుల్లో రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. వీవీపాట్ల పనితీరును అందరూ పరిశీలించవచ్చు. అలాగే గ్రామాల్లో సైతం అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేసింది ఈ ఈవీఎంల ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ సమయంలో ఈవీఎం, వీవీపాట్లను టాంపరింగ్ చేసే అవకాశం లేదు. ఎవరైనా ఈవీఎం, వీవీప్యాట్లకు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తే అవి వెంటనే ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ జిల్లా అధికారులతోపాటు ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల నిర్వహణకు 4 వేల సిబ్బంది అవసరం కానున్నారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పోలింగ్ సిబ్బంది నియామకం చేపడతాం. సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరైమన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు బ్యాలెట్ పోలింగ్ ఉద్యోగులు ఖచ్చితంగా బ్యాలెట్ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది బ్యాలెట్ ఓటింగ్‌పై శద్ధ చూపడం లేదు. ఓటు హక్కు తక్కువగా వినియోగించుకునే వారిలో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇందుకోసం ఆర్టీసీ సిబ్బంది జాబితాను ముందుగానే తెప్పించుకుంటున్నాం. ఆర్టీసీ సిబ్బంది అంతా బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడతాం. మూడు ప్రత్యేకమైన యాప్‌లు రాబోయే ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట అమలులోకి వచ్చిన వెంటనే ‘సి–విజిల్’ పనిచేయటం ప్రారంభం అవుతుంది. ఏ రాజకీయపార్టీకి చెందిన నాయకులైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తే వాటిని సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు లేదా వీడియోలు తీసి “సి–విజిల్’లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అయిన వెంటనే ఎన్నికల కమిషన్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకుంటారు. వీడియో అప్లోడ్ చేసిన వారి పేరు, ఫోన్ నంబరు తదితర వివరాలు గోప్యంగా ఉంచుతారు. దీనితోపాటు ఎన్నికల కమిషన్ ఓటర్ల కోసం ‘నేషనల్ గ్రివెన్స్ సర్వీస్’ యాప్‌ను రూపొందించింది. ఓటర్లు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. రాజకీయపార్టీల కోసం ఎన్నికల కమిషన్ ‘సువిధ’ పేరిట మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకవస్తోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల నిర్వహణ, లౌడ్ స్పీకర్లకు వినియోగానికి అనుమతుల కోసం ‘సువిధ’ యాప్‌లో అన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఎన్నికల కమిషన్ నేరుగా అనుమతులు జారీ చేయటం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో కరెంటు సమస్య జిల్లాలో మొత్తం 538 పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రధానంగా కరెంటు సమస్య ఉంది. దీన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే తాగునీరు, టాయిటెట్లు, ర్యాంపుల నిర్మాణం తదితర అంశాలను పరిశీలిస్తున్నాం. ఐపీ కెమెరాలతో పోలింగ్ లైవ్ పోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరాలతో లైవ్ పోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో వెబ్‌లైవ్ కాస్ట్ ఉండేది. కాగా రాబోయే ఎన్నికల్లో ఐపీ కెమెరాలతో లైవ్ పెట్టించనున్నాం. తద్వారా ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందించేందుకు వీలు ఉంటుంది. ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల సంఘం 1950 పేరిట టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
► రెండు జిల్లాల్లో 88 సెంటర్లు, 56,375 మంది విద్యార్థులు ► ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ► నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ► మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే డిబారే ► సాక్షి ప్రత్యేక ఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ ఖమ్మం జెడ్పీసెంటర్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నాం. ప్రణాళికాబద్ధంగా పరీక్షా కేంద్రాలను గుర్తించాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్యా, వైద్య, ఆరోగ్య, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం సాక్షికి ఇచ్చిన ప్రత్యేకఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై పలు అంశాలను వివరించారు. ఇంటర్య్వూ ఆయన మాటల్లోనే... సాక్షి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు? డీఐఈఓ: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 88పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఖమ్మంలో 55 సెంటర్లు వీటిలో 18 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, ఆరు సోషల్ వెల్ఫేర్, ఒకటి మోడల్ స్కూల్, ఒక హైస్కూల్, 28 ప్రైవేటు కళాశాలలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ, 3 సోషల్వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్, 13 ప్రైవేటు కళాశాలలున్నాయి. సాక్షి: రెండు జిల్లాల్లో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? డీఐఈఓ: రెండు జిల్లాల్లో 56,375 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 35,744 మంది, ప్రథమ సంవత్సరం 18 వేలు, ద్వితీయ సంవత్సరం 17,744 మంది రాయనున్నారు. భద్రాద్రి జిల్లాలో 20,631 మంది విద్యార్థులు కాగా, వీరిలో మొదటి సంవత్సరం 8,111, ద్వితీయ సంవత్సరం 8,281 మంది విద్యార్థులున్నారు. సాక్షి: పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? డీఐఈఓ: మార్చి 1 నుంచి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9న జరగాల్సిన పరీక్ష 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మాస్‌కాపీయింగ్‌కుపాల్పడితే డిబార్‌చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈఓ: జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నాం. పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సాక్షి: సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? జిల్లాలో ఎన్ని ఉన్నాయి? డీఐఈఓ: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఒక సమస్యాత్మక కేంద్రం ఉంది. సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? డీఐఈఓ: విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కింద కూర్చొని పరీక్షలు రాయకుండా ఏర్పాట్లు చేశాం. అన్ని కేంద్రాల్లో డెస్క్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీరు, విద్యుత్, మెడికల్ క్యాంపులు ఉండేలా చూస్తున్నాం. సాక్షి: ప్రాక్టికల్స్ నిర్వహణ సక్రమంగా జరగలేదన్న వాదన ఉంది కదా? డీఐఈఓ: ప్రాక్టికల్స్ నిర్వహణ పక్కాగా నిర్వహించాం. ప్రతిభ ఉన్నవారికే మార్కులు వస్తాయి. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. పనితనాన్ని బట్టే మార్కులుంటాయి. సాక్షి: పరీక్ష కేంద్రంలోకి ఎన్ని గంటలకు అనుమతిస్తారు? డీఐఈఓ: 8 గంటల నుంచి విద్యార్థులను అనుమతిస్తాం. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. ఇవే ఆదేశాలు అన్ని సెంటర్లకు జారీ చేశాం. సాక్షి: పరీక్షా కేంద్రాలపై ఎలాంటి నిఘా ఉంది? డీఐఈఓ: ప్రతికేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణపై హైపవర్ కమిటీ మెంబర్లు ఉన్నారు. రెండుజిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్, 88 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, నలుగురు డీఈసీ మెంబర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు.