
సాక్షి,నల్లగొండజిల్లా:కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషమని,రేపటి నుంచి ఆయనను ఎండ కట్టడాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(జనవరి31) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్‌రూమ్ ఇస్తానని ఎన్ని ఇల్లు ఇచ్చావు.రేపటి నుంచి తడాఖా చూపిస్తా అని కేసీఆర్ అంటున్నారు.కేసీఆర్ తడాఖా ఏంటో పార్లమెంటు ఎన్నికల్లో చూశాం.పదహారు లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తే తొమ్మిదింటిలో డిపాజిట్ కూడా రాలేదు.నువ్వేదో నాయకుడివి అనుకుంటున్నావు.
తెలంగాణ సాధనలో నీ పాత్ర అసలే లేదు. నాలాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడు.మాటలతో పదేళ్లు కేసీఆర్ రాజకీయాలు చేశాడు.ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.బయటికి వస్తా అంటున్నావ్ కదా ఏ జిల్లాకు పోదాం చెప్పు. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు.ఏడు లక్షల కోట్ల అప్పు చేశావు’
Comments
Please login to add a commentAdd a comment