ఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారు
వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారు
అంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదా
ఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చింది
మహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వైపే
సాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
జగన్ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను వైఎస్సార్‌సీపీ సపోర్టర్ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్‌సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా! - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
లంచాలకు బ్రేక్ పడింది
ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది.
చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు
మెడికల్ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది.
మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం
మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్‌సీపీ బంపర్ మెజారీ్టతో వస్తుంది.
నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు
మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్‌సీపీ సపోర్ట్ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులన్నట్టే కదా.
పోలవరం పూర్తయితే బాగుంటుంది
పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. –సత్యార్థి
Comments
Please login to add a commentAdd a comment