
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు.
‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు.