
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కులగణన వందశాతం సరిగా చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.మంగళవారం(ఫిబ్రవరి 18) మీడియాతో సుఖేందర్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.‘అసలు కులగణ మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసింది.
సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ రికార్డు లేదు.అసెంబ్లీలో పెడితే రికార్డులో ఉండేది. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడు.కులం,మతం తో సంబంధం ఉండదు.బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే. రాజకీయం,ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుంది.ఉచితాలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందే.
రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి పథకాలు ఉండాలి.ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదు.కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.కానీ 4కోట్ల ప్రజల హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా..నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు’అని సుఖేందర్‌రెడ్డి అన్నారు.