రేపటి నుంచి అసెంబ్లీ | From the Assembly tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి అసెంబ్లీ

Published Tue, Jan 21 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

From the Assembly tomorrow

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. వారం పాటు సాగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ప్రసంగిస్తారు. శాసన సభ ఇదివరకే ఆమోదించిన అత్యవసర సేవల సవరణ బిల్లు, కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ సవరణ బిల్లులను శాసన మండలిలో ప్రవేశ పెడతారని చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి తెలిపారు.

సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.  స్పీకర్ కాగోడు తిమ్మప్పతో కలసి గవర్నర్‌ను ఆహ్వానించగా, ఆయన సమ్మతించారని వెల్లడిచారు. కాగా ఏడాదికి 60 రోజుల పాటు శాసన సభ సమావేశాలు జరిపే విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదివరకే తమతో చర్చించారని తెలిపారు. టైం టేబుల్‌ను ఇవ్వాలని కోరగా, తయారు చేసి ఇచ్చామని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement