
సాక్షి,హైదరాబాద్:కేసీఆర్ ఫాంహౌస్ కలలు మానుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం(జనవరి31) మహేష్‌కుమార్ స్పందించారు.‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన,గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన,ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు. కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్,కాంగ్రెస్ అధికారంలో విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాంహౌస్‌లో పగటి కలలు కంటున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు.ప్రజలు చీ కొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి,మాటతీరులో మార్పు రాలేదు. ఇలాగే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు’అని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment