Bhardwaj
-
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్‌ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
జగన్ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను వైఎస్సార్సీపీ సపోర్టర్ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా! - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది. మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్సీపీ బంపర్ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్సీపీ సపోర్ట్ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. –సత్యార్థి -
రావణ చరిత్ర కోసం చిరంజీవిని కలుస్తాం: భరద్వాజ
సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమి యొక్క ఆత్మ గౌరవ నినాదంతో 'కోడ్ రామాయణ' రానుంది. పాపులర్ రైటర్ సౌద అరుణ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత చేతుల మీదుగా పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్ చివరి సినిమా ఇదేనా?) దూర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ ద్వారా దాని అంతరార్థం మాత్రం తెలుస్తుందన్నారు. దీని తరువాత వచ్చే రెండవ భాగం 'రావణచరిత్ర' మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ తరువాత మూడవ భాగం 'ఉత్తర రామాయణం' ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ.. డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి ఈ సినిమాలు తెలుపుతాయి. డ్రవిడ భూమి ఏ కారణాల చేత గుర్తింపు లేకుండా పోయిందో తెలపడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని భరద్వాజ అన్నారు. ప్రముఖ దర్శకుడు సౌద రచించిన ఈ పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే మెగాస్టార్ చిరంజీవికి చూపించి... రెండోవ భాగంలో వచ్చే 'రావణచరిత్ర'లోని రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తామని భరద్వాజ తెలిపారు. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్ఈ టర్మ్–1 పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల టర్మ్–1 బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గురువారం ప్రకటించింది. నవంబర్–డిసెంబర్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుందని, ఒక్కో టెస్టు వ్యవధి 90 నిమిషాలని పేర్కొంది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. టర్మ్–1, టర్మ్–2 పరీక్షల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. టర్మ్–2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. -
భళా భరద్వాజ్.. అమెరికాలో తెలుగు విద్యార్థి అద్భుత ప్రతిభ
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆణిముత్యం ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు సాధించి మాతృదేశం గర్వించేలా పేరు తెచ్చుకున్నాడు. అతనే విశాఖ జిల్లా సీలేరులోని ఏపీ జెన్కో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ కామేశ్వర శర్మ కుమారుడు భరద్వాజ్. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ యూఎంకేసీలో నిర్వహించిన అర్హత పరీక్షలో భరద్వాజ్ ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు శాస్త్ర పరిశోధనలు చేశాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరద్వాజ్ పరిశోధనలు చేశాడు. దీంతో ఖగోళ భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమ కుమారుడి పరిశోధనలకు వచ్చిన గుర్తింపుపై సోమవారం భరద్వాజ్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రంతో భరద్వాజ్ ఖగోళ భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి డాక్టరేట్ ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన వ్యక్తి భరద్వాజ్ అని వారు తెలిపారు. తమ కుమారుడి కృషివెనుక ప్రొఫెసర్ డానియేల్ మాకింటోస్, మార్క్ బ్రాడ్‌విన్ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ పరిశోధనల సమయంలో ఎనిమిది సంస్థల నుంచి ఉపకార వేతనాలు లభించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్ కొనసాగిస్తున్న మరో పరిశోధనకు అమెరికాలోని నాసా ఉపకార వేతనం కూడా అందించనుందన్నారు. భరద్వాజ్ పరిశోధనలు మెచ్చి 2018లో అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ స్వర్ణ పతకం అందజేసిందని, భారత్‌కు తిరిగొచ్చి దేశంలోని విద్యార్థులకు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా చేయడమే అతని ధ్యేయమన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోస్టు డాక్టరేట్ కూడా చేయనున్నట్లు తెలిపారు. పరిశోధనల అనంతరం స్వదేశానికి వచ్చిన భరద్వాజ్‌తో తల్లిదండ్రులు, సోదరి -
‘నీట్’గా అమ్మకానికి పెట్టేశారు!
ఇటీవల ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీకై ఎన్నికలను ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నీట్ అభ్యర్థుల డేటా లీకేజీ కోచింగ్ సెంటర్లకు కల్పతరువుగా మారుతోంది. దాదాపు రెండున్నర లక్షల మంది నీట్ అభ్యర్థుల డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య, దంత వైద్య కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) గత మేలో జరిగింది. జూన్ 4న ఫలితాలొచ్చా యి. మొత్తం 13 లక్షల మంది నీట్ పరీక్ష రాశా రు. అందులో 2.5 లక్షల మంది డేటాను ఓ వెబ్సైట్ అమ్మకానికి పెట్టింది. దీంతో మన దేశంలో సమాచార గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. నీట్ డేటాబేస్‌లో విద్యార్థి పేరు, నీట్లో వారికొచ్చిన స్కోర్, ర్యాంకు, చిరునామా, పుట్టిన తేదీ, సెల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇలా అన్నీ ఉన్నాయి. సరైనదో కాదో ఎలా తెలుస్తుంది ? వెబ్సైట్ ఓపెన్ చేయగానే మచ్చుకి ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల డేటా అందులో కనిపిస్తుంది. డేటా కొనుగోలు చేయాలనుకునే వారు అభ్యర్థు ల సమాచారం సరైందో కాదో ఫోన్ ద్వారా సం ప్రదించి తెలుసుకోవచ్చు. సరైన సమాచారమే ఇస్తున్నారన్న నమ్మకం కుదిరితే 2 లక్షల మంది డేటాకు 2.4 లక్షలు చెల్లించాలి. డేటా కొనుగోలు చేసే వాళ్లకి ఈ వెబ్సైట్ మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. విద్యార్థుల్ని ఆకర్షించడానికి ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తామంటోంది. విద్యార్థుల నుంచే వివిధ మార్గాల్లో ఈ డేటాను సేకరిస్తున్నారు. ఫేస్బుక్లో కెరీర్ కౌన్సిలర్స్కి సంబంధించి యాడ్స్ కనిపిస్తే విద్యార్థులే తమకు ఎక్కడ సీటు వస్తుందో అన్న ఆతృతతో వివరాలన్నీ ఇస్తున్నారు. వాటిని సేకరించిన కొందరు డేటా బ్రోకర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. అలాగే కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు తమ వివరాలన్నీ అందించాల్సి ఉంటుంది. అలా సేకరించిన డేటానే అమ్మకానికి పెడుతున్నారు. ఎవరు కొంటారు? విద్యార్థుల డేటా లీకేజీ వ్యవహారం రెండు మూడేళ్లుగా చర్చనీయాంశమవుతోంది. 2017లో ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన 15 లక్షల మంది విద్యార్థుల డేటా ఆన్లైన్లో అమ్ముడుపోయింది. అప్ప ట్లో కొన్ని వెబ్సైట్లు విద్యార్థుల డేటాను అమ్మకానికి పెట్టాయి. నీట్లో సరైన స్కోర్ రాని వారి ఫోన్ నంబర్లను తీసుకొని ఆ విద్యార్థుల వెంటబడుతున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్లు. తమ వద్ద చేరితే వచ్చే ఏడాది సీటు గ్యారెంటీ అంటూ మభ్యపెడుతున్నాయి. ‘నీట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి రోజూ నాకు నాలుగైదు కాల్స్ వస్తున్నాయి. ప్రత్యేకమైన కోర్సులు చేయాలంటే మా కాలేజీలో చేరండంటూ పదే పదే కాల్స్ చేస్తున్నారు’అంటూ యూపీకి చెందిన ఒక అభ్యర్థి చెప్పారు. చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2008 సరిగ్గా వినియోగంలో లేదని అంటున్నారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల వరకు డేటా బ్రోకర్ సంస్థలున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగానే డేటా వెల్లడిస్తున్న ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కోటి వరకు ఉన్నాయి. డేటా లీకేజ్ అవాస్తవం ఈ డేటా లీకేజీ అంతా అవాస్తమని నీట్–యూజీ 2018 డైరెక్టర్ డాక్టర్ సాన్యమ్ భరద్వాజ్ చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు, యూట్యూబ్ చానెల్స్‌లో వీడియోలు చూసి లీకేజ్ ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీబీఎస్ఈ పకడ్బందీ గా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భరద్వాజ్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: హాంకాంగ్‌లో జరిగిన ఆర్నాల్డ్ క్లాసికల్ ఆసియా మల్టీ స్పోర్ట్స్ ఫెస్టివల్లో తెలంగాణ క్రీడాకారుడు సత్తా చాటాడు. జంప్‌రోప్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ఉత్కర్ష్ భరద్వాజ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక్కడి వరల్డ్ ఆసియా ఎక్స్పో సెంటర్లో ఈనెల 20 నుంచి 24 వరకు జంప్‌రోప్ చాంపియన్‌షిప్ జరిగింది. ఈ పోటీల్లో తెలంగాణ జంప్‌రోప్ సంఘం జనరల్ సెక్రటరీ టి. బాలరాజు అధికారిగా పాల్గొన్నారు. -
ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం
సిమ్లా: సోనియా గాంధీ కూతరు ప్రియాంకా గాంధీ సిమ్లాలో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం నెలకొంది. స్థానిక బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ ఈ ఇంటి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హోం మంత్రి రాజనాథ్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. ప్రియాంకా గాంధీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నది.. రాష్ట్రపతి వేసవి విడిది భవనానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఈ నిర్మాణం అపాయకరమని, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు. గతంలో ఆ ప్రాంతంలో సామాన్యులు ఇళ్లు నిర్మించుకోదలచినప్పుడు భద్రత పరమైన కారణాలను చూపిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. అయితే ప్రియాంకా గాంధీ మాత్రం తన 'ఫ్యామిలీ స్టేటస్' సహాయంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారని ఆయన ఆరోపించారు. -
చక్రి మృతిపై ముదురుతున్న వివాదం
‘విషం’ చిమ్ముకుంటున్న చక్రి కుటుంబసభ్యులు విచారణ ఎలా జరపాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి కుటుంబసభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రే పింది. మృతి చెందిన రోజు కోడలు శ్రావణి ఫోన్ చేసి చక్రిని తానే చంపానని చెప్పిందని చక్రి తల్లి విద్యావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చక్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యావతితోపాటు చక్రి తమ్ముడు మహిత్ కోరారు. తనపై కేసు లేకుండా చేసుకోవడానికి ముందస్తుగా తమను నేరస్తులుగా చిత్రీకరించేందుకు పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేసిందని వారు వెల్లడించారు. దర్యాప్తు కష్టమేనంటున్న పోలీసులు చక్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విచారణ ఎలా చేయాలో తెలియక జూబ్లీహిల్స్ పోలీసులు తల పట్టుకుంటున్నారు. చక్రి మృతి చెంది నేటికి 29 రోజులు గడిచాయి. ఇప్పటి వరకూ అతని మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగలేదు. చక్రిపై నిజంగా విష ప్రయోగం జరిగిందా లేక ఆస్తుల పంపకంలో తలెత్తిన వివాదాలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ చక్రి మరణం సహజమా లేక హత్యా అనే విషయం తేల్చేందుకు ఇప్పుడు పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధం లేదు. అతని బౌతికకాయానికి పంజాగుట్ట శ్మశాన వాటికలో గత నెల 15న దహన సంస్కారాలు కూడా జరిగాయి. వాస్తవానికి చక్రి మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. ఖననం చేసినా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉండేది. మరోపక్క చక్రి చనిపోయిన సమయంలో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని ధ్రువీకరించారు. కనీసం అక్కడ చికిత్స చేసినా రిపోర్టుల ద్వారా విష ప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడా అవకాశం కూడా లేదు. దీంతో ఈ కేసు దర్యాప్తు కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. -
వండర్ కిడ్స్ రికార్డ్
విశాఖపట్నం: వంద ప్రశ్నలు.. ముప్పై మంది చిన్నారులు.. పది నిమిషాల 20 సెకన్లలో సమాధానాలు చెప్పి రికార్డ్ సృష్టించారు. రెండో తరగతి లెక్కల ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు యూకేజీ బుడతలు సమాధానాలిచ్చిన తీరు అబ్బురపర్చింది. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు ఈ రికార్డ్ సృష్టించారు. ఏయూ ఉపకులపతి జి.ఎస్.ఎన్.రాజు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వంద ప్రశ్నలకు బదులిచ్చారు. వంద ప్రశ్నలను ఎల్ఈడీ ద్వారా ప్రజెంటేషన్ చేసి వాటి సమాధానాలను యూకేజీ చిన్నారులను అడిగారు. 30 మంది విద్యార్థులు తడుముకోకుండా టీచర్స్ అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు చెప్పారు. అనంతరం భరద్వాజ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. స్కూల్ డెరైక్టర్ మళ్ల రామునాయుడు, ఏయూ ఆచార్యులు పి.రంగారావు, బి.మునిస్వామి, మదన్మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ల వాణిశ్రీ పాల్గొన్నారు. -
పేరుతో పాటు డబ్బు కూడా...
‘‘నా జీవితంలోనే గొప్ప సంతోష క్షణాలివి. 1982లో నిర్మాతని అయ్యాను. ఎన్నో సినిమాలు నిర్మించాను. అవేవీ ఇవ్వని ఆనందాన్ని ‘చందమామ’ సినిమా ఇచ్చింది. ఇప్పుడు చేస్తున్న ‘చంద్రకళ’ అంతకంటే మంచి పేరు తెస్తుందనీ, దాంతో పాటు డబ్బుని కూడా తెస్తుందని నా నమ్మకం’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణై’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు సి.కల్యాణ్. శ్వేతలానా, వరుణ్‌తేజ, సి.వి.రావు నిర్మాతలు. కార్తీక్‌రాజా, భరద్వాజ్ కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని బి.గోపాల్ ఆవిష్కరించి, తొలి ప్రతిని నిర్మాతల్లో ఒకరైన వరుణ్తేజకి అందించారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన బి.గోపాల్, రామ్‌ప్రసాద్, కొడాలి వెంకటేశ్వరరావు, శంకర్‌గౌడ్, ముత్యాల రాందాస్, బి.ఏ.రాజు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
ఇక సెలవా మరి!
మాజీ గవర్నర్ భరద్వాజ్‌కు వీడ్కోలు తాత్కాలిక గవర్నర్‌గా నేడు రోశయ్య బాధ్యతల స్వీకరణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ కే. రోశయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ భవన్లో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్. వఘేలా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం రోశయ్య చెన్నైకి తిరిగి వెళతారు. కాగా శనివారం పదవీ విరమణ చేసిన హెచ్ఆర్. భరద్వాజ్‌కు వీడ్కోలుగా రాజ్ భవన్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనను కలుసుకుని సత్కరించారు. ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి సహకరించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ ఐదేళ్లు ప్రజలకు మంచి చేశాననే తృప్తితో తిరిగి వెళుతున్నానని చెప్పారు. గత ఏడాదిగా తనకు సహకరించనందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
పెద్దలు ఖరారు
మండలికి ఐదుగురి పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుత గవర్నర్ హయాంలోనే ఆమోదం పొందే యత్నం చివరి నిమిషంలో మోహన్ కొండజ్జీ, ఇవాన్ డిసౌజా పేర్ల తొలగింపు! ఆ స్థానంలో ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌లకు ఛాన్స సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేయడానికి అధికార కాంగ్రెస్ కసరత్తును పూర్తి చేసింది. వివిధ రంగాలకు చెందిన వారు ఈ నెల 20న రిటైర్ కానుండడంతో ఆ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ఈ నెల 29న రిటైర్ కానున్నారు. యూపీఏ హయాంలో నియమితులైన ఆయన స్థానంలో కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఎటూ తమ వారినే నియమిస్తుంది. గవర్నర్‌తో సత్సంబంధాలు లేకపోతే వివిధ రంగాలకు చెందిన వారిని నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపే సిఫార్సులను ఒక పట్టాన ఆమోదించే ప్రసక్తే ఉండదు. కనుక ఈ వారంలోనే నామినేటెడ్ సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే అధిష్టానం వీఎస్. ఉగ్రప్ప, సినీ నటి జయమాల, మోహన్ కొండజ్జీ, ఇవాన్ డిసౌజా, అబ్దుల్ జబ్బార్ పేర్లను ఖరారు చేసింది. అయితే తుది నిముషంలో వచ్చిన ఒత్తిళ్ల కారణంగా కొండజ్జీ, డిసౌజాల బదులు ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో సరడగి రెండేళ్ల కిందట శాసన సభ నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందున ఇండిపెండెంట్ భైరతి సురేశ్ గెలుపొందారనే ఆరోపణలు వచ్చాయి. ఉగ్రప్ప గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా పని చేశారు. కాగా ఐదుగురితో కూడిన జాబితాను ముఖ్యమంత్రి ఏ క్షణంలోనైనా రాజ్ భవన్‌కు పంపే అవకాశాలున్నాయి. గవర్నర్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకు ముందే లేదా తిరిగి వచ్చిన తర్వాత ఈ జాబితాపై ఆమోద ముద్ర పడే అవకాశాలున్నాయి. బీజేపీ హయాంలో నియమితులైన డాక్టర్ ఎస్ఆర్. లీలా, డాక్టర్ దొడ్డ రంగే గౌడ, ప్రొఫెసర్ ఎంఆర్. దొరస్వామి, బీబీ. శివప్పలు రిటైర్ కానున్నారు. వీరితో పాటే అబ్దుల్ జబ్బార్ కూడా రిటైర్ కావాల్సి ఉంది. అయితే నెల కిందటే ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆయనింకా శాసన మండలి సమావేశంలో పాల్గొనలేదు. అందువల్లే ఆయనను తిరిగి నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావణగెరె జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పని చేస్తున్న జబ్బార్ అనేక విద్యా సంస్థలకు అధిపతి కావడం గమనార్హం. -
ప్రజా విశ్వాసం చూరగొనాలి
అవినీతితో అన్నీ అనర్థాలే = గణతంత్ర వేడుకల్లో గవర్నర్ భరద్వాజ్ = ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాలకులకు హితవు సాక్షి, బెంగళూరు : దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోందని గవ ర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల స్థానిక ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నాయన్నారు. నగరంలోని మానెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భరద్వాజ్ జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాలు... ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాన త్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సమాజంలోని ప్రతి వర్గానికి...ప్రతి రంగంలో సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అధికార పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కష్టించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వాగ్ధానాలన్నీంటిని తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలనీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ‘సెక్యులరిజం ఈజ్ ఇండియన్ డెస్టినీ’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వ్యాఖ్యలను గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ గుర్తు చేశారు. ఎందరో వీరులు ప్రాణాలు త్యాగం వల్ల నేడు భారతదేశం గణతంత్ర రాజ్యాల్లో ఒకటిగా నిలించిందన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులతో పాటు పొరుగు దేశాలకు దీటుగా త్రివిధ దళాలకు ఉపయుక్తమైన ఆయుధ సంపత్తిని అందించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు కర్ణాటకతోపాటు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కాగా, గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధాన ంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘సకాల’ పథకం ఇతర రాష్ట్రాలకే కాకుండా ప్రపంచ దేశాల ప్రశంసలు కూడా అందుకుందన్నారు. అయితే రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఆరోగ్యం, ఫ్లోరైడ్ రహిత తాగునీటి సరఫరా విషయాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితోపాటు పలువురు శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. -
కమలమెక్కడ?
బీజేపీకి విపక్ష స్థానంపై రేపు నిర్ణయం నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే విషయమై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప తెలిపారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ బుధవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని, అనంతరం న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కాగా ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలపై నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 30 వరకు వారం పాటు జరిగే సమావేశాల్లో 1,201 ప్రశ్నలను స్వీకరించగా, 630 ప్రశ్నలను అంగీకరించామని చెప్పారు. సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులేవీ పెండింగ్‌లో లేవని, కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు. -
రేపటి నుంచి అసెంబ్లీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. వారం పాటు సాగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ప్రసంగిస్తారు. శాసన సభ ఇదివరకే ఆమోదించిన అత్యవసర సేవల సవరణ బిల్లు, కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ సవరణ బిల్లులను శాసన మండలిలో ప్రవేశ పెడతారని చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. స్పీకర్ కాగోడు తిమ్మప్పతో కలసి గవర్నర్‌ను ఆహ్వానించగా, ఆయన సమ్మతించారని వెల్లడిచారు. కాగా ఏడాదికి 60 రోజుల పాటు శాసన సభ సమావేశాలు జరిపే విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదివరకే తమతో చర్చించారని తెలిపారు. టైం టేబుల్‌ను ఇవ్వాలని కోరగా, తయారు చేసి ఇచ్చామని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
తప్పుకుంటా!
గవర్నర్ భరద్వాజ్ వైరాగ్యం.. *సీఎం, మంత్రులు విలువ ఇవ్వడం లేదు * సలహాలకే పరిమితం చేస్తున్నారు * గత బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు * నేడు కాంగ్రెస్ పాలనపై కూడా అంతే * ఎమ్మెల్యేల విదేశీ పర్యటన అర్థరహితం * రాష్ర్టంలోనే అధ్యయనం చేయవచ్చు మైసూరు, న్యూస్‌లైన్ : ‘ముఖ్యమంత్రి, మంత్రులే గవర్నర్ మాట వినడం లేదు. నా సలహాలు వారికి మాత్రమే పరిమితం. ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడం వారి వ్యక్తిగత విషయం. ఇందులో నేను జోక్యం చేసుకోను. అయితే ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల అభివృద్ధి, ప్రాధాన్యతలపై అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది. నా మాట వినని సీఎం, మంత్రుల గురించి నేనేమీ మాట్లాడను. గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’ అని రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్. భరదాజ్ వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. నగరంలో శుక్రవారం ఓ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ ఎవరి మాటా వినడం లేదన్నారు. కనుక గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని యోచిస్తున్నానని అన్నారు. గత బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పాలనపై కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు అధ్యయనాలు జరపడానికి రాష్ట్రంలోనే చాలా ప్రదేశాలున్నాయని, కనుక వారు విదేశీ పర్యటనలకు వెళ్లడంలో అర్థం లేదని ఆయన చురకలు అంటించారు. -
మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలో మహిళల రక్షణ, భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, రక్షణపై నగరంలో గురువారం రెండు రోజుల జాతీయ సమావేశాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో రోజు రోజుకు మహిళలపై దౌర్జన్యాలు అధికమవుతున్నాయంటూ, చట్టాలంటే భయం లేకపోవడం కూడా దీనికి కారణమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరపడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కూడా నెలకొల్పాల్సిన అవ సరం ఉందన్నారు. దోషులకు తగిన శిక్ష పడితే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని సూచించారు. మనలో నిజాయతీ కలిగిన అధికారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దౌర్జన్యాలు తగ్గకపోవడానికి ఇదీ ఒక కారణమేనని తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను నియమించడం ద్వారా ఇలాంటి నేరాలను నివారించాలని ప్రభుత్వానికి సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో విదేశ వ్యవహారాల మంత్రులుగా మహిళలను నియమిస్తున్నారని, మన దేశంలో వారిని నమ్మడం లేదంటూ ఇదే మన దౌర్భాగ్యమని విచారం వ్యక్తం చేశారు. మహిళలకు బాధ్యతలను అప్పగిస్తే పురుషుల కంటే సమర్థంగా నిర్వర్తిస్తారని కితాబునిచ్చారు. మహిళలకు అధికారం అప్పగిస్తే సక్రమంగా వ్యవహరించలేరనే అప నమ్మకం ఏర్పడిందని అన్నారు. దీనిని పోగొట్టి మహిళలను గౌరవించాలని ఆయన సూచించారు. హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ మాట్లాడుతూ... మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలపై దౌర్యనాల కేసుల సత్వర పరిష్కారానికి పది ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, డీజీపీ లాల్ రుకుమ్ పచావ్, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్. వెంకటాచలయ్య ప్రభృతులు పాల్గొన్నారు. -
తీరు మారాలి
మంత్రుల వైఖరిపై గవర్నర్ = సీఎం బాగా పనిచేస్తున్నారు = బాధ్యతలను విస్మరించిన మంత్రులు = ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలి = పలు వర్సిటీల్లో వీసీల నియామకంలో జాప్యం = దీనిపై సీఎం ప్రత్యేక ద ృష్టి సారించాలి = బెంగళూరులోనే ‘రాజీవ్’ వర్సిటీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల తీరుపై సదా విమర్శలు గుప్పిస్తున్న గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ తాజాగా వారి వైఖరిపై పెదవి విరిచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పని తీరును ప్రశంసిస్తూనే మంత్రుల వైఖరిని తప్పుబట్టారు. నౌకా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కార్వారలోని సీ బర్డ్ నౌకాశ్రయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొందరు మంత్రుల పని తీరు తనకు తృప్తినివ్వడం లేదన్నారు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం బాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. తాను వివాదాల్లోకి పోదలచుకోలేదని, అయినప్పటికీ మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి తాను సమష్టి బాధ్యతను ఆశిస్తున్నానని తెలిపారు. మొత్తం ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించాల్సి ఉందన్నారు. అయితే ఈ నియామకాల్లో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సి ఉందన్నారు. రామనగర జిల్లాలో నిర్మించదలచిన రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని బెంగళూరులోనే నెలకొల్పాలని అన్నారు. బెంగళూరులో కావాల్సినంత స్థలం ఉన్నందున ఈ విశ్వ విద్యాలయం భవనాన్ని ఇక్కడే నిర్మించాలని సూచించారు. రామనగరలో ప్రైవేట్ స్థలంలో నిర్మించాల్సిన ఆగత్యం లేదన్నారు. -
ఇండియా, సౌదీ బంధం బలమైనది
గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇండియా, సౌదీ అరేబియాల మధ్య బంధం ఈనాటిది కాదని, ఏడో శతాబ్దం నుంచే పెనవేసుకుని ఉందని గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ అన్నారు. నగర శివారులోని సర్జాపుర వద్ద సబిక్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఇరు దేశాల మధ్య ఏర్పడిన సాంస్కృతిక బంధం, రాజకీయ... ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారానికి బాటలు వేశాయని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో జన్మించినా, మహాత్ముని సహచరునిగా స్వాతంత్య్ర పోరాటంలో గణనీయమైన పాత్రను పోషించారని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా, సాబిక్ సంస్థ చైర్మన్ సౌద్ బిన్ అబ్దుల్లా, వైస్ చైర్మన్ మహమ్మద్ అల్-మ్యాడి తదితరులు పాల్గొన్నారు.