డిజిట‌ల్ మీడియాకూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు | TDMJA Appeal For Government Ads On Digital Media | Sakshi
Sakshi News home page

డిజిట‌ల్ మీడియాకూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు

Published Wed, Jan 29 2025 4:56 PM | Last Updated on Wed, Jan 29 2025 5:13 PM

TDMJA Appeal For Government Ads On Digital Media

తిక్ష‌ణం ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న ఆన్‌లైన్ న్యూస్ మీడియా(వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి చేశారు

అభ్యర్థన లేఖ అందించిన డిజిట‌ల్ మీడియా జర్నలిస్టు నాయకులు 

ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఐ అండ్ పీఆర్ కమిషనర్

హైదరాబాద్: ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న ఆన్‌లైన్ న్యూస్ మీడియా(వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్..  త్వరలోనే ఆన్‌లైన్ మీడియా(వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.

ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జ‌ర్న‌లిస్టులు ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి స‌హ‌క‌రించాల‌ని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడ‌మీ ఆక్రిడిటేష‌న్‌లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందించ‌డం కొత్త మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌ప‌రిణామమ‌ని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement