Guttha sukendar reddy
-
‘కేసీఆర్ హీరోనే.. ఎందుకు గెలవలేదు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కులగణన వందశాతం సరిగా చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.మంగళవారం(ఫిబ్రవరి 18) మీడియాతో సుఖేందర్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.‘అసలు కులగణ మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసింది.సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ రికార్డు లేదు.అసెంబ్లీలో పెడితే రికార్డులో ఉండేది. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడు.కులం,మతం తో సంబంధం ఉండదు.బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే. రాజకీయం,ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుంది.ఉచితాలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందే.రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి పథకాలు ఉండాలి.ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదు.కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.కానీ 4కోట్ల ప్రజల హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా..నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు’అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
'టీఆర్ఎస్తో పొత్తు అంటూ.. టీడీపీ విషప్రచారం'
సాక్షి, నల్గొండ : జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్-వైఎస్సార్సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్ఎస్తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని గుత్తా తెలిపారు. -
గుత్తా బాధ్యతల స్వీకారానికి సీఎం!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గుత్తా పేరును ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ను ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. నేడో రేపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం జీవో జారీ చేసి అధికారికం గా గుత్తా పేరును ప్రభుత్వం ప్రకటించనుంది. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గుత్తా చాంబర్‌ను బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సిద్ధం చేశారు. అక్కడే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఖేందర్‌రెడ్డి సోదరుడు, కుమారుడు వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి కార్యాలయాన్ని, ఇతర వసతులను పరిశీలించారు. -
ఎంపీ సోదరుడి భార్య ఆత్మహత్య
చిట్యాల: నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడి భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత(45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీలత భర్త గుత్తా మహేందర్ రెడ్డి గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నారు. కాగా.. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.